ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో స్వాత్రంత్య దినోత్సవ వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకులు జరిగాయి. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. క-రో-నాని దృష్టిలో పెట్టుకుని, ప్రజలకు ఈ వేడుకుల్లో పాల్గునే అవకాసం ఇవ్వలేదు. ఇక జెండా వందనం అనంతరం, జగన్ మోహన్ రెడ్ది ప్రసంగించారు. సహజంగా స్వాత్రంత్య దినోత్సవం రోజు ఇచ్చే ప్రసంగంలో తమ ప్రభుత్వం చేస్తున్న పనులు అన్నీ గొప్పగా చెప్తారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి కూడా, గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల గురించి చెప్తూ వచ్చారు. ఈ సారి కూడా అదే విధంగా ప్రసంగం సాగింది. అయితే గత రెండేళ్ళ కంటే భిన్నంగా ఈ సారి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం సాగింది. ముఖ్యంగా తమ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న మూడు రాజధానుల ప్రస్తావన ఈ ప్రసంగంలో లేకపోవటంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఇంత పెద్ద విషయం పై, జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ప్రస్తావించలేదు అనే చర్చ జరుగుతుంది. అక్కడ ఉన్న నాయకులు, అధికారులు, మీడియా కూడా జగన్ ప్రసంగంలో మూడు రాజధానుల విషయం లేకపోవటం పై ఆశ్చర్య పోయారు. ఈ విషయం ఎందుకు ప్రసంగంలో చెప్పలేదో అంటూ చర్చించుకున్నారు.

jagan 15082021 2

అనేక ఇతర విషయాల పై జగన్ మాట్లాడారు. సంక్షేమం గురించి ఎక్కువగా చెప్పారు. అయితే ఈ సారి అనూహ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల గురించి కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మధ్య కాలంలో జీతాలు ఇవ్వటం సమయానికి ఇవ్వటం లేదు, సిపీఎస్ రద్దు, డీఏలు, పీఆర్సి ఇలా అనేక విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపధ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి వారి గురించి ఇక్కడ ప్రస్తావన చేసారు. ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, అవి తనకు కూడా తెలుసు అని, త్వరలోనే వాటి పరిష్కారం కూడా చూస్తామని జగన్ అన్నారు. మొత్తంగా, ప్రభుత్వం ఎదుర్కుంటున్న ఆర్ధిక సంక్షోభాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఈ సారి జగన్ ప్రసంగంలో ఎక్కువగా సంక్షేమం పైనే ఉండటం, ప్రభుత్వ ఉద్యోగులను మంచి చేసుకోవాలని అనుకోవటం, అలాగే ఎక్కడా మూడు రాజధానుల ప్రస్తావన అనేది లేకపోవటం, ఇవన్నీ గమనించాల్సిన అంశాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో, ఉద్యోగులను విశాఖ తరలించటం దాదాపు అసాధ్యం అని అంటున్నారు.

సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఈ రోజు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా, ఎన్వీ రమణ, జాతీయ పతకాన్ని ఎగరవేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ లో చేస్తున్న చట్టాల తీరు పైన జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం పార్లమెంట్ లో చట్టాలు చేస్తున్న తీరు చాలా విచారకరంగా ఉందని ఎన్వీ రమణ అన్నారు. చట్టాలు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో కూడా, అర్ధం కాని పరిస్థితి తలెత్తిందని అన్నారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. చట్టాల్లో ఎన్నో లోపాలు ఉంటున్నాయని, దీని పై కోర్టులో కూడా వ్యాజ్యాలు జరుగుతున్నాయని, ఇలాంటి లోపభూయిష్ట చట్టాలు, ప్రజలకు, ప్రభుత్వాలకు కూడా భారం అవుతున్నాయని అన్నారు. న్యాయవాదులు ప్రజా జీవితంలోకి కూడా రావాలని, చట్టసభలకు కూడా రావాలని, పార్లమెంట్ లో ఒకప్పుడు న్యాయ దిగ్గజాలు సభ్యులుగా ఉండే వారని, ప్రస్తుతం ఉన్న తీరు మారాలని అన్నారు. చట్టాల పై చర్చలు జరగకుండా ఉంటే ఇబ్బందులు వస్తయాని అన్నారు. ప్రతి చట్టం పై పార్లమెంట్ లో నాణ్యమైన చర్చ జరిగక పోతే, న్యాయపరమైన చిక్కులు వస్తయాని అన్నారు.

cji 15082021 2

చర్చలు జరగని కారణంగా, అసలు కొత్త చట్టాల ఉద్దేశం ఏమిటో కూడా తెలియకుండా పోతుంది అంటూ, జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇప్పుడు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక వ్యవస్థ పని తీరు పై, మరో వ్యవస్థ మాట్లాడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వ్యవస్థ గాడి తప్పుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే, ఇలా వేరే వ్యవస్థ మాట్లాడుతుంది. అయితే జస్టిస్ ఎన్వీ రమణ మాత్రం చాలా ధైర్యంగా జరుగుతున్న విషయం చెప్పారు. గత పార్లమెంట్ సమావేశాలు ఎలా జరిగాయో అందరూ చూసారు. ఎక్కడా చర్చ జరగకుండా, దాదాపుగా 19 బిల్స్ ని ఆమోదించారు. అసలు ఆమోదించిన బిల్స్ ఏమిటో కూడా ప్రజలకు తెలియదు. ఈ నేపధ్యంలోనే చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయినా వ్యవస్థల తీరుని ప్రశ్నిస్తున్నారు. సిబిఐ, ఈడీ, పోలీసులు, వ్యవస్థలు ఇలా అందరి పని తీరుని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి, ఇది ఎంత వరకు వెళ్తుందో.

వివేక కేసు విచరణ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు కీలక వ్యక్తులను విచారిస్తూ, సిబిఐ దూకుడు పెంచింది. ఈ నేపధ్యంలోనే వివేక కుమార్తె వైఎస్ సునీత, నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ తో ప్రత్యెక ఇంటర్వ్యూ లో మాట్లాడారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఆ ఛానెల్ అంటే జగన్ మోహన్ రెడ్డి గారికి కోపం, ఇప్పటికే ఆ ఛానల్ ని బ్యాన్ కూడా చేసారు. ఆ ఛానల్ లో జగన్ గారి సోదరి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక పొతే ఈ ఇంటర్వ్యూ లో ఆమె చాలా ఆచి తూచి మాట్లాడారు. ముఖ్యంగా సిబిఐ విచారణ జరుగుతున్న తీరుపై ఏమి మాట్లాడను అని ఆమె చెప్పారు. తాను ఈ సమయంలో మాట్లాడితే విచారణ మీద ప్రభావం ఉంటుంది కాబట్టి మాట్లాడ లేనని అన్నారు. అలాగే సిబిఐ విచారణ తీరు పై పలు అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి కదా అని ప్రశ్నించిగా, ఏది ఏమైనా ఈ సిస్టంలోనే మనం ఉన్నామని, ఈ సిస్టంతోనే పనులు చేయించుకోవాలని, ఈ కేసులో అసలు దోషులు బయటకు వస్తారనే నమ్ముతున్నాను అని, విచారణ జరుగుతుంది కదా, జరగనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఏపి పోలీసులు గురించి కూడా ఆమె మాట్లాడారు. ఈ రాష్ట్రంలో మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ఇలాంటి సమయంలో, ఈ రాష్ట్ర పోలీసులు మీకు ఎలా సహకరిస్తున్నారు అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.

sunitha 14082021 2

ఆమె మాట్లాడుతూ, "పరిస్థితి ఎలా ఉన్నా, ఈ రోజుకి కూడా నాకు సిస్టం మీద నమ్మకం ఉంది. ఎన్ని తప్పులు ఉన్నా, మనం ఈ సిస్టంతోనే పని చేయాలి. అందుకే ఈ సిస్టంలో నాకు మంచి జరుగుతుంది అనే ఆశ ఉంది. ఇప్పటికే రెండేళ్ళు అయ్యింది, ఇది తొందరగా అయిపోతుందని అనుకుందాం" అని సమాధనం ఇచ్చారు. ఇక జగన్ పదవిలోకి వచ్చిన తరువాత, మీరు ఆయనతో ఈ కేసు గురించి చర్చించారా, సెక్యూరిటీ అడిగారా అని అడగగా, చర్చించానని సమాధానం ఇచ్చారు. ఆయన నుంచి ఎలాంటి భరోసా వచ్చింది అని అడగగా, నా పరిస్థితి చూస్తున్నారుగా అని, ఏమార్పు లేదు కదా అని బదులు ఇచ్చారు. తన పరిస్థితి చూస్తే ఎలాంటి భరోసా ఉందో అర్ధం అవుతుంది కదా అని బదులు ఇచ్చారు. ఇక విజయసాయి రెడ్డి ముందు గుండెపోటు అని చెప్పారు కదా అని అడగగా, ఇది ఆ రోజు తనకు తెలియదని, తరువాత తెలిసిందని అన్నారు. షర్మిల సహకారం ఉందా అని అడగగా, తన కుటుంబంలో అందరి సహకారం ఉందని, అసలు దోషులు బయటకు రావాలనే అందరూ కోరుకుంటున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వీకెండ్ షాక్ అనే చెప్పాలి. శనివారం సాయంత్రం వస్తున్న ఈ న్యూస్ తో, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీకి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాయలసీమ ఎత్తిపోతల పధకంకు సంబంధించి, కృష్ణా రివర మ్యానేజ్మెంట్ బోర్డు, ఈ నెల 11, 12వ తెదేల్లో ప్రాజెక్ట్ ప్రదేశంలో పర్యటించింది. రాష్ట్ర గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ప్రకారం, అక్కడకు ప్రత్యక్షంగా వెళ్లి తనిఖీలు చేయటం జరిగింది. ఆ తనిఖీల తరువాత, కేఆర్ఎంబీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించింది. సుమారుగా 12 పేజీలు  ఉన్న ఈ నివేదికలో, గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యవరణ అనుమతులు లేకుండా అక్కడ పనులు చేపట్టవద్దు అంటూ ఆదేశాలు ఇచ్చిందో, ఆ `ఆదేశాలకు విరుద్ధంగా అక్కడ పనులు జరిగినట్టు కృష్ణా రివర మ్యానేజ్మెంట్ బోర్డు గుర్తించింది. అయతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, అక్కడ మేము కేవలం డీపీఆర్ కోసం మాత్రమే అక్కడ పనులు జరుగుతున్నాయని, ప్రాజెక్ట్ పనులు అక్కడ ఏమి జరగటం లేదని, ప్రాజెక్ట్ పనులు చేపట్టినట్టు మీరు నిర్ధారిస్తే, తగు చర్యలు తీసుకోవచ్చు అంటూ చీఫ్ సెక్రటరీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక అఫిడవిట్ దాఖలు చేసారు. అయితే తరువాత కొన్ని రోజులకు మళ్ళీ తెలంగాణా ప్రభుత్వం ఎన్జీటీ దగ్గరకు వచ్చింది.

ngt 14082021 2

అక్కడ ఎన్జీటీ తీర్పుకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి అంటూ తెలంగాణా ప్రభుత్వం, ఎన్జీటీ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. తమ ఆదేశాలు ధిక్కరించి, అక్కడ పనులు జరుగుతున్నట్టు తెలిస్తే, చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేఆర్ఎంబీని పరిశీలనకు వెళ్ళమని చెప్పింది. కొన్ని అవాంతరాలు తరువాత, కేఆర్ఎంబీ రెండు రోజుల క్రిందట అక్కడ పరిశీలనకు వెళ్ళింది. అయితే తమ పరిశీలనలో అక్కడ తీర్పు ధిక్కరించి పనులు చేసినట్టు నివేదికలో తెలిపింది. పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ ఈ విధంగా అన్ని పనులూ అక్కడ పూర్తి చేసారని పేర్కొన్నారు. ఈ మేరకు ఫోటోలతో సహా అక్కడ జరిగిన పనుల వివరాలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఇచ్చారు. అయితే ఈ కేసు విచారణ సోమవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందకు రానుంది. మరి ఈ రిపోర్ట్ చుసిన ఎన్జీటీ ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది ? ధిక్కరణకు పాల్పడినట్టు తేలితే, చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతాం అంటూ, గతంలో చెప్పిన ఆదేశాలను అమలు చేస్తుందా అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read