ఇండియా టుడే సంస్థ, ప్రతి ఏడాది మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో, బెస్ట్ సియం ఎవరు, కాబోయే ప్రధాని ఎవరూ అనే విధంగా ఒక సర్వే చేస్తూ వస్తుంది. ప్రతి ఏడాది చేసినట్టే, ఈ ఏడాది కూడా, ఇండియా టుడే ఒక సర్వే చేపట్టింది. ఈ సర్వేలో అన్ని రాష్ట్రాల సియంలకు, ప్రజల్లో ఎంత ప్రాముఖ్యత ఉంది అనే విషయం చెప్పటానికి, అప్రూవల్ రేటింగ్స్ అనేవి కూడా ఇచ్చింది. ప్రజల అభిప్రాయాల సేకరణ చేసిన మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో, ఈ సర్వే నిన్న ఇండియా టుడే విడుదల చేసింది. ఇందులో ప్రకటించిన టాప్ 11 ముఖ్యమంత్రులలో జగన్ మోహన్ రెడ్డికి స్థానం లేకుండా పోయింది. ఏ స్థానం వచ్చిందో తెలియదు కానీ, టాప్ 11లో అయితే జగన్ లేరు. ఇండియాలో బెస్ట్ సియం ఎవరు అని మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో వచ్చిన ఈ సర్వేలో జగన్ మోహన్ రెడ్డి స్థానం అమాంతం పడిపోయింది. జగన్ పాలన పైన కేలవం 19 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. అంటే 81 శాతం మంది ప్రజలు జగన్ పరిపాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవలే సియంగా ఎన్నికైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అందరి కంటే మొదటి స్థానంలో ఉన్నారు. ఆయనకు 42 శాతం మంది ప్రజల మద్దతు లభించింది. ఆ తరువాత స్థానంలో, అంటే రెండో స్థానంలో నవీన్ పట్నాయక్ ఉన్నారు.
ఇక మూడో స్థానంలో కేరళ ముఖ్యమంత్రి, తరువాత మహరాష్ట్ర ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ ఇలా వీరు అంతా ఉన్నారు. అయితే 30 శాతం నుంచి 19 శాతం వరకు రేటింగ్ తెచ్చుకున్న వారిలో కూడా చాలా మంది ఉన్నారు. వారిలో ఉత్తరప్రదేశ్, రాజాస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే ఇందులో జగన్ మోహన్ రెడ్డికి మాత్రం 19 శాతం ప్రజల మద్దతు మాత్రమే వచ్చింది. జగన్ ప్రజల మనసులు గెలవటంలో, పూర్తిగా వెనుకబడి పోయారని కూడా ఈ సర్వే ద్వారా అర్ధం అవుతుంది. ప్రజలు కోరుకున్న పాలన అందించటంలో జగన్ పూర్తిగా విఫలం అయ్యారునే విషయం ఈ మూడ్ అఫ్ ది నేషన్ పోల్ లో అర్ధం అవుతుంది. అయితే గత ఏడాది ఇదే సర్వేలో, జగన్ కు 11 శాతం మంది బెస్ట్ సియం అని చెప్పగా, ఈ ఏడాది మాత్రం కేవలం 6 శాతం మాత్రమే జగన్ బెస్ట్ సియం అని తమ అభిప్రాయం తెలిపారు. అయితే గతంలో ఇండియా టుడే ఇచ్చిన రేటింగ్ గురించి గొప్పగా చెప్పుకున్న వైసీపీ, వారి మీడియా, ఇప్పుడు రేటింగ్ పడిపోవటంతో సైలెంట్ అయిపోయారు.