రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన విభాగం విధినిర్వహణ, విద్యుక్త ధర్మానికి తిలోదకాలిచ్చిందని, సంబంధం లేని పనులు చేస్తోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనేక్లుప్తంగా మీకోసం...! రాష్ట్రంలో శాంతిభద్రతల విభాగం పనితీరుపై ప్రతిపక్షాలు, మీడియా ఎంతగా గగ్గోలు పెడుతున్నా, ప్రభుత్వం, ముఖ్యమంత్రినుంచి మౌనమే సమాధానమవు తోంది. ఏ సందర్భంలోనైనా సరే, ముఖ్యమంత్రి ఏనాడైనా మీడియాతో మాట్లాడుతూ, ఎనీ కొశ్చన్స్ అనే ప్రశ్న వేయగలిగారా? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవడమేకానీ, ముఖ్యమంత్రి ఏనాడూ అలా ప్రవర్తించలేదు. ఆయనలో ఎప్పుడూ ఒక వణుకు కనిపిస్తూనే ఉంటుంది. ప్రతిపక్షం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటే డీజీపీ కార్యాలయంలో ఒక విస్ఫోటనం రావాలి. కానీ అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించడంలేదు? ఎప్పుడూ రానూలేదు. ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ చేయాల్సిన డీజీపీ ఏం చేస్తున్నాడు? తన బాధ్యతలను అధికారిగా ఆయన విస్మరించాడు కాబట్టే, పదేపదే పౌరుడిగా తాను గుర్తు చేయాల్సి వస్తోంది. 5కోట్ల మందిని సమానంగా చూడాల్సిన బాధ్యత డీజీపీపైనే ఉంది. డీజీపీ తనబాధ్యతల నిర్వహణపై తనదృష్టిని పూర్తిగా కేంద్రీకరించడం లేదు. తరతమ బేధాలు, తేడాలు లేకుండా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా డీజీపీ వ్యవహరించాలి. అంతేగానీ సీఎంచెప్పింది చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి, సారాయి గంజాయి కేసులుపెట్టడానికి కాదు పోలీసులుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గలో వల్లెపు అశోక్ అనే బీసీ యువకుడిని దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని చావబాది, లాకప్ డె-త్ చేశారు. లాకప్ డె-త్ జరిగితే, మృతుడి భార్య, కుటుంబసభ్యులు, బంధువులకు చెప్పకుండా పోలీసులు అతని మృ-త-దే-హా-న్ని పూడ్చమని, కాల్చమని ఎలా చెబుతారు? పులివెందులలోని స్థానిక వైసీపీనేతల ఆదేశాల ప్రకారమే పోలీసులు అలా వ్యవహరించారా? అశోక్ మృ-త-దే-హా-న్ని పూడ్చండి... కాల్చండనే డైరెక్షన్ సీఎంవో నుంచే వచ్చిందా? లేక స్థానిక పోలీసులే అదంతా చేశారా? శ-వా-న్ని రాత్రిపూట కాల్చకూడదని తెలిసీ, భార్యబిడ్డలకు బంధువులకు చెప్పకుండా, కాల్చాలనే ఆలోచన పోలీసులకు ఎందుకొచ్చింది? ముఖ్యమంత్రి నియోజకవర్గమంతా ఇలానే అరాచకంగా ఉంటుందా? అక్కడి పోలీసులు ఇదేవిధంగా చట్టాన్ని, న్యాయాన్ని ఖాతరుచేయకుండా ప్రవర్తిస్తారా?

సీఎం ఏం చెబితే, డీజీపీ అదే చేస్తారా? ముఖ్యమంత్రి నియోజకవర్గమంటే, అ-రా-చ-కా-ని-కి అడ్డానా? అశోక్ లాకప్ డె-త్ వ్యవహారంపై ముఖ్యమంత్రి తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. తన నియోజకవర్గంలో అరాచకం లేదని ముఖ్యమంత్రి భావిస్తే, అదే వాస్తవమని ప్రజలకు తెలియాలంటే, ఆయన తక్షణమే లాకప్ డె-త్ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ధర్మం నాలుగుపాదాలతో నడుస్తోందని డీజీపీ భావిస్తే, తక్షణమే తమ డిమాండ్ కు ఆయన కూడా అంగీకరించి, ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవా లి. రాష్ట్రంలో న్యాయం ఎలా అమలవుతోందనడానికి మజ్జి అనే యువకుడి ఉదంతమే నిదర్శనం. ఎప్పుడో సంవత్సరం క్రితం తెలంగాణ నుంచి రెండు మద్యం సీసాలు తెచ్చుకున్న యువకుడిపై పోలీసులు ఇప్పుడు గంజాయి కేసు పెడతామని బెదిరించి, చివరకు అతని చా-వు-కి కారణమయ్యారు. చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో మద్యం సీసాలకు గంజాయి పుట్టిందా? రెండు మద్యంసీసాలు తెచ్చుకున్న పాపానికి యువకుడు బలై పోవాలా? మజ్జిని వేధించి, అతన్ని రూ.లక్ష లంచం డిమాండ్ చేసిన, ఎస్ఐ, కానిస్టేబుళ్లపై ప్రభుత్వం ఏంచర్యలు తీసుకుంది? ముఖ్యమంత్రి, డీజీపీల అసమర్థతవల్లే మజ్జి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వారిపై తక్షణమే ఐపీసీ 306 కేసు నమోదుచేసి, అరెస్ట్ చేసి, శాఖాపరమైన విచారణ జరపాలి. గుంటూరుజిల్లాలో అలీషా అనే మైనారిటీ యువకుడి చా-వు-కి కారకులెవరు? అలీషా కాళ్లపైకి ద్విచక్రవాహనం ఎక్కించి మరీ వేధించిన ఎక్సైజ్ పోలీసులపై డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారు? పల్నాడులో విక్రమ్ మ-ర-ణా-ని-కి, చిత్తూరులో ఓంప్రతాప్ చా-వు-కి, చీరాలలో కిరణ కుమార్ బల-వ-న్మ-ర-ణా-ల-కు కారకులైన పోలీస్ అధికారులపై డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారు? ఆయా ఘటనల్లో ప్రమేయమున్న సదరు అధికారులను తక్షణమే అరెస్ట్ చేసి, విచారించాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాం. డీజీపీ తన పంథా మార్చుకొని విధి నిర్వహణలో నిజాయితీగా, నిక్కచ్చిగా చట్టపరంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం.

వైసీపీ కార్యకర్తల అసభ్యకర పోస్టింగ్ లపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఏ డీ.జీ కి ఫిర్యాదు చేసిన తెదేపా శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు. తెలుగుదేశం పార్టీ (టిడిపి) నాయకులపై మరియు కేడర్‌పై అధికార వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారుల అసభ్యకర, వి-ద్వే-ష-పూ-రి-త పోస్టింగ్‌ల పై అనేక సార్లు ఫిర్యాదు చేశాం. కానీ, ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో గుంటూరు అరుండల్‌పేట పోలీస్ స్టేషన్ లో సైతం అనేక ఫిర్యాదులు చేశాం. ఐపిసి సెక్షన్ 500 తో అధికారులు కేసులు నమోదు చేశారు. కానీ, నిందితులను అరెస్టు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. టిడిపి మద్దతుదారులపై వైఎస్ఆర్‌సిపి దాఖలు చేసిన తప్పుడు ఫిర్యాదుల పట్ల మాత్రం వేగంగా స్పందిస్తున్నారు. టిడిపి మద్దతుదారుల పోస్టింగ్ లు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తమ అసమ్మతిని వ్యక్తం చేయడానికి మంచి ఉద్దేశ్యంతో చేయబడ్డాయి. కానీ, వైయస్‌ఆర్‌సిపి పోస్టింగ్ లు అసభ్యకరంగా, సమాజంలో వి-ద్వే-షం, శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. టిడిపి మద్దతుదారులను కించపరచడం, వారి పరువుకు భంగం కలిగించడం వంటి దుర్మార్గమైన ఉద్దేశాలతో వైఎస్ఆర్‌సిపి కార్యకర్తల పోస్టింగులు ఉన్నాయి.

tdp 12082021 2

ఇందుకోసం వైఎస్ఆర్‌సిపి మద్దతుదారులు యూ ట్యూబ్ ఛానెల్‌లు, ఫేస్‌బుక్ పేజీలు/ఖాతాలు, ట్విట్టర్ ఖాతాలు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగిస్తున్నారు. ప్రజల మధ్య శత్రుత్వం, ద్వే-షం ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా ప్రకటనలు, పుకార్లు రేపుతున్నారు. వైఎస్ఆర్‌సిపి సోషల్ మీడియా ఆపరేటర్లు టీడీపీ సీనియర్ నాయకుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ వారి వ్యక్తిత్వాలను కించపరచడం, అసభ్యకరంగా వక్రీకరిస్తున్నారు. టిడిపి మద్దతుదారులపై మాత్రమే చర్యలు తీసుకోవడం పోలీసు సిబ్బంది పక్షపాత దోరణిని స్పష్టంగా తెలుస్తుంది. పోలీసుల ఇటువంటి ఏకపక్ష చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కావున, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని మరోసారి అభ్యర్థిస్తునాను.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రాజద్రోహానికి పాల్పడుతున్నారు అంటూ, ఆయన పై రాజద్రోహం కేసు పెట్టి, హైదరాబాద్ లోని ఆయన ఇంటి నుంచి, ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి, మంగళగిరి తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు రాత్రి రఘురామకృష్ణం రాజు పై, సిబిఐ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ ఆరోపణలు వచ్చాయి. దీని పై రఘురామరాజు ఈ కేసు, బెయిల్ పిటీషన్ సందర్భంగా, తనకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తారు. సుప్రీం కోర్టులో సిబిఐ విచారణ కావాలి అంటూ పిటీషన్ వేసారు. దీని పై అప్పట్లోనే ప్రాధమికంగా విచారణ చేసిన ధర్మసానం, జూన్ నెలకు వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే, ఈ పిటీషన్ జూన్ నెలకు కూడా కోర్టు ముందుకు రాలేదు. ఇప్పుడు ఆగష్టు మూడో వారం వస్తున్నా, ఈ కేసు పై ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో ఈ కేసు విషయమై రఘురామరాజు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. తన కస్టోడియల్ టార్చర్‍పై వేసిన పిటీషన్ ఇంకా విచారణకు రాలేదని, ఈ పిటీషన్ ని విచారణకు తీసుకోవాలని, త్వరగా విచారణ చేయాలి అంటూ, సుప్రీం కోర్టుని రఘురామరాజు కోరారు. ఆ పిటీషన్ లో తనకు జరిగిన అన్యాయం పై సిబిఐ విచారణ కోరినట్టు చెప్పారు. ఈ పిటీషన్ గత నెలలోనే విచారణకు రావలసి ఉందని అన్నారు.

rrr 12082021 2

పలు మార్లు విచారణ జాబితాలోకి వచ్చినా, పలు కారణాలతో, ఈ పిటీషన్ బెంచ్ మీదకు రాలేదని, జాబితాలో ఉన్నా కూడా విచారణ జరగలేదని రఘురామరాజు కోర్టుకు తెలిపారు. రఘురామరాజు విజ్ఞప్తి పై సుప్రీం కోర్టు స్పందించింది. జస్టిస్ వినీత్ శరణ్ స్పందిస్తూ, మీ విజ్ఞప్తిని పరిశీలించమని, సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి తగు ఆదేశాలు ఇస్తామని, త్వరలోనే ఈ పిటీషన్ పై విచారణ చేస్తామాని తెలిపారు. దీంతో సుప్రీం కోర్టు నుంచి రిజిస్ట్రీకి, రఘురామరాజు విజ్ఞప్తి పై ఆదేశాలు వెళ్ళాయి. ముఖ్యంగా సిఐడి కస్టడీలో ఉండగా, రఘురామరాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేది ఆరోపణ. అయితే దీని పై హైకోర్టు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులను రిపోర్ట్ ఇవ్వమని కోరగా, వారు ఏమి లేదని రిపోర్ట్ ఇచ్చారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రకారం, సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ హాస్పిటల్ లో పరీక్షలు చేయగా, ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయినట్టు ఆర్మీ హాస్పిటల్ వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం తేల్చాలని, బాద్యుల పై చర్యలు తీసుకోవాలని రఘురామరాజు కోరుతున్నారు.

ప్రవీణ్ ప్రకాష్.. ఈయన సియం ఆఫీస్ లో మోస్ట్ పవర్ఫుల్ అనే విషయం అందరికీ తెలిసిందే. మంత్రులకు కూడా లేని పవర్స్ ఈయనకి ఉంటాయని ప్రచారంలో ఉంది. జీవోల జారీలో కూడా ఆయన మార్క్ కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలే కాకుండా, రాజకీయ నిర్ణయాల్లో కూడా ఆయన పాత్ర ఉంటుంది అనే ప్రచారం ఉంది. అందుకే ఆయన సియం పేషీలో ముఖ్యకార్యదర్శి పదవి ఇచ్చారు. సియం పేషీలో ఆయనే మోస్ట్ పవర్ఫుల్. ఇంకా చెప్పాలి అంటే, జగన్ తరువాత ఆయనే అనే స్థాయిలో ప్రచారం ఉంది. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గురించి ఎందుకు అనుకుంటున్నారా ? ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ప్రవీణ్ ప్రకాష్ కి ఇంకా సర్వీస్ ఉన్నా కూడా , ఆయన త్వరలోనే రిటైర్డ్ అయిపోతున్నారు అంట. రిటైర్మెంట్ తీసుకుని, ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ వార్తలు రావటంతో అందరూ విస్మయం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఈ వార్త సెక్రటేరియట్ లో హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ పీక్ లో ఉన్న ప్రవీణ్ ప్రకాష్, చాలా పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. ఆయనను చీఫ్ సెక్రటరీని చేసినా ఆశ్చర్యం లేదు అని అందరూ అనుకుంటున్న సమయంలో, ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు సర్వీస్ కి రిటైర్మెంట్ ఇచ్చిన రాజకీయాల్లోకి రావటం పై చర్చ జరుగుతుంది.

praveen 12082021 2

ఆయన ఏపి రాజకీయాల్లోకి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం లేదు. ఆయన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు అంట. అంతే కాదు, బీజేపీ పార్టీ నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు అంట. ఇందు కోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసినట్టు చెప్తున్నారు. ఆయనకు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. నిజానికి బీజేపీ రిఫరెన్స్ తోనే, ఆయనకు జగన్ వద్ద అంత మంచి స్థానం వచ్చిందని చెప్తారు. ఈ నేపధ్యంలోనే, 2022లో జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కోసం, ఆయన సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్, గ్రౌండ్ మొత్తం సెట్ చేసుకున్నారని చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారాణాశి నుంచి ఆయన రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు అంట. 1994 బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ ప్రకాష్, తన సహచరులు కొంత మంది ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారని, కేంద్రమంత్రి వర్గంలో ఉన్న అశ్విని కూడా ప్రావీణ్ బ్యాచ్ మేట్ అని అంటున్నారు. అయితే ఈ విషయం జగన్ మోహన్ రెడ్డికి చెప్పగా, ఆయనకు కూడా ఇందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని ప్రచారం జరుగుతుంది.

Advertisements

Latest Articles

Most Read