విజయవాడలో, దుర్గా ఘాట్‌ నుంచి పవిత్రసంగమం ప్రాంతానికి బోటు షికార్ ని ఏపీటీడీసీ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

దుర్గా ఘాట్‌ నుంచి పవిత్రసంగమం వరకు రాను, పోనుఒక్కరికి రూ.300 టిక్కెట్‌ ధరగా అధికారులు నిర్ణయించారు. ఈ టిక్కెట్‌తో దుర్గాఘాట్‌ నుంచి బయలుదేరి, భవాని ఐలాండ్ కు వెళ్లి, అక్కడ నుంచి పవిత్రసంగమం ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడ ఎంత సేపైనా పర్యాటకులు గడపవచ్చు. తిరుగు ప్రయాణంలో బోటు వచ్చినపుడు టిక్కెట్‌ చూపితే సరిపోతుంది.

ఎదో ఒక వైపు మాత్రమే ప్రయాణం చెయ్యాలి అనుకునే వారు రూ.200 టిక్కెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏపీటీడీసీ అధికారులు మెకనైజ్డ్‌ బోట్లతో ట్రయల్‌ రన్‌వేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకపోవటంతో ఈ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇది వరకు బోటు షికారు కి కాని, భవాని ఐలాండ్ కి కాని, వెళ్ళాలి అని, హరిత బెర్మ్‌పార్క్‌ దాకా వెళ్ళాల్సి వచ్చేది. దసరా ఉత్సవాలు, ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా, బోటింగ్‌ యూనిట్‌ను దుర్గాఘాట్‌కు మార్చారు అధికారులు.

"ర్యాలీ ఫర్ రివర్స్" పేరిట, ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ దేశవ్యాప్త కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే... ఆ కార్యక్రమం విజయవాడ చేరుకుంది. బుధవారం ఉదయం విజయవాడ, సిద్ధార్థ కాలేజీలో ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పాల్గొన్నారు.

నిన్న విజయవాడ చేరుకున్న జగ్గీ వాసుదేవ్‌, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రహదారులు గురించి ట్వీట్ చేశారు... చిలకలూరిపేట హైవే మీద వస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హైవేలు, ది బెస్ట్ అంటూ చంద్రబాబుని అభినందిస్తూ ట్వీట్ చేశారు...

ఇవాళ సిద్ధార్థ కాలేజీలో మాట్లాడుతూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రహదారాలు గురించి చెప్పారు, "మేము "ర్యాలీ ఫర్ రివర్స్" యజ్ఞంలో భాగంగా 16 రాష్ట్రాలు తిరుగుతున్నాను. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే ముందు భయపడ్డాము. ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది అని. వేడి సంగతి ఎలా ఉన్నా...ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు మాత్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎన్నో రేట్లు బాగున్నాయి. రోడ్లుకు ఇరువైపులా చెట్లు, అలాగే రోడ్ మధ్యలో మీడియన్ పై పూల మొక్కలు చాలా బాగా మైంటైన్ చేస్తున్నారు. " అన్నారు జగ్గీ వాసుదేవ్‌...

భారత్‌లో ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడులకు నవ్యాంధ్ర సరికొత్త చిరునామాగా మారింది. పెట్టుబడిదారులకు స్వర్గధామంగా అవతరించింది. ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడులను ఆకర్షించడంలో నవ్యాంధ్ర దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానాన్ని.. దేశంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది..

దేశంలో పెట్టుబడుల వృద్ధి, భవిష్యత్‌ అంచనాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిధులతో ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలు పెట్టిన పెట్టుబడులను, అందులోనూ రూ.10 కోట్లకు పైబడిన అంచనా వ్యయం గల ప్రాజెక్టులను మాత్రమే ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు..

ఈ నివేదిక ప్రకారం...గుజరాత్‌ 22.7 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 8.6 శాతంతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 8.2 శాతం తో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. మధ్య ప్రదేశ్‌ (7.4 శాతం), కర్ణాటక (6.6 శాతం), తెలంగాణ (5.5 శాతం), తమిళనాడు (4.5 శాతం) వరుసగా నాలుగు, ఐదు, ఆరు, ఏడో స్థానాల్లో నిలిచాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలు కలిపి 11.8 శాతం పెట్టుబడులు సాధించాయి.

క్రిందటి ఏడాది, టాప్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని, ఈ సారి గుజరాత్ టేక్ ఓవర్ చేసింది.. మహారాష్ట్ర కూడా, స్వల్ప తేడాతోముందంజులో ఉంది... అన్నిట్లో మనతో పోటీ పడే తెలంగాణా, 6వ స్థానంలో ఉంది... రాజధాని కూడా లేని మన రాష్ట్రాన్ని, చంద్రబాబు ఎలా ముందుకు తీసుకువేళ్తున్నారు, ఎవర్ని చూసి పెట్టుబడులు వస్తున్నాయి అనేదానికి ఇది ఒక ఉదాహరణ... కబుర్లు చెప్పుకుంటూ, మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటే, పెట్టుబడులు రావు అనే దానికి కూడా, ఇది ఒక ఉదాహరణ...

దేశంలోనే ప్రధమంగా అమరావతి రాజధానిలో భూసమీకరణ పథకం అమలుచేయడం పట్ల బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ హర్షం వ్యక్తం చేశారు. అవురావతి రాజధాని నగరానికి రైతుల నుంచి స్వచ్చంధంగా భూములు సమీకరించిన విధానం పై అధ్యయనానికి ప్రత్యేకంగా ఏపీకి వచ్చిన ఆయన సోమవారం విజయవాడ ఏపీసిఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ప్రత్యేక కమిషనర్ వి రామ మనోహరరావు బీహార్ ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ల్యాండ్ పూలింగ్ స్కీం పై ప్రజెంటేషన్ ఇచ్చారు.

రాజధానికి కావాల్సిన భూమి అత్యంత వేగంగా సమీకరించి, రైతులకు తిరిగి ప్లాట్లు కేటాయించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యమైన అంశాలను స్వయంగా నోట్బక్లో నమోదు చేసుకుంటూ ల్యాండ్ పూలింగ్ స్కీం అమలు పై మోడీ తన సందేహాలను వ్యక్తపర్చారు. గతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ పూలింగ్ విధానం అమలులో ఉండేదా అని ఆయన ప్రశ్నించగా దానికి శ్రీధర్ స్పందిస్తూ రైతుల్ని రాజధాని అభివృద్ధిలో భాగస్వాముల్ని చేస్తూ ప్రజా రాజధానిగా అభివృద్ధి పరిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భూ సమీకరణ పధకాన్ని రూపొందించారని వివరించారు.

కేవలం రెండు నెలల వ్యవధిలోనే 32వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించేందుకు పలు దఫాలుగా వారితో సమావేశమై, వారికి ఈ పథకం పై విస్తృత అవగాహన కల్పించామని తెలియజేశారు.

రాజధాని నగరం మాస్టర్ ప్లాన్ అనుగుణంగా ఉండటంతోపాటు, వేర్వేరు స్థాయిల్లో రైతులకు ప్రయోజనం కలిగే విధంగా వీటిని వర్గీకరించి రైతులకు కేటాయించామని, దీంతో ప్లాట్లను స్వీకరించిన రైతులు పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.

Advertisements

Latest Articles

Most Read