జ‌గ‌న్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా కొడాలి నాని లేని లోటు చాలా స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంద‌ని వైసీపీ పెద్ద‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొడాలి నాని ప్లేస్ ని ఆయ‌న‌ని మించే నోరున్న త‌మ్మినేని సీతారాంతో భ‌ర్తీ చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది. త‌మ్మినేని సీతారాం రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన‌, గౌర‌వ‌నీయ‌మైన స్పీక‌ర్ ప‌ద‌విలో ఉంటూ చాలా దారుణ‌మైన భాష‌లో మాట్లాడ‌డం, అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష టిడిపిపై అధికార వైసీపీ ఎమ్మెల్యేల కంటే ముందుగానే స్పీక‌ర్ త‌మ్మినేని మాట‌ల‌తో టార్గెట్ చేయ‌డం చూసిన జ‌గ‌న్ రెడ్డి ఆయ‌న‌ని మంత్రిని చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.
కొడాలి నాని ప్లేస్ భ‌ర్తీ చేయ‌డంతోపాటు, కాళింగుల‌కు మంత్రి ప‌ద‌వి లేద‌ని, త‌మ్మినేనిని మంత్రిని చేసి వారి ఓట్ల‌కు గాలం వేయొచ్చ‌నేది వైకాపా వ్యూహం అని అంటున్నారు. కేబినెట్ విస్తరణ దిశగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చ‌ని వైకాపా ఆశావ‌హులు ఎదురుచూస్తున్నారు. మంత్రి ప‌ద‌వులు కోల్పోయేవారు, ఆశిస్తున్న‌వారు వ‌ర‌స‌గా సీఎంని క‌లుస్తున్నారు. తమ్మినేని సీతారాం సీఎం జగన్ రెడ్డిని తాడేప‌ల్లి క్యాంప్ కార్యాలయంలో క‌ల‌వ‌డంతో బెర్త్ ఖాయ‌మ‌ని గుస‌గుస‌లు బ‌య‌ట‌కొచ్చాయి. మొత్తానికి మంత్రివ‌ర్గంలో కొడాలి నానీని త‌మ్మినేని సీతారాంతో రీప్లేస్ చేయాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం వైకాపాలో జోష్ నింపుతోంది.

ఇటీవ‌ల కాలంలో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ప్ర‌తీ రోజూ ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ వ్యాఖ్య‌ల‌న్నీ త‌మ ప్ర‌భుత్వంపైకే తిరిగి వ‌స్తున్నాయ‌ని, తెలివిగా వైసీపీ స‌ర్కారుని ఇర‌కాటంలో పెట్టేలా ధ‌ర్మాన త‌న తెలివిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని వైకాపా పెద్ద‌లు గుర్తించారు. అన్న ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌ని కాద‌ని మ‌రీ మంత్రిని చేస్తే ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేలా రోజూ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తోన్న ధ‌ర్మాన‌పై సీఎం జ‌గ‌న్ రెడ్డి సీరియ‌స్‌గా ఉన్నార‌ట‌. మంత్రివ‌ర్గ మార్పులు-చేర్పుల నేప‌థ్యంలో స్పీక‌ర్ తమ్మినేని సీతారాంని మంత్రిని చేయ‌నున్నార‌ని స‌మాచారం.  ధర్మాన ప్రసాదరావుని మినిస్ట‌ర్‌గా త‌ప్పించి స్పీక‌ర్‌గా చేయాల‌నుకుంటున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. గ‌తంలోనూ స్పీక‌ర్ ప‌ద‌వికి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేరు ప్ర‌తిపాదిస్తే ఆయ‌న వ్య‌తిరేకించి తీసుకోలేదు.  ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఫ‌లితాలు మూడు రాజ‌ధానుల‌కి రిఫ‌రెండం అని ప్ర‌క‌టించి అధిష్టానం ఆగ్ర‌హానికి గుర‌య్యాడు ధ‌ర్మాన‌. స్థానిక ఎమ్మెల్సీ కోటాలో త‌న అనుచ‌రుడిని దింపి ఏక‌గ్రీవం చేసుకోక‌పోవ‌డం, ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో వైకాపా అబ్య‌ర్థి ఓడిపోవ‌డం వంటివ‌న్నీ ధ‌ర్మాన మెడ‌కు చుట్టుకున్నాయి. దీంతో మూడేళ్ల త‌రువాత వ‌చ్చిన మంత్రి ప‌ద‌వి మూణ్ణాళ్ల ముచ్చ‌ట‌య్యేలా ఉంద‌ని ఆయ‌న అభిమానులు ఆవేద‌న‌లో ఉన్నారు.

అమ‌రావ‌తి ప్ర‌జారాజ‌ధాని అలుపెరుగ‌ని పోరాటం చేస్తూనే ఉంది. నిర్బంధాల‌ని ఎదిరించి మ‌రీ నిల‌బ‌డింది. న్యాయ‌స్థానాల‌లో గెలిచింది. దేశ‌స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో న్యాయం కోసం జూలై 11 వ‌ర‌కూ నిరీక్షిస్తోన్న అమ‌రావ‌తి ఉద్య‌మ‌కారులు..త‌మ మొక్కులు చెల్లించుకునేందుకు మ‌రోసారి ఉప‌క్ర‌మించారు. మూడు ముక్క‌లాట‌తో ప్ర‌జారాజ‌ధాని అమరావతికి స‌మాధి క‌ట్టేందుకు పాల‌కులు చేసిన కుట్ర‌లు, కుతంత్రాల‌పై ప్ర‌జా ఉద్య‌మం ఆరంభ‌మై 1200 రోజులు పూర్త‌య్యాయి. కేసులు, నిర్బంధాలు, దాడులు ఎదిరించి అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మాన్ని సాగించారు. వైసీపీ స‌ర్కారు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అలుపెరగని ఉద్యమం చేసిన రైతులు, కూలీలు ఎన్నో త్యాగాలు చేశారు. చంద్ర‌బాబు పిలుపు మేర‌కు 33 వేల ఎక‌రాలు స్వ‌చ్ఛందంగా ఇచ్చిన రైతులు 29 వేల మంది జ‌గ‌న్ స‌ర్కారు బాధితులుగా రోడ్డున ప‌డ్డారు. శాంతియుత‌మైన నిర‌స‌న‌లు, న్యాయ‌పోరాటంతో అమ‌రావ‌తి ఉద్య‌మం ఏళ్లుగా కొన‌సాగింది. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌లకోర్చి అమ‌రావ‌తి నుంచి తిరుప‌తి పాద‌యాత్ర చేశారు. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కూ పాద‌యాత్ర చేస్తుండ‌గా ప్ర‌భుత్వ‌మే కుట్ర‌పూరితంగా అడ్డుకుంది. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి, రైతులు వేసిన కేసుల్లో అమ‌రావ‌తే రాజ‌ధాని అని పేర్కొంటూ హైకోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చింది.  గతేడాది మార్చి 3న అమరావతే రాజధాని అని  తీర్పు ఇచ్చిన త‌రువాత ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లింది. అక్క‌డ కూడా అత్య‌వ‌స‌రంగా విచార‌ణ జ‌రిపాల‌ని, హైకోర్టు తీర్పుపై స్టే కావాల‌ని కోరినా ఫ‌లితం ద‌క్క‌లేదు. అమ‌రావ‌తిని ధ్వంసం చేసి, పూర్తిగా స‌మాధి చేయాల‌ని వైసీపీ స‌ర్కారు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. అమ‌రావ‌తి అజ‌రామ‌ర‌మ‌ని ఒక్కో న్యాయ‌స్థానం తీర్పూ తేల్చేస్తోంది. దీంతో కోర్టు ఆదేశాలతో నిలిచిన మహాపాదయాత్ర-2ని, కోర్టు ఆదేశాలు ధిక్క‌రించ‌కుండా చేప‌ట్టాల‌ని అమ‌రావ‌తి రైతులు నిర్ణ‌యించారు. ఈనెల 31న బస్సుల్లో అరసవ‌ల్లి వెళ్లి మొక్కులు తీర్చుకోనున్నారు.

అంద‌రూ అనుమానిస్తున్న‌దే అన్నారు  సీపీఐ నేత నారాయణ. బాబాయ్ హ‌-త్య‌కేసు విచార‌ణ సీబీఐ చివ‌ర ద‌శ‌కు చేర్చ‌డంతో, దాని నుంచి కీల‌క పెద్ద‌ల్ని త‌ప్పించేందుకే జ‌గ‌న్ రెడ్డి త‌ర‌చూ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌ని ఏపీలో విప‌క్షాలు కోడై కూస్తున్నాయి. ఇదే విష‌యాన్ని సీపీఐ నారాయ‌ణ కూడా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు.  జగన్ పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో బట్టబయలైంద‌ని నారాయ‌ణ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న బాబాయ్ వివేకానంద‌రెడ్డి హ-త్య కేసు విచారణ చివరి దశకు రావడంతో భయంతో జగన్ ఢిల్లీకి వెళ్తున్నాడ‌ని చెప్పుకొచ్చారు. బీజేపీతో జ‌గ‌న్ డీల్ ఓకే అయ్యింద‌ని, అమిత్‍ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నాడ‌ని వెల్ల‌డించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి కర్నాటక ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించాలని అమిత్ షాతో ఒప్పందం కుదిరిందని నారాయ‌ణ వెల్ల‌డించారు. జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తాన్ని కర్నాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నాడ‌ని ఆరోపించారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా బాబాయ్ వివేకా హ-త్య కేసు తీర్పు ఆలస్యం కాబోతుంద‌ని నారాయ‌ణ ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు, బీజేపీ పెద్ద‌ల‌తో మంత‌నాల‌పై బీజేపీ ఏనాడూ స్పందించ‌డంలేదు. నారాయ‌ణ ఆరోప‌ణ‌ల‌పై స్పందిస్తుందేమో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read