వైఎస్ వివేకానందరెడ్డి హ-త్యకేసులో సీబీఐ అనుమానితుడుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి లాయర్లు కొత్త స్టోరీతో మళ్లీ తెలుగు ప్రజల ముందుకొచ్చారు. వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపేసిన తరువాత పులివెందుల ఎదుగూరి సంధింటి క్రియేటివ్ రైటింగ్స్ నుంచి వచ్చిన తొలి కథ గుండెపోటు. సాయంత్రానికే పీకే క్రియేటివ్స్ ఐప్యాక్ సూచనతో దీనిని గొడ్డలిపోటుగా మార్పు చేశారు. ఆ తరువాత రోజే అబ్బాయ్ సొంత మీడియా సంస్థలో `నారాసుర రక్తచరిత్ర` అని అచ్చేయించారు. కేసు విచారణ సీబీఐ స్పీడ్ చేశాక..ఈ రకరకాల కథలు వినిపిస్తున్న వారి చుట్టూనే అనుమానాలు పెరిగాయి. ఆధారాలు అక్కడికే వెళ్లి ఆగుతున్నాయి. ఈ నేపథ్యంలో అబ్బాయ్ జగన్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ పర్యటన, అవినాష్ రెడ్డి అరెస్టు ఆగిపోవడం వంటి పరిణామాలు చకచకా సాగిపోయాయి. అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడనే దశలోనే వివేకానందరెడ్డిది లవ్ జి-హా-ద్ హ-త్య అని ఇదే గ్యాంగ్ ప్రచారం చేసింది. అది వర్కవుట్ కాకపోయేసరికి వివేకా కూతురు, అల్లుడే ఆస్తి కోసం చేసి ఉంటారని అబ్బాయ్ మీడియా సీరియల్ వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ ఈ నెలాఖరుకి పూర్తి కావాల్సి ఉంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి మరో కొత్త స్క్రీన్ ప్లేతో రంగ ప్రవేశం చేశారు. సునీల్ యాదవ్ తల్లిని వివేకానందరెడ్డి లైంగికంగా వేదించాడని అందుకే వివేకాపై కక్షతో ఈ హ-త్య-కు కుట్ర పన్నాడని కోర్టుకి తెలియజేశారు. దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని, దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని అవినాష్ రెడ్డి తండ్రి వేసిన పిటిషన్ పై ఆయన వాదనలు వినిపించారు. వివేకా రెండవ భార్య కుమారుడిని వారసుడుగా ప్రకటించడంతో వారి కుటుంబంలో తీవ్ర విభేదాలు వచ్చాయని చెప్పారు లాయర్. టీడీపీ సునితతో కలిసి అవినాష్ రెడ్డి,భాస్కర్ రెడ్డిలపై కుట్ర పన్నారని చెప్పుకొచ్చారు. సిబిఐ సైతం తమ వాదనతో సంబంధం లేకుండా దస్తగిరి వాగ్మూలంపై ఆధారపడి విచారిస్తుందని కోర్టుకి భాస్కర్ రెడ్డి వాదనగా తెలిపారు. ఈ కేసు విచారణని గురవారానికి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.
news
జగన్ పై చంద్రబాబు సరికొత్త స్లోగన్.. మొదటి రోజే ప్రజల్లోకి దూసుకుపోతుంది..
టిడిపి అధినేత చంద్రబాబు అసలు సిసలు రాజకీయ నేత అవతారంలో ప్రత్యక్షమయ్యారు. సాంప్రదాయ రాజకీయాలని నమ్ముకుని ఇన్నాళ్లూ జగన్ రెడ్డితో పోరాడారు. అరాచక, నియంతృత్వ, ఫ్యాక్షన్ పోకడలతో జగన్ రెడ్డి అన్ని ప్రజాస్వామ్య పద్ధతులని కాలరాశాడు. ఈ నేపథ్యంలో తన సాంప్రదాయ రాజకీయ పోరాట పంథాని పక్కనబెట్టి దూకుడు రాజకీయ వ్యూహాలకి దిగారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాపకింద నీరులా పని ఉంటే, ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో పంచుమర్తి అనూరాధని దింపి తన సీటు తానే గెలుచుకుని కూడా వైసీపీని చావుదెబ్బ కొట్టారు.
జగన్ రెడ్డి ప్రవర్తన, తీసుకునే నిర్ణయాలు, చేస్తున్న విధ్వంసం ప్రజల ముందుంచి `` సైకో పోవాలి- సైకిల్ రావాలి`` అనే నినాదాన్ని జనంలోకి బాగా తీసుకెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు టిడిపి శ్రేణులంతా జగన్ రెడ్డిని సైకో అనే పిలుస్తున్నారు. టిడిపి సోషల్ మీడియా అంతా జగన్ రెడ్డిని సైకో అనే సంబోధిస్తున్నాయి. ఇప్పుడు మరో స్లోగన్ ని జగన్ పైకి ఎక్కుపెట్టారు చంద్రబాబు. జగన్ రెడ్డి ప్రతీ సభలోనూ నేను మీ బిడ్డనంటూ ప్రాధేయపడుతున్న విషయాన్నే లైనుగా తీసుకుంది తెలుగుదేశం. చంద్రబాబు జగన్ రెడ్డి మీ బిడ్డ కాదు..రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ కొత్త నినాదంతో మరో క్యాంపెయిన్ తీసుకున్నారు. ఇది కూడా జనంలోకి బాగా వెళుతోంది.
ముందస్తు ఎన్నికకి జగన్ వెళ్తున్నాడు...ఇవిగో సాక్ష్యాలు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకి తాము వెళ్లడంలేదని ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వెల్లడించాడు. అయితే ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రం అందరూ పార్టీ అప్పగించిన కార్యక్రమాలు ఆగస్టు నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టాడు. ఇక్కడే ముందస్తు ముచ్చట దాగి ఉందని వైసీపీలోనే చర్చ సాగుతోంది. అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకి వెళ్తుంది అనే దానికి మరో సంకేతం భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. 57 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇచ్చిన ప్రభుత్వం కీలక స్థానాల్లో తమ విధేయులని మొహరించింది. 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ ల బదిలీలు అయిన వెంటనే ఐపీఎస్ అధికారుల స్థానాల మార్పులు చేర్పులతో జీవో ఇచ్చారు. మొత్తం 39 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం తమకి అనుకూలంగా ఉండే అధికారులని కీ పోస్టులు కట్టబెట్టింది. ఎన్నికల సమయానికి ఇబ్బందిగా తయారవుతున్నారనే అనుమానం ఉన్న ఐపీఎస్‌లను నాన్ ఫోకల్ పోస్టుల్లో పడేసింది. ఎమ్మెల్యేలను బతిమలాడటం, తరచూ సమావేశాలు పెట్టడం, ఆగస్టు నాటికే పార్టీ వ్యూహాత్మక కార్యక్రమాలు పూర్తి కావాలనే టార్గెట్ ఇవ్వడం, తాజాగా ఐఏఎస్-ఐపీఎస్ బదిలీలతో ఇవన్నీ ముందస్తు ఎన్నికల వ్యూహాలేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ధర్మవరం అబ్బాయికి లోకేష్ దెబ్బ తాడిపత్రిలో బాబాయ్ అబ్బా
యువగళం పాదయాత్రలో ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని టార్గెట్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ కేతిరెడ్డి చేస్తున్నవి డ్రామాలేనని-ఆయన చేస్తున్నవన్నీ కబ్జాలని ఆధారాలతో సహా లోకేష్ వెల్లడించారు. దీంతో కేతిరెడ్డి కల్లుతాగిన కోతిలా అమరావతి వచ్చి కరకట్టపై గెంతులేశారు. అబ్బాయికి లోకేష్ కొట్టిన దెబ్బ ఏ రేంజులో ఉంటుందో చూసిన తాడిపత్రిలో బాబాయ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి గిలగిలా కొట్టుకుంటున్నారు. తాడిపత్రిలోకి యువగళం ఎంటర్ కాకముందే ధర్మవరం గుడ్ మార్నింగ్ కేటు స్టార్ బాబాయ్ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి లోకేష్‌కి ముందస్తు వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాడిపత్రి పాదయాత్రకొచ్చి తనపై ఆరోపణలు చేసే ముందు వాటికి కచ్చితంగా ఆధారాలు కూడా చూపించాలని, చూపించకుండా ఆరోపణలు చేస్తే నారా లోకేష్ శిబిరం వద్దకు వచ్చి ఆందోళన చేస్తానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి హెచ్చరించారు. అంటే అబ్బాయిలాగే తనపైనా సాక్ష్యాలతో నారా లోకేష్ అవినీతి ఆరోపణలు చేస్తారనే భయంతో ముందుగానే బెదిరింపులకి దిగిన పెద్దారెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి దిగారు. తనపై ఆరోపణలు చేసే ముందు కచ్చితంగా ఆధారాలు చూపించాలి లేకపోతే నారా లోకేష్ బస చేసే శిబిరం ముందు ఆందోళన చేస్తాననడం ముమ్మాటికీ బెదిరింపు ధోరణేనని అంటున్నారు. ఇటీవలే ధర్మవరంలో పాదయాత్ర పూర్తిచేసుకున్న నారా లోకేష్ ఎమ్మెల్యే కేతిరెడ్డి కబ్జాలు, ఆక్రమణలన్నీ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెరువును కప్పేసి, గుట్టని ఆక్రమించి కట్టుకున్న విలాసవంతమైన ఫామ్ హౌస్ బండారం బయటపెట్టారు లోకేష్. దీనిపై వైసీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. తన అన్న కొడుకు కబ్జాల గుట్టురట్టు చేసినట్టే, తన అవినీతిని లోకేష్ ప్రజల ముందుంచేస్తారనే భయంతో తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆందోళనలో ఉన్నారని ఆయన వ్యాఖ్యలను బట్టి స్పష్టం అవుతోంది.