ఒక పక్క తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసిపోయాయి, ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్, టిడిపి మధ్య చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది. నిన్న విశాఖ వచ్చిన పవన్ కళ్యణ్, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో పాల్గుని ప్రసంగం చేసారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ, ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అంటూ, డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి పైన చేసిన కొన్ని వ్యాఖ్యలకు, టిడిపి వెంటనే కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ వాళ్ళు పార్లమెంట్ లో పోరాటం చేసే సమయంలో, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన టిడిపిని కూడా పిలవాలని, అలాగే అఖిలపక్ష సమావేశంలో కూడా, బెస్ట్ ఫ్రెండ్ టిడిపిని పిలవాలి అంటూ, వైసీపీ, టిడిపి ఫ్రెండ్ అనే విధంగా ప్రసంగం చేసారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యల పై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ రెండూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, ప్రజలకు ఎవరు ఏంటో తెలుసు అని అన్నారు. ఒకరు చెప్పవలసిన అవసరం లేదని అన్నారు. ఇన్ని ఇబ్బందులు పెడుతూ, అరెస్ట్ లు చేస్తూ, కార్యాలయాల పై దా-డు-లు చేస్తూ ఉంటే, బెస్ట్ ఫ్రెండ్స్ అని పవన్ ఎలా అంటారు అంటూ కౌంటర్ ఇచ్చారు.

tdp 01112021 2

అచ్చెన్నాయుడు ఏమన్నారు అంటూ, "తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఫ్రెండ్స్ అని అన్నారు. ఒకరికి చెప్పవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ రెండూ బెస్ట్ ఫ్రెండ్సా లేదా, వేరే పార్టీలు బెస్ట్ ఫ్రెండ్సా అనేది ప్రజలకు తెలుసు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వం అఖిలపక్షం అనేది పిలవాలి కదా. పిలిచిన తరువాత, మేము వెళ్తామో లేదో అప్పుడు అడగండి. పిలవక ముందే మనం ముందు ఎందుకు ఊహాల్లోకి వెళ్ళటం. మీకు ఆయన అఖిలపక్షం పిలుస్తారు అనే నమ్మకం ఉందా ? తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ థిక్ ఫ్రెండ్సో కాదో ప్రజలకు తెలుసు. 5 కోట్ల మంది ఆంధ్రులకు తెలుసు. మాకు వాళ్ళు థిక్ ఫ్రెండ్స్ అయితే మా మీద కేసులు ఎందుకు పెడతారు ? మా ఆఫీస్ పైన ఎందుకు దా-డు-లు చేస్తారు ? మా అందరి మీద కేసులు పెట్టారు కదా ? కేసులు పెట్టని వాడు ఎవరైనా ఉన్నారా ? ఆస్తులు ధ్వం-సం కాని వారు ఎవరైనా ఉన్నారా ? అన్నీ అయిపోయాయి, చివరకు ఈ ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా, ఒక పార్టీ కార్యలయలం మీద దా-డి చేస్తే, వారు మాకు థిక్ ఫ్రెండ్ ఏంటి ? ప్రజలు ఇవ్వన్నీ గమనిస్తారు." అని అన్నారు.

ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్. మొన్నటి వరకు ఐపిఎస్ ఆఫీసర్ గా తెలంగాణలో పని చేసారు. దళితుల కోసం అని, ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. మాయావతికి చెందిన బీఎస్పీ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఈయన తెలంగాణాలో ఒక సెన్సేషన్. ఉద్యోగానికి రాజీనామా చేసిన కొత్తలో, తెలంగాణా రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపెస్తారాని అందరూ భావించారు. కానీ ఆయన అనుకున్న స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టించలేక పోయినా, ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ నిన్న ఏబిఎస్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయన నేపధ్యంలో, చిన్నప్పుడు పడిన అవమానాలు, తరువాత ఆయన కెరీర్, ఇప్పటి రాజకీయ పరిస్థితితులు, కేసీఆర్ పరిపాలన, ప్రస్తుతం తెలంగాణా ఎదుర్కుంటున్న ఇబ్బందులు, ఆయన రాజకీయ ప్రస్తానం ఇలా అనేక అంశాల పై ఆయన, నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండగా జరిగిన, అప్పటి తెలుగుదేశం పార్టీ కీలక నేత, పరిటాల రవి హ-త్య గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ravi 01112021 2

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే, టిడిపి నాయకులను వరుస పెట్టి చం-పు-కుం-టూ వచ్చారు. ఆ క్రమంలోనే పరిటాల రవి కూడా చనిపోయారు. ఆయన హ-త్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందని, అప్పట్లో అందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో పరిటాల రవి హ-త్య జరిగిన సందర్భంలో, ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్, అనంతపురం ఎస్పీగా ఉన్నారు. అప్పట్లో ఈయన పై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం పైన, నిన్న ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ని ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పరిటాల రవి పై అటాక్ జరగబోతుందని అందరికీ తెలుసు, మేము కూడా హెచ్చరించాం, పరిటాల రవి తన ప్రాణానికి ముప్పు ఉందని, జైల్లో కుట్ర పన్నుతున్నారని, నాకు కూడా ఫిర్యాదు చేసారు, నేను ఆ లేఖను ప్రభుత్వానికి ఇచ్చాను. ఎస్పీగా అది నా బాధ్యత. కాని దాని పై నిర్ణయం తీసుకోవాల్సింది అప్పటి ప్రభుత్వం" అని ప్రవీణ్ కుమార్ అన్నారు. అంటే అప్పటి ప్రభుత్వం, పరిటాల రవి విజ్ఞప్తిని పట్టించుకోలేదని చెప్పకనే చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక బంగారం అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇసుక పాలసి మార్చటంతో, ఇసుక బంగారం అయి కూర్చుంది. ఒకానొక సమయంలో, కోటీశ్వరులు కూడా ఇళ్లు కట్టలేక, ఇసుకని బుక్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ఇసుక లారీ, లక్ష రూపాయలకు కూడా అమ్మిన సందర్భం ఉంది. లారీ ఇసుక 5 వేలుకి అమ్మితేన అవినీతి అని చెప్పిన వారు, ఇప్పుడు నాలు అయిదు రెట్లు అధికం అమ్ముతున్నారు. ఇక ఇసుక మొత్తం మొన్నటి వరకు ప్రభుత్వమే అమ్మింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరిగాయి. తరువాత జేపీ సంస్థ అనే సంస్థకు ఇసుక అమ్మకాల బాధ్యతలు అప్పచెప్పారు. ప్రభుత్వం నుంచి, జేపీ సంస్థకు ఈ బదలాయింపు జరిగే సమయంలో, ఇసుక స్టాక్ మొత్తం జేపీ సంస్థకు అప్పచెప్పారు. డిపోల దగ్గర, నిల్వ కేంద్రాల దగ్గర మొత్తం 21 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్టు తేల్చి, రాష్ట్ర ప్రభుత్వం, జేపీ సంస్థకు అప్పచెప్పింది. దీని పై నిజంగా అంత అప్పచెప్పరా లేదా అనే విషయం పై, జేపీ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖ అధికారులతో కలిసి డిపోలలో, అలాగే నిల్వ కేంద్రాల్లో మొత్తం కొలతలు వేసారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

sand 01112021 2

మొత్తం 21 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్టు ప్రభుత్వం చెప్పగా, ఈ కొలతలలో మొత్తం కేవలం 14 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్టు తేలటంతో, అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం టన్ను ఇసుక, రూ.475 ఉండగా, ఈ మొత్తం లెక్కిస్తే, రూ.33.25 కోట్లు అవుతుంది. ఇది కేవలం ఇసుక రేటు మత్రమే, అదే రవాణాతో పాటుగా ఇతర ఖర్చులు వివరాలు కూడా తీస్తే, ఈ మొత్తం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఏడు లక్షల టన్నులు లెక్క తేలకపోవటంతో, ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం అనే చెప్పాలి. దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. అసలు ఇంత పెద్ద మొత్తంలో ఇసుక ఎక్కడ మాయం అయ్యిందో తేల్చాలని, ఆడిట్ చెయ్యలని ఆదేశాలు జారీ చేసారు. ఇక మరో పక్క లెక్క తేలిన 14 లక్షల టన్నుల్లో కూడా, దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల టన్నుల వరకు కూడా, నాణ్యత లేని, బురద , మట్టి కలిసిన ఇసుక ఉన్నట్టు చెప్తున్న జేపీ సంస్థ, వాటికి కూడా మేము డబ్బులు చెల్లించం అని చెప్తుంది. మొత్తంగా, ఈ మొత్తానికి బాధ్యత ఎవరో ప్రభుత్వం తేల్చాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో ఉన్న గవర్నర్ నరసింహన్, ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసింది అంటే, వెంటనే రిపోర్ట్ తెప్పించుకుని కేంద్రానికి పంపించే వారు. ఇప్పటి గవర్నర్ లోపల పని తీరు ఎలా ఉందో, కేంద్రానికి ఎలాంటి నివేదికలు పంపిస్తున్నారో తెలియదు కానీ, బయటకు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం, ప్రభుత్వం కార్యక్రమాలు పెడితే వాటిలో, చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం, ఇలాంటివి తప్పితే, గవర్నర్ పెద్దగా ఆక్టివ్ గా ఉన్న సందర్భాలు లేవు. ముఖ్యంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కు అనేక ఫిర్యాదులు ప్రతిపక్షం నుంచి వెళ్ళినా, ఆయన బయటకు అయితే ఎలాంటి నివేదిక కోరినట్టు వార్తలు రాలేదు. చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి పైన దా-డి కానీ, లేకపొతే ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం పైన దా-డి కానీ, ఇలా ఏ విషయంలోనూ గవర్నర్ స్పందించినట్టు లేదు. ప్రభుత్వం ఎలాంటి వివాదాస్పద బిల్లు పంపించినా, గవర్నర్ ఆమోదించి పంపిస్తూ ఉంటారు. కోర్టులో ఉన్న మూడు రాజధానుల అంశం పైన కూడా, గవర్నర్ ఆమోదం చేసి పంపించారు. ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య మంచి సంబంధాలే ఉండేవి.

governor 01112021 2

అయితే మొదటి సారి గవర్నర్, ప్రభుత్వం పై సీరియస్ అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి. ప్రభుత్వాన్ని వివరణ అడిగారు అంటూ వార్తలు వచ్చాయి. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలియదు కానీ, గవర్నర్ సీరియస్ అవ్వటం, రెండు రోజుల ముందే జగన్ మోహన్ రెడ్డి వెళ్లి కలవటం వంటి అంశాలు కీలకంగా మారాయి. ఇది పాత అంశమే, అయినా ఇప్పటికిప్పుడు గవర్నర్ హడావిడిగా ఎందుకు స్పందించారు అనేది చూడాలి. నాలుగు నెలల క్రిందట టిడిపి అప్పుల విషయంలో సంచలన ఆరోపణలు చేసింది. గవర్నర్ పేరుని ఒప్పందంలో చేర్చి, గవర్నర్ అప్పు చేసినట్టు చూపించారని చెప్పింది. గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసింది. దీని పై అప్పట్లో గవర్నర్ ఆక్షన్ లోకి దిగినట్టు ఏమి వార్తలు రాలేదు. అయితే రెండు రోజుల నుంచి గవర్నర్ ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారని, ప్రభుత్వాన్ని వివరణ అడిగారని వార్తలు వచ్చాయి. దీని వెనుక కేంద్రం సీరియస్ అవ్వటంతో, గవర్నర్ స్పందించారా ? లేక కోర్టులు సీరియస్ అవ్వటంతో గవర్నర్ స్పందించారా అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read