జగన్ కి అత్యంత ఆప్తుడు, 12 ఓట్లతో గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... రాజధాని ప్రాంతంలో ఉంటూ, రాజధాని వద్దు అని, జగన్ చెప్పినట్టు అమరావతి మీద కోర్ట్ లలో కేసులు వేస్తూ, రాజధానిని అడ్డుకోవటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న ఈయన, ఇప్పుడు మరో కేసు వేశారు.. కాని ఈ సారి అమరావతి మీద కాదు...

ప్రతి పేద వాడికి, విజ్ఞానం, వినోదం కూడా అందించాలి అనే లక్ష్యంతో, చంద్రబాబు ప్రభుత్వం ఫైబర్ నెట్ తో, 150 రుపాయిలకే, ఫోన్, టీవీ, ఇంటర్నెట్ కలిపించటం కోసం, కృషి చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే కొన్ని చోట్ల కనెక్షన్ లు కూడా ఇస్తున్నారు... వచ్చే ఏడాది నాటికి రాష్ట్రం మొత్తం, ఈ కనెక్షన్ లు ఇవ్వనున్నారు...

ఈ తరుణంలో, ఫైబర్నెట్ ద్వారా కేబుల్ టీవీ/టీవీ ఛానళ్ల ప్రసార రంగంలోకి అడుగిడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్ట్లో కేసు వేశారు. మీడియా ప్రభుత్వ నియంత్రణలో ఉండరాదని, టీవీ ప్రసారాల ప్రభుత్వం కంట్రోల్ లోకి వెళ్ళిపోతాయనే వాదన వినిపిస్తున్నారు...

ముఖ్యమంత్రిగా ఉంటూ, సాక్షి పేపర్, టీవీ స్థాపించిన చరిత్ర కలిగిన పార్టీ, ఇలా వ్యవహరించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది... 150 రూపాయలు అంటే, పేదలు, దిగువ మధ్య తరగతి వారే ఎక్కువగా దీంతో లబ్ది పొందే అవకాసం ఉంది... 500 పెట్టి ఇంటర్నెట్, 200 పెట్టి ఫోన్ రీచార్జ్, 200 పెట్టి కేబుల్/డిష్ పెట్టుకునే బదులు, పేదవారికి, 150 కే ఇవన్నీ వస్తాయి అని, వారికి వినోదంతో పాటు, విజ్ఞానం కూడా తక్కువ ఖర్చుకు దొరుకుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైబర్ నెట్ తీసుకువస్తే, ఈ జగన్ పార్టీ ఎమ్మెల్యే ఇది కూడా అడ్డుకునే ప్రయత్నం కోర్ట్ ల ద్వారా చేస్తున్నారు... రాజధాని లాగే, ఈ ప్రాజెక్ట్ కూడా మరింత ఆలస్యం అయ్యేలా చేస్తున్నారు...

12 రోజుల పాటు, లండన్ పర్యటనకు వెళ్ళిన జగన్, ఇప్పటి వరకు, ప్రశాంత్ కిషోర్ కి మాత్రమే ఫోన్ చేస్తూ, ఇక్కడ విషయాలు తెలుసుకుంటున్నారు.. అయితే, సడన్ గా, నిన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి, జగన్ ఫోన్ చేసినట్టు, నాని వర్గీయులు చెప్తున్నారు....

లండన్ నుంచి, జగన్ ఎందుకు ఫోన్ చేశాడో, అర్ధం కాక కొడాలి నాని కొంచెం సేపు షాక్ లో ఉండి, తేరుకుని ఫోన్ లో మాట్లాడారు.... అయితే నాని హావభావులు చుసిన పక్కన వారు, విషయం అర్ధం చేసుకున్నారు... అటు వైపు నుంచి, ఎలాంటి బూతులు రాకపోతే, కొడాలి నంటి లాంటి బూతులు మాట్లాడే వాడు, అవాక్కవుతాడు అనుకున్నారు...

విషయం ఏమిటి అంటే, రెండు రోజుల క్రిందట నాని మాట్లాడుతూ, నాది చంద్రబాబు రేంజ్ అన్నారు... పులివెందులలో జగన్ ను, గుడివాడలో నన్ను ఓడించే మగాడు లేడు అని కూడా అన్నారు..

ఈ విషయం పీకే, ఆ రోజు బ్రీఫింగ్ లో, జగన్ కు చెప్పారు... అప్పుడే జగన్ ఫైర్ అయ్యినట్టు పీకే టీం చెప్తుంది... "ఆడిది చంద్రబాబు రేంజ్ అంటే, ముఖ్యమంత్రి అవుతాడా ? మరి నేనెందుకు ?" అని పీకే మీద చిందులు తోక్కరంట జగన్... మీది ప్రధాని రేంజ్ లే సార్, అని జగన్ ని శాంతపరిచారు పీకే... అలాగే, నాతో నాని పోల్చుకోవటం ఏంటి ? నా రేంజ్,నాని రేంజ్ ఒకటేనా అని కూడా అన్నారంట జగన్... నేను జైలుకి పొతే, తాను ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుదాం అనుకుంటున్నాడా, అని పీకే తో అన్నారంట జగన్ ?

అయితే నిన్న మళ్ళీ కొడాలి నాని మాట్లుడుతూ, ఏడాది ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది... మా పార్టీని సమాయత్తం చేస్తున్నాం అని విలేకరులతో అన్నారు.. వెంటనే పీకే, లండన్ ఫోన్ చేసి విషయం చెప్పారు... దీంతో జగన్ మరింత రెచ్చిపోయారు... అతను ఒక ఎమ్మెల్యే... మొన్న ఏకంగా సియం రేంజ్ అన్నాడు, పోనీలే అని ఊరుకున్నా... ఇప్పుడు ఎలక్షన్స్ గురించి, పార్టీ వ్యూహాలు గురించి తను చెప్పటం ఏంటి ? పార్టీని చీల్చాలని చూస్తున్నాడా ? నేనెందుకు ఇంకా ? ఇప్పటికే రోజాకి ఎక్కువ ఇచ్చి, నా కంటే ఎక్కువ ఇమేజ్ వచ్చేలా చేశాం, ఇప్పుడు ఇతను తయారవుతున్నాడు.... నా ఇమేజ్ కంటే, పార్టీలో ఎవరి ఇమేజ్ హై లో ఉండకూడదు... వెంటనే కొడాలి నానిని కాన్ఫరెన్స్ కాల్ లో తీసుకోమని పీకే కి చెప్పి, నానికి జగన్ క్లాస్ పీకరని పీకే టీం చెప్తుంది... నోరు అదుపులో పెట్టుకుని, మీడియాతో మాట్లాడుకుందా, ఇంటి ఇంటికీ కార్యక్రమంలో తిరగామన్నారు అంట జగన్... నీది బూతులు మాట్లాడటంలో ముఖ్యమంత్రి రేంజ్... నిన్ను పెట్టుకుంది అందుకే... అంతే కాని రాజకీయాల్లో ముఖ్యమంత్రి అవ్వటానికి కాదు, అంటూ ఫోన్ పెట్టేసాడంట జగన్...

జగన్ ఇగో చూసి, ప్రశాంత్ కిషోర్ కొద్దిగా షాక్ అయ్యారంట... నేనంటే జీతగాడిని కాబట్టి, నేనేం చేసినా తట్టుకోలేడు... పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా తట్టుకోలేడు అని ఇప్పుడే తెలిసింది... నా వ్యూహాలు ఇప్పుడు, ఇతని ఇగో satisfy చెయ్యటానికి కూడా ఉపయోగించాలి అన్నారంట...

జగన్ పార్టీ ఫేవరేట్ ఎమ్మెల్యే రోజా, నంద్యాల, కాకినాడ ఎన్నికలు తరువాత పూర్తిగా మీడియా ముందుకు రావటం, బూతులు మాట్లాడటం ఆపేశారు... ఎక్కడా హడావిడి చెయ్యకుండా, తన నియోజకవర్గానికే పరిమితం అయిపోయారు...

ఇవాళ రోజా సడన్ గా బయటకు వచ్చారు.. నగరిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో రోజా పాల్గున్నారు. తరువాత టీచర్ గా మారి పిల్లలకు పాఠాలు చెప్పారు...

చాక్‌పీస్ తీసుకుని బ్లాక్ బోర్డుపై "కలలు కనండి... సాకారం చేసుకోండి" అంటూ రాశారు... పిల్లలకి మంచి సూక్తులు నేర్పారు.... సహజ దొరనికి భిన్నంగా రోజా ప్రవర్తన చూసి అందరూ ఆచర్యపోయారు...

కాని ఇక్కడ రోజా ఒక చిన్న తప్పు చేశారు.... "చేసుకోండి" బదులు "చేసుకొండి" అని తెలుగులో తప్పుగా రాసారు... అది పెద్ద తప్పు కాకపోయినా, ఎవరన్నా నోరు జారితే రెచ్చిపోయే రోజా.. ఇలా తప్పులు రాస్తే ఎలా... నోరు జారితే పప్పు, ఉప్పు అని సంబోధించే రోజా, మరి ఏ పప్పో ? తప్పులు మానవ సహజం, అనే విషయం ఇప్పటికైనా రోజా గుర్తించి, ఎదుటివారికి గౌరవం ఇచ్చి మాట్లాడుతారు అని ఆశిద్దాం...

నంద్యాల, కాకినాడ ఫలితాలతో చావు దెబ్బ తిన్న జగన్ పార్టీకి, జగన్ సొంత జిల్లలోనే షాక్ ట్రీట్మెంట్ కి స్టేజ్ సెట్ అవుతుంది. కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని, ముందుగా క‌డ‌ప జిల్లాలోని రాజంపేట మునిసిపాలిటీకి ఎన్నిక‌లు నిర్వ‌హించాలని ప్రభుత్వం రెడీ అవుతుంది.

పార్టీ క్యాడర్‌ కు, స్థానిక ఎమ్మెల్యే, నాయకులకు, ఈ విషయం మీద సంకేతాలు అందాయి... ఏ పనులు ఇప్పటి వరకు చేశారు, ఇంకా ఏ పనులు చెయ్యాలి అనే దాని పై సమాచారంతో ప్రజల వద్దకు వెళ్ళాలని, నంద్యాల, కాకినాడ లాగే, అభివృద్ధి అజెండాతోనే ఎన్నికలకు వెళ్ళాలని చంద్రబాబు అనుకుంటున్నారు... అటు వైసీపీ పార్టీ కూడా, ఎన్నికలకు సిద్ధం అవుతుంది..

అయితే, ఎలా అయినా జగన్ సొంత జిల్లలో గెలిచి, జగన్ కు మరింత ఎక్కువగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు... ఇప్పటికే జగన్ సొంత బాబాయిని, సొంత జిల్లలో గెలిపించ లేక పోయారు అనే అపవాదు కూడా ఉంది... ఇక ఇప్పుడు మ‌రోసారి రాజంపేట‌లో గెలిచి జ‌గ‌న్‌కు సొంత జిల్లాలోనే మ‌రో ఝుల‌క్ ఇచ్చేందుకు టీడీపీ రెడీ అవుతోంది....

Advertisements

Latest Articles

Most Read