మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారంవర్ల రామయ్య విలేకరులతో మాట్లాడిన వివరాలు. యథాతథంగా ఆయన మాటల్లోనే మీకోసం...! "రాష్ట్రమంతా, అందరూకూడా, దేశమంతాకూడా మొన్న అయిపోయింది.. నిన్న అయిపోయి దని ఎదురచూస్తుంటే వాయిదాపడుతోంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పాత్రికేయుల్ని సీబీఐని అడుగుతున్నా. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ కాకుండా రక్షిస్తున్న ఆ అజ్ఞాత శక్తి ఎవరు? ఆ అజ్ఞాతశక్తి మనరాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డిగారే కదా! జగన్మోహన్ రెడ్డిగారి కి మనరాష్ట్రప్రజలు ఇచ్చిన మొత్తం అధికారాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా సంపా దించిన తనఅవినీతి సంపాదన మొత్తాన్ని, తనతెలివితేటలు మొత్తాన్ని రాష్ట్రసంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారు అని అనుకుంటున్నారా? లేక అల్లకల్లోలంగా మారిన రైతులజీవన విధా నాన్నిబాగుపర్చడానికి, నీళ్లలో తడిచిపోయిన పంట కొనడానికి ఏమైనా ఉపయోగిస్తున్నారా ? కాదు. తొలగించిన దళితసంక్షేమ పథకాలన్నీకూడా మరలాప్రవేశపెట్టడానికి ఉపయోగి స్తున్నాడా? లేదు. అతని ముందున్న ఏకైకలక్ష్యం తనసోదరుడు అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుం డా చూడటమే. అతనే ఆ అజ్ఞాతశక్తి, అతను ఏంచేస్తున్నాడో తెలియదు..ఎలా చేస్తున్నాడో తెలియదు.. అతనితరుపున లాబీయిస్ట్ లు ఎలా ప్రయత్నంచేస్తున్నారో తెలియదు? ఇంకా అరెస్ట్ కాలేదనే మీమాంసమాత్రం రాష్ట్రప్రజల్లో ఉంది. నేను అడుగుతున్నాను ఈరోజున సీబీఐని అడుగుతున్నాను. మిమ్మల్ని తప్పుపట్టడం లేదు మిమ్మల్ని కూడా ఇబ్బందిపెట్టారు. సీబీఐ అధికారులపై తప్పుడుకేసులుపెట్టడం ఇక్క డే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలోనే సాధ్యమైందిఅది. అందుకని మిమ్మల్ని తప్పుపట్టడంలేదు, కానీ ఎందుకుమీనమేషాలు లెక్కెడుతున్నారు? మీరు హైకోర్ట్ లో దేర్ ఈజ్ ఏ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ మిస్టర్ అవినాశ్ రెడ్డి అని అఫిడవిట్ వేయలా? వేశారా లేదా? సుప్రీంకోర్టుకు చెప్పలా? మీరు వదిలిస్తే మేం లోపలే స్తామని అన్నారా.. లేదా? మరి ఇంకెందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?

నిన్ హైడ్రిన్ టెస్ట్ దేనికి చేస్తారు? ఫోరెన్సికల్ ల్యాబ్ లో ఫింగర్ ప్రింట్ ఎక్స్ పర్ట్స్ కు కూడా కనిపించని ఇన్ విజబుల్ ఫింగర్ ప్రింట్స్ కూడా కనుక్కునే, కనిపెట్టే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆ టెస్ట్ చేస్తారు? దానికి అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సంబంధం ఏమిటి? మినాయిడ్రి న్ టెస్ట్ కు, అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సంబంధంలేదుకదా! తీసుకెళ్లి అతన్ని లోపలేయచ్చుకదా ! ఆ పనిచేయకుండా మీరుఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు? మీకు అడ్డుపడు తున్న ఆశక్తి మనశక్తేనా? ఈ శక్తేనా? చాలా కాలాతీతమైంది. మీ ఎఫీషియన్సీని కూడా ప్రశ్నించేస్థాయిలో ప్రజలు ఉన్నారనికూడా సీబీఐ గమనించాలి. సీబీఐ డైరెక్టర్ ...నాక్కూడా వారి గురించి తెలుసు. తెలుగుదేశం పార్టీ మీ అఫిషియన్సీని తప్పుపట్టడంలేదు. వివేకా కూతురు డాక్టర్ సునీత ఓ వీరవనిత.చరిత్రలో రాణిరుద్రమ, ఝాన్సీరాణి పోరాటంచేసిన శత్రువులకంటే పెద్దశత్రువుతో సునీత చేస్తున్న పోరాటం చరిత్రలో నిలుస్తుంది. ఆ అమ్మాయి. డాక్టర్ సునీత, డాటర్ ఆఫ్ వివేకానందరెడ్డి. మనంచెబుతాం..ఝాన్సీ లక్ష్మీభాయి, రాణిరుద్రమదేవి..ఈ అమ్మాయి. రాణిరుద్రమదేవి, ఝాన్సీలక్ష్మీభాయిలు ఎదుర్కొన్న శత్రువులు జగన్మోహన్ రెడ్డి కంటే బలవంతులేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు విశాల ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు. కాకతీయసామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దదేమీకాదు. పెద్దసువిశాల సామ్రాజ్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంత శక్తిమం తుణ్ణి ఢీకొంటున్న మహిళ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి..వీరవనిత లేకపోతే పోలీసులు ఎప్పుడో ఈ కేసుని అన్ డిటెక్టబుల్ అనిచెప్పేవారు.

ఝాన్సీలక్ష్మిభాయి, రాణిరుద్రమ రక్తా న్ని పుణికిపుచ్చుకున్న ఆమె పోరాటపటిమ ఈకేసుని సజీవంగా ఉంచింది. మహిళలం దరూ కూడా ఆమెనుఆదర్శంగా తీసుకోవాలి. పెద్దడాక్టర్ అయిన ఆఅమ్మాయిని మండు టెండలో చున్నీని నెత్తికి కట్టుకొని పరిగెడుతుంటే, ఈ ప్రభుత్వానికి జాలి, దయ, కరుణ, మానవత్వంలేవా? ఆమె ఎవరోకాదే.. పరాయిమహిళకాదే, నీ సొంతచెల్లెలు. ఆకన్ను.. ఈకన్ను అన్నారు. ఒకకన్ను ఏమో ముద్దాయిని పట్టుకోమని తిరుగుతుంటే, మరోకన్ను ఏమో డోంట్ అరెస్ట్ మీ అన్నా.. అంటోంది. ఇప్పటికైనా సీబీఐ జంపింగ్ టూ యాక్షన్. టేక్ సూటబుల్ యాక్షన్. చట్టప్రకార మే యాక్షన్ తీసుకోండి. మీరు హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ ప్రకారమే ముం దుకెళ్లండి. మీ విచారణ మీరుచేసుకోండి, మేంఎక్కడా అడ్డుపడం అని న్యాయస్థానాలు హుం దాగాచెప్పాయి. అంతస్పష్టంగా చెప్పాక కూడా మిమ్మల్ని అడ్డుకుంటున్నఆ అజ్ఞాతశక్తి ఎవరు? మీ చేతులుబందిస్తున్నది.. మీకాళ్లకు అడ్డుపడుతున్నది.. అతను అరెస్ట్ కాకుండా చూస్తున్న ఆ అజ్ఞాతశక్తి ఎవరో చెప్పండి, అంత శక్తి అడ్డుకున్నాక ఈ కేసు విచారణ మేం చేపట్టలేమని చెప్పండి పోనీ.

అవినాశ్ రెడ్డి అరెస్ట్ తోనే వివేకాహత్య కేసు ముగిసిపోయినట్టుకాదని సీబీఐ గుర్తించాలి. ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఇంకాఉంది. హూకిల్డ్ బాబాయ్ ఉదంతంలోని అసలు ముద్దాయిలు బయటకు రావాల్సి ఉంది. ఇంతటితోఅయిపోలేదు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడంతోనే కేసుముగిసిపోయినట్టు కాదు. మీరు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది చాలా ఉంది. కుట్ర బయటకు తీయాలికదా! హూ కిల్డ్ అనేది కొంతవరకు ఐడియా వచ్చింది. కానీ ఎందుకు చంపారనేది తేలాలికదా! ఎందుకు అనేది సీబీఐ దర్యాప్తుచేయాలి. సుప్రీంకోర్టు కూడా అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయగానే సీబీఐని వదలదు. అది మిలియన్ డాలర్ల క్వశ్చన్. వై దేహేవ్ కిల్డ్ హిమ్. అర్థరాత్రి, తెల్లవారుజామున వచ్చినఫోన్లు, కాల్ లిస్ట్ లుకూడా మీరువదిలేస్తే ప్రజలు వదలరు. ఎందుకంటే అవి ప్రజల మస్తిష్కంలో నిక్షిప్తమయ్యాయి. వాటిపై మీరు సమాధానంచెప్పాలి.. ఎవరు ఎందుకు చంపా రనేది సీబీఐనే బయటపెట్టాలి.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కి జ‌గ‌న్ రెడ్డి మొగ్గు చూపిస్తున్నార‌ని ఆంధ్ర‌జ్యోతిలో ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురించారు. రోజు రోజుకీ పెరిగిపోతున్న‌ ప్రజా వ్యతికేతక, అప్పులు దొర‌క‌ని స్థితిలో కేంద్రం ఆశీస్సుల‌తో వైఎస్ జ‌గ‌న్ ముంద‌స్తుకి వెళ్తార‌ని ఆంధ్ర‌జ్యోతి విశ్లేష‌ణ‌. ఇటీవ‌ల కాలంలో ఆంధ్ర‌జ్యోతి ప్ర‌చురిత‌మైన‌వ‌న్నీ నిజాలు కావ‌డంతో ఇది కూడా వాస్త‌వ‌మేన‌ని అంద‌రూ న‌మ్ముతున్నారు.  ఆంధ్ర‌జ్యోతి రాసిన కార‌ణాలు కాకుండా ఏపీలో ప‌రిణామాలు చూస్తుంటే ముంద‌స్తుకి గ్యారెంటీగా వెళ్తార‌ని తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్, డిఎస్పీల బ‌దిలీలు రాష్ట్ర‌మంతా చేప‌ట్ట‌డం ముంద‌స్తుకి మొద‌టి సంకేతం. కొంద‌రినైతే పోస్టులో చేరి నెల కాకుండానే ఎమ్మెల్యేలు చెప్పిన వారిని నియ‌మించ‌డం ఎన్నిక‌ల‌లో త‌మ‌కి మ‌ద్ద‌తుగా ఉండే అధికారుల‌ను వేయించుకోవ‌డం చూస్తుంటే ముంద‌స్తుకి వెళ్తార‌నే స్ప‌ష్టం అవుతోంది. మ‌రోవైపు పేటీఎం మేధావులు, సెల‌బ్రిటీలు వ‌ర‌స పెట్టి ఏపీలో దిగ‌బ‌డుతున్నారు. సోష‌ల్మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. ఇదంతా ముంద‌స్తు కోస‌మేన‌ని వేరే చెప్ప‌క్క‌ర్లేదు. ఇన్నాళ్లు ఎక్క‌డున్నారో తెలియ‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నిద్ర‌లేచారు. ముంబైలో తాగి కాళ్లు నాకే రాంగోపాల్ వ‌ర్మ ఫుల్ టైమ్ వైసీపీ కోసం ప‌నిచేయ‌డానికి ఇక్క‌డే ఉంటున్నారు. అంబ‌టి రాయుడు, శ్రీరెడ్డి, మాకిరెడ్డి పురుషోత్త‌మ‌రెడ్డి, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్, ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్, జ‌ర్న‌లిస్ట్ సాయి, తెల‌క‌ప‌ల్లి ర‌వి వంటి వారంతా గ‌త కొద్దిరోజులుగా చాలా యాక్టివ్‌గా మారుతున్నారు. వీరంతా వైసీపీ కోసం ప‌నిచేసే స్లీప‌ర్ సెల్స్‌. ఇవి యాక్టివ్ అయ్యాయంటే ముంద‌స్తు ఎన్నిక‌లు ముంచుకొస్తున్న‌ట్టేన‌ని అర్థం.

ఐపీఎల్-ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్లో ఆడిన అంబ‌టిరాయుడుని జేపీఎల్-జ‌గ‌న్ పొలిటిక‌ల్ లీగ్‌లో చేరుతున్నాడు. ఇటీవ‌ల వ‌ర‌స‌గా వైకాపా పాల‌న‌ని, సీఎం జ‌గ‌న్ రెడ్డిని ప్ర‌శంసిస్తూ ట్వీట్లు చేస్తున్న అంబ‌టిరాయుడు అంద‌రూ ఊహిస్తున్న‌ట్టే సీఎం జగన్ ను కలిశాడు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన అంబటి రాయుడు, నేడో రేపో వైకాపాలో చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. టీమిండియాకి ఆడిన క్రికెట‌ర్ అంబ‌టిరాయుడు త‌న ఆట‌కంటే ఎక్కువ‌గా నిత్యం వివాదాల‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉండేవాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ద‌క్కించుకున్న అంబ‌టి రాయుడు ఆట అంతంత మాత్ర‌మే. క్రికెట్ ఆట‌ని చాలించి పొలిటిక‌ల్ గేమ్ కి రెడీ అవుతూ జ‌గ‌న్  పొలిటిక‌ల్ లీగ్‌లో చేర‌డానికి స‌ర్వం సిద్ధం చేసుకున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.  దీనికంటే ముందు ఏపీ స‌ర్కారు కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌శంసిస్తూ అంబ‌టి ట్వీట్లు వేశారు. ఏపీ సీఎం చేసే ట్వీట్ల‌ను అంబ‌టి రాయుడు రీట్వీట్ చేయ‌డంతో వైకాపాతో టైఅప్‌లో ఉన్నాడ‌ని అంతా అనుకున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు జగన్ శంకుస్థాపన సంద‌ర్భంగా సీఎం ప్రసంగాన్ని వైసీపీ ట్విట్టర్ నుంచి అంబటి రాయుడు  రీట్వీట్ చేశాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైకాపా ప్యాకేజీ పాలిటిక్స్ నుంచి బ‌య‌ట‌కొచ్చి ఏకంగా పోటీకి దిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఐపీఎల్ ని వీడి జేపీఎల్ లో చేరి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేందుకు ఉవ్విళ్లూరుతున్న అంబ‌టిరాయుడు ముసుగు తీసేసాడు. ఇన్నాళ్లు ట్విట్ట‌ర్ హ్యాండిల్ వైకాపాకి అద్దెకిచ్చిన అంబ‌టిరాయుడు ఇప్పుడు తానే జ‌గ‌న్ ఫ్రాంచైజీకి చిక్కాడని తేట‌తెల్లం అయ్యింది.

క‌ర‌క‌ట్ట క‌మ‌ల్ హాస‌న్ అని టిడిపి వారు ముద్దుగా పిలుచుకునే మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి తోక క‌త్తిరించి పారేశారు జ‌గ‌న్ రెడ్డి. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా జ‌గ‌న్ రెడ్డి త‌న‌ను మోసం చేశార‌నే ఆగ్ర‌హంతో ఉన్న ఆళ్ల రామక్రిష్ణారెడ్డి చుట్టూ అసమ్మతులను మొహరిస్తున్నాడు. ఒకానొక ద‌శ‌లో ష‌ర్మిల వ‌ర్గంగా ఆర్కే బ‌య‌ట‌ప‌డిపోయారు. దీంతో జ‌గ‌న్ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేని శ‌త్రువుని చూస్తున్నట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ష‌ర్మిల‌ని వైకాపా నుంచి కానీ, ఏపీ నుంచి ఎవ‌రైనా క‌లిస్తే క్ష‌ణాల్లో జ‌గ‌న్ రెడ్డికి స‌మాచారం వ‌చ్చేస్తోంది. ష‌ర్మిల చుట్టూ జ‌గ‌న్ నిఘా బృందాన్ని ఉంచార‌ని ఇటీవ‌లే డిఎల్ ర‌వీంద్రారెడ్డి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కూడా ష‌ర్మిల‌తో ర‌హ‌స్య భేటీలు జ‌గ‌న్ దృష్టికి వ‌చ్చాయి. మంగ‌ళ‌గిరిలోనూ విప‌రీత‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త ఉంద‌ని, నారా లోకేష్‌ని త‌ట్టుకుని నిల‌బ‌డే శ‌క్తి కోల్పోయార‌ని ఆర్కే ని దూరం పెడుతూ వ‌స్తున్నారు వైకాపా పెద్ద‌లు. మంగ‌ళ‌గిరి చేనేత‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ని వైకాపాలో చేర్చుకుని ఆర్కేకి పొగ‌బెట్టారు. మాజీమంత్రి మురుగుడు హ‌నుమంత‌రావు, మాజీ మున్సిప‌ల్  చైర్మ‌న్ గంజి చిరంజీవి వంటి వారిని టిడిపి నుంచి తీసుకుని ఒక‌రికి ఎమ్మెల్సీ, ఇంకొక‌రికి ఆప్కో చైర్మ‌న్ పోస్టులు క‌ట్టబెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కి వైకాపా టికెట్ ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి లేద‌నే బ‌ల‌మైన సంకేతాలు పంపుతున్నారు జ‌గ‌న్. త‌న కొడుకు పెళ్లికి సీఎంని క‌నీసం ఆహ్వానించ‌లేదు ఆర్కే. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే ఉన్న సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగే ఎమ్మెల్యేల స‌మీక్ష‌కి కూడా హాజ‌రు కాలేదు.  ఆళ్ల రామకృష్ణా రెడ్డికి వైకాపాలోనే వ్య‌తిరేక వ‌ర్గంగా ఉన్న దొంతి రెడ్డి వేమారెడ్డికి మంగళగిరి వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి పెద్ద దెబ్బే కొట్టింది వైసీపీ.  ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గానికి నాయ‌కుడైన దొంతిరెడ్డికి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం ముమ్మాటికీ ఆర్కే తోక క‌త్తిరించ‌డ‌మేన‌ని వైసీపీలో టాక్ వినిపిస్తోంది. ఆర్కేకి ప‌డ‌నివారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతూ, ఆర్కేకి కుడిఎడ‌మ భుజాల్లాంటి నేత‌లైన‌ మంగళగిరి పట్టణ పార్టీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావును, తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి ప‌ద‌వుల నుంచి తొల‌గించారు. అంటే వైకాపా నుంచి ఇక త‌మ‌రు ద‌య చేయొచ్చు అని ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి డైరెక్టుగానే సంకేతాలు పంపేశారు జ‌గ‌న్ రెడ్డి.

Advertisements

Latest Articles

Most Read