ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన జీ-20 స‌మావేశాలలో తాగేందుకు పెట్టిన వాట‌ర్ ఇప్పుడు టిడిపికి వ‌జ్రాయుధంగా దొరికింది. చంద్ర‌బాబు రూ.65 ఉన్న హిమాల‌య వాట‌ర్ తాగ‌డం పెద్ద నేరం అన్న‌ట్టు వైసీపీ విష‌ప్ర‌చారం చేసింది. బాబు తాగే హిమాల‌య రూ.65 నీరుపై ఏడ్చిన జ‌గ‌నూ తాగే ఆవ ఆల్కలైన్ బాటిల్ వాట‌ర్ ఖ‌రీదు అక్ష‌రాలా రూ.1,012. చంద్ర‌బాబు హిమాల‌య వాట‌ర్ బాటిల్ పై సోష‌ల్ మీడియాని వాడుకుని విప‌రీతంగా టిడిపిని డ్యామేజ్ చేసింది వైసీపీ. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ప్ర‌తీ స‌మావేశంలోనూ చంద్ర‌బాబు తాగే వాట‌ర్ వ‌ల్లే రాష్ట్రం అప్పుల పాలైపోయింద‌ని వ్యాఖ్యానించేవారు. అయితే దీని పై టిడిపి సోషల్ మీడియా లెక్కలు కట్టి కౌంటర్లు ఇస్తుంది. హిమాల‌య లీట‌రు వాట‌ర్ బాటిల్ రూ.65కి అమ్ముతున్నారు. రోజుకి మూడు బాటిళ్లు తాగితే రూ.195. ఇది నెల‌కి వేలు. ఏడాదికి 72 వేలు. ఐదేళ్ల‌కి 3ల‌క్ష‌ల 60 వేలు. ఈ వాట‌ర్ బాటిల్ ప‌ట్టుకుని జ‌గ‌న్ రెడ్డి గ్యాంగ్ చేసిన దుష్ప్ర‌చారం అంతా ఇంతా కాదు. జ‌గ‌న్ రెడ్డి తాగే ఆవ ఆల్క‌లైన వాట‌ర్ బాటిల్ ఖ‌రీదు రూ.1,012. రోజుకి మూడుబాటిళ్లు తాగితే రూ. 3,036, నెల‌కి ల‌క్ష‌ , ఏడాదికి 12 ల‌క్ష‌లు, ఐదేళ్ల‌కి 60 లక్షలు అవుతోంది. అంటే జ‌గ‌న్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఆయ‌న తాగునీటికే అక్ష‌రాలా 60 లక్షలు ఖ‌ర్చు చేయాలి అన్న మాట‌ అని టిడిపి ప్రశ్నిస్తుంది. జ‌గ‌న్ రెడ్డి నైజం గురివింద తీరు అనేది చంద్ర‌బాబుపై చేసిన హిమాల‌య వాట‌ర్ ఆరోప‌ణ‌ల‌తో మ‌రోసారి తేలిపోయింద‌ని టిడిపి ఆరోపిస్తుంది.

ఎగిరెగిరి ప‌డిన మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుని కేబినెట్ నుంచి జ‌గ‌న్ రెడ్డి తప్పించేస్తున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల భోగ‌ట్టా. చాలా రోజులుగా కొంద‌రు మంత్రుల్ని  సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి తొల‌గిస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త నెల‌లో గ‌వ‌ర్న‌ర్ భేటీ సంద‌ర్భంగా కూడా మంత్రివ‌ర్గ మార్పులు చేర్పుల‌పై ఊహాగానాలు వెలువ‌డ్డాయి. అయితే అనూహ్యంగా ఇవి వాయిదాప‌డ్డాయి. మ‌ళ్లీ  మంత్రి సీదిరి అప్పలరాజుని సీఎం హ‌ఠాత్తుగా పిలిపించి మ‌రీ క్లాస్ పీక‌డంతో మంత్రి ప‌ద‌వి పీకేయ‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల స‌స్పెండ‌యిన నలుగురు ఎమ్మెల్యేల‌ను సీఎం జ‌గ‌న్ రెడ్డి పిలిపించి మాట్లాడే వారిని సస్పెండ్ చేయ‌డం, సీదిరి అప్ప‌ల‌రాజుని ప్ర‌త్యేకంగా పిలిచి మ‌రీ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో త‌లంట‌డంతో మంత్రి ప‌ద‌వి ఊడిపోవ‌డం ఖాయ‌మ‌ని వైసీపీలోనే చ‌ర్చ సాగుతోంది. విష‌యం తెలిసిన‌ట్టుంది. జ‌గ‌న్ రెడ్డి కోసం ఏ త్యాగానికైనా సిద్ధ‌మంటూ బిల్డ‌ప్ క‌బుర్లు చెబుతున్నారు సీదిరి.  ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్న సీదిరిని ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారులు ఉన్న‌ఫ‌ళంగా రావాల‌ని కోర‌డంతో, అన్నీ ర‌ద్దు చేసుకుని వ‌చ్చేశారు. సీఎంతో భేటీ అయ్యాక మీడియాతో కూడా మంత్రి అప్ప‌ల‌రాజు మాట్లాడ‌క‌పోవ‌డంతో కేబినెట్ నుంచి త‌ప్పించ‌డం గ్యారెంటీ అని వైసీపీలోనే సీదిరి ప్ర‌త్య‌ర్థులు పండ‌గ చేసుకుంటున్నారు.  ప‌లాస నుంచి తొలిసారిగా గెలిచిన డాక్ట‌ర్‌ సీదిరి అప్ప‌ల‌రాజుకి రెండో విడ‌త‌లో జ‌గ‌న్ రెడ్డి ఏరికోరి మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. టిడిపిపై విమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్పించి, వైసీపీ బ‌లోపేతానికి చేసిన కృషి శూన్య‌మ‌ని వైసీపీ అధిష్టానం అసంతృప్తితో ఉంది. మ‌రోవైపు భూక‌బ్జాలు, దందాల్లో నిత్య‌మూ మంత్రి పేరు వినిపిస్తోంది. వైసీపీలోనూ మంత్రి సీదిరి అంటే ప‌డ‌ని వారంతా ఒక వైపుగా రాజ‌కీయాలు ఆరంభించారు. ఇంటా-బ‌య‌టా పోరు, అవినీతి ఆరోప‌ణ‌ల‌న్నీ సీరియ‌స్‌గా తీసుకున్న జ‌గ‌న్ రెడ్డి మంత్రి ప‌ద‌వి పీకేయ‌డానికే మొగ్గుచూపుతున్నార‌ని తెలుస్తోంది.

వైసీపీలో సీఎం నుంచి వార్డు వాలంటీర్ వ‌ర‌కూ అంద‌రిలోనూ ఫ్ర‌స్టేష‌న్ పీక్స్‌కి చేరింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట‌మి త‌రువాత ఇది మ‌రింత పెరిగిపోయింది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నుంచీ ప్ర‌శ్నించే వాళ్ల‌ని నానా హింస‌లు పెడుతూనే ఉన్నారు. ఏకంగా ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు ఇంటిపైకి రౌడీలు ఎటాక్ చేశారు. టిడిపి కేంద్ర కార్యాల‌యాన్ని ధ్వంసం చేశారు. మాజీమంత్రులు చాలా మందిని అక్ర‌మ కేసుల్లో అరెస్టులు చేశారు. ఈ అరాచ‌క పాల‌న నాలుగేళ్లుగా సాగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో మూడు చోట్ల ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాలు కోల్పోయింది. ఆ త‌రువాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం ఒక్క‌టి, అది కూడా త‌న‌ది కానిది వైసీపీ ఓడిపోయింది. ఈ ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్న వైసీపీ అధినేత‌కి బాబాయ్ హ‌-త్య కేసు, ఢిల్లీ లిక్క‌ర్ కేసు మెడ‌కి చుట్టుకున్నాయి. దీంతో తీవ్ర‌మైన అస‌హ‌నంలో ఉన్నారు. అన్ని జిల్లాల్లోనూ విప‌క్షాల‌పై ఎటాక్స్‌కి వైకాపా శ్రేణులు దిగుతున్నాయి. అమరావ‌తి ఉద్య‌మం 1200 రోజుల‌కు చేరుకున్న సంద‌ర్భంగా వివిద రాజ‌కీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. వారిపై డైరెక్ట్ ఎటాక్‌కి దిగింది వైసీపీ. తెనాలిలో టిడిపి కౌన్సిల‌ర్ యుగంధ‌ర్ పై కౌన్సిల్ హాలులోనే వైకాపా నేత‌లు దా-డి-కి దిగారు. పుట్ట‌ప‌ర్తిలో టిడిపికి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కారును ధ్వంసం చేశారు. రాళ్లు, కర్రలతో వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. చూస్తుంటే, వైసీపీ రాష్ట్ర‌వ్యాప్తంగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కి పాల్ప‌డి అశాంతి వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టే ఉన్నాయి ప‌రిస్థితులు. గ‌న్న‌వ‌రంలో ప‌ట్టాభిపై దా-డి రాష్ట్ర‌మంతా చూసింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్గా పోస్టులు పెట్టి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన అంజ‌న్ ని అక్ర‌మంగా అరెస్టు చేసి గే అంటూ ముద్ర‌వేశారు. టిడిపి సోష‌ల్ మీడియాకి ప‌నిచేస్తున్న అజ‌య్ అమృత్ కారులో గంజాయి పెట్టి అరెస్టు చేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అవినీతి ప్ర‌శ్నించార‌ని సుబ్బారావు గుప్తాపై ఇప్ప‌టివ‌ర‌కూ చాలాసార్లు దా-డి చేశారు. తాజాగా ఆయ‌న కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయించారు. ఇవ‌న్నీ చూస్తుంటే ఓటమి భ‌యంతోనే వైకాపా చేయిస్తోంద‌ని అర్థం అవుతోంది.

కోలా గురువులు దుర‌దృష్టానికి బ్రాండ్ అంబాసిడ‌ర్. ఇచ్చిన డ‌బ్బు వ‌సూలు చేసుకోలేని స‌త్తెకాల‌పు రాజ‌కీయ‌నేత‌. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ పెద్ద‌లు త‌న‌ని డ‌బ్బు కోసం ఎలా పీల్చుకుతిన్నారో ఓ ఆడియో ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతూనే ఉంది. ఎన్నిక‌ల‌కి ఎంత ఖ‌ర్చు పెడతావు అని జ‌గ‌న్ రెడ్డి బంధువులు అడిగేవార‌ని 10 కోట్లు పెడ‌తానంటే 20 కోట్లు అడిగేవార‌ని, 20 కోట్లు రెడీ చేస్తే న‌ల‌భై చూడ‌మంటూ పీల్చుకుతిన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన రాజ‌కీయ నేతే ఈ కోలా గురువులు.  విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి చెందిన కోలా గురువులు మ‌త్స్య‌కార సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. ఆ ప్రాంతంలో మంచి పేరుంది. దీంతో రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశంచేసి 2009లో తొలిసారిగా ప్రజారాజ్యం పార్టీ తరఫున విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 341 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో గురువులు జ‌గ‌న్ రెడ్డి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్య‌ర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికలకి ద్రోణంరాజు శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చేశారు. ఆయ‌నా ఓడిపోయారు. టిడిపి నుంచి గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ వైసీపీలో చేరిపోయారు. ఏళ్లుగా కోలా గురువులుతో వైసీపీ కోసం కోట్లు ఖ‌ర్చుపెట్టించారు. ఒక‌సారి వైసీపీ టికెట్ పై ఓడిపోయారు. మ‌రోసారి టికెట్ ఇవ్వ‌లేదు. వ‌చ్చేసారీ గురువులుకి టికెట్ అనుమాన‌మే. దీంతోనే పాత బ‌కాయిలు చెల్లు చేసేందుకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిచ్చారు. దానికి నిధులూ లేవు, విధులు లేక‌పోవ‌డంతో కోలా గురువులు గుర్రుగా ఉన్నారు. విశాఖ‌లో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు టిడిపి చేతిలో ఉన్నాయి. మ‌త్స్య‌కారుల ఓట్లు గ‌ణ‌నీయంగా ఉన్నాయి. మ‌త్స్య‌కారుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న గురువులు లాంటి వారు దూర‌మైతే మ‌ళ్లీ విశాఖ‌లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని గురువులుకి ఎమ్మెల్సీగా ఇస్తామ‌న్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, టిడిపి నుంచి కొనుగోలు చేసిన న‌లుగురు, జ‌న‌సేన నుంచి తీసుకొచ్చిన 1తో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు కొట్టేయొచ్చ‌నుకున్నారు. అయితే అనూహ్యంగా వైసీపీ నుంచి న‌లుగురు క్రాస్ ఓటింగ్ చేయ‌డంతో కోలా గురువులు ఓడిపోయి, టిడిపి అభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచింది. దీంతో గురువులుకి మ‌రోసారి అన్యాయం జ‌రిగింది. ఎమ్మెల్యేగా గెలిచి అధ్య‌క్షా అనే అవ‌కాశం కోసం చూస్తే అదీ ద‌క్క‌లేదు. చివ‌రికి ఎమ్మెల్సీగానైనా స‌భ‌లో అడుగుపెట్టి అధ్య‌క్షా అందామంటే అదీ పాయే! వైసీపీ కోసం పెట్టిన కోట్లు వ‌చ్చే దారి క‌న‌ప‌డ‌క గురువులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read