రాష్ట్ర ప్రభుత్వ శైలి చాలా విడ్డూరంగా, చాలా వింతగా ఉంటోందని, ఏ అ-ఘా-యి-త్యం, అనర్థం జరిగినా, అ-రా-చ-కం జరిగినా డబ్బుతో దాన్ని అణచి వేస్తామన్నట్లుగా ప్రభుత్వం వ్యహరిస్తుండటం దురదృష్టకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. గురువారం ఆయన తన నివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! "జరుగుతున్న దా-రు-ణా-లపై ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎవరికి చెప్పాలి? ముఖ్యమంత్రా ప్రజలకు అందుబాటులో ఉండరు. సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పినా ఆయన పట్టించుకోరు, మరి ప్రజలగోడు వినేదెవరు? నా ప్రశ్న కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉంది. ఆగస్ట్15న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు బ్రహ్మండంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి చెబుతున్న సమయంలోనే రమ్య అనే బీటెక్ విద్యార్థిని దారుణంగా ఒక దుర్మార్గుడి చేతిలో నడిరోడ్డుపై అ-తి-కి-రా-త-కం-గా చం-ప-బ-డిం-ది. ఆ ఘటనతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. పట్టపగలు, స్వాతంత్ర్య దినోత్సవం నాడు, ఆడ బిడ్డలెవరూ స్వేచ్ఛగా తిరగే పరిస్థితి లేదని రాష్ట్రమంతా గగ్గోలు పెట్టింది. కానీ ముఖ్యమంత్రేమో మృ-తు-రా-లి కుటుంబానికి పదిలక్షలిచ్చి, రమ్య హ-త్యో-దం-తా-న్ని ప్రజల్లో నలగకుండా సద్దుమణిగేలా చేయాలని చూశారు. ఎంతటి ఘోరాన్నైనాసరే డబ్బుతో మేనేజ్ చేయొచ్చన్న ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఈ ఘటనలో స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యమంత్రి చేయాల్సిందేమిటి? దుండగుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. దళితవర్గానికి చెందిన హోంమంత్రితో సజ్జల రామకృష్ణారెడ్డి చిలుకపలుకులు పలికించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏదిచెప్పమంటే ఆమె అది చెబుతారు. హోంమంత్రిగా ఆమె విధులు, బాధ్యతలు, చట్టాల గురించి ఆమెకు తెలియదు. దిశా చట్టం కింద రాష్ట్రంలో ముగ్గురికి ఉ-రి-శి-క్ష-లు పడ్డాయని, 20 మందికి జీవితకాల జైలు శిక్షలు పడ్డాయని ఆమెచెప్పడం విడ్డూరం. ఆమె చెప్పిందంతా శుద్ధ అబద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన దిశా చట్టం కేంద్రం కొర్రీలు వేయడంతో అది అక్కడే ఆగిపోయింది. దిశా చట్టం శిక్షల గురించి హోంమంత్రి చెప్పిందంతా శుద్ధ అబద్ధం. రాష్ట్రంలో దిశా చట్టమే లేదు. లేని దిశ చట్టంతో హోంమంత్రి ముగ్గురికి ఉ-రి శిక్షలు, 20మందికి జీవితకాల శిక్షలు వేయించారా? ఏ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో ముగ్గురికి ఉ-రి శిక్షలు పడ్డాయో, 20మందికి యావజ్జీవ శిక్షలు పడ్డాయో, ఏ న్యాయమూర్తి వారికి శిక్షలు వేశారో, నిందితులపేర్లతో సహా, హోంమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి.

లేదా అన్నీ అబద్ధాలు పలికిన హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఆమెతో పచ్చి అబద్ధాలు చెప్పించిన డిఫ్యాక్టో హోంమంత్రి సజ్జల కూడా తన పదవికి రాజీనామా చేయాలి. ఎందుకిలా సిగ్గుమాలిన ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది? దళిత మహిళతో ఎందుకిలా చెప్పిస్తోంది? ఆమె చెప్పిన దానిపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే. సజ్జల రామకృష్ణారెడ్డైనా సరే, ఎవరికి శిక్షలుపడ్డాయో చెప్పాలి. లేని చట్టంతో సుచరితగారు ముగ్గురికి ఉ-రి శిక్ష, 20మందికి యావజ్జీవశిక్షలు వేసేసింది. దిశా యాక్ట్ ఏ2 విజయసాయి రెడ్డి సృష్టించే సూట్ కేసు కంపెనీలా ఉంది. సూట్ కేసు కంపెనీ ఎక్కడుంటుందో తెలియదు, కానీ డబ్బు మాత్రం ఫ్లో అవుతూంటుంది. అలానే ఆలూ... చూలు లేని సూట్ కేస్ కంపెనీ లాంటి దిశ చట్టం కింద ఉరిశిక్షలు పడ్డాయని హోంమంత్రి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. హోమంత్రి శిక్షలు పడ్డాయని చెబుతున్న ఆ అభాగ్యులు ఎవరు? ప్రభుత్వానికి, పాలకులకు పారదర్శకంగా ఆలోచన చేయాలని లేదు. రోజు గడుపుకోవడానికి ఏదో ఒకటి చెప్పి, తప్పించుకోవడానికి చూస్తోంది. తాను అడిగే ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం చెప్పలేదు. సూట్ కేస్ చట్టాలను తాను మోయలేనని ఆమే తనకు తాను రాజీనామా చేయాలి. తన సలహాలతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి కుహనా సలహాదారు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. 

స్వాతంత్ర్య దినోత్సవం నాడు గుంటూరులో రమ్య అనే యువతి దారుణ హ-త్య-కు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని పరామర్శించటానికి, టిడిపి జాతీయ ప్రాధాన కార్యదర్శి నారా లోకేష్, బాధితురాలి ఇంటికి వెళ్ళారు. అయితే లోకేష్ పరామర్శించి, ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు. అలా కాకుండా, లోకేష్ వచ్చిన సమయంలో, అక్కడకు వచ్చిన వైసీపీ ప్రజాప్రతినిధులు, ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, వైసీపీ వారిని ఏమి చేయకుండా, అక్కడకు వచ్చిన టిడిపి నేతలను అరెస్ట్ చేసారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. పొలిటికల్ కేరీర్ లోనే మొదటి సారిగా లోకేష్ ని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ లో పెట్టారు. సాయంత్రం వరకు వదిలి పెట్టకుండా, సాయంత్రం అనేక పోలీస్ స్టేషన్లకు తిప్పి, చివరకు నోటీస్ ఇచ్చి వదిలిపెట్టారు. ఇది ఇలా ఉంటే అసలు లోకేష్ పై ఏమి కేసు పెట్టారు ? ఆయన కేవలం పరామర్శ కోసమే కదా వెళ్ళింది, పరామర్శకు వెళ్ళిన వ్యక్తి పై ఎలాంటి కేసు పెట్టి, అరెస్ట్ చేసారు ? విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని నోటీసులో సంతకం పెట్టించుకుని మరీ ఎందుకు పంపిచారు ? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే లోకేష్ పైన పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది.

ln 18082021 2

అందులో కొన్ని ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి. అవి చూసిన టిడిపి శ్రేణులు ఆశ్చర్యపోయారు. లోకేష్ పై 448 నెంబర్ తో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఈ కేసులో లోకేష్ ని ఏ1గా చూపించారు. సరే ఇక ఏమి అభియోగాలు పెట్టారు అంటే, అక్కడ ఉన్న ఉద్యోగుల విధులకు నారా లోకేష్ ఆటంకం కలిగించారు అంట. అంతే కాదు కుట్రపూరితంగా మా-ర-ణా-యు-ధా-ల-ను ధరించి వచ్చారు అంటూ, కొన్ని సెక్షన్లు పెట్టి, ఆయన పై అభియోగాలు మోపారు. ఇక ఇదే కేసులో, ఇతర టిడిపి నేతలు కూడా ఉన్నారు. మాజీ మంత్రులు పత్తిపాటి, నక్కా ఉన్నారు. అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. మొత్తం 32 మంది పై కేసులు నమోదు చేసారు. వీరి పై 341, 353, 147రెడ్‌విత్‌ 149 రెడ్‌విత్‌ 120బీ అనే అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇక అలాగే మరో కేసు వచ్చి, గుంటూరు హాస్పిటల్ దగ్గర రమ్య మృతదేహం ఉన్న అంబులెన్స్ ని వెళ్ళనివ్వలేదు అంటూ మరి కొంత మంది కూడా కేసు పెట్టారు. అయితే అసలు లోకేష్ ఎక్కడ కుట్ర చేసారు, ఎక్కడ ఉద్యోగులను అడ్డుకున్నారు అంటూ టిడిపి శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

ఇటీవల జార్ఖండ్ లో హైకోర్టు జడ్జిని కొంత మంది మార్నింగ్ వాక్ చేస్తుంటే, హ-త్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు సుప్రీం కోర్టు కూడా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుతో సంబంధం లేకుండా, 2019లో దాఖలైన పిటీషన్ పై, కరుణాకర్‌ మహాళిక్‌ అనే వ్యక్తి, జడ్జిల భద్రత పై ఒక పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కోర్టులు, జడ్జిల విషయంలో తీసుకుంటున్న చర్యల పై విచారణ జరిగింది. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ విచారిస్తుంది. ఈ కేసు విషయం పై, గత విచారణలోనే అన్ని రాష్ట్రాలను అఫిడవిట్ వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు అన్నీ, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కాబట్టి, ఆయా రాష్ట్రాలనే, ఈ భద్రత విషయం పై అఫిడవిట్ వేయాలని ఆదేశాలు జారీ చేసారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు మాత్రామే పాటించాయి. కొన్ని రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, గోవా, కేరళ, మహారాష్ట్ర, మిజోరం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లు ఇలా ఈ రాష్ట్రాలు, సుప్రీం కోర్టు ఆదేశించినట్టు అఫిడవిట్ దాఖలు చేయలేదు.

sc 18082021 2

కొంత మంది కొంత సమయం కావలి అంటూ సుప్రీం కోర్టుని కోరగా, చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సమయం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే అంతకు ముందే, అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రాల పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు చెప్పిన చేయకపోవటంతో, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు లక్ష రూపాయల జరిమినా విధించింది. ఈ జరిమానాని సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ సంక్షేమ నిధికి ఉపయోగించాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా పది రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలనీ, అలా దాఖలు చేయని పక్షంలో, చీఫ్ సెక్రటరీని సుప్రీం కోర్ట్ కు పిలిపిస్తాం అంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, ఈ విచారణకు ఏపి నుంచి న్యాయవాదులు ఎవరూ హాజరు కాలేదు. సుప్రీం కోర్టు అడుగుతున్న ప్రశ్నలకు ఏపి నుంచి సమాధానం చెప్పే వారు లేకుండా పోయారు. మొత్తానికి మొన్నటి వరకు హైకోర్టు వరుకే పరిమితమైన అంశాలు, ఇప్పుడు సుప్రీం కోర్ట్ వరకు చేరాయి. మరి గడువులోగా ఏపి అఫిడవిట్ దాఖలు చేస్తుందో, సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురి అవుతుందో చూడాలి.

ఇన్నాళ్ళు కోర్ట్ వాయిదాలు ఏదో ఒక సాకుతో తప్పించుకుంటూ, కాలం గడిపేస్తున్నా జగన్ మోహన్ రెడ్డి అండ్ కో కి, ఈడీ కోర్టు షాక్ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ, ఈడీ నుంచి పిలుపు వచ్చింది. జగన్ మోహన్ రెడ్డికి సమన్లు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 22న తమ ముందుకు విచారణకు హాజరు కావాలి అంటూ జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ, ఈడీ కోర్టు ఆదేశాలు ఇచ్చాయి. ముఖ్యంగా నిన్న ఈడీ , కోర్టులో మరో రెండు చార్జ్ షీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడు చార్జ్ షీట్లు దాఖలు చేసిన ఈడీ, నిన్న మరో రెండు చార్జ్ షీట్లు దాఖలు చేసింది. అందులో ఒకటి వాన్ పిక్ కేసు. అయితే ఈ చార్జ్ షీట్ ని, న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుందో లేదో అని అందరూ అనుకుంటున్న సమయంలో, ఈడీ కోర్టు, వాన్ పిక్ కేసుని విచారణకు తీసుకుంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డి ఒక్కరికే కాదు, ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డికి పిలుపు వచ్చింది. ఈ కేసులో ఉన్న మోపిదేవి వెంకటరమణకు కూడా కోర్టు పిలుపు వచ్చింది. ఇక ఎమ్మెల్యే ధర్మాన, ఐఆర్టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డికి కూడా ఈ సమన్లు జారీ అయ్యాయి. ఇక ఈ కేసులో ఉన్న పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాశ్ కు కోర్టు సమన్లు జారీ చేసింది.

ed 18082021 2

వీరితో పాటుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎం.శామ్యూల్, మన్మోహన్ సింగ్ కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఇక మొత్తంగా జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ కోర్టుకు వెళ్లి అక్కడ నుంచోవటం అంటే ఆయన ఇమేజ్ కు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మచ్చ. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన తరువాత, కేవలం రెండు సార్లు మాత్రమే ఆయన కోర్టు విచారణకే హాజరు అయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, ప్రతి సారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నారు. ఈ నేపధ్యంలో క-రో-నా రావటం, కోర్టులు వర్చ్యువల్ గా సమావేశం అవ్వటం జరిగినా, అక్కడ కూడా మినహాయింపు కోరారు. ఈ మొత్తం ఎపిసోడ్ నేపధ్యంలో, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి పిలుపు వచ్చింది. మరి ఆయన విచారణకు వెళ్తారో, లేదా ఏదైనా సాకు చెప్పి మినహాయింపు అడుగుతారో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ నెల 25న జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు రానుంది.

Advertisements

Latest Articles

Most Read