ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, సోము వీర్రాజు సంచలన ప్రకటన చేసారు. తాను 2024 తరువాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని, 2024 తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ సంచలన ప్రకటన చేసారు. 2024లో బీజేపీకి అధికారం ఇవ్వాలని సోము వీర్రాజు ఈ సందర్భంగా కోరారు. ఇటీవల జరిగిన కోర్ కమిటీ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలను బీజేపీ తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పైన, గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని విషయాల పైన దూకుడుగా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతి ఉద్యమం దగ్గర నుంచి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకం, జగన మోహన్ రెడ్డి చేస్తున్న అప్పులు, ఇలా అన్ని విషయాల పైన పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత క్యాష్ చేసుకోవటం కోసం ఉద్యామాలు తీవ్రతరం చేయాలని, ఈ మధ్య కోర్ కమిటీ సమావేశం అయ్యి, గట్టిగా పని చేయాలని, ఎలాగైనా ఏపిలో బీజేపీని అధికారంలోకి తేవాలని, నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం మొత్తం కార్యచరణ సిద్ధం చేసారు. ఈ నేపధ్యంలో, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూనే, ముందు ఉండి నడిపించాలసిన సోము వీర్రాజు, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పటం పై, పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అనూహ్యంగా సోము వీర్రాజు, తాను 2024 తరువాత రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పటంతో, అటు బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా షాక్ అయ్యారు. సోము వీర్రాజు గత 42 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి, తరువాత బీజేపీలో కూడా అనేక పదవులల్లో పని చేసారు. చంద్రబాబు హాయంలో, టిడిపి సహకారంతో, ఎమ్మెల్సీ అయ్యి, ఎట్టకేలక సభలో అడుగు పెట్టారు. ప్రసుత్తం ఆయన బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన అధ్యక్ష పదవి కూడా చేపట్టి రెండేళ్ళు అవుతుంది. సహజంగా ప్రతి రెండేళ్లకు అధ్యక్షులను మార్చుస్తారు. ఈ సారి కూడా సోము వీర్రాజుని మార్చి కొత్త వారికి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలోనే సోము వీర్రాజు ఈ ప్రకటన చేయటం వెనుక, ఏమి వ్యూహం ఉందో, ఆయన ఆలోచన ఏమిటో తెలియదు కానీ, మొత్తానికి రాజకీయ సన్యాసం ప్రకటనతో, పలువురు విస్మయం వ్యక్తం చేసారు. ఆరోగ్య పరిస్థితి, వయసు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకటన చేసారా ? లేదా ఇంకా ఏమైనా వ్యూహం ఉందా అనేది చూడాలి మరి.