టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ చైర్మెన్ గా ఉన్న సంగం డెయిరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ కుప్పి గంతులు అందరూ చూసారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అముల్ కోసం, సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవాలని, ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం, చివరకు కోర్టుల్లో మొట్టికయాలు తింది. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ను జైలు పాలు చేసమనే సంతోషం తప్పితే, సంగం డెయిరీని ఏమి చేయలేక పోయారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూటు మార్చింది. మరోసారి ధూళిపాళ్ల నరేంద్రను ప్రభుత్వం టార్గెట్ చేసింది. గత కొన్నేళ్ళుగా, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ పేరుతో ఒక ట్రస్ట్ నడుస్తుంది. దీంతో ఇప్పుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ ను ప్రభుత్వం టార్గెట్ చేసింది. దేవాదాయ శాఖ నుంచి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ కు నోటీసులు వెళ్ళాయి. ఈ ట్రస్ట్ కార్యాలయం కూడా సంగం డెయిరీ ఆఫీస్ పరిసరాల్లోనే ఉంది. అయితే, దేవాదాయ శాఖ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, అక్కడకు వచ్చి నోటీసులు అంటించి వెళ్ళారు. దేవాదాయ శాఖ అంటించిన నోటీసుల్లో, పలు కీలక విషయాల గురించి సమాచారం కావాలని కోరారు. ముఖ్యంగా ట్రస్టు డీడ్ , మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టు ఆస్తులు, ఇతర ట్రస్టీల వివరాలు కావాలి అంటూ, నోటీసులో పేర్కొన్నారు.

dhulipalla 20082021 2

వీటితో పాటు, ఈ ట్రస్ట్ స్థాపించిన వివరాలు, అలాగే గత మూడు ఏళ్ళ వార్షిక ఆదాయంతో పాటుగా, ఖర్చులకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని ఆ నోటీసులో ఆదేశాలు జారీ చేసారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ఈ ట్రస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి అంటూ, దేవాదాయ శాఖ నుంచి నోటీసులు పంపించారు. ఈ వివరాలు పది రోజుల్లో తమకు అందచేయాలని టైం కుడా పెట్టారు. వివరాలు కనుక తమకు ఇవ్వకపోతే, చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే గతంలోకి వెళ్తే, సంగం డెయిరీ వివాదం చెలరేగిన సమయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈ ట్రస్ట్ పైనే ఎక్కువగా విమర్శలు చేసిన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ట్రస్ట్ ఎప్పుడో 1994లో ప్రారంభం అయ్యింది. ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే వారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే, ఒక పెద్ద హాస్పిటల్ కూడా ఉంది. రైతులకు, ఉద్యోగులకు ఈ హాస్పిటల్ లో సేవలు అందించే వారు. మరి ఇప్పుడు ప్రభుత్వం, ఎందుకు మళ్ళీ వివాదం రేపుతుందో అర్ధం కావటం లేదు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థిపై ప్రధానే స్వయంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారన్న కథనాలు పత్రికల్లో వచ్చాయని, వాటిపై ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు ఎందుకు స్పందించలేదని, ప్రభుత్వ ఆర్థిక సమస్యలతో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, ప్రజలందరూ ఇబ్బందిపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోందనేది వాస్తవం. ఈ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారులు, మంత్రలు ఎవరూ స్పందించరు. రాష్ట్ర ఆర్థికమంత్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఇద్దరూ అప్పుల కోసం ఢిల్లీలోనే చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్ర ఆదాయమెంత, అప్పులెన్ని అనేదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారు. జగన్ ప్రభుత్వం కేవలం 25 నెలల్లోనే రూ.2లక్షల55 వేల కోట్ల అప్పు చేసింది. 2019-20లో రూ.39వేల కోట్లు, 2020-21లో రూ.55వేల కోట్లు, 2021-22లో జూన్ నాటికి దాదాపు రూ.60వేల కోట్ల అప్పులు చేశారు. ఆ విధంగా చేసిన రూ. లక్షా 40 వేల కోట్లు కాక, ఏ1, ఏ2లు తమకు నచ్చిన దొడ్డి దారిలో అప్పులు పొందడానికి చేయాల్సిందంతా చేశారు. కార్పొరేషన్లు సృష్టించి, భూములు తనఖా పెట్టి , ఎఫ్ఆర్ బీఎం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.56వేల కోట్ల వరకు అప్పులు తెచ్చారు. ప్రభుత్వం డైరెక్ట్ గా తెచ్చిన అప్పులు లక్షా 44వేల కోట్లయితే, ఇన్ డైరెక్ట్ గా కార్పొరేషన్ల ముసుగులో చేసిన అప్పులు రూ.56వేల కోట్లు. ఈవిధంగా చేసిన అప్పులు కాకుండా ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు రూ.45వేల కోట్ల వరకు ఉన్నాయని సీఎఫ్ఎంఎస్ లోని అధికారులు చెబుతున్నారు. ఆ వ్యవస్థలో ఏం జరుగుతోందో ఏ అధికారికి తెలియడంలేదు. ఉద్యోగస్తుల కు జీపీఎఫ్ అడ్వాన్సులు, డీఏ చెల్లింపులు, పింఛన్లు కూడా చెల్లించలేని దుస్థితికి ప్రభుత్వం వచ్చింది. డీఏలు ఉద్యోగుల ఖాతాల్లో వేసినట్లే వేసి తిరిగి వెనక్కు తీసుకోవడ జరిగింది. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు కలిపితే ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులు రూ.2లక్షల 40వేల కోట్ల వరకు ఉన్నాయి. ఆదాయం లేకుండా ప్రభుత్వం అప్పులభారాన్ని ఏంచేస్తుందనే ప్రశ్న ప్రతిఒక్కరిలోనూ ఉంది. మద్యం, పెట్రోల్ డీజిల్ పై వచ్చే వ్యాట్, జీఎస్టీలపై వచ్చే ఆదాయంతో పాటు, కేంద్ర ప్రభుత్వమిచ్చే నిధులు కూడా రాష్ట్రానికి బాగానే వస్తున్నాయి. సంక్షేమ పథకాలకు రూ. 95వేలకోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. రూ.95వేల కోట్లు పోయినా కూడా మిగిలిన ఆదాయంతో పాటు, తెచ్చిన అప్పుల తాలూకా సొమ్మంతా ఏమైందో ప్రభుత్వం చెప్పాలి.

రూ.45వేల కోట్ల అప్పుల కోసం ఇప్పటికే రాష్ట్ర ఆర్థికమంత్రి ఢిల్లీలో తిరుగుతున్నాడు. కానీ కేంద్ర పెద్దలు ఇప్పటికే రాష్ట్రం మితిమీరి అప్పులు చేసింది కాబట్టి, తామేమీ ఇవ్వమని తెగేసి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఈప్రభుత్వం ఏంచేస్తుందో చూడాలి. వచ్చే నెలలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే, ఉద్యోగులకు జీతాలు ఆపాల్సిన పరిస్థితి. ఇవన్నీకేంద్ర ప్రభుత్వానికి తెలియబట్టే, మోదీ జగన్ ప్రభుత్వం అప్పుల పరిధి దాటిపోయిందని చెప్పారు. చివరకు జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లోని సొమ్ముని కూడా తీసేసు కుంటోంది. ఉద్యోగుల జీతాలు ఆపితే, వారు కచ్చితంగా కోర్టులను ఆశ్రయించడం ఖాయం. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కూడా అరకొరగానే అమలవుతున్నాయి. ప్రభుత్వ పథకాలపేరుతో ప్రజలకు ఖర్చు పెట్టింది కేవలం రూ.95వేల కోట్లయితే, మిగిలిన రూ.3లక్షల50వేల కోట్ల సొమ్ము ఏమైందంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని, జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇష్టానుసారం చెల్లింపులు చేసింది. ఆ వ్యవహారం కేంద్రానికి తెలియబట్టే, ప్రధాని ఏపీ ప్రభుత్వతీరుపై సీరియస్ అయ్యారన్న కథనాలు చూస్తున్నాం. ఏపీ కంటే చిన్నరాష్ట్రాలైన రాజస్థాన్, ఒడిశా ఆదాయం ఎక్కువ, అప్పులు తక్కువగాఉన్నాయి. ఏపీప్రభుత్వం అప్పులపై బరితెగించ బట్టే, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) రూ.41వేలకోట్ల చెల్లింపులకు లెక్కలు చెప్పమని ఆదేశించింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, విద్యుత్ డిస్కంలు, స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం దాదాపు రూ.30వేల కోట్ల వరకు అప్పులు తెచ్చింది. బేవరేజెస్ కార్పొరేషన్ లోని స్టాక్ ను రూ.1400కోట్ల అప్పు కోసం ప్రభుత్వం తాకట్టుపెట్టింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పినవారు, చివరకు మద్యం తాగిస్తాం.. అప్పులివ్వండి అనేస్థితికి వచ్చారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరోటి ఉంటుందా? 

మంత్రి అవంతి శ్రీనివాస్ తన పేరటి సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆడియో లీక్ పై స్పందించారు. నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇది తన పై జరుగుతున్న తప్పుడు ప్రచారం అని అన్నారు. తనకు ఎవరితోనే శత్రుత్వం అనేది లేదని, మరి తన పై ఎందుకు ఇలా కావాలని విష ప్రచారం చేస్తున్నారో తెలియటం లేదని అన్నారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలతో తనను ఇబ్బంది పెట్టాలని కొంత మంది చూస్తున్నారని అన్నారు. తనకు దేవుడి మీద నమ్మకం ఉందని, ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడు అంటూ, అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. పార్టీలో కూడా తన ప్రతిష్ట దెబ్బ తీయాలని ఎవరో ప్రయత్నం చేసినట్టు అర్ధం అవుతుందని అన్నారు. ఈ ఆడియో లీక్ పై, పూర్తి స్థాయిలో విచారణ చేయమని, పోలీస్ కమిషనర్ ని కోరానని, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారని, పోలీస్ వాళ్ళే ఇందులో ఏమి ఉందో తేలుస్తారని అన్నారు. ఈ ఆడియోలో నిజా నిజాలు అన్నీ పోలీస్ వారే చెప్తారని అవంతి అన్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయాలని, చేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని అన్నారు. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిని అని, అందుకే తన పై ఈ కుట్రలు చేస్తున్నారని అన్నారు. కొంత మందికి ఈ ధోరణి నచ్చటం లేదేమో అని వ్యాఖ్యానించారు.

avanthi 20082021 2

తన రాజకీయ ప్రత్యర్ధుల పై కూడా ఎప్పుడూ ఆరోపణలు చేయలేదని, తన రాజకీయ ఎదుగుదల చూసి, కొందరు తట్టుకోలేక పోతున్నారని అన్నారు. ఈ రెండున్న ఏళ్ళలో, అవినీతి ఆరోపణలు కూడా ఎవరూ చేయలేదనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తాను సెల్ఫ్ మేడ్ అని, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని అని అన్నారు. మహిళల్లో కూడా తమకు మంచి ఆదరణ ఉంది కాబట్టి, మహిళల్లోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో మంచి కంటే, ఎక్కువ వెళ్తుందని అన్నారు. అయితే ఈ `సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ, మీరు కంప్లైంట్ ఇచ్చింది, సోషల్ మీడియాలో మీ ఆడియో వైరల్ చేస్తూ, మిమ్మల్ని కించ పరుస్తున్నారనా ? లేదా అసలు ఆ ఆడియోలో ఉన్న వాయిస్ కూడా మీదు కాదని చెప్తున్నారా ? అని వాయిస్ గురించి అడగగా, అవంతి మాట దాటేసారు. వాయిస్ గురించి పోలీస్ విచారణలో తేలుతుంది అంటూ, సమాధానం చెప్పి తప్పించుకున్నారు. మరి దీని పై పోలీసులు ఏమి తేలుస్తారు ? ఏమి జరుగుతుంది అనేది చూడాలి.

ప్రజలు, ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగమనే వాటికి తావులేకుండా, జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా, వారు సంతోషంగా ఉండేలా సాగాల్సిన రాష్ట్రపాలన, ఈ ప్రభుత్వంలో అందుకు విరుద్ధంగా సాగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు జవాబుదారీగా బాధ్యతలు నిర్వహించాల్సిన ప్రభుత్వం, అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, గాంధారి పుత్రుల్లాంటి 151 ఎమ్మెల్యేలున్నారు కదా అని దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన పనిలేదని, జీవోలకు నంబర్లు ఇవ్వాల్సిన పనిలేదని ప్రభుత్వమే చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చేసేపనులు ప్రజలకు తెలియచేయాల్సి నబాధ్యత పాలకులపైనే ఉందని, అందుకోసమే ఆర్టీఐ చట్టాన్ని (సమాచారహక్కు చట్టం) తీసుకురావడం జరిగిందన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు, విధులకు విఘాతం కలిగేలా, జీవోలను ఆఫ్ లైన్లో పెడతామనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. ఇష్టాను సారం జీవోలు విడుదలచేస్తాం... అవి ప్రజలకు తెలియాల్సిన పనిలేదని చెప్పడం ముమ్మాటికీ రాజ్యాంగవిరుద్ధమే అవుతుందని మాజీ మంత్రి తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారుగా వ్యవహరించా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రజాస్వా మ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించకుండా, అప్పులు చేయడానికి, దోచుకోవడానికే ప్రభుత్వం బ్లాంక్ జీవోలు, రహస్య జీవోలిస్తుందా అని ఆలపాటి నిలదీశారు.

hc 20082021 2

తెలంగాణ హైకోర్టు నిన్న చాలా స్పష్టంగా జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించిందన్నారు. ఏపి నిర్ణయం పై కూడా, భంగపాటు తప్పదన్నారు. ఆర్థిక శాఖలోని సమాచారం బయటకు వచ్చిందన్న కారణంతోనే ప్రభుత్వం జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచకూడదని నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమం పేరుతో అప్పులుచేస్తూ, తద్వారా వచ్చే సొమ్ముని దొడ్డిదారిన తన ఖజానాకు మళ్లిస్తున్నాడన్నా రు. కేంద్ర ప్రభుత్వ అనుమతి, ఎఫ్ఆర్ బీఎం పరిమితులకు లోబడే ప్రభుత్వం అప్పులు చేయాలని, కానీ జగన్ తనకు తోచిన విధంగా అప్పులు చేస్తూ, ఆసొమ్ముని కాజేయడానికే జీవోలను కూడా బహిర్గతం చేయడానికి ఇష్టపడటం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న అక్రమ, తప్పుడు నిర్ణయాలు ప్రజలకు తెలియకూడదనే ప్రభుత్వం చీకటి జీవోలను దాచేస్తోందన్నారు. ఈ విధంగా చేస్తున్న ముఖ్యమంత్రి ముమ్మాటికీ పరిపాలనకు అనర్హుడని మాజీమంత్రి తేల్చి చెప్పారు. ప్రజలకు సమాచారం తెలియ చేయకుండా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 13ను కూడా ఉల్లంఘిస్తున్నా డన్నారు. సమాచారహక్కు చట్టాన్ని కూడా తుంగలో తొక్కతూ, ప్రభుత్వం తీసుకున్న జీవోల ఆఫ్ లైన్ నిర్ణయం, ముమ్మాటీకి రాజ్యాంగ వ్యతిరేకమేనన్నారు. ఈ విధమైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంపై న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే చర్యలు తీసుకుంటామని ఆలపాటి స్పష్టంచేశారు.

Advertisements

Latest Articles

Most Read