భన్వర్‌లాల్‌... ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన పేరు అన్ని టీవీ ఛానెళ్లలో ప్రతిధ్వనిస్తూనే ఉండేది. అలాంటి భన్వర్‌లాల్‌ పదవి కాలం అక్టోబర్ 31 (ఇవాల్టితో) ముగిసింది... 1983 ఐఏఎస్ బ్యాచ్‌‌కు చెందిన భన్వర్‌లాల్ ఆంధ్రప్రదేశ్‌ క్యాడెర్‌ అధికారి.... కొత్త ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఆయన స్థానంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఇన్‌చార్జీ అనూప్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు...

bhanwarlal 31102017 2

అయితే, ఆయన రిటైర్ అయ్యారో లేదో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌ పై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించింది... భన్వర్‌ లాల్‌ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎస్సీ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బకాయిలు చెల్లించని కారణంగా భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించనట్లు తెలుస్తోంది.

bhanwarlal 31102017 3

గతంలో భన్వర్‌లాల్‌ ప్రభుత్వ బంగ్లా దుర్వినియోగం చేసారు అనే ఆరోపణలు ఉన్నాయి... దీంతో భన్వర్‌లాల్‌ కు ప్రభుత్వం రూ. 17 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానా సమీక్షంచాలి అని భన్వర్‌లాల్‌ కోరటంతో, గత ప్రభుత్వం రూ. 4,37,500 లకు కుదించింది. అయితే, అప్పటి నుంచి, ఇప్పటి వరకు, ఒక్క పైసా కూడా బకాయిలు చెల్లించలేదు. దీంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది.

జగన్ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి, ఎవరూ అసెంబ్లీకి వెళ్ళద్దు అంటూ, వైసీపీ పార్టీ ఇప్పటికే తమ ఎమ్మల్యేలకు ఆదేశాలు జారీ చేసేంది... కీలకమైన బడ్జెట్ సమావేశాలు అయినా వెళ్ళద్దు అని చెప్పేశారు... అయితే, ఈ నిర్ణయం పట్ల, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే... పజ్రల తరుపున పోరాడాల్సిన ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటే విమర్శలు వస్తున్న తరుణంలో, వైసీపీ ఎమ్మల్యేలు ప్రజా వ్యతిరేకత వస్తుంది అనే భయంలో ఉన్నారు... దీంతో అందరూ, విజయసాయి రెడ్డి దగ్గరకు వెళ్లి, జగన్ నిర్ణయం మార్చుకోమని వేడుకున్నారు...

vijayaayi 31102017 2

పోయినసారి అసెంబ్లీకి వెళ్ళకుండా  పోలవరం, కాపు రిజర్వేషన్ లాంటి అంశాల్లో చంద్రబాబుకి అనుకూలం అయ్యేలా చేసామని, వారు విజయసాయి దగ్గర వాపోయారు... ఇలాంటి సమస్యలు ప్రజల ఎమోషన్ తో డైరెక్ట్ గా ముడి పడిన సమస్యలని, ఇలాంటి టైంలో మనం అసెంబ్లీలో లేకుండా చాలా తప్పు చేసామని, మనం అసెంబ్లీలో ఉంటే మన వాయిస్ కూడా ప్రజలకు చెప్పే వీలు ఉండేదని, చంద్రబాబుని ఎదో రకంగా ఇరికించే అవకాసం కోల్పయమని చెప్పారు...  అసెంబ్లీకి రాకుండా రోడ్లు మీద స్టేజి షోలు చేస్తుంటే, ప్రజలు ఎలా నమ్ముతారని వారు విజయసాయిని ప్రశ్నించారు...

vijayaayi 31102017 3

దానికి విజయసాయి వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు... జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే, అది శాసనం అని మీకు తెలియదా ? కొత్తగా ఇలా వచ్చి నన్ను అడుగుతారేంటి ? అయినా ఇలాంటి వాటితో మనకి పని లేదు... అసెంబ్లీకి వెళ్ళినా, మిమ్మల్ని చంద్రబాబు ఆడుకుంటారు... అయినా ఇలాంటి భయాలు పెట్టుకోవద్దు.. మనం అధికారంలోకి వస్తున్నాం.. జగన్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం... అన్నీ అనుకూలిస్తే, నేను కేంద్ర మంత్రిని అవుతాను... మీలో కూడా మంత్రులు అవ్వచ్చు... భయాలు పెట్టుకోవద్దు.... జగన్ ను నమ్ముకోంది, అని వారిని తిప్పి పంపించి వేసారు...

ఆర్థికంగా వెనుకబడిన తరగతులవారికి రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప కానుకను అందించబోతున్నది. జనవరి ఒకటో తేదీ నుంచి "చంద్రన్నపెళ్లికానుక" పేరుతో సరి కొత్త పథకాన్నిరాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుక రంగం సిద్దంచేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉదయలక్ష్మీ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పధకం ప్రకటన చెయ్యగానే, అందరూ ఎదో ప్రజలను ఓట్లు కోసం ఆకట్టుకునే కొత్త పధకం అని లైట్ తీసుకున్నారు కాని, దీని వెనుక చాలా కసరత్తు జరిగింది...

chandranna pelli kanuka 31102017 2

బీసీ కుటుంబాల్లోని పేద యువతులకు చిన్న వయసులోనే జరుగుతున్న పెళ్లిళ్ళు జరుగుతున్నాయని, తద్వారా మహిళలు త్వరగా అనారోగ్యపాలు అవుతున్నారని, మహిళలకు గృహ హింస ఎక్కువ అవుతుంది అని ప్రభుత్వం గ్రహించింది... ఇలా ఒక పధకం పెట్టి, ప్రతి బీసీ వధూవరులు తమ వివాహాలను రిజిస్టర్‌ చేసుకునేలా ప్రోత్సహించేందుకు, చిన్న వయస్సులోనే పెళ్లిళ్లను నిరోధించడంతో పాటు, పెళ్లి తర్వాత కూడా వేధింపుల నుంచి ఆమెకు రక్షణ కల్పించవచ్చని, వివాహ సమయంలో ఆ కుటుంబాలకు ప్రభుత్వ ప్రోత్సాహం ద్వారా సంతృప్తి కలిగించేందుకు ఈ పథకం రూపొందిచారు. దీంతో పెళ్లిళ్లు ఇక నుంచి అధికారికంగాక నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు.

chandranna pelli kanuka 31102017 3

బీసీ కుటుంబాల్లోని పేద యువతుల పెళ్లి సందర్భంలో ఈ పథకం కింద యువతి కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కేవలం పెళ్లి సమయంలోనే ప్రభుత్వం ఈ పథకం కింద ఈ సాయాన్ని అందించి, వివాహిత తల్లిదండ్రులకు ప్రభుత్వం బాసటగా నిలవాలని ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. ఈ పథకం కింద లబ్ది పొందాలి అంటే తప్పనిసరిగా బీసీ అయి ఉండాలి. పెళ్లి కాని ఏపీకి చెందిన యువతి అయి ఉండాలి. 18 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి 21 ఏళ్ల వయసు నిండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. పదో తరగతి పాస్ కావాలి. ఇందుకు సంబంధించి మీ-సేవ ద్వారా సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పట్టిన తేదీ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయం, ఆధార కార్డు, పెళ్లికార్డు, పోటోలు, తెల్ల రేషన్ కార్డు కాపీలను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వచ్చే ఏడాది జూన్, జులైలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీనిలో భాగంగానే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందుస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి, కమిషనర్ కార్యాలయాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలు ఎప్పడు జరిగినా వాటికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు కసరత్తు చేస్తున్నారు.

elections 31102017 2

ప్రస్తుతమున్న గ్రామ సర్పంచ్ల పదవీకాలం 2018 ఆగస్టు ఒకటవ తేదీ నాటికి ముగియనుంది. రాజ్యాంగంలోని ఆగ్రికల్ 243ఈ3(ఏ) నిబంధన ప్రకారం పదవీకాలం ముగిసేలోపే తదుపరి ఎన్నికల ప్రక్రియు పూర్తి చేయాల్సిన అవసరం ఉండగా, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994 ప్రకారం పాత సర్పంచుల పదవి ముగిసే మూడు నెలల ముందు వీలును బట్టి ఏప్పడైనా ఎన్నికలు పూర్తిచేయవచ్చు.

elections 31102017 3

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టాన్ని అనుసరించి గ్రామ పంచాయతీలకు తాజాగా ఎన్నికల నిర్వహణ అవసరమైన ముందుస్తు ప్రణాళికను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. కొత్త పంచాయితీల ఏర్పాటు, గ్రామ పంచాయతీల విలీనం తదితర అంశాల ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తిచేసి, ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీల జాబితాను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖని ఈసీ కోరింది. 2018 జనవరి 1వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మార్చి 31వ తేదీ పూర్తిచేసి, పంచాయతీ ఎన్నికల్లో వార్డుల రిజర్వేషన్ల వివరాలు మే నెలాఖరుకల్లా ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటుంది.

Advertisements

Latest Articles

Most Read