రాష్ట్రంలో పిచ్చి పిచ్చి మద్యం బ్రాండులు అన్నీ అమ్ముతున్నారని, బూమ్ బూమ్, జాం జాం అనే బ్రాండులు వచ్చేసాయి అని ఉండవల్లి అన్నారు. పెద్ద కంపెనీలను ఎందుకు రానివ్వటం లేదు, ఈ పిచ్చి కంపెనీలు ఎందుకు వచ్చాయి అనే విషయం పై, వివరాలు సేకరిస్తున్నా అని, దీని పై త్వరలోనే పూర్తి వివరాలతో వస్తానని అన్నారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, పగ తీర్చుకునే విధంగా ప్రవర్తించటం సబబు కాదని అన్నారు. ప్రత్యర్దులని నిర్ములించటానికి, కక్ష తీర్చుకోవటానికి కాదు, ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అని అన్నారు. అలాగే నిమ్మగడ్డ పై, కులం విషయంలో జగన్ మోహన్ రెడ్డి, ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టటం పై, ఉండవల్లి ఆక్షేపించారు. ఈ రోజు నిమ్మగడ్డ చేసిందే కరెక్ట్ అయ్యింది కదా, ఈ రోజు కరోనాతో అన్నీ ఆగిపోయాయి కదా అని ఉండవల్లి అన్నారు. ఆలాగే కోర్టుల పై వైసిపీ శ్రేణులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వ్యాఖ్యల పై కూడా ఉండవల్లి స్పందించారు. జడ్జిలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఉంటే, వారు ఎందుకు ఊరుకుంటారు అని ఉండవల్లి అన్నారు. 

ప్రభుత్వాలు తప్పు చేస్తే కోర్టులు సరిదిద్దే బాధ్యత ఉందని అన్నారు. బూతులు తిట్టిన వారికి నోటీసులు ఇస్తే, మేము చూసుకుంటాం, ఇవన్నీ మాకు మాములే అంటూ, వైసిపీలో ఉన్న ఒక పెద్ద నేత చెప్తున్నారు అంటే, ఇంకా ఏమి చెప్పాలి ? అంటే దీని వెనుక మా పార్టీ ఉందని మీరే ఒప్పుకున్నారా అని ఉండవల్లి ప్రశ్నించారు. అధికారం శాశ్వతం అని జగన్ మోహన్ రెడ్డి అనుకుంటే, అంతకంటే పిచ్చి తనం లేదని ఉండవల్లి అన్నారు. అలాగే బడ్జెట్ పై ఉండవల్లి మాట్లాడుతూ, కేవలం జగన్ ఇచ్చిన హామీలకే, 84 వేల కోట్లు, ఏడాదికి అవుతుందని, ఇక జీతాలు, పెన్షన్లు అధికం అని, మరి ఈ డబ్బులు ఎలా తెస్తారని ఉండవల్లి ప్రశ్నించారు ? అలాగే పార్టీ మారిన వాళ్ళు అందరూ తనతోనే ఉంటారని జగన్ అనుకుంటున్నారేమో, మొన్న ఆ పార్టీలో ఎలా మాట్లాడారో, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారుగా, ఎవరూ శాశ్వతం కాదని ఉండవల్లి అన్నారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. కరోనా విషయంలో జగన్ పై విమర్శలు చేసారు ఉండవల్లి. జగన్ గారు కరోనా ఉంది, ప్రజలకు చెప్తున్నారు మాస్కులు పెట్టుకోమని, కానీ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం మాస్కులు వేసుకోవటం లేదు, అధికారులు కూడా మాస్క్ వేసుకోవటం లేదు, ప్రజలకు చెప్పే ముందు, మీరు మాస్కు వేసుకోండి అని ఉండవల్లి అన్నారు. ఆవ భూములు విషయంలో పెద్ద స్కాం జరిగిందని అన్నారు. రేటు లేకపోయినా, ఎక్కువ పెట్టి భూములు కొన్నారని, అధికారులు, మంత్రులు మాత్రం, స్కాం ఏమి లేదని అంటున్నారని, కాని ఇందులో చాలా పెద్ద గోల్ మాల్ జరిగిందని, దీని పై రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్ట్ ప్రకారం సమాచారం అడిగినట్టు చెప్పారు. అవినీతి అయినా అయ్యి ఉండాలి, లేకపొతే అసమర్ధత అయినా అయ్యి ఉండాలని ఉండవల్లి అన్నారు. ఇళ్ళ స్థలాల పేరుతో చేస్తుంది అంతా తప్పు అని, ఎక్కడో ఊరి బయట 20 కిమీ అవతల ఇళ్ళ స్థాలాలు ఇస్తే, మీరు చెప్పుకోవటానికి తప్ప, దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉందని ఉండవల్లి అన్నారు. టైం తీసుకుని అయినా ఉపయోగ పడే భూములు ఇవ్వాలని అన్నారు. ఇక ఈ భూములు మెరక తోలే విషయంలో కూడా పెద్ద స్కాం జరుగుతుందని, దీని పై ఏసీబీకి కంప్లైంట్ చేస్తానని ఉండవల్లి అన్నారు.

ఇక ఇసుక విధానం దారుణంగా ఉందని ఉండవల్లి అన్నారు. ఆన్లైన్ లో ఇసుక అనేది ఎక్కడ జరగటం లేడని, ఎక్కడ చూసినా అవినీతే అని అన్నారు. దీని వల్ల లేబర్ కు కూడా పనులు లేకుండా, చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజమండ్రిలోనే ఇసుక ఇబ్బందులు ఉంటే, దీని వెనుక ఏమి జరుగుతుంది ? అని అన్నారు. ఇక మద్యం విషయంలో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఎలాంటి ధరలు ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్న వాటికి చూస్తే, కేసుకి ఇంత అని పెర్సెంటేజ్ తీసుకుంటున్నారని ఉండవల్లి అన్నారు. కొనటం, అమ్మటం ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి, మొత్తం ప్రభుత్వానిదే బాధ్యత అని ఉండవల్లి అన్నారు. ప్రభుత్వం మాత్రం, కొనటం తగ్గించారని చెప్తున్నారని, కాని పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమ మాఫియా రాజ్యం ఏలుతుందని అన్నారు. అలాగే నాటు సారా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది అని అన్నారు.

గత కొంత కాలంగా, వైసీపీ పార్టీలో, వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేకత విధానాల పై, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు, వైసీపీ చేస్తున్న ప్రతి తప్పుని ఎత్తి చూపిస్తున్నారు. ముందుగా తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేసి ఇంగ్లీష్ మీడియం పెట్టటం పై, ఏకంగా పార్లమెంట్ లోనే, సొంత పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇక ఇసుక మాఫియా ఆగడాలు గురించి రాష్ట్రం అంతా ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా రఘురామ కృష్ణం రాజు, బహిరంగంగానే చెప్పారు. అలాగే తిరుమల భూములు అమ్మకం విషయం పై మొదట స్పందించింది రఘురామకృష్ణం రాజే. ఇక ప్రభుత్వ భవనాలకు రంగులు విషయం, ఎలక్షన్ కమీషనర్ విషయం, ఇలా ప్రతి విషయం పైనా, ఆయన తన అభిప్రాయం తెలిపారు. నిజానికి ఇవన్నీ తప్పుడు విధానాలే అయినా, సొంత పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు చెయ్యటంతో అందరూ అవాక్కయ్యారు. అయితే, ఇదే విషయం పై రఘురామ కృష్ణం రాజుని అడగగా, తాను అనేక సార్లు జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఈ విషయాలు అన్నీ చెప్దాం అనుకున్నాం అని, కానీ ఆయన తనకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేడని, అందుకే మీడియా ద్వారా ఆయనకు ఈ విషయాలు తెలుపుతున్నాని చెప్పారు.

అయితే ఈ విషయం పై ఎట్టకేలకు వైసిపీ స్పందించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో, విజయసాయి రెడ్డి, రఘురామకృష్ణం రాజుకు షోకాజ్ నోటీస్ పంపించారు. వారం రోజుల్లోగా తమకు సమాధానం చెప్పాలి అంటూ, రఘురామకృష్ణం రాజుకి విజయసాయి రెడ్డి నోటీస్ పంపించారు. ఆ షోకాజ్ నోటీసులో అంశాలు గమనిస్తే, మీరు ఎంపీగా, వైసిపీ సింబల్ పైన గెలిచారు, పార్లమెంట్ లో ఒక కమిటీకి మెంబెర్ గా ఉన్నారు, అయితే మీరు గత కొన్ని రోజులుగా పార్టీని కించపరుస్తూ మాట్లాడుతున్నారు అని ఆ నోటీస్ లో ఉంది. షోకాజ్ నోటీస్ ఇవ్వటానికి గల కారాణాలు కూడా వివరించారు. ఇంగ్లీష్ మీడియం మేము మ్యానిఫెస్టోలో పెడితే మీరు వ్యతిరేకించారు. అలాగే వైసిపీ ఎమ్మెల్యేలు, ఇసుక దోపిడీ చేస్తున్నారు అన్నారు. ఒక సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ, ఎవరి నాయకత్వం నాకు కావలి ? బొచ్చులో నాయకత్వం అని, పార్టీ అధినేతను కించపరిచారు. అలాగే వివిధ టీవీ చర్చల్లో, పార్టీని చులకన చేసి మాట్లాడారు. అలాగే మీరు సింహం అని, మిగతా వాళ్ళు పందులు అని అన్నారు. ఇవన్నీ మీరు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారు అని తెలియచేస్తున్నాయి, అంటూ విజయసాయి రెడ్డి, రఘురామ కృష్ణం రాజుకి, నోటీస్ పంపించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో మారు హైకోర్టు మెట్లు ఎక్కారు. అందరూ ఊహించినట్టు గానే, గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా, ఆయన రాష్ట్ర ప్రభుత్వం పై, హైకోర్టులో, కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. హైకోర్టులో, కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు, నిమ్మగడ్డ తరపు న్యాయవాది అశ్విన్ కుమార్. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. తన విజ్ఞప్తులను సైతం పట్టించుకోవడం లేడని, అరిపిస్తూ, పిటీషన్ లో, తెలిపారు నిమ్మగడ్డ. గత కొంత కాలంగా ఈ అంశం పై వివాదం నడుస్తూ ఉంది. కరోనా కారణంగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసారు. అయితే, దీని పై జగన్ భగ్గుమన్నారు. ఏకంగా సియం హోదాలో ఉంటూ, కులం పేరుతో నిమ్మగడ్డ పై విరుచుకుపడ్డారు. ఇక తరువాత, రమేష్ కుమార్ కు బెదిరింపులు రావటంతో, ఆయన తనకు కేంద్ర బలగాల భద్రత కావాలని, ఇక్కడ పదవిలో ఉన్న వాళ్ళ చరిత్ర, వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే భయం వేస్తుంది అంటూ, సుదీర్ఘ లేఖ రాసారు. ఈ లేఖ పై జగన్ ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చంద్రబాబు రాసిన లేఖ అంటూ, ఎదురు దాడి చేసింది. అయితే తరువాత రెండు రోజులకే, కేంద్రం ఆయనకు భద్రత కల్పించింది.

అయితే కరోనా సమయంలో, చేస్తున్న సహాయంలో, పోటీలో ఉన్న వారు పాల్గుని, తమకే ఓటు వెయ్యాలని చెప్పటం, ప్రతిపక్షాలు అప్పటి ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చెయ్యటంతో, నిమ్మగడ్డ, ఈ విషయం పై, చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతే, వెంటనే ప్రభుత్వం, మేము ఎన్నికల సంస్కరణలు తెస్తున్నాం అని ఒక ఆర్డినెన్స్ తెచ్చి, 77 ఏళ్ళ కనకరాజ్ ను తీసుకు వచ్చి, ఎన్నికల కమీషనర్ గా నియమించారు. అయితే, దీని పై నిమ్మగడ్డ కోర్టు కు వెళ్లారు. తనను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పారు. హైకోర్టు కూడా నిమ్మగడ్డతో ఏకీభావిస్తూ, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కొట్టేసింది. దీంతో నిమ్మగడ్డ మళ్ళీ ఎన్నికల కమీషనర్ అయ్యారు. అయితే ప్రభుత్వం మాత్రం, ఇందుకు ఒప్పుకోలేదు. ఆయన నియామకం చెల్లదు అంటూ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. అయినా సరే, నిమగడ్డను ప్రభుత్వం ఒప్పుకోక పోవటంతో, కోర్టు ధిక్కరణ కింద ఆయన ఈ రోజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. మరి దీని పై, హైకోర్టు ఎలా స్పందిస్తుందో, ఎలాంటి ఆదేశాలు జరీ చేస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisements

Latest Articles

Most Read