భార‌త‌దేశంలోనే ధ‌నిక సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. సీబీఐ, ఈడీ కేసులే 42 వేల కోట్ల అవినీతిపై పెట్టాయి. జ‌గ‌న్ రెడ్డి క్విడ్ ప్రోకో బిజినెస్ మోడ‌ల్ ప్ర‌పంచ ఆర్థిక‌నేరాల‌లోనూ పాఠంగా చేరింది. తండ్రి అధికార‌మే పెట్టుబ‌డిగా ల‌క్ష‌ల కోట్ల కంపెనీలు, ఆస్తుల‌కి అధిప‌తి అయిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపులో దేశ‌విదేశాల నుంచి ఇన్వెస్ట‌ర్లు వ‌చ్చి 13 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అంగీక‌రించారు. ఏపీలో వైసీపీ స‌ర్కారు, దాని అనుకూల మీడియా దీనిపై ప్ర‌చారం హోరెత్తిస్తోంది. అంబానీ, అదానీల‌ను ర‌ప్పించ‌గ‌లిగిన వైఎస్ జ‌గ‌న్ రెడ్డి త‌న కంపెనీల నుంచి ఒక్క రూపాయి కూడా ఆంధ్రాలో ఎందుకు పెట్టుబ‌డి పెట్ట‌లేద‌నేది అంతుబ‌ట్ట‌ని మిస్ట‌రీ. ఏపీలో పెడితే లాభం లేద‌నుకున్నారా? సీబీఐ, ఈడీ చెబుతున్న‌ట్టు అవ‌న్నీ సూటు కేసు కంపెనీలేనా? జగ‌న్ రెడ్డికి చెందిన సండూర్ పవర్, సరస్వతి పవర్, 3. ఆమోద ఐరన్, భారతి సిమెంట్, కార్మెల్ ఆసియా, జగతి పబ్లికేషన్స్ సంస్థ‌ల‌లో ఏ ఒక్క సంస్థ నుంచి ఏపీలో జ‌రిగిన గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌లో రూపాయి ఎంవోయూ చేసుకోక‌పోవ‌డం విస్మ‌యం గొలుపుతోంది.

విశాఖ కేంద్రంగా జ‌రిగిన గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి రోజే 13 ల‌క్ష‌ల‌కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ పెట్టుబ‌డుల ద్వారా 6 ల‌క్ష‌ల మందికి ఉద్యోగావ‌కాశాలు వ‌స్తాయ‌ని తెలిపారు. వివిధ రంగాల‌కు చెందిన కంపెనీల‌తో చేసుకున్నామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. ఈ కంపెనీల‌లో చాలా వ‌ర‌కూ జ‌గ‌న్ రెడ్డి బినామీలు, ఆయ‌న అక్ర‌మాస్తుల కేసుల్లో ఉన్న‌వాళ్లు, ఆయ‌న బంధువులు, ఆయ‌న పార్టీ వాళ్లే కావ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ఏపీలో టిడిపి స‌ర్కారు ఉన్న‌ప్పుడు ఎంవోయూ చేసుకున్న చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ గ్రీన్ కో...ఇటీవ‌ల దావోస్ వెళ్లి టిడిపి హ‌యాంలో చేసుకున్న ఒప్పందాల‌నే మ‌ళ్లీ చేసుకుంది. తాజాగా విశాఖ‌లోనూ మ‌రోసారి ఎంవోయూ చేసుకోవ‌డం అనుమానాస్ప‌ద పెట్టుబ‌డులు అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇండోసాల్ ఎంవోయూ రూ.76,033 కోట్లు చేసుకున్నామ‌ని చెప్పారు. ఇది జ‌గ‌న్ రెడ్డి స‌న్నిహితుల  కంపెనీ. జ‌గ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల కేసులో ఉన్న విజ‌య‌సాయిరెడ్డి వియ్యంకుడు కంపెనీ అరబిందో గ్రూప్‌ రూ.10,365 కోట్లు పెట్టుబ‌డి క‌ట్టుక‌థేన‌ని ప్ర‌చారం సాగుతోంది. సీఎంకి చెందిన కంపెనీ అని పేరుప‌డిన  షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ.8,855 కోట్లు పెట్టుబడి అంటేనే జ‌నం విర‌గ‌బ‌డి న‌వ్వుతున్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన చాలా కంపెనీలు వారి బినామీలు, క్విడ్ ప్రోకో కేసులలో ఉన్న‌వారేన‌ని స్ప‌ష్టం అవుతోంది. మ‌రికొన్ని కంపెనీలు వైసీపీకి చెందిన‌వారివ‌ని టాక్ వినిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ వ్యూహ‌క‌ర్త రాబిన్ శ‌ర్మ మేఘాల‌య ఎన్నిక‌ల్లో బోనీ కొట్టాడు. కొన్నేళ్ల క్రితం వ‌ర‌కూ ఐ ప్యాక్ ప్ర‌శాంత్ కిశోర్ టీములో కీల‌కంగా ఉన్న రాబిన్ శ‌ర్మ త‌న సొంత కంపెనీ షోటైమ్. టిడిపికి వ్యూహ‌క‌ర్త‌గా రాబిన్ శ‌ర్మ మౌనంగా ప‌నిచేసుకుంటూ వెళ‌తారు. అయితే టిడిపియే పెద్ద స్ట్రాట‌జిస్టుల పాఠ‌శాల కావ‌డంతో రాబిన్ శ‌ర్మ‌కి అంత ఫోక‌స్ లేద‌నే అభిప్రాయం ఉంది. క‌న్స‌ల్టెన్సీ కంపెనీ పేరు షో టైమ్ అయినా, రాబిన్ శ‌ర్మ షో చేయ‌డు. అందుకే రాబిన్ శ‌ర్మ ఫోటోలు కూడా నెట్లో పెద్ద‌గా దొర‌క‌వు. దీంతో మ‌రో ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత రాబిన్ శ‌ర్మ ఫోటోలు వ్యూహ‌క‌ర్త రాబిన్ శ‌ర్మ‌గా ప్ర‌చురించ‌డం చూస్తుంటాం. అంతగా లో ప్రొఫైల్ మెయింటెన్ చేసే షోటైమ్ రాబిన్ శ‌ర్మ మేఘాల‌య ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ట్వీట్ చేశాడు. ఏంటో విశేషం అని త‌ర‌చి చూస్తే మేఘాలయలో ఎన్నికల్లో గెలుపొందిన ఎన్‌పీపీ విజయం కోసం రాబిన్ శర్మ టీం పని చేసింది. అంటే త‌న సొంత కంపెనీ షో టైమ్ నుంచి తొలి బోణీ కొట్టాడ‌న్న‌మాటే. ఏపీలో కూడా వైసీపీకి తీవ్ర‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త ఉన్న నేప‌థ్యంలో టిడిపి గెలుపు ఖాయ‌మ‌ని, ఇది రాబిన్ శ‌ర్మ‌కి మంచి బూస్ట్ ఇస్తుంద‌ని అన‌లిస్టుల మాట‌. టిడిపి మొద‌ట్లో రాబిన్ శ‌ర్మ‌తో ఒప్పందం చేసుకున్నా అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించింది. టిడిపికి కూడా ప్ర‌త్యేక‌మైన స్ట్రాట‌జీ బృందాలు ఉంటాయి. ఇవ‌న్నీ క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం లేక‌పోవ‌డం, రాబిన్ శ‌ర్మ మౌనం క‌లిసి ఉన్నాడా లేడా అనేట‌ట్టు ఉండేది ప‌రిస్థితి. ఒక్క‌సారిగా టిడిపి కార్య‌క్ర‌మాలు జోరందుకోవ‌డంలో రాబిన్ శ‌ర్మ పాత్ర ఉంద‌ని అప్పుడు అంద‌రికీ అర్థ‌మైంది. బాదుడే బాదుడుతో మొద‌లు పెట్టి, ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి రాబిన్ టీము కార్య‌క్ర‌మాలే. వీటి లాంఛింగ్ స‌మ‌యంలో వేదిక‌పైకి వ‌చ్చారు రాబిన్ శ‌ర్మ‌. ఇటీవ‌ల టిడిపి కేడ‌ర్‌లో ఊపు తెస్తోన్న సైకో పోవాలి-సైకిల్ రావాలి పాట రాబిన్ టీము రూపొందించిన‌దేన‌ని టాక్ వినిపిస్తోంది.

ఏపీ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం చ‌దువు పెద్ద‌గా లేదు కానీ క‌బ్జాల విష‌యంలో అన‌కొండ‌ని మించిపోతాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇట్టినా ప్లాంటేష‌న్ కంపెనీకి చెందిన‌ వంద‌ల ఎకరాలు కారు చౌక‌గా కొట్టేశాడ‌ని హోరెత్తిపోయింది. జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారు క‌నీసం విచార‌ణ కూడా జ‌ర‌ప‌లేదు. అయితే కేంద్ర ఆదాయ ప‌న్నుశాఖ మాత్రం మంత్రిపై ఓ క‌న్ను వేసింది. గ‌తంలోనూ కార్మిక‌శాఖ మంత్రిగా బెంజ్ కారు లంచంగా తీసుకున్నార‌నే టిడిపి ఆధారాలో స‌హా బ‌య‌ట‌పెట్టింది. అయినా మంత్రిపై చ‌ర్య‌లు శూన్యం. తాను లాగేసుకున్న భూముల‌ను తిరిగి ఇచ్చేస్తాన‌ని కొద్దిరోజుల క్రితం మంత్రి ప్ర‌క‌టించారు. ఈ భూముల కొనుగోలులో జ‌రిగిన భారీ డ‌బ్బు లావాదేవీల‌పై ఐటీ శాఖ గ‌తంలో నోటీసులు ఇచ్చింది. దీనిని మంత్రి ప‌ట్టించుకోలేదు. దీంతో రెండోసారి ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. ఇట్టినా భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఈనెల 17 లోపు త‌మ ముందు హాజ‌రై వివరణ ఇవ్వాలని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొంది. ఏప్రిల్ 3న జ‌రిగే వీడియో కాన్ఫరెన్సుకి త‌ప్ప‌క‌ హాజరుకావాలని జయరాం, ఆయన భార్యకు ఐటీ నోటీసులు జారీ చేసింది. మంత్రి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఇట్టినా ప్లాంటేషన్ పేరుతో రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి కార్య‌క‌లాపాలు ఆరంభించ‌లేదు. ఇది ప‌సిగ‌ట్టిన మంత్రి ఇట్టినా కంపెనీలో ఓ వాటాదారుడిని లైనులో పెట్టుకుని అక్ర‌మంగా భూములు లాగేసుకున్నార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. ఇట్టినాకి చెందిన‌ 450 ఎకరాల భూమిలో వందెకరాలు కొన్నది వాస్తవమేనని మంత్రి గుమ్మనూరు జయరాం కూడా అంగీకరించారు. వీటిని తిరిగి రైతులకు మార్కెట్‌ ధర ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తానని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read