వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో ఘోరంగా విఫలమైందని, ప్రజలు గంజాయి, ఇతరత్రా డ్ర-గ్స్ గురించి మొత్తుకున్నా కూడా పాలకులు సకాలంలో స్పందించకపోగా, ప్రశ్నించిన టీడీపీ నేతలు,ఇతరులపై కేసులు పెట్టారని, మాదక ద్రవ్యాలను నియంత్రించి యువతను, రాష్ట్ర భవిష్యత్ ను కాపాడకుండా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రివర్యులు నిమ్మకాయల చినరాజప్ప స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! తెలుగుదేశం పార్టీ సహా, ఇతర పార్టీలు తొలి నుంచి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వ్యాప్తి రాష్ట్రంలో పెరిగిందని చెప్పినా పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం పెడచెవిన పెట్టాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి, ముఖ్యమంత్రిని నిలదీశామన్న అక్కసుతో ఆఖరికి టీడీపీ కార్యాలయం పై కూడా దా-డి-కి తెగబడ్డారు. ప్రభుత్వ పని తీరు అంతా గాలి వాటంగా ఉండటంతో, రాష్ట్రం నుంచి మాదక ద్రవ్యాలు, మరీ ముఖ్యంగా గంజాయి వంటివి దేశమంతా రవాణా అవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడా గంజాయ సాగు అనేది లేకుండా చేశాము. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, గిరిజనుల సహాయ సహాకారాలతో, ప్రత్యేక బృందాలతో గంజాయి సాగుకి రాష్ట్రంలో చోటు లేకుండా చేశాము. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, వైసీపీ నేతలు గంజాయినే తమ ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. స్వయంగా పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రే ఏపీ నుంచి ఇతరప్రాంతాలకు గంజాయి రవాణా అవుతుందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై ఈ ప్రభుత్వం కాస్తైనా సిగ్గుపడాలికదా? రాష్ట్రంలో గంజాయి వాడకంతో పాటు, మద్యం, నాటాసారా అమ్మకాలు పెరిగాయి. మాదకద్రవ్యాలను ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుండటంతో మహిళలపై దారుణాలు అధికమయ్యాయి.

j 03122021 2

పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గంజాయి సాగుతో పాటు, మాదక ద్రవ్యాల బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. 2018లో రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు చాటు మాటుగా 33,900 కిలోల గంజాయి స్మగ్లింగ్ జరిగితే, అది 2020 నాటికి లక్షా 06 వేల 400 కిలోలకు పెరిగింది. 2018లో మాదకద్రవ్యాల బారిన పడి 196 మంది చనిపోతే, 2020లో మృతుల సంఖ్య 380కు చేరింది. అలానే కేసుల నమోదులో 2018లో 504కేసులు నమోదైతే, 2020లో 866కేసులు నమోదయ్యాయి. గంజాయి రవాణా, సాగు ఇతర వ్యవహారాల్లో 2018లో 175మందికి శిక్షలు పడితే, 2020లో కేవలం 22 మందిని మాత్రమే శిక్షించారు. పోలీస్ స్టేషన్లలో కేసులు సరిగా నమోదు చేయకపోవడం, పట్టుబడిన వారిని అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేయడంతో కేసుల సంఖ్యతో పాటు శిక్షలుపడిన ఘటనలు బాగా తగ్గాయి. 2018లో 1638 కేసులు నమోదైతే, 2020లో 1569 కేసులు మాత్రమే నమోదు చేశారు. చాలా చోట్ల నమోదైన కేసుల్లో ఎలాంటి శిక్షలు పడలేదు. రాష్ట్రం నుంచి గంజాయి ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతోందంటే అందుకు ప్రధాన కారణం అధికార పార్టీ నేతల అండదండలే. మద్యాన్ని ప్రభుత్వం ప్రధాన ఆదాయవనరుగా మార్చుకుంది. మద్యంద్వారా ఏటా రూ.20 వేల కోట్లఆదాయం వస్తోందని ప్రభుత్వమే చెప్పింది.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి మంత్రి అనిల్ కుమార్ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై స్పందిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడాడని, ప్రతిపక్షంపై తన అక్కసునంతా వెళ్లగక్కి, ఈ ప్రభుత్వ నిర్వాకాలతో తనకు వచ్చిన కడుపు ఉబ్బరం తగ్గించుకున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! పోలవరంప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారన్న ప్రజలకు సమాధానం చెప్పలేక, ఒకరకమైన అసహనంతోనే కొన్ని మీడియా సంస్థలు సహా, అందరిపై మంత్రి అనిల్ కుమార్ అక్కసు వెళ్ల గక్కుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ కి ఖర్చుపెట్టిన డబ్బులు, రీయింబర్స్ మెంట్ చేయించుకొని జగన్ రెడ్డి తన 30నెలల పాలనలో రూ.4వేల కోట్ల వరకు కేంద్రం నుంచి పొందాడు. మీడియాకు పత్రికలకు పోలవరంప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక్క సమాచారమైనా ఏనాడూ ఎందుకు మీడియాకు ఇవ్వలేదు. ముఖ్యమంత్రికి, మంత్రి అనిల్ కుమార్ కు సమాచారం ఇచ్చే ధైర్యం లేదా? చంద్రబాబునాయుడి గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు 71శాతంవరకు జరిగితే, తన 30నెలల పాలన లో జగన్ రెడ్డి ఎంతశాతం పనులు చేశాడు? ఏం చేశారో చెప్పమని ప్రజలు, సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాలు అడుగుతుంటే, మంత్రి ఎందుకు బూతుపురాణం వల్లెవేస్తున్నాడు? గోదావరికి వరదలు వచ్చి, అక్కడున్నవారంతా కొండలు, గుట్టలపాలైతే, వారికి ఇస్తామన్న రూ.2 వేల పరిహారమే ఇంతవరకు ఇవ్వని అసమర్థ, దద్దమ్మ, చేతగాని ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి మీరు పోలవరం ప్రాజెక్ట్ కడతారా? పూర్తిచేసే ముఖాలేనా మీవి? 30నెల ల్లో గజ్జి ఏంటి మంత్రీ? రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడి ఎవరు గజ్జితో పనిచేశారో తెలియదా జగన్ రెడ్డి? జూన్ 2019లో జరిగిన తొలి రివ్యూ మీటింగ్ లో అధికారులు చాలాస్పష్టంగా జగన్ రెడ్డికి చెప్పారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎల్ అండ్ టీ సంస్థ చేసిందని, ప్రపంచమంతా గర్వించేలా నిర్మాణం జరిగిందని చెప్పారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు జరగాలంటే, కాపర్ డ్యామ్ ఎగువన, దిగువన పనులు చేయాలని, నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తే రెండేళ్లలోనే డ్యామ్ పనులు పూర్తి చేస్తామని వివరంగా చెప్పారు. 2022 జూన్ నాటికి పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తిచేసి విద్యుత్ కూడా వచ్చేలా చేస్తామన్నారు కదా జగన్ రెడ్డి. కానీ నువ్వేం చేశావు? అధికారంలోకి వస్తే పట్టిసీమ పంపులు పీకుతానన్నవాడిని తీసుకొచ్చి పోలవరం పనుల్లో పెట్టావు. పట్టిసీమ పనికిరాదు.. ఆ నీళ్లు తెచ్చి ఎక్కడపోస్తారు అన్నారు. పట్టిసీమ నీళ్లు సముద్రంలో పోస్తారా అని జగన్ రెడ్డి ప్రధానప్రతిపక్షనేత గా ఉన్నప్పుడు మా ట్లాడాడు.

గోదావరి నీళ్లు 350టీఎంసీలు తెచ్చి కృష్ణాడెల్టాను కాపాడటమేగాక, అదే నీటిని శ్రీశైలానికి తరలించి, రాయలసీమకు తరలించడం జరిగింది. పోలవరంప్రాజెక్ట్ విషయంలో జగన్ రెడ్డి ఎందుకింత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నా డు. తెలుగువారి గుండెచప్పుడు, జాతీయప్రాజెక్ట్ అయిన పోలవరం పూర్తైతే, రాష్ట్రానికి తాగు నీటిసమస్య ఉండదు. అలాంటిప్రాజెక్ట్ నిర్మాణంలో ఏంచేశారనే దానిపై జగన్ రెడ్డి ఎందుకు నోరువిప్పడంలేదు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ప్రకారం, రాష్ట్రజలవనరుల శాఖాధికారులు నిర్మాణంచేశారు. ఆవిధంగా జరిగిన పనులకు సంబంధించి రూ.7వేలకోట్లు వచ్చాయి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.4వేలకోట్లు వచ్చాయి. వచ్చిన డబ్బుతో డ్యామ్ సైట్లో పనులుఎందుకు చేయించలేదు? నిర్వాసితులకు డబ్బులివ్వకుండా లిక్కర్ కంపెనీలకు అడ్వాన్స్ లు చెల్లించారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారు. పీటర్ కమిటీ అని ఏవేవో డ్రామాలుఆడారు. పుల్లారావు అనేవ్యక్తి ఢిల్లీ హైకోర్ట్ లో వేసిన పిటిషన్ పై స్పందిస్త్తూ, కేంద్రప్రభుత్వం పోలవరంప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి లేదని స్పష్టంచేసింది. ఇన్నిజరిగినా కూడా జగన్ రెడ్డి తన ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమారప్రగల్భాలు ఆపలేదు. పోలవరం నిర్వాసితులకు ఈ ముఖ్యమంత్రి, మంత్రి అనిల్ రూపాయికూడా ఇవ్వలేదు. బూతులు మాట్లాడే మంత్రులు, వారితో మాట్లాడించే ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ కడతారా? 5 ఏళ్లలో చంద్రబాబునాయుడు 62ప్రాజెక్ట్ లకు శ్రీకారంచుట్టి, ఇరిగేషన్ రంగంలో విప్లవం తీసుకొచ్చారు.

ఒకజాతీయ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడి హయాంలో పూర్తవుతుందని దేశమంతా ఎదురుచూసింది. ఈ 30నెలల్లో మీరు ఎంచుకున్న ప్రాజెక్ట్ లను ఎంతవరకు పూర్తిచేశారో చెప్పండి. నెల్లూరు బ్యారేజ్ మే 2021కి, సంగం బ్యారేజ్ మే 2021, వెలిగొండ ప్రాజెక్ట్ ఆగస్ట్ 2021 కి పూర్తవుతాయనిచెప్పారు. అధికారంలోకి వచ్చాక మీరు ఎంచుకున్న ప్రాజెక్ట్ ల్లోనే ఎక్కడా పనులు జరగలేదు. 30 నెలల్లో ఇరిగేషన్ రంగానికి ఎంతఖర్చుపెట్టారో, ఏఏ ప్రాజెక్ట్ ల్లో ఎంతశాతం పనులు చేశారో పూర్తివివరాలతో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ముందా మీకు? టీడీపీ హాయాంలో జరిగినపనులకు సంబంధించి వచ్చిన రూ.4వేలకోట్లను లిక్కర్ కంపెనీలకు ఇచ్చి నిర్వాసితుల నోట్లో మట్టికొట్టారు. నిర్వాసితులకు తీరని ద్రోహంచేసి, వరద సాయం కూడా ఇవ్వకుండా వారిని కొండలు, గుట్టల్లో వదిలేశారు. ఆఖరికి వారికి ఇస్తామన్న రూ.2వే ల పరిహారంకూడా ఇప్పటికీ అందలేదు. ప్రధానమంత్రిని కలవడానికి భయపడే ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్ రెడ్డి ఒక్కడే. ప్రధానిని కలిసి పోలవరానికి అవసరమైన నిధులు ఎందుకు అడగలేకపోతున్నావు జగన్ రెడ్డి? తరుముకొస్తున్న కేసుల భయంతోనా? పోలవరం ప్రాజెక్ట్ డిజైన్స్ ఫైనల్ చేయించుకోలేనివారు.... మీరు కోటలోఉన్నా.. పేటలో ఉన్నాఒకటే, మీకెందుకయ్యా అధికారం? పోలవరం డ్యామ్ కట్టడం మీ ఇష్టం నా ఇష్టం కాదు జగన్ రెడ్డి? శాసనసభలో బూతులుతిట్టి ఇప్పటికే భ్రష్టుపట్టారు. అందుకే గౌరవసభలతో ప్రజల్లోకి వెళుతున్నాం.

రాజకీయ నాయకులు బయటకు చెప్పే దానికి, లోపల చేసే దానికి చాలా తేడా ఉంటుంది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అసలు ఏమి చెప్తారో, ఏమి చేస్తారో మొత్తం కన్ఫ్యూషన్ గానే ఉంటుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పలేం. ఈ మధ్య హడావిడి చేసిన దిశ చట్టమే తీసుకుంటే, రాష్ట్రంలో హడావిడి చేస్తున్నారు, కేంద్రానికి మాత్రం సమాచారం ఇవ్వటం లేదు. దీంతో బిల్లు ఆగిపోయింది. ఇక తాజాగా మరో విషయం నిన్న రాజ్యసభ సాక్షిగా బయట పడింది. నిన్న విజయసాయి రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు, వైసీపీ బండారం బయట పడింది. కర్నూలులో నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అయితే ఇదే విషయం పై విజయసాయి రెడ్డి ఒక ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర మంత్రి కిరణ్ రిజీజు సమాధానం ఇచ్చారు. తమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కర్నూలులో నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ పెట్టమని ఎలాంటి ప్రతిపాదన రాలేదని తేల్చి చెప్పారు. అయితే గతంలో ఇదే విజయసాయి రెడ్డి, తాము కేంద్రాన్ని కర్నూలులో నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ పెట్టమని అడిగినట్టు , మీడియాకు గతంలో చెప్పారు. మరి విజయసాయి రెడ్డి చెప్పింది నిజమా ? లేక తమకు ఎలాంటి ప్రతిపాదన ఏపి నుంచి రాలేదని కేంద్ర మంత్రి చెప్పింది నిజమా ? మరో పక్క కర్నూల్ న్యాయ రాజధాని అంటూ చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కనీసం ఈ ప్రతిపాదన కూడా కేంద్రానికి ఎందుకు పంపించ లేదు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ల్యక్షంతో, కడపలో జరిగిన విధ్వంసం అందరికీ తెలిసిందే. కడపలో ఉన్న అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి, ఊరు ఊరు కొట్టుకుపోయింది. 40 మందికి పైగా చనిపోయారు కూడా. అయితే వరదలు వస్తున్నాయి అని తెలిసినా, ప్రభుత్వం నిర్ల్యక్షంతో వ్యవహరించింది. ఇసుక మాఫియా కోసమే ఇలా చేసారని టిడిపి కూడా ఆరోపించింది. ఇవి ప్రభుత్వం చేసిన హ-త్య-లు అని చంద్రబాబు కూడా అన్నారు. ఇప్పుడు ఇదే అంశం రాజ్యసభలో కూడా చర్చకు వచ్చింది. గురువారం రోజు రాజ్యసభలో డ్యాం సేఫ్టీ బిల్లు పైన కేంద్ర జల శక్తి శాఖా మంత్రి షకావత్ మాట్లాడుతూ, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్నమ్మయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవటం పై, రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒకే సారి వరద వచ్చిందని, ఒక గేటు తెరుచుకోక పోవటంతో, విధ్వంసం జరిగిందని అన్నారు. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా కూడా ఈ అంశం చర్చకు వచ్చిందని, ఎవరైనా దీని పైన స్టేడి చేస్తే, మన పరువు అంతర్జాతీయంగా పోతుందని అన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ విధ్వంసానికి మనందరం బాధ్యులమే అని అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుందని అన్నారు.

shekavath 03122021 2

"ఒక్కసారిగా వరద వచ్చింది. స్పిల్ వె సామర్ధ్యం కటనే ఒకటిన్నర రెట్లు నీళ్ళు ఎక్కువ వచ్చి పడింది. హడావుదిగా నిర్ణయం తీసుకుని అయుదు గేట్లు తెరవటం వల్ల గేట్లు, స్పిల్ వే ద్వారా వచ్చిన నీరు మొత్తం కిందకు వెళుతుంది. కానీ చాలా బాధతో చెబుతున్నాను.. నాలుగు, అయుదు గేట్లలో ఒకటి తెరచుకోలేదు. అది పని చేయడం లేదు. ఈ బాధ్యత ఎవరిదీ అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా ? ఆ ప్రభావం చాలా దూరం వరకూ పడింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఆ వార్తను ఆధారంగా చేసుకుని దేశంలో మరో జలాశయం కొట్టుకుపోయిందని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. భారత్ లో మరో వంతెన తెగిపోయిందని ప్రపంచ వ్యాప్తంగా ఇంజీనీర్లు దీనిని కేసు స్టడీగా తీసుకుంటే, మనకు ఎంత అవమాకరం ? దీనికి బాధ్యతా, జావాబుదారీతనం ఎవరు తీసుకోవాలనే అంశం పై ఓ చట్టం చేయాల్సిన వసరం ఉందా లేదా ? దీనికి వారు బాధ్యులు" అని వ్యాఖ్యానించారు.

Advertisements

Latest Articles

Most Read