వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. సాధారణంగా ఎక్కడైనా ఉపఎన్నికలు జరిగితే అధికారంలో ఉన్న పార్టీలే గెలుస్తుంటాయని...భాజపా ఓడిపోవడం ఆ పార్టీ పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పుగా భావించాలని చెప్పారు. వారి పరిపాలనలో ప్రజలు ఎంత నిరాశ, నిస్పృహలతో ఉన్నారో చెప్పేందుకు ఇది నిదర్శనమన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతుంటాయని వ్యాఖ్యానించారు. విభజనహామీలు, చట్టంలోని అంశాల అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం చివరి అస్త్రం మాత్రమేనని... వీటి సాధనకు రాజకీయ పరిష్కారమే ముఖ్యమని చెప్పారు. అందుకే రాష్ట్రంలోని ప్రజలంతా ఒకే దారిలో నడిచి ఏకపక్షంగా తమకు మద్దతివ్వాలన్నారు. రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

cbn rahul 02062018 2

జాతీయ రాజకీయాల్లో నాయకత్వం వహిస్తారా? అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు... ‘నేషనల్‌ ఫ్రంట్‌ పెడతా.. యునైటెడ్‌ ఫ్రంట్‌ పెడతా. నేనే ప్రధాన మంత్రిని అవుతా... అని నేను అన్నాననుకో... నీకు ఆనందం. నువ్వే రేపు వీడు ఒక ఫూల్‌..బఫూన్‌ అని రాస్తావు..’ అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అలాగే పలు ప్రశ్నలకు స్పందిస్తూ... ‘ నేను సైనికుడి మాదిరిగా పనిచేస్తాను. రాష్ట్రాలను బలోపేతం చేసుకోవాలనేదే నా ఉద్దేశం. జాతీయ రాజకీయాల్లో ఎవరికీ పోటీదారును కాను. రాబోయే రోజుల్లో కేసీఆర్‌, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయ్‌క్‌ ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం. ప్రాంతీయ పార్టీల కూటమి విషయంలో ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ప్రాంతీయ పార్టీల కూటమి ఎన్నికలకు ముందా? తర్వాత ఎలా కార్యారూపం దాల్చుతుందో మీరే చూస్తారు అని చంద్రబాబు అన్నారు.

cbn rahul 02062018 3

రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇవ్వటం పై, విమర్శలు వస్తున్నాయి కదా అని విలేకరి అడగగా, కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాహుల్‌గాంధీతో కరచాలనం చేయడంలో తప్పేముంది. మోదీ, సోనియాగాంధీతో నాకు వ్యక్తిగత విరోధాలు ఏమీ లేవు. కాంగ్రెస్‌ ఎంత అన్యాయం చేసిందో... భాజపా కూడా రాష్ట్రానికి అంతకంటే ఎక్కువే చేస్తుంది...’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రజల మనోభావాలతో జాతీయ పార్టీలు ఆడుకుంటున్నాయి. అవి వారికి ఆటకావొచ్చు. మనకు జీవన్మరణ సమస్య. అలాంటి పరిస్థితి సృష్టించి నీకు దిక్కున్న దగ్గర చెప్పుకోమనడం ఏం పద్ధతి... ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్నవి సాధించుకోవడం ఎలాగో నాకు తెలుసు. ప్రాంతీయ పార్టీలకు ఈ సారి ఎక్కువ సీట్లు వస్తాయి. మన ఆలోచనలకు దగ్గరగా ఉండే పార్టీలన్నీ మద్దతు తీసుకుని విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతాం. ’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే విషయం పై చంద్రబాబు ఈ మధ్య తరుచూ మాట్లాడుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా ? ప్రధాని అయ్యే ఆశలు ఉన్నాయా అని విలేకరులు అడిగినా, పియం అంటూ టిడిపి శ్రేణులు నినాదాలు ఇచ్చినా, చంద్రబాబు ఎప్పుడూ ఇవి తోసి పుచ్చే వారు.. నాకు ప్రధాని అయ్యే ఆలోచనే లేదు అని, అసలు అలాంటి ఆశలు లేవని, రాష్ట్రమే నాకు ముఖ్యం అంటూ చంద్రబాబు అనేకసార్లు చెప్పారు. రాష్ట్రం కోసం నేను అహర్నిశలు కష్టపడుతున్నాని, ఒక విజన్ తో, రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసే ఆలోచలనతో పనులు మొదలు పెట్టానాని, అంతటి ప్యాషన్ తో రాష్ట్రం కోసం పని చేస్తుంటే, ఇక ప్రధాని అవ్వాలి అనే ఆశ ఎలా ఉంటుంది అంటూ చంద్రబాబు ఎప్పుడూ అనే వారు. అయితే, నిన్న మాత్రం కొంచెం బిన్నంగా స్పందించారు.

cbn nataional 02062018 2

‘జాతీయ రాజకీయాలపై అందరి మాదిరి కుప్పిగంతులేయలేను’ ఏపీ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. శనివారం నిర్వహించనున్న నవ నిర్మాణ దీక్షపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాలపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. " జాతీయ రాజకీయాలేంటో.... అక్కడి పరిస్థితులు, పరిమితులేంటో నాకు తెలుసు. ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావడం ఖాయం. మేం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయం. జాతీయ రాజకీయాల విషయంలో ఎప్పుడేం చేస్తానో మీరే చూస్తారు. కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో, బీజేపీ అంత అన్యాయం చేస్తోంది, ఇంకా ఎక్కువ చేస్తుంది కూడా. విభజన హక్కుల సాధనకు చివరి ఆప్షన్‌గా న్యాయ పోరాటం చేస్తాను" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

cbn nataional 02062018 3

"ఈ దేశంలో ఉన్న రాజకీయపార్టీలను అధ్యయనం చేసిన వ్యక్తిని నేను. అనేక సందర్భాల్లో వాటిల్లో భాగస్వామినయ్యాను. జాతీయ రాజకీయాల్లో సంక్లిష్ఠతలు తెలిసిన వాడిని. ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్నవి సాధించుకోవడం ఎలాగో నాకు తెలుసు. ప్రాంతీయ పార్టీలకు ఈ సారి ఎక్కువ సీట్లు వస్తాయి. మన ఆలోచనలకు దగ్గరగా ఉండే పార్టీలన్నీ మద్దతు తీసుకుని విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతాం. నీతి, నిజాయతీ వ్యాఖ్యలు వల్లించిన మోదీ కర్ణాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపి బరితెగించారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. కేంద్రాన్ని విడిచిపెట్టం. సహకరించనందునే ధర్మపోరాటం చేస్తున్నాం..’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

నిన్న జరిగిన టీవీ డిబేట్లలో, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీల్ కు ఛాలెంజ్ విసిరితే పారిపోయారు. ఇంతకీ జీవీల్ అంటే ఎవరో తెలీదు అంటారా.. ఈ మధ్యే వార్తల్లో వస్తున్నారు. అరకోటు వేసుకుని, ఎక్కువగా అమరావతి పై విమర్శలు చేస్తూ, మీకు మయసభ కావాలా అని అడుగుతూ ఉంటారు.. ఆయనే జేవీఎల్ అంటే... నిన్న టీవీ డిబేట్ లో, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఒక ఛాలెంజ్ విసిరారు. మీరు, నేను కొట్టుకోవటం ఎందుకు, కేంద్రం నుంచి ఒక ఐదుగురు, రాష్ట్రం నుంచి ఐదుగురు అధికారులని, ఓపెన్ డిబేట్ చెయ్యమని చెప్దాం.. టీవీ చానల్స్ ముందు ఈ డిబేట్ పెడదాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒప్పించి తీసుకువస్తా, మీరు కేంద్రం నుంచి తీసుకురండి, ప్రజల ముందు వాస్తవాలు ఉంచుదాం అని అంటే, జీవీఎల్ ఈ ఛాలెంజ్ స్వీకరించకుండా పారిపోయారు.

gvl 02062018 2

గురువారం సచివాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కుటుంబరావు మాట్లాడుతూ, కేంద్రం పై కొన్ని ఆరోపణలు చేసారు. వీటి పై సమాధానం చెప్పండి అంటే, ఒక్కడంటే ఒక్కడు ముందుకు రాలేదు. 2016-17కు సంబంధించి రూ.84,000 కోట్ల ఎడ్యుకేషన్‌ సెస్‌.. పద్దుల్లోనే లేదని కాగ్‌ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ‘ఆ సెస్‌ మొత్తాన్ని విద్యాశాఖకు అప్పగించకుండా ఎటు మళ్లించారు? కనీసం సెస్‌ నిర్వహణ ఖాతా కూడా పెట్టలేదు. కేంద్రంలోని 19 శాఖలు సమర్పించిన యూసీలు సక్రమంగా లేవని కాగ్‌ తన నివేదికలో తెలిపింది. కొన్ని శాఖలు అసలు యూసీలే సమర్పించలేదు. సక్రమంగా నిధులు వినియోగిస్తూ.. యూసీలు సమర్పిస్తున్న నవ్యాంధ్రపై అమిత్‌ షా, జితేంద్ర సింగ్‌, జీవీఎల్‌ సరసింహారావు విమర్శలు చేస్తున్నారు. మా లెక్కలు అడిగేముందు మీ లెక్కలు సరి చూసుకోండి’ అని హితవు పలికారు.

gvl 02062018 3

నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు కోస్టల్‌ ఎంప్లాయిమెంట్‌ జోన్‌కు అనుకూలంగా ఉంటాయని స్వయంగా నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సిఫారసు చేశాక కూడా.. రాష్ట్రానికి ఇవ్వకుండా దానిని కేంద్రం కోల్ట్‌స్టోరేజీలో పడేసిందన్నారు. ఏపీకి రూ.మూడున్నర లక్షల కోట్లు ఇచ్చామంటున్నారని.. దీనిపై వారు అధికారులతో చర్చకు సిద్దమా అని సవాల్‌ విసిరారు. ఢొలేరా విషయంలో జీవీఎల్‌ బుధవారం చెప్పినవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. ఢిల్లీ-ముంబై ఇండస్ర్టియల్‌ కారిడార్‌కు కేంద్రం ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయించి.. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. వీసీఐసీలో కృష్ణపట్నం పోర్టును నోడ్‌గా చేర్చాక ఒక్క రూపాయైునా ఇచ్చారా అని నిలదీశారు. ఢొలేరా స్మార్ట్‌ సిటీ ప్రణాళిక, డిజైన్‌లను సింగపూర్‌ సంస్థలే చేస్తున్నాయని, ఆ సంస్థలకు భాగస్వామ్యం కూడా ఉందని తెలిపారు. అలాంటిది అమరావతిలో కోర్‌ కేపిటల్‌ ప్రాంతం అభివృద్ధికి సింగపూర్‌ సంస్థలతో కలిసి రాష్ట్రప్రభుత్వం పనిచేస్తుంటే విమర్శిస్తున్నారని ఆక్షేపించారు.

తెలుగు రాష్ట్రాలు ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. రానున్న కాలంలో తెలంగాణ ప్రజల కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంచితే, విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.

modi cbn 02062018 2

విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా అవమానించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బెంజిసర్కిల్‌లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. 2014 బాధా సంవత్సరమని, జూన్ 2 చీకటిరోజని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయం కోసం ఢిల్లీలో దీక్ష చేశానని గుర్తుచేశారు. విభజన సమయంలో కొంతమంది రాజీపడ్డారని, మరికొంతమంది కోవర్టులుగా మారారని చంద్రబాబు ఆరోపించారు.
హేతుబద్ధత లేకుండా విభజన చేశారని మండిపడ్డారు. అస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి ఇచ్చారన్నారు. ఏపీలో తొలి ఏడాది రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు.

modi cbn 02062018 3

సంక్షోభం, సమస్యల మధ్య ఏపీలో పాలన ప్రారంభమైందని సీఎం తెలిపారు. కష్టాలు, సమస్యలు తప్ప ఏపీకి ఏం ఇచ్చారనిప్రశ్నించారు. కాంగ్రెస్‌ మోసం చేస్తే.. బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సంతోషం ఉందని వేడుకలు జరుపుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని చంద్రబాబు విమర్శించారు. అడుగడుగునా అవమానం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. లాభాలు లేని దిల్లీ-ముంబయి బుల్లెట్‌ రైలుకు నిధులు ఎలా ఇస్తారు? అని సీఎం ప్రశ్నించారు. ఇక్కడ మెట్రో రైలు అడిగితే గిట్టుబాటు కాదంటున్నారని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read