దేశంలోని ఎంపీల పని తీరు ఆధారంగా, ప్రముఖ మీడియా పార్లమెంట్ ర్యాంకులు కేటాయించింది. అయితే ఈ ర్యాంకులు చూసుకుంటే, 22 ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, లోక్ సభ పెర్ఫార్మన్స్ లో టాప్ 100లో కేవలం ఒక్కరే నిలిచారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్ లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అందరికంటే నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఓవరాల్ గా రఘురామకృష్ణం రాజు పెర్ఫార్మన్స్ కి ఆయనకు 40వ స్థానం లభించింది. అలాగే లోక్ సభ పెర్ఫార్మన్స్ లో 53వ ర్యాంకు రాగా, నియోజవర్గం పెర్ఫార్మన్స్ లో ఆయనకు 72వ ర్యాంకు వచ్చింది. ఇక లోక్ సభ పెర్ఫార్మన్స్ లో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రెండో వ్యక్తిగా, మొత్తంగా లోక్ సభ పెర్ఫార్మన్స్ లో 57వ ర్యాంకు తెచ్చుకున్నారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, మన రాష్ట్రం నుంచి, మూడో వ్యక్తిగా లోక్ సభ పెర్ఫార్మన్స్ లో నిలిచారు. మొత్తంగా లోక్ సభ పెర్ఫార్మన్స్ లో 98వ ర్యాంకు తెచ్చుకున్నారు. టాప్ 100 లోక్ సభ పెర్ఫార్మన్స్ లో, వైసీపీ రెబెల్ ఎంపీ తప్పితే ఎవరూ లేరు. ఇక తెలుగుదేశం పార్టీలో మాత్రం, ఉన్న ముగ్గురిలో ఒకరికి 57వ ర్యాంకు, మరొకరికి 98వ ర్యాంకు వచ్చింది.
మరో ఎంపీ అయిన కేశినేని నానికి, లోక్ సభ పెర్ఫార్మన్స్ లో 198వ ర్యాంకు వచ్చింది. ఇక వైసీపీ గురించి చూస్తే, లోక్ సభ పెర్ఫార్మన్స్ లో టాప్ 100లో రఘురామకృష్ణం రాజుని తీసేస్తే ఎవరూ లేరు. 147వ ర్యాంకుతో వంగా గీతా ఉన్నారు. ఆ తరువాత 166 వ ర్యాంకుతో లావు కృష్ణదేవరాయులు ఉన్నారు. ఆ తరువాత 181 స్థానంలో బాలసౌరి ఉన్నారు. 188 వ ర్యాంకులో తలారి రంగయ్య, 192వ ర్యాంకులో కోటగిరి శ్రీధర్ ఉన్నారు. ఇక అతి దారుణమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన వారిలో, నందిగం సురేష్, 427వ స్థానంలో ఉన్నారు. ఆ తరువాత అతి దారుణమైన ర్యాంకు, 413తో చింతా అనురాధ, ఆ ఆతరువాత 400వ ర్యాంకుతో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా చెప్పాలి అంటే, లోక్ సభ పెర్ఫార్మన్స్ లో వైసీపీ అతి దారుణంగా పెర్ఫాం చేసింది. తమ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు లేకపోతే, అసలు టాప్ 100లో చోటు కూడా దక్కేది కాదు. అలా మిగతా 21 మంది పరువు, రఘురామకృష్ణం రాజు కాపాడారు అనే చెప్పాలి. ఇక తెలుగుదేశం నుంచి ముగ్గురిలో, ఇద్దరు టాప్ 100లో ఉన్నారు. ఇలా ఉంది మన ఎంపీల పని తీరు. అనేక విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి, ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి లాంటి విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. అయినా మన ఎంపీలు, ఇలా పని చేస్తున్నారు.