రాష్ట్రంలో వాతావరణం మారింది. ఉదయం నుంచి చిరుజల్లులతోపాటు ఆకాశం మేఘావృతంగా ఉంది. ఎండ లేకపోగా.. కూల్ వెదర్ వచ్చేసింది. చాలా ప్రాంతాల్లో సన్నటి జల్లులు పడుతున్నాయి. రాష్ట్రంలో వాతావరణ మార్పులు, పిడుగులు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పలు జాగ్రత్తలను, హెచ్చరికలను కింది స్థాయి వరకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

cbn tweet 02062018 2

ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గాయి. నిన్నటి వరకు 40 డిగ్రీల ఎండ, ఉక్కబోతతో ఇబ్బంది పడిన ప్రజలు.. కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారిగా 10 డిగ్రీల వరకు టెంపరేచర్ తగ్గిపోవటం.. చిరు జల్లులతో ఇక ఎండలు వెళ్లిపోయాయి అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సమ్మర్ అయిపోయింది. ఎండా కాలం ముగిసింది. అరేబియా, బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమ గాలులతో చల్లగా మారిపోయింది. గాలులు తమ దిశ మార్చుకోవటంతో ఈ విధమైన వాతావరణం ఏర్పడింది. ఈ మార్పు.. నైరుతి రుతుపవనాల రాకకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుత వాతావరణంలోని మార్పులతో.. రెండు రోజుల్లోనే రాష్ట్రానికి రుతుపవనాలు రానున్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ఏడాది సమ్మర్ సీజన్ ముగిసిపోయింది అంటున్నారు వెదర్ ఎక్స్ పర్ట్స్.

cbn tweet 02062018 3

తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. ఈ వర్షాకాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా.. దక్షిణ భారతదేశంలో మంచి వర్షాలు నమోదవుతాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌ వరకు రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపించనుందని తెలిపింది. కేంద్ర వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ కేజే రమేశ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు 23 కిలోమీటర్ల వ్యాసార్థంలో వాతావరణంను అంచనా వేసేవాళ్లం కాగా ఇప్పడు 12 కిలోమీటర్ల వ్యాసార్థంలో వాతావరణంను తెలుసుకోవచ్చన్నారు. ఇప్పుడు ఐదు రోజుల ముందే వాతావరణ పరిస్థితులు తెలుసుకునే వీలుందన్నారు. అంతేకాకుండా ఎంత ప్రభావంతో వానలు కురుస్తాయో తెలిపే వ్యవస్థ ఉందన్నారు. ఏయే జిల్లాల్లో ఎంత వర్షపాతం పడుతుందో తెలుపుతూ.. జిల్లాస్థాయి అధికారులను వారం ముందే అప్రమత్తం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సీజన్‌లో దక్షిణ భారత్‌లో వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు మాత్రమే వెళ్లారు.. చాలా మంది ఉన్నారు.. అంటూ అమిత్ షా చెప్పిన వారం రోజులుకే, ఎన్డీఏనుంచి బయటకు వచ్చేస్తాం అంటున్నాయి మిత్ర పక్షాలు.. మోడీ, అమిత్ షా నిర్వాకాల వల్ల, రోజు రోజుకీ బీజేపీ దిగజారిపోతుంది. మోడీ, అమిత్ షా చేస్తున్న పనుల వల్ల, వచ్చే ప్రజా వ్యతిరేకత తమకు తగులుతుంది అని భయపడుతున్నారు. అవే ఎన్నికల ఫలితాల్లో కూడా కనిపిస్తున్నాయి. గతంలో మనుగడ కోసం బీజేపీ చేతిలో అవమానాలను దిగమింగుకున్న పార్టీలు ఇప్పుడు తమను గెలిపించలేని బీజేపీ దగ్గర ఊడిగం అవసరం లేదనే నిర్ణయానికి వచ్చాయి. మిత్రధర్మం ఇదేనా అంటూ కొన్ని సూటిపోటి మాటలు విసురుతుంటే, మరికొన్ని మాకేదీ గౌరవం అంటున్నాయి . ప్రత్యేక హోదా అంశంపై తెలుగుదేశం ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి కూటమిలో అభిప్రాయభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

modi shah 02062018 2

2014 ఎన్నికల అనంతరం మధ్యలో ఎన్డీఏలో చేరిన జేడీయూ ఇప్పుడు బయట పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల దాకా బీజేపీతోనే కూర్చుంటే రాజకీయ పార్టీగా అంతర్థానం అయిపోతామనే భయం మొదలైంది. 2014 ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లకు గాను బీజేపీ 31 గెలుచుకుంది. జేడీయూ రెండుచోట్లే నెగ్గింది. 2019లో బీజేపీతో కలిసి పోటీ చేయాల్సి వస్తే 2014లో గెలిచిన రెండు సీట్ల లెక్కన తమకు తక్కువ సీట్లు కేటాయిస్తుందేమోనన్న భయం జేడీయూని వెంటాడుతోంది. దీన్ని నివారించేందుకే ముఖ్యమంత్రి నితీశ్‌ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు.

modi shah 02062018 3

మహారాష్ట్రలో పాల్ఘార్‌లో తొలిసారిగా దీర్ఘకాల మిత్రపక్షాలైన బీజేపీ- శివసేన ఢీకొన్నాయి. బీజేపీ చేతిలో శివసేన ఓడిపోయింది. మహారాష్ట్రలో మేమే పెద్ద పార్టీ అంటూ బీజేపీ కాలరెగరేస్తోంది. శివసేన గాయాలకు కారం రాస్తోంది. బీజేపీ ఎలక్షన్‌ కమిషన్‌తో కుమ్మక్కైందనీ, ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్లే ఓడిపోయామనీ శివసేన వ్యాఖ్యానించింది. కాంగ్రె్‌సకు లాభం చేకూర్చే ఏ పనీ ఉద్ధవ్‌ చేయరనే ధీమా బీజేపీని ఎంతకైనా తెగించేట్లు చేస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో తమకు ఆశించిన స్థాయిలో పదవులు అందలేదని, ఏ కీలక నిర్ణయం తీసుకున్నా తమను సంప్రదించడం లేదని అకాలీదళ్‌ అసంతృప్తిగా ఉంది. కశ్మీర్‌లోనూ కఠువా ఉదంతం తర్వాత తెగతెంపుల వరకు వెళ్లింది. రాంమాధవ్‌ ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించడంతో ప్రస్తుతానికి రాజీ కుదిరింది. బీజేపీకి, ఎల్జేపీకి మధ్య అంతరం పెరిగింది. ఇక బీజేపీకి చివరకు మిగిలేది, ఆంధ్రాలో జనసేన, వైసిపీ, తమిళనాడులో అన్నాడీఎంకే మాత్రమే అని విశ్లేషకులు అంటున్నారు.

అశోక్ గజపతి రాజు విమానయాన మంత్రిగా ఉండగా, గన్నవరం ఎయిర్ పోర్ట్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు... ఏడాది లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ హోదాను అందుకుంది... అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులను కూడా పూర్తి చేసుకో కలిగింది... మరో పక్క అంతర్జాతీయ విమానాలు తిరగటానికి వీలుగా ఇమిగ్రేషన్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయ్యేలా చూసారు... అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ శాఖలు కొలువు తీరటానికి కార్యాలయాలతో పాటు, కౌంటర్లు కూడా పూర్తయ్యాయి... ఇమిగ్రేషన్‌ అధికారితో పాటు సిబ్బందిని కూడా నియమించటం జరిగింది... అయితే ఇవన్నీ అశోక్ రాజీనామా చెయ్యకముందు జరిగిన పనులు... రాజీనామా చేసిన తరువాత పరిస్థితి మారిపోయింది..

airlines 02062018 2

ఇన్ని చేసినా, ఇప్పటికీ కేంద్రం ఇంటర్నేషనల్ ఫ్లైట్ లకి, పర్మిషన్ ఇవ్వటం లేదు.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, దుబాయ్ కు అంతర్జాతీయ సర్వీసుల కోసం కసరత్తు చేసి, ఎయిర్ ఇండియా సర్వీసు నడిపేందుకు సూత్ర ప్రాయంగా అంగీకరించారు.. కాని చావు కబురు చల్లగా చెప్పింది ఎయిర్ ఇండియా. విజయవాడ నుంచి దుబాయికి సర్వీసును నడపలేమని చెప్పింది. ఈ తరుణంలో, ఇప్పుడు దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ ఆశలు చిగురింప చేస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడపటానికి వీలుగా స్లాట్‌ కోరుతూ సివిల్‌ ఏవియేషన్‌ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. అరబ్‌ ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌కు అనుబంధంగా ఉన్న ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ కోస్తా ప్రజలకు తీపి కబురు అందించింది. ఎయిర్‌ ఇండియా ఇచ్చిన షాక్‌తో స్తబ్దుగా ఉన్న పారిశ్రామికవేత్తలలో కూడా తాజా కబురుతో జోష్‌ వచ్చింది.

airlines 02062018 3

కిందటి నెల చివర్లో 24, 25 తేదీల్లో చెన్నైలో జరిగిన సదరన్‌ రీజియన్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ వల్ల అనుకోకుండా ఫ్లై దుబాయ్‌ నుంచి ఆసక్తి వ్యక్తమైంది. ఈ సమావేశానికి విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మదుసూదనరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి ఉన్న అవకాశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేశారు. దేశీయంగా ఇండిగో, ఎయిర్‌ ఆసియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఫ్లైదుబాయ్‌, ఎయిర్‌ ఇండియా వంటి అనేక ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రతినిథులు పాల్గొన్నారు. విదేశీ అవకాశాలకు సంబంధించి ఏపీడీ ప్రజంటేషన్‌ను అన్ని విమానయాన సంస్థలు ఆసక్తిగా విన్నప్పటికీ, ఫ్లై దుబాయ్‌ సంస్థ తక్షణం స్పందించింది. స్లాట్‌ కోరుతూ సివిల్‌ ఏవియేషన్‌కు దరఖాస్తు చేయటం కూడా వెంటనే జరిగిపోయింది. మరి కేంద్రం, ఎలా స్పందిస్తుందో చూడాలి..

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, ముసుగులు నెమ్మదిగా వీడుతున్నాయి... ఎవరు ఎటు వైపో, డైరెక్ట్ గా కాకపోయినా, ఇన్ డైరెక్ట్ గా అయినా ప్రజలకు అర్ధమవుతుంది. కాంగ్రెస్,బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ అని కెసిఆర్ చెప్తున్న మాటలు, అన్నీ అబద్ధమని ప్రతి రోజు జరుగుతున్న సంఘటనలు తెలియ చేస్తుంటే, ఇప్పుడు బీజేపీ కూడా అదే చెప్తుంది. తెలంగాణలో కాంగ్రె్‌సను, ఏపీలో టీడీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీ సీనియర్‌ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరు శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠితో మాట్లాడుతూ ఈ సంగతి తెలిపారు. ‘ఏపీలో ఎవరు గెలిచినా.. తెలుగుదేశం పార్టీని మాత్రం అధికారంలోకి రానివ్వం. తెలంగాణలో కాంగ్రె్‌సకు విజయం దక్కకుండా ఏమైనా చేస్తాం‘ అని తమ పార్టీ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ వెళ్లిపోవాలని బీజేపీ కూడా కోరుకుందని, తమకు చంద్రబాబు కావాలనుకుంటే అప్పుడే ఆపగలిగే వాళ్లమని ఆయన పేర్కొన్నారు.

bjp 02062018 2

ఏపీ రాజకీయాల్లో గేమ్‌ ఆడేందుకే రాష్ట్ర శాఖ పాత అధ్యక్షుడితో రాజీనామా చేయించి.. కొత్త అధ్యక్షుడిని తీసుకొచ్చామన్నారు. ఆ రాష్ట్రంలో రాజకీయ క్రీడకు సన్నద్ధమవుతున్నామని చెప్పారు. 2019 వరకు కాంగ్రెస్ లో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అనేకమంది నేతలు బీజేపీతో చేతులు కలుపుతారని, అక్కడ కాంగ్రెస్‌ పేరుతో మొక్క కూడా మొలవదని వారికి తెలుసునని చెప్పారు. ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా బీజేపీలో చేర్చుకుంటామని, టీడీపీ నుంచి కూడా పలువురు సంకేతాలు పంపిస్తున్నారని అన్నారు. 2019లో చంద్రబాబు శీర్షాసనం వేసినా ముఖ్యమంత్రి కారని, అప్పటికి ఏపీలో కొత్త అంశాలు తెరపైకి వస్తాయని జోస్యం చెప్పారు.

bjp 02062018 3

1984లో ఉమ్మడి ఏపీలో చోటుచేసుకున్న సంక్షోభమే 2019లోనూ పునరావృతం అవుతుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రె్‌సను అధికారంలోకి రాకుండా ఉండేందుకు అవసరమైన వ్యూహరచన చేస్తున్నామని బీజేపీ నేత చెప్పారు. అక్కడ బీజేపీ గెలవడమో, లేదా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడమో జరగాలి తప్ప.. కాంగ్రె్‌సకు అధికారం దక్కకూడదనేదే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణలో టీఆర్‌ఎ్‌సను తిట్టకపోతేనే నష్టమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి యోచించడం సరైన వ్యూహమేనని వ్యాఖ్యానించారు. మొత్తానికి, ఈ నేత వ్యాఖ్యలతో, కెసిఆర్ చేత ఫెడరల్ ఫ్రంట్ అనే డ్రామా ఆడిస్తుంది మేమే అనే సంకేతాలు బీజేపీ ఇచ్చింది.

Advertisements

Latest Articles

Most Read