వివేకానందరెడ్డి హ-త్యకేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ విచారణని స్పీడు చేసింది. ఒక కన్ను మరొక కన్నుని ఎందుకు పొడుస్తుందని ప్రశ్నించిన వైఎస్ జగన్ చుట్టూ ఉన్న మనుషులకే సీబీఐ విచారణకి రమ్మంటూ నోటీసులు ఇవ్వడం ఈ కేసు త్వరలోనే తేలిపోనుందని సమాచారం. తాజాగా రేపు మరోసారి సిబిఐ విచారణకు కావాలని అవినాష్ రెడ్డికి పిలుపు వచ్చింది. స్వయంగా ఇంటికి వెళ్లి సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు కచ్చితంగా రావాల్సిందే అని, ఎలాంటి కారణాలు చెప్పవద్దని గట్టిగా చెప్పారు. ఇక మరో పక్క, పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను కడపలో సీబీఐ అధికారులు విచారించారు. హ-త్య జరిగినరోజు వివేకా ఇంటికి ఎందుకు వచ్చారని, ఎంపీ అవినాష్‌రెడ్డితో ఫోటో దిగిన విషయంపైనా సీబీఐ సుధాకర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డి, భారతి రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారిలో ఎక్కువమందిని సీబీఐ విచారణకు పిలిచింది. ఇప్పటికే రెండు సార్లు సీబీఐ విచారణని ఎదుర్కొన్న ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని నెల 12న ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలులోని అతిథిగృహానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. సీబీఐ అధికారుల జోరు చూస్తుంటే తొందరలోనే వివేకా కేసులో సూత్రధారులు, పాత్రధారులందరినీ తేల్చేసేలా కనిపిస్తోంది. గతంలో విచారణకు పిలిచిన సీఎం జగన్ రెడ్డి ఓఎస్ డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం భార్య భారతి రెడ్డి పీఏ నవీన్ లను మరోసారి విచారణకు పిలిచారని వార్తలు వస్తున్నాయి. గూగుల్ టేకౌట్, కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ చేస్తున్న సీబీఐ, హత్య జరిగిన సమయంలో వివేకానందరెడ్డి ఇంటి నుంచి..అవినాష్ రెడ్డి ఇంటికి..తాడేపల్లిలో సీఎం జగన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కాల్స్‌పై దృష్టి సారించినట్టు అర్థమవుతోంది.
news
జగన్ ఆఫర్ చేసిన సలహాదారు పదవి తిరస్కరించి, సంచలన వ్యాఖ్యలు చేసిన చాగంటి కోటేశ్వరరావు..
పెద్దపెద్ద వాళ్లు సైతం పదవుల కోసం పైరవీల బాట పడుతున్నారు. అటువంటి సమయంలో పిలిచి పదవి ఇస్తే సున్నితంగా తిరస్కరించి తన పెద్దరికాన్ని-సింప్లిసిటీని చాటుకున్నారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరికోరి కట్టబెట్టిన టీటీడీ ధర్మప్రచార పరిషత్ సలహాదారుడి పదవిని చాగంటి తిరస్కరించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అవసరం లేరని చాగంటి తేల్చి చెప్పారు. నా ఊపిరే వెంకటేశ్వరస్వామి అని చాటిచెప్పారు. టీటీడీకి నా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ముందు ఉంటానని ప్రకటించారు. తనకు కట్టబెట్టిన పదవి పట్ల చాగంటి మొదటి నుంచీ అంత ఆసక్తిగా లేరు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో దశాబ్దాల కాలం పనిచేసిన అనంతరం తెలుగు ప్రజలకు ప్రముఖ ప్రవచనకర్తగా డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు సుపరిచితులు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ధార్మిక ప్రచారంలో తలమునకలయ్యే చాగంటికి పదవి కట్టబెట్టడం ద్వారా హిందూ వ్యతిరేకి అనే ముద్రని పోగొట్టుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నం అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ రెడ్డి ఆదేశాలతో టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ నెల క్రితమే టిటిడి సలహా మండలి నిర్ణయం తీసుకుంది. అయితే బాధ్యతలు చేపట్టని చాగంటి కోటేశ్వరరావు ఆ పదవినే తిరస్కరించడం ఇప్పుడు సంచలన వార్త అయ్యింది. రాజకీయాల జోలికి వెళ్లని చాగంటి, ఈ పదవి తీసుకోవడం ద్వారా తనపై పొలిటికల్ ముద్ర పడుతుందనే పదవికి దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట
ఇన్వెస్టర్లు కాదు...వైసీపీ, ఐ ప్యాక్ కళాకారులు.. భోజనాల దగ్గర దొరికిపోయారు...
విశాఖపట్ణణంలో ఇన్వెస్టర్ సమ్మిట్ ఘనంగా ఆరంభమైందని వైసీపీ సర్కారు ఊదరగొడుతోంది. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పెట్టుబడుల ప్రకటనపై సమన్వయం లోపించిందని స్పష్టమైంది. యంగ్ డైనమిక్ లేడీ మినిస్టర్ విడదల రజనీ 2 లక్షల కోట్లు అని చెప్పగా, సీఎం 13 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని సగర్వంగా చెప్పారు. అంబానీ, జీఎమ్మార్, జిందాల్ వంటి పారిశ్రామిక ప్రముఖులు హాజరు కావడం విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కి కొంత ఇన్వెస్టర్ల లుక్ కనిపించింది. అయితే భోజనాలు, సమ్మిట్ కిట్ల వద్ద జరిగిన తోపులాటతో ఇన్వెస్టర్లు ఇలా కొట్లాటకి దిగారా అనే అనుమానాలు రాక మానవు. కొందరైతే మెడలో సమ్మిట్ ఎంట్రీ కార్డుతో భోజనాల కోసం గొడవ పడడం కనిపించింది. మరికొందరు లడ్డూ, పింగాణీ ప్లేటు, బుక్, పెన్ను ఉన్న కిట్ల కోసం ఎగబడి స్టాళ్లను విరగ్గొట్టేశారు. వీరా లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన ప్రతినిధులు అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. కోర్ అంటే వేదికపై సీఎంతో పాటు ఆశీసులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలు తప్పించి కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో అత్యధికులు వైసీపీ సోషల్ మీడియా వాళ్లేనని తెలుస్తోంది. వీరు మరీ రఫ్‌గా కనిపిస్తున్నారని చివరి వరసలో పెట్టి, కొద్దిగా క్లాసుగా కనిపించే ఐ ప్యాక్ నార్త్ వాళ్లందరినీ ముందు వరసలో కూర్చోబెట్టారు. మరోవైపు ఐప్యాక్‌లో పనిచేసే తెలుగువాళ్లని సమ్మిట్ కి తీసుకెళ్లలేదని సమాచారం. ఎందుకంటే వారు వీళ్లు ఇన్వెస్టర్లు కాదు, ఐ ప్యాక్ ఎంప్లాయీస్ అని నోరు జారుతారనే భయంతో తీసుకెళ్లలేదని తెలుస్తోంది.
పట్టాభిని కొట్టిన ముసుగు దొంగలు వల్లభనేని వంశీ గ్యాంగేనా ? సంచలన వ్యాఖ్యలు చేసిన పట్టాభి...
టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనని అక్రమంగా అరెస్టు చేసి తోట్లవల్లూరు స్టేషన్ కి తరలించారని, పోలీస్ స్టేషన్లో కరెంటు తీసేసి, పోలీసుల్ని బయటకు పంపేశారని పేర్కొన్నారు. జనాలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు, భక్షక భటులుగా మారారని ఆరోపించారు. రాత్రి 2 గంటల నుంచి 5 గంటల మధ్య ముసుగులు వేసుకుని వచ్చిన ముగ్గురు దుండగులు తనకు ముసుగు వేసి కొట్టారని ఆరోపించారు. వారు పోలీసులు కాదు. అంటే వల్లభనేని వంశీ గ్యాంగ్ వాళ్లే పట్టాభిని ముసుగులు వేసుకుని పోలీసుల సహకారంతో పోలీస్ స్టేషన్లోనే కొట్టారని ప్రచారం సాగుతోంది. సంకల్పసిద్ధి కేసులో తనపై ఆరోపణలు చేసిన పట్టాభి, టిడిపి నేతలపై దాడి చేస్తానని గత కొన్ని రోజులుగా వంశీ హెచ్చరిస్తూ వస్తున్నారు. గన్నవరం గొడవల సందర్భంగా పోలీసుల సాయంతో పట్టాభిపై దాడి చేసింది వంశీయేనని పొలిటికల్ సర్కిల్లో గుప్పుమంటోంది. జైలు నుంచి విడుదలయ్యాక పట్టాభి మాట్లాడుతూ ఇప్పటివరకూ తనపై నాలుగుసార్లు దాడి జరిగిందని, అయినా వెనక్కి తగ్గనని అరాచక సర్కారుపై పోరాడుతూనే ఉంటానన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బెయిల్ వచ్చిన అనంతరం రాజమండ్రి జైలు నుంచి పట్టాభితో సహా టిడిపి నేతలంతా విడుదలయ్యారు. అక్రమ కేసుల్లో అరెస్టయి విడుదలైన నేతలకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.