ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు కోసం అని ప్రారంభం అయ్యాయి. అయితే బద్వేల్ ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం, అలాగే సంతాప తీర్మానాలు తరువాత, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానం స్పీకర్ తిరస్కరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర ధరల పెరుగుదల పైన తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ దాన్ని తిరస్కరించారు. తరువాత సభ వాయిదా పడింది. సభ వాయిదా తరువాత బీఏసీ సమావేశం ఏర్పాటు చేసారు. అసెంబ్లీ సమావేశాలను కేవలం ఒక్క రోజు మాత్రమే జరపాలని తాము భావిస్తున్నాం అని, స్పీకర్ తమ్మినేని అచ్చెన్నాయుడుకి చెప్పారు. దీని పైన అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, మీరు ఒక్క రోజు అసెంబ్లీ కోసం, ఇంత హడావిడి ఎందుకని, అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు పాటు జరపాలని అచ్చెన్నాయుడు కోరారు. దీని పైన జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ, గ్రేట్ అచ్చెన్నాయుడు, పెద్దాయిన అడుగుతున్నారు కదా, మనం అంగీకరించకాపోతే ఎలా, ఈ నెల 26 వరకు అసెంబ్లీ జరుపుకుందాం అంటూ, వెటకారంగా జగన్ స్పందించారు. దీంతో స్పీకర్ కూడా ఒప్పుకుని, అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు కాకుండా, 26 వరకు జరుపుకుందాం అని నిర్ణయం తీసుకున్నారు.

bac 18112021 2

అయితే బీఏసి సమావేశంలో కుప్పం ఎన్నికల పైన ఆసక్తికర చర్చ జరిగింది. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ, ఆయన్ను హేళన చేస్తూ, జగన్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ప్రవర్తించిన తీరు హుందాతనంగా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చంద్రబాబును అసెంబ్లీకి తీసుకురండి, కుప్పం ఫలితాల తరువాత చంద్రబాబుని చూడాలని ఉంది అంటూ, జగన్ మోహన్ రెడ్డి వెటకారంగా చంద్రబాబుని హేళన చేస్తూ మాట్లాడటంతో, అచ్చెన్నాయుడు దీటుగా సమాధానం ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటమలు అనేవి సహజం అని, మీరు ఎన్నికల్లో ఎలా గెలిచారో అందరికీ తెలుసులే కానీ, బీఏసి సమావేశంలో ఎన్నికల చర్చ ఎందుకు, మీరు ప్రజా సమస్యల పైన చర్చించే దమ్ము ఉందొ లేదో చెప్పండి అని అన్నారు. అయినా ఆపకుండా మంత్రి అనిల్ కల్పించుకుని, నెల్లూరు ఎన్నికలకు అచ్చెన్నాయుడు ఇంచార్జ్ అని, ఒక్కటి కూడా గెలవలేదని మళ్ళీ వ్యంగ్యంగా మాట్లాడారు. మళ్ళీ జగన్ కల్పించుకుని, చంద్రబాబుతో చాలా మాట్లాడాలి, అసెంబ్లీకి తీసుకురండి అని చెప్పగా, చంద్రబాబు పారిపోయే వ్యక్తి కాదని, కచ్చితంగా అసెంబ్లీకి వస్తారని అన్నారు.

రాజధాని అమరావతి విషయంలో దాఖలు అయిన పిటీషన్ పై ఫుల్ బెంచ్ విచరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ మూడవ రోజు కూడా కొనసాగింది. రైతుల తరుపున శ్యాం దివాన్ వాదనలు వినిపించారు. ప్రభుత్వాలు చేసే విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అని, రాజధాని నిర్మాణం దేశ ప్రతిష్టత ముడి పడిన అంశం అని కోర్టు ముందు వాదించారు. అయితే ఈ విచారణ సందర్భంగా హైకోర్ట్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులలో ఒకటైన జ్యుడిషియల్ క్యాపిటల్ అనే పదం పై హైకోర్టు ప్రశ్నల వర్షం సంధించింది. అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ అనే దానికి అర్ధం ఏమిటి అంటూ హైకోర్టు ప్రశ్నించింది. వికేంద్రీకరణ చట్టంలో, హైకోర్టుని కర్నూల్ లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు అర్ధం అవుతుందని, ఇలాంటి హామీలను వికేంద్రీకరణ చట్టంలో అసలు పొందుపరచవచ్చా అని, కోర్ట్ ప్రశ్నించింది. అలాగే, అసలు వికేంద్రీకరణ చట్టంలో, ఎక్కడా కర్నూల్ లో హైకోర్టు ఉంటుంది అనే విషయం పై స్పష్టత లేదు కదా అని కోర్ట్ కామెంట్ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, కర్నూల్ తో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి విబేధాలు సృష్టించే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, ఈ మేరకు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

hc 18112021 2

ఇప్పటికే హైకోర్టుని అమరావతిలో ఏర్పాటు చేస్తూ, రాష్ట్రపతి ఇచ్చిన నోటిఫికేషన్ విషయాన్ని కూడా చీఫ్ జస్టిస్ ప్రస్తావించారు. అలాగే కేంద్రం కొత్త నోటిఫికేషన్ ఇవ్వనంత వరకు, హైకోర్టు ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశమే లేదు కదా అని అన్నారు. మరి ఇలాంటి సమయంలో, హైకోర్టు, కర్నూల్ లో పెట్టటానికి ఎలా సాధ్య పడుతుందని ప్రశ్నించారు.అమరావతి విషయంలో ఒకసారి ఇప్పటికే తీసుకున్న నిర్ణయం, హైకోర్టు విషయాలో కూడా వర్తిస్తుందా అని ప్రశ్నించారు. రైతుల తరుపున శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ, ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు తుంగలోకి తొక్కి, లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలు కర్నూల్ లో ఏర్పాటు చేసారని అన్నారు. రాజధాని అమరావతి విషయంలో ఒకసారి తీసుకున్న నిర్ణయం, మళ్ళీ మార్చటానికి వీలు లేదని అన్నారు. ఇప్పటికే విభజన చట్టం ప్రకారం, హైకోర్టుని అమరావతిలో పెడుతూ కేంద్రం నోటిఫికేషన్ కూడా ఇచ్చిందని అన్నారు. హైకోర్టు మీద నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందని అన్నారు. అన్ని విభాగాలు ఒక చోట ఉంటేనే అది రాజధాని అవుతుందని వాదనలు వినిపించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. తమ సొంత ప్రభుత్వ పని తీరు పైనే, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో వస్తున్న ప్రజా వ్యతిరేకత, తమ మీద పాడుకుందా, వైసీపీ ఎమ్మెల్యేలు కొంత మంది జాగ్రత్త పడుతూ, తమ ప్రభుత్వం పైనే వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే బాటలో, ఇప్పుడు ధర్మాన ప్రసాద్ కూడా, ప్రజల్లో ఉన్న ప్రజా వ్యతిరేకత, తన మీద పడకుండా జాగ్రత్త పడుతూ, ముందుకు వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా నెల్లూరులో ఆనం, శ్రీకాకుళంలో ధర్మాన, అడపా తడపా తమ ప్రభుత్వం పైనే, చురకలు వేస్తూ, వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ధర్మాన ప్రసాద్ రావు, నిన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది అనే వార్తల నేపధ్యంలో, ధర్మాన ఇలా ప్రభుత్వం పైనే వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది. ఆయన మాట్లాడుతూ, తమ రాష్ట్రంలో, పేదలకు ఎంతో ఉపయోగకరమైన నరేగా పథకాన్ని సరిగ్గా అమలు చేయలేక పోతున్నాం అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం చేపట్టిన అనేక పనులు, ఎందుకు మనం పూర్తి చేయలేక పోతున్నాం అని విశ్లేషిస్తే, అనేక విషయాలు తమ ముందుకు వస్తున్నాయని అన్నారు.

dhramana 17112021 2

ఒక పని చేయటానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్ కానీ, ఒక ఏజెన్సీ కాని, వారు ఈ రాష్ట్రంలో పడుతున్న ఇబ్బంది, సిమెంట్ ఎక్కువ ధరకు దొరుకుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం అని చెప్పిన, సిమెంట్ సరఫరా సరిగ్గా జరగటం లేదని అన్నారు. అలాగే స్టీల్ కూడా, బయట మార్కెట్ లో ఎక్కువ ధర ఇస్తే, ప్రభుత్వం తక్కువ ధర ఇస్తే ఎలా అని అన్నారు. ఇక ఇసుక కూడా బయట మార్కెట్ లో ఎక్కువ ఉంటే, మనం తక్కువ ఇస్తాం అంటే ఎలా అని ప్రశ్నించారు. ఇవన్నీ సరిగ్గా లేవని అన్నారు. పంతానికి పోయిన కొంత మంది పనులు చేసి, తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు లోనవుతున్నారని అన్నారు. ప్రభుత్వం పనులు చేస్తున్న వారు నష్టపోతున్నారని, నష్టాల్లో ఉంటున్నారని అన్నారు. నష్టాలు వస్తుంటే ఎవరు పనులు చేస్తారని ప్రశ్నించారు. ఇవన్నీ మారాలని అన్నారు. వాస్తవికంగా ఉండాలని అన్నారు. తప్పుడు సలహాలు ప్రభుత్వానికి ఇవ్వద్దు అని అన్నారు. కొంత మంది అధికారులు తీరు వల్లే ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. మరి ఈ వ్యాఖ్యల పై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజల్లో నానాటికి వ్యతిరేకత పెరిగిపోతుందని, ఎవరిని కదిలించినా చెప్తారు. రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనే మాటే లేదు, ఇక పెరిగిన చార్జీలు, పన్నులు అదనం. ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నారు అంతే. కేవలం రెండున్నరేళ్ళకే ఇలా అయిపోతే, ఇదే సంకేతం ప్రజల్లోకి వెళ్తే, ఇబ్బంది అనుకున్న వైసీపీ నేతలు, మున్సిపల్ ఎన్నికల్లో అడ్డ దారులు తొక్కారు. అయితే వైసీపీ నేతలు కుప్పం మీద పెట్టిన ఫోకస్, ఇతర చోట్ల పెట్టలేదు. దీంతో అక్కడ ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉందో అర్ధమై పోయింది. ఈ రోజు 13 మునిసిపాలిటీలలో, వైసీపీ గతంతో పోల్చుకుంటే, ఓటు బ్యాంక్ పొగుట్టుకాగా, టిడిపి గణనీయంగా పెంచుకుంది. దొంగ ఓట్లు, అధికారిక అరాచకాలు చేసినా, టిడిపి భారీగా పుంజుకుంది. అయితే వైసీపీ, బ్లూ మీడియా మాత్రం, కుప్పం దగ్గరే ఆగిపోయి, సంబర పడుతున్నారు కానీ, వారికి పడిన బొక్క మాత్రం చూపించకుండా, జాగ్రత్త పడుతున్నారు. కుప్పంలో అసలు జరిగింది ఎలక్షన్ కాదు సెలక్షన్. ఆ ఎన్నిక అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక మిగతా చోట్ల టిడిపి గట్టిగ పోటీ ఇచ్చింది. కొన్ని నెలల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో, 98 మునిసిపాలిటీల్లో, టిడిపి కేవలం రెండు మునిసిపాలిటీ గెలిచింది.

eelctoin 17112021 1

ఇప్పుడు 13 మునిసిపాలిటీలలో, టిడిపి రెండు గెలిచింది. జగ్గయ్యపేటలో గెలిచేస్తుంది అనుకున్నా, చివరలో తారు మారు చేసారు. ఇక దాచేపల్లి మొదట టిడిపి గెలించిందని ప్రకటించి, మళ్ళీ రెండు వార్డులు రీ కౌంటింగ్ చేసి, వైసీపీ గెలిచినట్టు చెప్పారు. అలాగే బేతంచెర్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక గతంలో 98 మునిసిపాలిటీల్లో, దాదాపుగా 15 మునిసిపాలిటీల్లో ఒక్క వార్డు కూడా టిడిపి గెలవలేదు. నేడు 328 వార్డుల్లో ఎన్నికలు జరగగా, దాదాపుగా 100 వార్డులు పైగా టిడిపి గెలిచింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు కూడా ఒక వేవ్ కనిపిస్తుంది. స్పష్టమైన వైసీపీ ఎదురీత కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా దర్శి లో 2019 ఎన్నికలలో వైస్సార్సీపీ 39,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యి, అక్కడ టిడిపి గెలిచింది. ఇక ఇక బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి బుగ్గన ఉండే ప్రాంతంలో కూడా టిడిపి గెలిచింది. అలాగే గుంటూరు నగరంలో కొన్ని నెలలు క్రితం జరిగన ఎన్నికల్లో, వైస్సార్సీపీ సిట్టింగ్ డివిజన్ ని తెలుగుదేశం గెలుచుకుంది. కొన్ని నెలల క్రితమే ఇక్కడ వైసీపీ అభ్యర్ధి వెయ్యి ఓట్ల పైన తేడాతో గెలవగా, నేడు టిడిపి అభ్యర్థి సమత విజయం 537 ఓట్ల తో గెలిచారు. ఇక్కడ మరో అంశం జనసేన కూడా పోటీలో ఉంది, వారికి 400 దాకా వచ్చాయి. మొత్తంగా ఎన్ని అరాచకాలు చేసినా టిడిపి ముందుకు వచ్చింది. వైసీపీ మాత్రం, ఇవేమీ కనిపించకుండా, కుప్పం దగ్గరే ఆగిపోయింది.

Advertisements

Latest Articles

Most Read