వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నుంచీ తీవ్ర‌మైన నిర్బంధం ఎదుర్కొంటోంది, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీ. ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు నుంచి గ్రామ‌స్థాయి కార్య‌క‌ర్త వ‌ర‌కూ ప్ర‌భుత్వ ప్రేరేపిత హిం-స‌కు బాధితులే. వైసీపీ అరాచ‌క వాదానికి పోలీసులే సూత్ర‌ధారులుగా మారుతున్నారు. త‌మ‌పై దా-డులు జ‌రిగిన ప్ర‌తీసారి టిడిపి నేత‌లు త‌ప్పుడు కేసులు బ‌నాయించే పోలీసులు, పెట్టిస్తున్న వైసీపీ నేత‌ల‌కి వ‌డ్డీతో స‌హా చెల్లిస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ  బ‌రితెగింపు త‌గ్గ‌డంలేదు.  అధికారంలోకి వ‌చ్చాక తెలుగుదేశం పార్టీ ఎంత‌గా బ‌రితెగించి అంద‌రినీ బాదేయ‌వ‌చ్చో పోలీసులే వైసీపీ స‌ర్కారులో పైల‌ట్ ప్రాజెక్టులా అమ‌లు చేసి టిడిపికి అందిస్తున్నారు. తాము టార్గెట్ చేసే టిడిపి సానుభూతిప‌రుల ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర గంజాయి, పో-ర్న్ వీడియోలు దొర‌క‌డం అనే ప్ర‌మాద‌క‌ర ఎత్తుగ‌డ‌ని వైసీపీ పోలీసుల ద్వారా అమ‌లు చేసింది. టిడిపి అధికారంలోకి వ‌స్తే ఇది వైసీపీ మీద ఇదే పోలీసుల్ని వాడి ప్ర‌యోగించే బ్ర‌హ్మాస్త్రం కానుంది. చంద్ర‌బాబుపై చెప్పులు విసిరి, ఆయ‌న‌పై బ‌స్సుని రాళ్ల‌తో కొడితే..అప్ప‌టి డిజిపి భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ అని చెప్పుకొచ్చారు. ఇది టిడిపి అమ్ముల‌పొదిలో ఒక అస్త్రం. చంద్ర‌బాబు ఇంటి మీద‌కు ఎమ్మెల్యే జోగి ర‌మేష్ దా-డికొస్తే విన‌తిప‌త్రం ఇవ్వ‌డానికి అని క‌వ‌ర్ చేసిన పోలీసులు...రేపు వైసీపీ నేత‌ల ఇళ్ల మీద‌కు టిడిపి వాళ్లు ఎటాక్ వెళితే ఇలాగే మీడియాకి వివ‌రించాల్సిన ప‌రిస్థితిని పోలీసులే సృష్టించారు. బీజేపీ నేత స‌త్య‌కుమార్ కారుపై రాళ్ల‌తో కొడితే.. దానికి పోలీసులు ఉన్న‌తాధికారులు చెప్పిన సూత్రం...రాబోయే కాలంలో టిడిపి నిర‌స‌న‌లు తెలిపేందుకు ఓ అస్త్రం కానుంది.

త‌న‌తో న‌ల‌భై మంది వైసీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నారంటూ ఏపీ టిడిపి అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. మీడియా స‌మావేశం నిర్వ‌హించిన మాజీ మంత్రి పేర్ని నానిని ఇదే విష‌య‌మై మీడియా ప్ర‌తినిధులు అడిగారు. వైసీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడికి ట‌చ్‌లో ఉన్నార‌ట క‌దా అని ప్ర‌శ్నించారు. దీనిపై పేర్నినాని ఘోర‌మైన గే భాష‌తో స‌మాధానం ఇచ్చారు. అచ్చెన్నాయుడుతో ట‌చ్‌లో ఉండ‌డానికి ఆయ‌న ఏమైనా గే అని ఎదురు ప్ర‌శ్నించారు. ట‌చ్‌లో ఉంటే మా ద‌గ్గ‌ర ఉన్న స్క్రాప్‌ని తీసుకెళ్లు, మ‌గాళ్లు-మ‌గాళ్లు ఎందుకు ట‌చ్‌లో ఉంటారంటూ పేర్నినాని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని అచ్చెన్నాయుడు అంటే గే అని వ‌క్ర‌భాష్యం చెప్పిన పేర్నినాని, వైసీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి త‌మ‌తో టిడిపి ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని గ‌తంలోనూ, తాజాగానూ వ్యాఖ్య‌లు చేశారు.  వైసీపీ వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే టీడీపీ నుంచి ఇద్దరు మినహా మిగిలిన వారంతా సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. టిడిపి ఎమ్మెల్యేల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన వైసీపీ నేత‌లంతా పేర్ని నాని లాజిక్ బ‌ట్టి గేలే అవుతారు.  టిడిపిని క్లీన్ స్వీప్ చేస్తాన‌ని అప్పుడు, వైసీపీ గేట్లు  ఎత్తితే చంద్ర‌బాబు, అచ్చెన్నాయుడు త‌ప్పించి అంతా త‌మ వైపు వ‌చ్చేస్తార‌ని ప్ర‌క‌టించిన‌ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్ని నానీ భాష‌లో గే అయి ఉండాలి మ‌రి అంటున్నారు టిడిపి నేత‌లు. వైసీపీ న‌లుగురు టిడిపి ఎమ్మెల్యేల‌ని కొనుగోలు చేసి, ఇప్పుడు టిడిపి త‌మ ఎమ్మెల్యేలు న‌లుగురిని కొనుగోలు చేసింద‌ని వాపోవ‌డం చూస్తుంటే..తాము చేస్తే సంసారం, ఎదుటోళ్లు చేస్తే వ్య‌భిచారం అన్న చందంగానే ఉంది. పేర్ని నాని గే వ్యాఖ్య‌లు  తిరిగి వైసీపీకే త‌గులుతున్నాయి.

ఇటీవ‌లే హార్ట్ ఎటాక్ వ‌చ్చి ఆస్ప‌త్రిలో చేరారు వెంక‌ట‌గిరి వైసీపీ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. స్టంట్ వేసి వైద్యం చేశారు. వ‌స్తూనే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్‌కి పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. పార్టీ నుంచి కూడా స‌స్పెండ్ చేశారు. అయినా మేక‌పాటి ఇంచు కూడా త‌గ్గ‌డంలేదు. నియోజ‌క‌వ‌ర్గానికి రావొద్ద‌ని పోలీసుల‌తో వైసీపీ నేత‌లు హెచ్చ‌రిక‌లు పంపారు. తాను ఎమ్మెల్యేన‌ని ఎవ‌డు అడ్డుతాడో చూద్దామంటూ తొడ‌కొట్టి మ‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో దిగారు. వైసీపీ నేత‌ల హెచ్చ‌రిక‌లు, పోలీసుల వార్నింగులు ప‌ట్టించుకోని ఉదయగిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఉదయగిరి బస్టాండ్ సెంటర్‍లో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ద‌మ్మున్నోడు వ‌చ్చి త‌న‌ను ట‌చ్ చేయాలంటూ మేకపాటి స‌వాల్ విసిరారు. మేకపాటి ఉదయగిరికి వస్తే తరిమికొడతామని ఇటీవల వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో బస్టాండ్ సెంటర్‍లో కుర్చీ వేసుకుని మ‌రీ ఎమ్మెల్యే కూర్చున్నారు. గంటన్నర పాటు బస్టాండ్ సెంటర్‍లోనే కూర్చుని వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎవరు పడితే వారు నాయకులు కాలేరని మేకపాటి ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే మేకపాటికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఆందోళ‌న‌కి దిగారు. తాము వచ్చే సరికి మేకపాటి వెళ్లిపోయారన్న వ్యతిరేక వర్గం అంటుంటే, ఇప్ప‌టివ‌ర‌కూ అక్క‌డే ఉంటే ఎందుకు రాలేదంటూ మేక‌పాటి అంటున్నారు. టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో పోలీసులు ఉరుకుల ప‌రుగులు పెట్టారు.

ఎమ్మెల్యేగా కంటే యూట్యూబ్ స్ఫూఫ్ స్టార్‌గా పేరొందిన ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి దందాల‌న్నీ బ‌య‌ట‌పెట్టిన నారా లోకేష్‌ ధ‌ర్మ‌వ‌రం న‌డివీధులో గుడ్డ‌లిప్పి మ‌రీ నిల‌బెట్టి క‌డిగేశారు. శ‌నివారం యువ‌గ‌ళం పాద‌యాత్ర ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్ట చెరువు మీదుగా వెళుతూ మీడియాకి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెరువును క‌ప్పేసి, గుట్ట‌ని ఆక్రమించి క‌ట్టుకున్న విలాసవంతమైన ఫామ్ హౌస్ ని చూపించారు. ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నంబర్లలో ఎర్రగుట్ట పైన ఉన్న 15 ఎకరాలను దొంగ పత్రాలు సృష్టించి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాజేశారని లోకేష్ ఆరోపించారు. ఎర్రగుట్టపై భూములను కొట్టేయడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. ఎర్రగుట్టపై మరో 5 ఎకరాలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబంలోని మహిళ పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారని.. ఇవి పిత్రార్జితంగా ఆమెకు సంక్రమించినట్లు రికార్డుల్లో చూపారని, కర్నూలు జిల్లాకు చెందిన మహిళ తండ్రికి ధ‌ర్మ‌వ‌రం ఎర్రగుట్టపై ఎలా భూములు వ‌చ్చాయో వెల్ల‌డించాల‌న్నారు. ఎర్ర‌గుట్ట‌ ఉన్న సర్వే నంబర్ల రికార్డులు ఆర్.టి.ఐ ద్వారా కోరితే రికార్డులే లేవ‌ని స‌మాధానం ఇచ్చార‌ని, రికార్డుల్లో లేని భూమి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరుతో ఎలా నమోదు అయిందని ప్రశ్నించారు. పోతుల నాగేపల్లి పరిధిలోని 42, 43 సర్వే నెంబర్లలో అసైన్డ్ భూములను క‌బ్జాకి ఎమ్మెల్యే ప్ర‌య‌త్నించ‌గా, అడ్డుకున్న‌ అప్పటి కలెక్టర్ గంధం చంద్రుడిని బ‌దిలీ చేయించార‌ని సంచ‌ల‌న విష‌యాలు లోకేష్‌ వెల్ల‌డించారు.గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి చేసేవి కబ్జాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లు అని లోకేష్ మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా అంతా ఎమ్మెల్యే క‌నుస‌న్న‌ల్లోనే సాగుతోంద‌న్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ అక్రమాలతో పాటు రాష్ట్రంలోని వైకాపా ఎమ్మెల్యేలందరి అవినీతిపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్ర‌క‌టించారు.

Advertisements

Latest Articles

Most Read