గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో నడుస్తున్న స్థానిక ఎన్నికల విషయం పై హైకోర్టు నేడు తేల్చేసింది. స్థానిక ఎన్నికల పై, కీలకమైన సూచనలు చేసింది హైకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికల పై ఇప్పటికే హైకోర్టులో పలు దఫాలుగా విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు అధికారాన్ని కట్టబెడుతూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంభందించి, రాష్ట్ర ఎన్నికల సంఘం వద్దకు, రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్ అధికారులను పంపించాలని ఆదేశించింది. ప్రభుత్వం తరుపున పంపించిన ముగ్గురు అధికారులతో, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సంప్రదింపులు జరిపి ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు స్పష్టం చేసింది. క-రో-నా కారణంగా ఎన్నికలు వాయిదా కై, ప్రభుత్వం వైపు నుంచి లేఖ రాయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం లేఖను ఎన్నికల కమిషన్ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. క-రో-నా వ్యాక్సిన్, స్థానిక ఎన్నికలు రెండు ప్రజలకు సంబంధించినవే కాబట్టి, ఇటు ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండు కూర్చుని మాట్లాడకుంటే మంచిదని హైకోర్టు తెలిపింది. లేని పక్షంలో, ముగ్గురు అధికారులను, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్దకు పంపిస్తే, దానికి సంబంధించి పూర్తి వివరాలు, అధికారులు పేర్లు, తేదీ గురించి కూడా తమకు నివేదించాలని హైకోర్టు తెలిపింది.

nimmagadda 2312020 2

ప్రభుత్వ అధికారులు తమ వాదనను, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వివరించాలని, ప్రభుత్వం వైపు నుంచి ఉన్న అన్ని అభ్యంతరాలను వ్యక్తం చేయాలని హైకోర్టు సూచించింది. ఇప్పటికే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపధ్యంలో, మీ వాదన మీరు వినిపిస్తే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు సూచించింది. దీంతో బాల్ మొత్తం, హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టులో వేసేసింది. కాబట్టి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వ అధికారులు ఏమి చెప్తారు, తమ వాదన ఎలా వినిపిస్తారు, ఎన్నికల కమీషనర్ ఒప్పుకుంటారా అనే విషయం తేలుతుంది. మొత్తానికి, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిర్ణయమే ఫైనల్ అనే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అనే చెప్పాలి. హైకోర్టు ఆదేశాల పై ప్రభుత్వం, ముగ్గురు అధికారులను పంపిస్తుందా ? లేక హైకోర్టు మాటలు కాకుండా, సుప్రీం కోర్టుకు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ గత మూడు రోజుల నుంచి కూడా పోలవరం ప్రాజెక్ట్ పరిధితో పాటు, అలాగే ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసిత గ్రామాలను కూడా ఆయన పర్యటిస్తున్నారు. మొదటి రోజు ఆయన పోలవరం పనులు డ్యాం సైట్ లో పర్యవేక్షించారు. రెండో రోజు మాత్రం, ఆయన తూర్పు గోదావరి జిల్లాలో నిర్వాసిత గ్రామాల్లో పర్యటించారు. ఈ రోజు మూడో రోజు, పశ్చిమ గోదావరి జిల్లాలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో నిర్వాసిత కాలనీల నిర్మాణ పనులుని పరిశీలించారు. అనంతరం ఆయన జంగారెడ్డి గూడెం చేరుకొని మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత పునరావాస పనులకు సంబంధించి, కొంత అసంతృప్తి వ్యక్తం చేసారు. పోలవరం ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో చేయాలి అంటే, ఆయా గ్రామాల నిర్వాసితులకు పునరావాస పనులు వేగంగా చేయాల్సి ఉండగా, అనుకున్న స్థాయిలో పనులు జరగటం లేదని అన్నారు. ప్రధానంగా ఈ పునరావాస కాలనీలు నిర్మాణాలు, ఆర్ అండ్ ఆర్, భూమికి భూమి, ఇతరత్రా పునరావాస పనులు అన్నీ కేవలం 20 శాతం మాత్రమే పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చూసుకుంటే, జూన్ 2021 నాటికి కాఫర్ డ్యాంను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యం మేరకు జూన్ 2021 నాటికి రెండు కాఫర్ డ్యాంలు పూర్తి చేయాలంటే, అందుకు అనుగుణంగా నిర్వాసిత గ్రామాల్లో అందరినీ కూడా పూనరావాసం కల్పించాలని అన్నారు. వాళ్ళను గ్రామాల్లో నుంచి పంపిస్తేనే ఈ నిర్మాణాలు చేయగలమని అన్నారు.

polavaram 22122020 2

ఎగువ కాఫర్ డ్యాం కానీ, దిగువ కాఫర్ డ్యాం కానీ పూర్తయితే, ఆయా గ్రామాల్లోకి గోదావరి నీరు అంతా ఆ గ్రామాల్లోకి వెళ్తుంది కాబట్టి, ముందుగానే ఆ గ్రామాలను ఖాళీ చేయించాలని, అనుకున్న ప్లాన్ ప్రకారం, మొదట 35.5 కాంటూరు పరిధి నిర్వాసిత గ్రామాలను తరలించాలని అన్నారు. అలాగే రెండో విడతలో, 41.5 కాంటూరు నిర్వాసిత గ్రామాల ప్రజలను తరలించాలని, దీనికి ముందుగా వారికి పునరావాసం కల్పించాలని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖ పునరావాసం కార్యక్రమాలు వేగావంతం చేస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేసి ఖరీఫ్‌కు నీళ్లివ్వాల్సి ఉంది ఆయన తెలిపారు. ఈ మూడు రోజులు పర్యటన చేసి వాస్తవ పరిస్థితి తెలుసుకుంటున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ రేపు కూడా పశ్చిమ గోదావరిలో పర్యటిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి అనిల్ చెప్తున్న దానికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్తున్న దానికి చాలా తేడా కనిపిస్తుంది. 35.5 కాంటూరు పరిధిలోకి పునరావాసం ఇంకా పూర్తి చేయలేదు అంటే, ఎప్పటికి అవుతుందో మరి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చూద్దాం ఇప్పటికైనా వేగంగా పునరావాసం చేస్తారేమో.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్ర పరిస్థితితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ, తాము చేసేది తప్పు అని ఎవరు చెప్పినా, వారి పై ఏదో ఒక విధంగా పరువు తీసే పనులు చేస్తున్నారు. తప్పు ఎక్కడ జరిగింది, ఏది సరి చేసుకోవాలి అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తమకు ఎవరు అడ్డు చెప్పినా, వారి విమర్శలను పోజిటివ్ గా తీసుకోకుండా, నెగటివ్ గా తీసుకుంటున్నారు. చివరకు రాజ్యాంగ సంస్థలను కూడా వదిలి పెట్టటం లేదు. ఎన్నికల కమీషనర్ అయినా, శాసనమండలి చైర్మెన్ అయినా, చివరకు హైకోర్టు జస్టిస్ లు అయినా, ఇలాగే వ్యవహరిస్తున్నారు. కోర్టుల్లో తీర్పులు చెప్పే జడ్జిలను కూడా, పలానా కేసు నుంచి తప్పించాలని ఏకంగా ప్రభుత్వం పిటీషన్ వేసే పరిస్థితి వచ్చింది. మిషన్ బిల్డ్ ఏపి కేసులో, జస్టిస్ రాకేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన్ను విచారణ నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ వేసింది. అలాగే రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందో లేదో తేల్చాలి అని చెప్పే కేసులో కూడా జస్టిస్ రాకేశ్ కుమార్ ని విచారణ నుంచి తప్పించాలని కోరారు. దీంతో రాకేశ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను 29 ఏళ్ళ ప్రాక్టీస్ తరువాత, 2009లో హైకోర్ట్ జడ్జి అయ్యాను అని, అప్పటి నుంచి ఏ రిమార్క్ లేకుండా పని చేసానని, రిటైర్ అయ్యే వరకు ఇలాగే పని చేస్తానని అన్నారు. కెరీర్ చివరి దశలో ఇలాంటి పిటీషన్ లు తన పై వస్తాయని అనుకోలేదని అన్నారు.

hc 22122020 2

అయితే ఇదే సమయంలో జస్టిస్ రాకేశ్ కుమార్ ముందుకు మరో కేసు వచ్చింది. అదే ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు కేసు. గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కనిపించిన ప్రతి భవనానికి తమ పార్టీ రంగులు వేసేసారు. ఆ తరువాత ఈ విషయం కోర్టుకు వెళ్ళటంతో, మరో రంగు జోడించి, మార్చేసాం అని చెప్పారు. అయితే మళ్ళీ కోర్టు అక్షింతలు వేయటంతో, మొత్తానికి సున్నం పూసి, వేరే రంగులు వేసారు. ఇలా పార్టీ రంగులు వేయటం, మళ్ళీ వేరే రంగు వేయటం, మళ్ళీ సున్నం పూసి వేరే రంగులు వేయటం, ఇలా ఈ మొత్తం ఖర్చు 4 వేల కోట్ల వరకు అయ్యిందని, ఈ మొత్తం ఖర్చు అంతా సంబధిత అధికారులు నుంచి రాబట్టాలి అంటూ హైకోర్టులో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు జస్టిస్ రాకేశ్ కుమార్ ముందుకు రాగా, ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తన పై మరో పిటీషన్ వేసి, ఈ కేసు నుంచి తప్పుకోవాలని తనను కోరే అవకాసం ఉందని, ఈ పిటీషన్ చాలా తీవ్రమైనదిగా ఉందని, ఇప్పటికే తనను తప్పుకోవాలని రెండు పిటీషన్ లు వేసారని, ఇప్పుడు మరో సారి ప్రభుత్వం పిటీషన్ వేసే పరిస్థితి వద్దు అని, తన పరువు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నానని, అందుకే ఈ కేసు తన రిటైర్మెంట్ తరువాత, అంటే జనవరి మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. దీంతో తాను ఈ కేసు విచారణ చేయను అని చెప్పకనే చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాద్ ని నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ దానికి సంబందించిన జీవో జారీ చేసారు. 1987 బ్యాచ్ కి చెందిన ఆదిత్యానాద్ దాస్ ఈ నెల 31 మధ్యానం నుంచి కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీ నీలం సాహనీ కొనసాగుతున్నారు. ఆమె పదవీ కాలం ఈ నెల 31కి ముగుస్తుంది. అయితే ఇప్పటికే, నీలం సాహనీ పదవీ కాలం ఆరు నెలల క్రిందటే ముగిసినా కూడా, ఇప్పటికే రెండు సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించి, ఆ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగించటం జరిగింది. క-రో-నా కాలంలో ఇప్పుడు చీఫ్ సెక్రటరీని మార్చితే ఇబ్బంది వస్తుందని చెప్పి, ఆవిడ పదవీ కాలాన్ని పొడిగించారు. దీనికి కేంద్రం కూడా ఒప్పుకుంది. ఇక ఈ సారి ఆమె రిటైర్డ్ అవ్వటం అనివార్యం అవ్వటంతో, కొత్త చీఫ్ సెక్రటరీ పై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో మొదటి నుంచి ఆదిత్యానాద్ దాస్ పేరు ప్రముఖంగా వినిపించింది. జగన్ మోహన్ రెడ్డికి , ఆదిత్యానాద్ దాస్ కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో, వేరే వారు పోటీకి వచ్చినా, చివరకు చీఫ్ సెక్రటరీ పదవి ఆదిత్యానాద్ దాస్ కే దక్కింది. అందరూ భావించినట్టే, అందరి అంచనాలకు తగ్గట్టే, ఆదిత్యనాద్ ని కొత్త చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

nilam 22122020 2

అయితే పదవీ విరమణ చేస్తున్న నీలం సాహనీకి మాత్రం, ఆవిడ పదవి అయిపోయినా సరే జగన్ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నీలం సాహనీ పదవీ విరమణ అవ్వగానే, ఆమెను ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆమెకు జగన్ మోహన్ రెడ్డి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్ధం అవుతుంది. ఇక అలాగే మరి కొంత మంది ఐఏఎస్ అధికారులకు కూడా పోస్టింగ్ లు ఇచ్చారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారిగా ఉంటూ, జగన్ కేసుల్లో జైలుకు వెళ్ళిన అధికారి శ్రీలక్ష్మికి పురపాలకశాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఆమె మొన్నటి వరకు తెలంగాణా ప్రభుత్వంలో పని చేసేవారు. అయితే ఆమె సొంత రాష్ట్రానికి వెళ్ళిపోతానని చెప్పటంతో, ఏడాది ప్రయత్నాలు తరువాత కేంద్రం ఒప్పుకోవటంతో, గత వరామే ఆమె తెలంగాణా నుంచి ఏపి క్యాడర్ కు మారారు. దీంతో ఆమెకు కీలకమైన పురపాలకశాఖ కార్యదర్శిగా నియమించారు. ఇక జలవనరులశాఖ కార్యదర్శిగా మరో అధికారి శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. ఇక రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisements

Latest Articles

Most Read