ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల కబ్జా ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో రాజంపేటలోని పోలి గ్రామంలో వైసీపీ నేత పోలి సుభారెడ్డి కొండను సైతం మింగేశారు. ఈ వైసీపీ నేతలు ఖాళీ స్థలాలను కబ్జా చేయడమే కాకుండా, కొండలను కూడా తవ్వేసి కబ్జా చేయడంతో, అక్కడ ఉన్న ప్రజలే కాకుండా, అధికారులు సైతం విస్మయానికి గురవుతున్నారు. రాజంపేట పోలి గ్రామంలో వైసీపీ నేతలు కొండను సైతం తవ్వేసి ఆక్రమించేసారు. అక్కడ స్థానిక వైసీపీ నేత పోలి సుభారెడ్డి ఈ కొండను తవ్వి ఏకంగా 100 ఎకరాలు కబ్జా చేయడంతో ,అక్కడ కలక్టర్ కూడా షాక్ తిన్నారు. కబ్జా చేసిన కొండను పరిశీలించిన కలెక్టర్ 100 ఎకరాల కొండను తవ్వేందుకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ అక్కడి ఆర్డీవోను ప్రశ్నించారు. అంతేకాకుండా తవ్విన గ్రావెల్ ఏమైందని కూడా కలెక్టర్ గిరీషా అధికారులను నిలదీయడంతో ఏం చెప్పాలో తోచక అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ కబ్జా భూమిలో పాతిపెట్టిన రాళ్లను తక్షణమే తీసివేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేసాలు జారీ చేసారు. దీనితో తప్పేది లేక వైసీపీ నేత సుభారెడ్డి కబ్జాపై ఉన్నతాధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా చూసుకుంటూ పోతే రాష్ట్రం లో ఎన్ని వందల , వేల కబ్జాలు బయటపడతాయో.
news
కొత్త చీఫ్ సెక్రటరీకి అప్పుడే హైకోర్టు పిలుపు... వచ్చి సమాధానం చెప్పాలని ఆదేశం..
ఏపీ ప్రభుత్వ తీరుతో ఏపీ చీఫ్ సెక్రటరీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డికి హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అధికారయంత్రాంగం పట్టించుకోలేదు. హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి పాఠశాలల ఆవరణలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాలు చేపట్టినట్లు పిటిషనర్లు కోర్టుకి తెలియజేశారు. విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ సెక్రటరీ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంటులో ఛీకొడుతున్నా సిగ్గుపడని వైసీపీ... అంత మంది ఉండి ఏమి లాభం ?
విభజన చట్టం ప్రకారం ఏపీకి న్యాయంగా రావాల్సినవేవీ ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. రాజ్యసభ, లోక్ సభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం పూర్తి అవ్వదని చెప్పేసింది కేంద్రం. ప్రత్యేక హోదా ఇవ్వం అని కూడా స్పష్టం చేసింది. ఒకే రోజు పార్లమెంటులో ఏపీ ప్రయోజనాలు నెరవేర్చలేమని బీజేపీ సర్కారు తేల్చేసినా పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా వున్న వైసీపీ నోరు ఎత్తలేదు. రాజ్యసభ, లోక్ సభలో కనీసం తమ నిరసన తెలపడానికి కూడా వైసీపీ ఎంపీలు ప్రయత్నించలేదు. వైసీపీ అధినేతపై సీబీఐ ఈడీ కేసులు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడి అన్న ఇరుక్కోవడం, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వైసీపీ ఎంపీని అనుమానిస్తుండడం వంటి కేసుల వల్లే ఏపీకి ఎంత నష్టం చేసినా వైసీపీ ఎంపీలు మౌనం వహిస్తున్నారని ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కోర్టుకెళ్ళిన హెడ్మాస్టర్లకు జగన్ సర్కారు జలఖ్... అల ఉంటుంది మరి..
పోకిరీ సినిమాలో ప్రకాశ్ రాజ్ ``గిల్లితే గిల్లించుకోవాలి. అరవకూడదు`` అంటాడు. జగన్ రెడ్డి కూడా తాను తీసుకునే నిర్ణయాలను అంగీకరించాలి. అన్యాయం అంటూ కోర్టుకెళితే రకరకాల వేధింపులు మొదలవుతాయి. వైసీపీ సర్కారు తలపెట్టిన బదిలీలు నిబంధనలకు విరుద్ధంగా వున్నాయంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ప్రధానోపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో బదిలీలపై వాజ్యం వేసిన 25 మంది ప్రధానోపాధ్యాయులకు ఆర్.జె.డి. వెంకటకృష్ణారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.