జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎక్కువ అయిపోయాయి. కేవలం రెండున్నరేళ్ళకే, ఇలా అయిపోయిన ప్రభుత్వం, బహుసా ఇదేనేమో. ఒక పక్క అంత పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్నాం అని చెప్తున్నా, ఇక్కడ మాత్రం ప్రజలు అవేమి విశ్వసించటం లేదు. ముఖ్యంగా అప్పులు పాలు అవుతున్న రాష్ట్రం, పెరిగిపోతున్న రేట్లు, రాని పెట్టుబడులు, లేని ఉద్యోగులు, దారుణమైన రోడ్డులు, మహిళలకు లేని భద్రత, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏది చూసినా మొత్తం తేడాగానే ఉంది. ఆ వర్గం, ఈ వర్గం అని లేదు అన్ని వర్గాలది అదే పరిస్థితి. సొంత సామాజికవర్గం కూడా జగన్ కు దండం పెడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, జగన్ పై విరుచుకు పడ్డారు. 2014 తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న డీఎల్, 2019 ఎన్నికల సమయంలో జగన్ కు అనుకూలంగా పని చేసారు. అయితే అందరి లాగే, ఆయనకు కూడా ఇప్పుడు మొత్తం సినిమా అర్ధం అయ్యింది. జగన్ ప్రభుత్వ వైఖరి పై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంలో మంత్రులు అందరూ డమ్మీలుగా మారి పోయారని, అన్నిటికీ ఒక్కడే వచ్చి మాట్లాడుతున్నాడని పరోక్షంగా సజ్జల పై విరుచుకు పడ్డారు. చెంబు పట్టుకుని వెళ్ళే వారికి, చిన్నపటి స్నేహితులకు, సలహదారు పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

dl 16102021 2

తన వర్గం కూడా ఈ సారి మా రెడ్డి ప్రభుత్వం రావాలని ఊగిపోయమాని, ఇప్పుడు తమకు బుద్ధి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితితులు ఉన్నాయని అన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులను పట్టించుకునే వారే లేకుండా పోయారని అన్నారు. తన సొంత పొలాన్ని కౌలకు ఇద్దామని చూసినా ఎవరూ ముందు రాని పరిస్థితి ఉందంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డి లాంటి వారికి వ్యవసాయ శాఖ సలహాదారుడి పదవి ఇచ్చారని అన్నారు. తప్పు చేసిన ఎవడైనా జైలుకు పోక తప్పదని అన్నారు. సొంత ఖజానాను నింపుకోవటానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, ప్రజల సమస్యలు పట్టటం లేదని అన్నారు. జరుగుతున్న దారుణాల పై చూస్తూ ఊరుకోలేక ముందుకు వచ్చానని, మీడియా కూడా ఈ దారుణాలని ప్రశ్నించాలని డీఎల్ డిమాండ్ చేసారు. రాష్ట్ర భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించాలని అన్నారు.

జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే అన్నిరంగాల్లో విఫలమైందని, తాజాగా విద్యుత రంగంలో ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వానికి ముందుచూపులేకపోవడం వల్ల ప్రజలతో పాటు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలుకూడా తీవ్రమైనఇక్కట్లపాలవుతున్నారని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతప్రభుత్వంలో చేసుకున్న పీపీఏలను రద్దు చేయడం జరిగింది. ముఖ్యమంత్రే స్వయంగా అధిక ధరకు విద్యుత్ కొంటున్నారని ఆరోపణలు చేశారు . మరలా ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వమే తిరిగి పీపీఏలు చేసుకుంది. ఈ విధంగా ఒకదశా-దిశా లేకుండా ప్రభుత్వం ముందుకు పోతోంది. మన రాష్ట్రానికి 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమైతే, 145 మిలియన్ యూనిట్లే ఉత్పత్తి అవుతోంది. దాన్ని కప్పిపుచ్చడం కోసం ఈ ముఖ్యమంత్రి బొగ్గుకొరతని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ఆపేసి, బహిరంగ మార్కెట్లో అధికధరకు కొంటున్నాడు. ఎందుకు విద్యుత్ ఉత్పత్తి ఆపేశారంటే, బయట రూ.2.50 పైసలకే విద్యుత్ దొరుకుతోంది, అదేమనం ఉత్పత్తి చేస్తే అంతకంటే ఎక్కువ ఖర్చవుతోందని చెబుతున్నాడు. అలా చెప్పిన పెద్దమనిషే నేడు యూనిట్ విద్యుత్ ను రూ.20లకు కొంటున్నాడు. రోజుకి విద్యుత్ కొనుగోలు కోసమే రూ.60 కోట్లు వెచ్చిస్తున్నాడు. విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణం దాగి ఉందేమోనన్న అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేసి, అధిక ధరలకు బయట కొనడమేంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. విద్యుత్ కొనుగోలుభారాన్ని ఈ ముఖ్యమంత్రి ప్రజలపైనే వేస్తున్నాడు. ఇప్పటికి 6సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ట్రూఅప్ ఛార్జీలు, ఆఛార్జీలు, ఈఛార్జీలు అంటూ వారిని దోచేస్తున్నారు. 2014-19 నాటికి సంబంధించిన విద్యుత్ ఉత్పత్తిపై ట్రూఅప్ ఛార్జీలు వేస్తానంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి దృష్టంతా విద్యుత్ ఛార్జీలుపెంచడం, కరెంటు కోతలు పెట్టడం పైనే ఉంది. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రయ్యాక ఎప్పుడూ కరెంట్ కోతలు అనేవిలేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక విద్యుత్ కోతలు పెరిగాయి... ఛార్జీలు పెరిగా యి. ఈ ముఖ్యమంత్రి ఏపీఈఆర్ సీ ద్వారా రూ.26,260కోట్లు రుణం తీసుకున్నారు.

6సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచి రూ.11,611కో ట్ల భారం ప్రజలపై వేశాడు. అప్పులు ప్లస్ ప్రజలపై వేసిన ఛార్జీలు కలిపి అంతిమంగా జనంపైనే రూ.36వేల కోట్లు అయ్యింది. తెచ్చిన అప్పులు ముఖ్యమంత్రి ఏంచేశారో తెలియదు? కేంద్రఇంధనశాఖా మంత్రి ప్రహ్లద్ జోషి ఏమంటారంటే, ఏపీ విద్యుత్ సంస్థలకు తామెప్పుడో లేఖ రాశామని, బొగ్గు కొరత ఉంటే తీసుకోవాలని చెప్పామంటున్నారు. సింగరేణి ఇతర బొగ్గుఉత్పత్తి సంస్థలకు ఏపీ ప్రభుత్వం బాకీ ఉందని, సింగరేణి సంస్థకు రూ.2వేలకోట్లు, మహానది కోల్ ఫీల్డ్స్ కు రూ.200కోట్లు, కోల్ ఇండియావారికి రూ.215కోట్లు బాకీ ఉన్నారని కేంద్రమంత్రి చెబుతున్నారు. ఆ బాకీలు చెల్లించి, బొగ్గు దిగుమతి చేసుకోవాలని, చౌకగా థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవాలని కూడా తాము చెప్పామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అంటున్నారు. విద్యుత్ రంగంపై, కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఈ ముఖ్యమంత్రి నోరు పెగలడంలేదు. సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడిస్తున్నాడు. అనధికారికంగా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలుచేస్తోంది. కోతలని చెప్పకుండా ఏవేవో కారణాలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమలుసరిగా నడవడంలేదు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తికేంద్రాలు ఆపేసి, బయటనుంచి రూ. 20లకు విద్యుత్ కొనడం, కుంభకోణం కాక ఏమవుతుంది?

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణాన్ని మావోయిస్టులు ధ్రువీకరించారు. 1958లో గుంటూరు జిల్లా పల్నాడులో జన్మించిన ఆర్కే, ఈనెల 14 ఆర్కే(63) మృతి చెందినట్టు మావోయిస్టులు ప్రకటించారు. కిడ్నీలు విఫలమై ఆర్కే మరణించినట్టు చెప్పారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేశాం అని తెలిపారు. డయాలసిస్ కూడా చేసాం అని అయినా కాపాడుకోలేక పోయాం అని తెలిపారు. చికిత్స అందించిన ఆర్కేను కాపాడుకోలేపోయాం అని ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ఆర్కే మృతిపై కొత్త విషయం బయట పడింది. ఆర్కే మరణం వెనుక ఛత్తీస్‍గఢ్ పోలీసుల వ్యూహం ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్కే అనారోగ్యంపై పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉండటంతో, ఆపరేషన్ సమాధాన్ ను మొదలు పెట్టారు. ఆ ఆపరేషన్ తోనే పోలీసులు టార్గెట్ పూర్తి చేసారు. వారం నుంచి అడవిని చుట్టుముట్టి ఆపరేషన్ సమాధాన్ అమలు చేసారు. వైద్యం అందకుండా చేసే ప్రయత్నంలో పోలీసులు సఫలం అయ్యారు. ఆపరేషన్ సమాధాన్ విజయవంతమైందంటున్న పోలీసుల ప్రచారం, దీనికి సాక్ష్యం అని అంటున్నారు. ఆర్కే భార్య శిరీష కూడా ఇదే ఆరోపణ చేసారు. వైద్యం అందకుండా పోలీసులు చంపేశారని, పోలీసుల నిర్బంధం లేకుంటే బతికేవాడని, ఆమె అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొత్తం తానై వ్యవహరిస్తున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి పై విమర్శలు ఎదురు అవుతున్నాయి. ఏ శాఖ వ్యవహారం అయినా, ఆయనే వచ్చి మీడియాతో మాట్లాడటం, ఇప్పుడు చివరకు ఏకంగా ఉద్యోగులను కూడా ఆయన కలిసి హామీలు ఇవ్వటం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో చెప్పటానికి, ఇదే ఉదాహరణ అని అంటున్నారు. ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యల పై ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలు అంటూ సజ్జలను కలవటం పై టిడిపి అభ్యంతరం చెప్తుంది. అశోక్ బాబు మాట్లాడుతూ" పీఆర్సీ పై వచ్చే నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల దానిపైఏమీ తేల్చలేదు. సజ్జల చెప్పిందే ప్రభుత్వహామీ అని ఎవరూ అనుకోవడం లేదు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రో, ప్రభుత్వప్రధాన కార్యదర్శో స్పందించాలి, సలహాదారులు కాదు. ఉద్యోగ సంఘాలు కలయిక త్రివేణి సంగమం కాదు. దాని వల్ల ఉద్యోగులకు బంగారు భవిష్యత్ వచ్చినట్లు కాదు. పీఆర్సీ నివేదిక కూడా తీసుకోలేని స్థితిలో ఉన్న ఉద్యోగ సంఘాలు, సజ్జల చెప్పారంటూ సన్నాయినొక్కులునొక్కడం సరికాదు. పీఆర్సీ సకాలంలో అమలుకానందున ఉద్యోగులు ఎంత నష్టపోయారో ఉద్యోగ సంఘాలకు తెలియదా? ఏడుకొండల వాడి దర్శనం కంటే గొప్పగా ముఖ్యమంత్రి దర్శనం అయిందని సంబరపడితే సరిపోతుందా?"

sajjala 16102021 2

"వారంలో సీపీఎస్ రద్దన్న మఖ్యమంత్రి హామీకి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ పోకడను బట్టి ఉద్యోగసంఘాల నిర్ణయాలుండాలి. ఏ డిమాండ్లు ఎక్కడ, ఎలా సాధించాలనే దానిపై ఉద్యోగ సంఘాలకు స్పష్టత లేదు. పటిష్టమైన పోరాట పంథాను సంఘాలు నిర్ణయించుకోలేక పోవడం వాటి వైఫల్యమే. కింది స్థాయి ఉద్యోగుల సంఘాల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పింఛన్ దారులు, ఉపాధ్యాయులందరి పక్షాన ఉద్యోగ సంఘాలు మాట్లాడాలి. గతంలో ప్రాణాలైనా అర్పిస్తామన్న ఉద్యోగ సంఘాలు నేడు ఛలో అసెంబ్లీ కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలనేతలు నోరెత్తితే ఏమవుతుంది.. మహా అయితే ఉద్యోగాల్లోంచి తీసేస్తారు. దానికే భయపడతారా? ప్రభుత్వాలు మారగానే తిరిగి ఎవరి ఉద్యోగాలువారికి వస్తాయికదా..అది జరిగిన చరిత్ర కదా. అది ఉద్యోగ సంఘాల నేతలకు తెలియకపోవడం మా దురదృష్టం. ఒకవేళ తెలిసీ సంఘాలనేతలు మౌనంగా ఉంటే, అది కూడా ఉద్యోగుల దురదృష్టమే. 11వపీఆర్సీ ఎప్పటి నుంచి అమలవుతుందన్న దానిపై ప్రభుత్వం నుంచి ప్రకటనే లేదు. పలానా తేదీనుంచి తమకు ఎరియర్స్ కావాలని ఉద్యోగ సంఘాలనేతలు ఎందుకుపట్టుబట్టడం లేదు? ప్రభుత్వానికి గులామ్ అనే నాయకులను నమ్ముకోవడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు. ఉద్యోగులను నష్టపెడితే, దానిఫలితం వచ్చేఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది. ఈ నిజమే ఉద్యోగసంఘాలనేతలకూ వర్తిస్తుంది." అని అశోక్ బాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read