12 ఓట్లతో గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే , అమరావతికి అన్ని విధాలుగా అడ్డు తగులుతున్న వైసీపీ‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి, హై కోర్ట్ మరో షాక్ ఇచ్చింది.

ప్రతి పేద వాడికి, విజ్ఞానం, వినోదం కూడా అందించాలి అనే లక్ష్యంతో, చంద్రబాబు ప్రభుత్వం ఫైబర్ నెట్ తో, 150 రుపాయిలకే, ఫోన్, టీవీ, ఇంటర్నెట్ ఇస్తుంటే, దాన్ని అడ్డుకుంటూ హై కోర్ట్ లో పిటీషన్‌ వేసాడు, ఈ వైసీపీ‌ ఎమ్మెల్యే.

ఫైబర్నెట్ ద్వారా టీవీ ఛానళ్ల ప్రసార రంగంలోకి అడుగిడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్ట్ ని కోరగా, హై కోర్ట్ అది సమంజసం కాదని, ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వం, టెలివిజన్‌ రంగంలోకి అడుగు పెట్టవద్దని ఎక్కడ లేదని, ఉంటే చూపాలని చెప్పి, పిటీషన్‌ కొట్టేసింది.

150 రూపాయలు అంటే, పేదలు, దిగువ మధ్య తరగతి వారే ఎక్కువగా దీంతో లబ్ది పొందే అవకాసం ఉన్నా....ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, సాక్షి పేపర్, టీవీ స్థాపించిన చరిత్ర కలిగిన పార్టీ, ఇలా వ్యవహరించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది...

నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి భార‌త యాత్ర‌ క‌ర్నూలు జిల్లాలో జరిగింది. క‌ర్నూలు జిల్లాలోని ఏపీఎస్పీ బెటాలియ‌న్ మైదానంలో మంగళవారం బాల‌ల భ‌ద్ర‌తే భార‌త భ‌ద్ర‌త పేరుతో బ‌హిరంగ స‌భ జ‌రిగింది. ఇందులో సీఎం చంద్ర‌బాబు, నోబెల్ శాంతి పురస్కార గ్ర‌హీత కైలాశ్ స‌త్యార్థి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు కైలాష్ సత్యార్థి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక నేత ఇలా బాలల హక్కుల పరిరక్షణ కోసం రోడ్డు పైకి రావడం ఇదే మొదటిసారి అని అన్నారు.

తాను భార‌త యాత్ర‌కు సంకల్పించిన‌ప్పుడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాన‌ని, అప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడే మొదట స్పందించారని నోబెల్ శాంతి పుర‌స్కార‌ గ్రహీత కైలాశ్ స‌త్యార్థి అన్నారు.

ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఎంతో మంది ముందుకు వ‌స్తున్నారని చెప్పారు. పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్ట‌డంతో పాటు బాల‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేయాల‌ని కోరుతున్నాన‌ని, చంద్రబాబుతో అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, బాలబాలికల సంరక్షణ కోసం కైలాష్‌ సత్యార్థి నిరంతరం కృషిచేస్తున్నారని బాబు కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని బాలకార్మిక వ్యవస్థ నిర్మూళనకు అందరూ కృషిచేయాలని ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చారు.

కృష్ణాజిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరో సారి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం వంశీ, తన గన్‌మెన్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.

టు ప్లస్‌ టు గన్‌మెన్‌లు ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అందుకే ఇలా నిరసన తెలియచేసానని అంటున్నారు. అదనంగా సెక్యూరిటీ ఇవ్వనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే వంశీ తీరు, తెలుగుదేశం పార్టీలో చర్చనీయంసం అయ్యింది... ప్రతి దానికి వంశీ పెద్ద విషయం చేస్తారని, ప్రభుత్వం వచ్చినాక వంశీ ఇలా చెయ్యటం మూడో సారి అంటున్నారు... ఏదైనా ఉంటే, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకోవాలి కాని, ఇలా మీడియాకి ఎక్కి సెన్సేషన్ అవ్వటం కోసం, ప్రయత్నం ఎందుకు అని అంటున్నారు.

అందరి ఎమ్మెల్యేలు లాగే వంశీకి సెక్యూరిటీ ఇచ్చాం అని, చెప్తున్నారు.. వంశీ నిరసనను ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి...

ప్రశాంత్ కిషోర్ మొదటి అసైన్మెంట్ నంద్యాల, కాకినాడ ఎన్నికలు... వీటిల్లో ఘోరంగా ఫ్లోప్ అవ్వటంతో, ప్రశాంత్ కిషోర్ జగన్ ను ప్రసన్నం చేసుకోవటానికి, 9121091210కు మిసిడ్ కాల్ ఇచ్చి వైఎస్ కుటుంబంలో చేరండి అని కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేశారు...

అయితే, ఈ కాన్సెప్ట్ కి జగన్, తన పైత్యం జోడించారు... 9121091210 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు, సమస్య ఉన్న ఎవరైనా ఫోన్ చెయ్యొచ్చు అని చెప్పి, భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు... సోషల్ మీడియా, వెబ్సైటులో ఆడ్స్ పెట్టి డిజిటల్ మీడియాలో కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు...

దీంతో చాలా మంది, ఆ నెంబర్ కి ఫోన్ చేసి, వాళ్ళ సమస్య చెప్పారు.. అయితే, జగన్ రికార్డెడ్ వాయిస్ తో, నేను ముఖ్యమంత్రి అవ్వగానే మీ సమస్య తీరుస్తాను అంటూ మెసేజ్ వస్తుంది... అంటే మీకు ఏదైనా ప్రాణాలు మీదకు వస్తే, జగన్ అన్నకి మిస్సిడ్ కాల్ ఇచ్చి, రెండేళ్ళు ఆగాలి.. అప్పుడు కూడా, జగన్ అన్న సియం అయితేనే, మీ సమస్య పరిష్కారం అవుతుంది... లేకపోతే, 2024 వారకు, మీరు మళ్ళీ వెయిట్ చెయ్యాలి...

రెండేళ్ళు మిగిలి ఉండగా, ప్రజా సమస్యలు పైన, ప్రజలు చెప్పే సమస్యలు పైన ప్రభుత్వంతో పోరాడకుండా, ఇప్పుడు సమస్య చెప్పండి, రెండేళ్ళు తరువాత నేను సియం అవుతాను, అప్పుడు మీ సమస్య తీరుస్తాను అంటే అర్ధం ఏంటి ? ఇతనికి సియం కుర్చీ మీద యావ తప్ప, ప్రజా సమస్యలు పరిష్కరించటంలో ఎంత చిట్టాసుద్ధి ఉందో ఇక్కడే అర్ధమవుతుంది అని అంటున్నారు ప్రజలు...

అందుకే, ఇలాంటి అద్భుతమైన పధకం, ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ పెట్టలేదు అని, మా జగనన్నే మొదటి వాడు అంటున్నారు... ఇప్పుడు సమస్యలు చెప్తే, రెండేళ్ళ తరువాత, అదీ ఇతను ముఖ్యమంత్రి అయితే, సమస్యలు తీర్చటం ఏదైతే ఉందో, "న భూతే న భవిష్యత్" అంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read