చంద్రబాబుని యువతను ఉద్దేశిస్తూ ఎప్పుడూ అంటూ ఉంటారు, కష్టపడాలి పని చెయ్యాలి... ప్రపంచం మీ ముందు ఉంది, అవకాశాలు మీ ముందు ఉన్నాయి, వెతుక్కుంటే వెళ్ళండి, జయించండి, అని చెప్తూ ఉంటారు... కాని కొన్ని రాజకీయ కారణాలు చేత, చంద్రబాబు ఎన్నికల హామీలో, నిరుద్యోగ భృతి ప్రకటించారు... తీవ్ర ఆర్ధిక లోటు ఒక పక్క.... అయినా సరే, ఎలక్షన్ హామీలు ఎలా అయినా తీర్చాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు... రైతు రుణమాఫీ లాంటి అతి పెద్ద కార్యక్రమం చేస్తూ, 1000 రూపాయలు పెన్షన్ లు ఇస్తూ, ఎలక్షన్ హామీలలోని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ముందుకు సాగుతున్న చంద్రబాబు, ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, నిరుద్యోగ బృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

cbn 01062018 2

మరి, వయసులో ఉన్న వారు కూడా, ముసలి వాళ్ళు లాగా, నెల నెలా ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటే, ఇద్దరికీ తేడా ఏంటి ? కష్టపడి పని చేసుకోవాల్సిన వయసులో, ప్రభుత్వం మీద ఆధారాపడి జీవిస్తే ఎలా ? చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు, యువతను ఇలా సోమరిపోతులను చేస్తే ఎలా ? వీటన్నటికీ చంద్రబాబు తనదైన శైలిలో, ఈ పధకాన్ని రూపొందించారు... ముసలి వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నట్టు కాకుండా, నిరుద్యుగులు ఈ పధకంతో తమ కాళ్ళ మీద తాము నిలబడేలా, విన్నూతంగా రూపొందించారు... దీని ప్రకారం... నిరుద్యోగులకు భృతి చెల్లిస్తూనే, ఆ సమయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు... అయితే, ఈ శిక్షణ అయిన తరువాత, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించి, స్టైఫండ్‌ ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, దీని పై కూడా వర్క్ అవుట్ చెయ్యాలని అధికారులని ఆదేశించారు.. ఇది ఒక్కటే కాదు, కొన్ని ప్రభుత్వ పనుల్లో కూడా వీరిని ఉపయోగించుకుంటారు. ఇలా ఉపయోగించుకుంటే, అప్పుడు కూడా ప్రోత్సాహకం ఇస్తారు...

cbn 01062018 3

నిన్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి నారా లోకేష్‌, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ పధకం వివరాలను మీడియాకు వివరించారు. వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, ఐర్లాండ్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాల్లో అమలుచేస్తున్న నిరుద్యోగ భృతిని పరిశీలించి రూపకల్పన చేసినట్టు చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని, సమాజానికి ఉపయోగపడేలా, విజ్ఞాన సమూహంలా యువతను తీర్చిదిద్దుతామని, అప్పుడే ఈ పధకానికి ఉపయోగం అని చెప్పారు. రుణ మాఫీ, పెన్షన్ లు లాగానే, నిరుద్యోగ బృతి కుడా చాలా పకడ్బందిగా ఇవ్వనున్నారు. ఇందుకోసం, అన్ని రకాలుగా అవసరమైన టెక్నాలజీ, డేటా, ఉపయోగించుకోనున్నారు. ఎవరికీ పడితే వారికి కాకుండా, నిజమైన లబ్దిదారులకు ఇది ఉపయోగపడే విధంగా, నిరుద్యోగ బృతి ఇవ్వనున్నారు.

cbn 01062018 4

ఇవి నిబంధనలు... పేద కుటుంబమై ఉండాలి.. తెల్లకార్డు ఉండాలి... లబ్ధిదారుకు 22-35 ఏళ్ల వయసు ఉండాలి... కనీస విద్యార్హత డిగ్రీ. తత్సమాన విద్యార్హత.... నెలకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి... ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు అర్హులున్నా ఇస్తారు.... నిరుద్యోగ భృతికి తోడు.. వారిని కొన్ని ప్రభుత్వ పనుల్లో ఉపయోగించుకుంటారు. దానికి అదనంగా ప్రోత్సాహకం ఇస్తారు... నిరుద్యోగ భృతిని ప్రతి నెలా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేస్తారు...రేషన్‌ను ఎక్కడైనా తీసుకున్నట్లే భృతిని ఎక్కడైనా తీసుకోవచ్చు. బయోమెట్రిక్‌ను అనుసంధానం చేస్తారు.... నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు వారికి ఉచితంగా నైపుణ్యాల అభివృద్ది శిక్షణ ఇచ్చి సమాజానికి ఉపయోగపడే వర్క్‌ఫోర్స్‌గా తయారుచేస్తారు.

కార్పొరేట్ సర్వీసు రెస్పాన్స్ బిలిటీ నిబంధన కింద APGENCO 90 లక్షల రూపాయలతో వైద్య పరికరాలు, వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఎక్విప్ మెంట్ గల రెండు ఆరోగ్య రధాలను బుధవారం ముఖ్యమంత్రి ఉండవల్లి నివాసం వద్ద గల గ్రీవెన్సు హాలు దగ్గర ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రెండు ఆరోగ్య రధాలలో ఒక వాహనాన్ని సీలేరు, రెండవదానిని కడప జిల్లాకు కేటాయించడం జరిగింది. ఈ ఆరోగ్య రధాలతో వివిధ రోగాలకు సంబంధించిన 150 వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇసీజీ, రక్త పరీక్షలు, అయిదు పెరామీటర్ మోనిటరింగ్ సిస్టం, నీరుడు పరీక్ష, నెబురైజర్, ఆక్సిజన్, హార్టు ఎటాక్ వచ్చిన రోగి వైద్య సేవలు అందించి ప్రమాదం నుండి రక్షించుటకు తగిన సౌకర్యాలు ఈ ఆరోగ్య రధాలలో ఏర్పాటు చేశారు.

genco 31052018 2

ఆరోగ్య రధాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఆయా గ్రామాలలో ప్రజలకు అందుబాటులోకి ఉండి ఉచిత వైద్య సేవలు అందిస్తాయి. ఆరోగ్య రధంలో ఒక మెడికల్ ఆఫీసరు, ఫార్మసిస్ స్టాఫ్ నర్సు, టెక్నీషియన్ ఉంటారు. అవసరమైన మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులకు సంబంధించిన పరీక్ష ఉచితంగా నిర్వహిస్తారు. క్యాన్సర్ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, NTR వైద్య సేవ ఆసుపత్రులకు పంపడం జరుగుతుంది. రోగులకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులో అప్లోడ్ చేసి రోగి ఆధార్ కార్డును అనుసంధానం చేయడం జరుగుతుంది.

genco 31052018 3

ఆరోగ్య రధాలకు అదనంగా ఒక్కొక్కటి 15 లక్షల విలువగల 3 అంబులెన్స్ లను ఏర్పాటు చేసింది. గిరిజన ప్రాంతాల ప్రజలు ఎవరైనా PHC కి రాలేని వారు ఉంటే ఈ అంబులెన్స్ లు ఆయా గ్రామాలకు పంపి ఇంటి వద్దనే ఉచిత సేవలు అందించడం జరుగుతుంది. 3 అంబులెన్స్ లను సీలేరు, కడప (రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏరియా), ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో గల మచ్ ఖండ్ పవర్ ప్రాజెక్టు ఏరియాలకు కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్ కో సీఎండీ విజయానంద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐ అండ్ ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యశాలలో కిడ్నీ పేషంట్లతో పాటుగా, ఇకపై ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు కూడా ఉచిత డయాలసిస్ మరియు పింఛన్లు అందజేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయడు ఆదేశించారు. బుధవారం తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం,ప్రకాశం జిల్లా కనిగిరి,కృష్ణా జిల్లా ఎ.కొండూరు ప్రాంతాలలో సికెడి వ్యాధి ప్రబలకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడమే కాకుండా దానిని యుద్ధప్రాతిపదికన అమలుచేయాలన్నారు. మూడు ప్రాంతాలలో 100% స్క్రీనింగ్ పూర్తిచేయాలన్నారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సురక్షిత తాగునీటిని అందుబాటులోకి తేవాలని,ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసి శుద్ధిచేసిన నీటినే అందజేయాలన్నారు.

dialysis 31052018 2

అధిక రక్తపోటు కారణంగా హై-డోస్ మందుల వినియోగం,విచక్షణా రహితంగా పెయిన్ కిల్లర్లు వాడటం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయనే విషయంపై ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు.కలుషిత తాగునీటి వినియోగం,అధిక టిడిఎస్ వల్ల కూడా ఈ వ్యాధి ప్రబలుతున్న విషయంపై అందరినీ చైతన్యపరచాలన్నారు.తండాలలో అవగాహనా శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్వహిస్తున్న డయాలసిస్ కేంద్రాలకు అదనంగా మరో 14కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.పాడేరు, రంపచోడవరం, తుని, అమలాపురం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసరావు పేట, మాచర్ల, ఆత్మకూరు, మదనపల్లి, కుప్పం, కదిరి, రాయచోటి,ఆదోనిలో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పుతున్నామన్నారు.

కృష్ణా జిల్లా ఎ.కొండూరులో 15తండాలలో 13వేల జనాభా ఉన్నారంటూ, డయాలసిస్ 21మందికి జరుగుతోందని, 821మంది రక్త నమూనాలు సేకరించినట్లుగా, ఇప్పటివరకు 3మెగా మెడికల్ క్యాంపులు, 34ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించినట్లుగా జిల్లాకలెక్టర్,డిఎంహెచ్ వో వివరించారు. ప్రభుత్వ వైద్యశిబిరాలతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 24గం.అంబులెన్స్ వసతి కల్పించినట్లుగా ముఖ్యమంత్రికి వివరించారు.క్రమం తప్పకుండా స్క్రీనింగ్ లు నిర్వహిస్తున్నామన్నారు.

dialysis 31052018 3

ఎ.కొండూరులో ఇటీవల ఒక వ్యక్తి మృతిపై మీడియాలో వచ్చిన కథనాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించగా,గతంలో అతనికి డయాలసిస్ జరగలేదని అధికారులు తెలిపారు.క్రానిక్ కిడ్నీ డిసీజ్(సికెడి)తో ఇబ్బంది పడ్డాడని,రెండునెలల క్రితం స్క్రీనింగ్ లో బయట పడిందని చెప్పారు. మృతుని కుటుంబానికి రూ.10వేల చెక్కు అందించామన్నారు.ఎ.కొండూరు మండలంలోని 19 గ్రామాలలో పరిస్థితి గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఉచిత మందులతో పాటుగా అందరికీ పోషకాహారం అందేలా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. జూన్ 1నుంచి అటుకుల లడ్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, తక్షణమే నూజివీడు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం,ప్రకాశం జిల్లా కనిగిరి, కృష్ణా జిల్లా ఎ.కొండూరు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.మూడు జిల్లాలలోఇప్పటివరకు సికెడి వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న వైద్యసేవలపై నివేదిక ఇవ్వాలని కోరారు.

55 వేల విద్యుత్ రంగ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపికబురు చెప్పారు. గురవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో పే రివిజన్ కమిటీ సిఫారసులకు ఆయన ఆమోద ముద్ర వేశారు. 2018-22 కాలానికి 25 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. దీని ద్వారా 15 సంవత్సరాలలోపు సర్వీసు ఉన్న వారికి రెండు వెయిటేజి ఇంక్రిమెంట్లు, 15 సంవత్సరాలకు పైగా సర్వీసులో ఉన్న వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల రూ.800 కోట్లు విద్యుత్ సంస్థలకు అదనపు ఖర్చు అవుతుందని, అయినా ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి విద్యుత్ ఉద్యోగి క్రమశిక్షణతో, బాధ్యతతో మెలిగి వినియోగ దారుడికి మెరుగైన సేవలు అందించాలని, విద్యుత్ రంగ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

cbn 31052018 2

మరో పక్క సంక్షేమ శాఖల సమీక్షలో చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. పథకాల ఫలితాలు నిర్దేశిత వర్గాలకు చేరాలన్నారు. ఇందుకోసం రియల్ టైమ్ గవర్నెన్స్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని, 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వినతులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలకు తెలియపర్చాలని, మనం దేనికైతే ఖర్చుపెడుతున్నామో ఆ పథకం ఫలవంతం కావాలని, ఫలితాలు లబ్దిదారులకు చేరాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ‘మనం చేసేది బాగానే చేస్తున్నాం. లబ్దిదారులకు ఒక కోరిక ఉంటుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాల ఫలితాలు తమకు చేరాలని భావిస్తారు. వాళ్ల కోరినది మనం చేయాలి. అత్యధికంగా సంతృప్తి రావాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.

cbn 31052018 3

ఇదిలా ఉంటే సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ ఆర్డీఓతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన కార్పొరేషన్ ఉత్సత్తులపై నాణ్యతలో రాజీ వద్దని, కర్ణాటక లాంటి పొరుగు రాష్ట్రాలు ఎలా విక్రయిస్తున్నాయి. ఎలా లాభాలు గడిస్తున్నాయో, ఆయా గిరిజన సహకార సంస్థల పనితీరును అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కాగా 2017-18 లో సాంఘిక సంక్షేమ శాఖకు కేటాయించిన బడ్జెట్ రూ.3692.44. వ్యయం చేసిన మొత్తం రూ. 3144.21. (85%) గా ఉంది. 2018-19లో కేటాయించిన మొత్తం రూ.4278.78 కోట్లు. 2017-18లో గిరిజన సంక్షేమానికి కేటాయించిన మొత్తం రూ. 1815.33 కోట్లు కేటాయించగా రూ.1724.44 కోట్లు (95%) వ్యయం చేశారు. 2018-19లో రూ. 2129.13 కోట్లు మంజూరు చేశారు. ఇక బి.సి సంక్షేమానికి కేటాయించింది రూ.5015.70 కోట్లుకాగా,అ దులో రూ. 4916.23 కోట్లు (98%) వ్యయం చేశారు. 2018-19లో రూ.6213.16 కోట్లు కేటాయించారు

Advertisements

Latest Articles

Most Read