తెలంగాణపై కమలనాథులు గురిపెట్టారు. నాలుగు వైపుల నుంచీ తరుముతూ వస్తూ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఒక వైపు ఢిల్లీ లిక్కర్ కేసు కేసీఆర్ కూతురు కవిత మెడకే చుట్టుకునేలా ఉంది. ఆమె అరెస్టు దగ్గర పడిందని తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ వాయిస్ అని పేరుపడిన షర్మిల రాష్ట్రపతి పాలన గళం ఎత్తుతోంది. బీఆర్ఎస్ అని ఎంత పెద్ద సౌండ్ చేసినా, కమలనాథులు కనికరించే అవకాశంలేదని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ నిర్ధారిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని, చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టి పని చేయాలని తెలంగాణ బీజేపీ నేతలని ఆదేశించారు షా. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై అమిత్‌షా సీరియస్ గా స్పందించడంతో నేతలు అవాక్కయ్యారు. విభేదాలు పక్కనపెట్టటి, నేతలంతా కలిసి కష్టపడి పనిచేయాలని అమిత్‌షా ఆదేశించారు. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని, అనంతరం ఉమ్మడి జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించాలని, చివరిగా రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభ నిర్వహించాలని సూచించారు. పార్టీలోకి చేరికలను వేగవంతం చేయాలన్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకోవడం మినహా నాకు వేరే పనిలేదు, నా ఫోకస్ అంతా తెలంగాణపైనే అనే అర్థం వచ్చేలా అమిత్ షా చెప్పడంతో టి బీజేపీ నేతలు విషయంలో స్పష్టత వచ్చింది. తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డి ఒక వర్గంగా, సంజయ్ మరో వర్గంగా, అర్వింద్ ఇంకో వర్గంగా గ్రూపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా హెచ్చరిక ఇటు బీజేపీ నేతలకు, అటు బీఆర్ఎస్ నేతలకు గుబులు రేపుతోంది.
news
వైసీపీని అడ్డంగా బుక్ చేసిన విజయసాయిరెడ్డి...
వైఎస్సార్ రైతుభరోసా అని భారీ ప్రకటనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా తాను బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాను అంటూ ప్రకటించేశారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సీఎం జగన్ రెడ్డి గాలి తీసేశారు. తెలిసి చేశారో, తెలియక చేశారో...కావాలనే ఇరికిద్దామనే ఆలోచనతో చేశారో కానీ విజయసాయిరెడ్డి ట్వీటు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ జగన్ బటన్ నొక్కడానికి ప్రకటనలు ఇచ్చిన సమయానికే ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద రైతుల ఖాతాలత్లో రూ.2000 జమ అయిపోయింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ ఆలోచనల ప్రతిరూపమే ఈ పథకం అంటూ కితాబు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 16800 కోట్లు విడుదల చేసినందుకు రైతుల తరఫున దన్యవాదాలు తెలిపారు సాయిరెడ్డి. ఇవేవో తన జేబులోంచి ఇస్తున్నట్టు జగన్ రెడ్డి భారీ ప్రకటనలు కూడా ఇచ్చేశారు. దీనికి పేరు కూడా ఇచ్చిన ప్రధాన మంత్రి పేరు చివరన కనపడకుండా పీఎం కిసాన్ అని వేసి తాటికాయంత అక్షరాల్లో వైఎస్సార్ రైతు భరోసా అని వేయించారు. అయితే విజయసాయిరెడ్డిని సీఎం జగన్ రెడ్డి దూరం పెట్టారని, పదవులన్నీ పీకేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీని పొగుడుతూ వేసిన విజయసాయిరెడ్డి ట్వీటు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలో చేరతారనే ఊహాగానాలకు ఊతమిస్తోంది.
చంద్రగిరి నుంచి వెళ్తూ వెళ్తూ, చెవిరెడ్డి రాజకీయం పై కోలుకోలేని దెబ్బ కొట్టిన లోకేష్.
వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గం చంద్రగిరిలో అడుగిడిన నారా లోకేష్ ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డిని టార్గెట్ చేశారు. ఎటువంటి మొహమాటాల్లేకుండా బ్యాటింగ్ చేశారు. అట, ఇట అంటూ శషభిషలు లేకుండా చెవిరెడ్డి, ఆయన తమ్ముడి అవినీతిపై ధ్వజమెత్తారు. తొండవాడ బహిరంగసభలో నారా లోకేష్ మాట్లాడుతూ ల్యాండ్, శాండ్, వైన్, మైన్, ఎర్రచందనం మాఫియా ఈ నియోజకవర్గంలో చెలరేగిపోతోందన్నారు. చంద్రగిరిలో మూడు సీ లు ఉన్నాయని, అవి 1.చంద్రగిరి 2. చెవిరెడ్డి. 3.చెవిలో పువ్వు అంటూ సైటైర్లు పేల్చారు. చంద్రగిరిలో చెవిరెడ్డి కొండంత దోచుకుని ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాడన్నారు. చెవిరెడ్డి ఎమ్మెల్యే, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్, ప్రభుత్వ విప్ అనే 4 పదవులు చేతిలో పెట్టుకుని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. జనం ఓట్లతో గెలిచిన చెవిరెడ్డి వెయ్యి రూపాయలు దోచుకుని...జనం చేతిలో రూ.10 పెడుతున్నాడన్నారు. చెవిరెడ్డి, ఆయన అనుచరులు ఎర్రచందనంతో వెయ్యికోట్లు దోచుకున్నారని ఆరోపించారు. చెవిరెడ్డి తమ్ముడు రఘ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా అధికారం చెలాయిస్తున్నాడని, రఘుకి చీటీల ఎమ్మెల్యే అనే పేరుందని, రూ.120కోట్ల విలువగల 60ఎకరాల భూమిని దోచుకున్నాడని ఆరోపించారు. చెరువుల భూములు కబ్జా చేసి, స్వర్ణముఖి నదిలో ఇసుక మాఫియా కూడా చెవిరెడ్డి తమ్ముడిదేనని సభలోనే ప్రకటించారు. ఎర్రచందనం ఎక్కడున్నా ఎత్తుకుపోయేది చెవిరెడ్డి మనుషులేనని లోకేష్ ఆరోపించారు.
వివేకా కేసులో సీబీఐ పెద్ద తలకాయల వైపు.. కౌంటర్‌గా నారాయణపైకి సీఐడీ..
ఏపీలో వైసీపీ సర్కారు ఏ సంక్షోభంలో పడినా, రాజధానిలో ఏదో ఒక కేసుని తిరగదోడుతుంది. కోర్టుల్లో కేసులున్నా, మరికొన్ని చీవాట్లు తిన్నా ఈ రివర్స్ కేసుల ప్లాన్‌ని అమలు చేస్తూనే ఉంది. వివేకా హ-త్య కేసు పూర్తిస్థాయిలో మెడకు చుట్టుకోవడంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని వార్తలొచ్చాయి. టిడిపి కీలక నేత నారాయణ ఇంటిపై దా-డు-ల-కి సీఐడీని పంపుతోంది. నారాయణ బెయిల్ పై ఉండడంతో ఆయన కుమార్తెల ఇళ్లపై దా-డు-లు చేశారు. తాజాగా రాజధాని అమరావతి ప్రాంత మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారంలో అవకతవకలపై సీఐడీ నోటీసులు జారీ చేయడం వెనక ఏదో ప్లాన్ ఉంటుందని వార్తలు వస్తున్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద మాజీ మంత్రి పి. నారాయణ, నారాయణ భార్య పి.రమాదేవి, పి. ప్రమీల, రామకృష్ణా హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్‌కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది