వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, అణిచివేత విచ్చలవిడిగా మారడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారింది. పోలీసులలో కొందరు నేరాల రేటు తగ్గించి శాంతిభద్రతలు కాపాడటానికి బదులుగా, ప్రజల ప్రాధమిక హక్కులను అణిచేయడంపైనే శ్రద్ద చూపడం విడ్డూరం. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వమే అసమ్మతిని అణిచేయడం హాస్యాస్పదం. ప్రతిపక్షాల గొంతు నొక్కేయడంలో పోలీసుల్లో కొందరు అధికార వైసిపితో కుమ్మక్కు కావడం విచారకరం. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలు ఏడాది పూర్తయిన సందర్భంగా 17డిసెంబర్ 2020న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పోలీస్ నోటీసులు జారీ చేయడమే అందుకు తార్కాణం. బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కారాదని, ఏ కార్యక్రమంలో పాల్గొనరాదని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే ఈ నోటీసులు..17డిసెంబర్ 2020న పోలీసులు జారీచేసిన ఈ నోటీసులు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ), 19(1)(బి) మరియు 19(1)(డి) స్ఫూర్తిని కాలరాయడమే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 600మంది టిడిపి నాయకులకు ఈ నోటీసులను ఇచ్చారు, ఎటువంటి అసమ్మతిని తెలియజేయరాదని హెచ్చరించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తమ అసమ్మతిని తెలియజేసి శాంతియుత ఆందోళనల ద్వారా మన స్వాతంత్ర్య యోధులు మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించారనేది ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా వెలిబుచ్చే అసమ్మతిని అణిచేయడానికి బదులుగా శాంతిభద్రతల పరిరక్షణపై మీరు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగ హామీగా సంక్రమించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ బాధ్యత మీ రాజ్యాంగ విధి.
news
రాష్ట్రపతి, సుప్రీం కోర్టు సీజేకు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ...
ప్రతి రోజు మీడియా ముందు కనపడి, రాజధాని రచ్చబండ పేరుతో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు, ప్రభుత్వం తీరు పై , వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో అభిప్రాయలు చెప్పే వారు. అయితే ఈ మధ్య ఆయన సైలెంట్ అయ్యారని అందరూ అనుకున్నారు. నిజానికి ఎంపీ రఘురామకృష్ణరాజుకి హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆయనకు జరిగిన వైద్య పరీక్షల్లో, స్వల్ప తేడా గమనించి, గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుని, ఇప్పుడిప్పుడే మళ్ళీ తనదైన శైలిలో సమస్యల పై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణం రాజు, తన ఆపరేషన్ అయిన తరువాత చేసిన మొదటి పని, అమరావతి రైతులు తరుపున నిలబడటం. మూడు ముక్కలు చేసి, అమరావతి రైతులకు గుండె కోత మిగిల్చిన ప్రభుత్వ తీరును ఆయన వ్యతిరేకించారు. అయితే ఈ క్రమంలో రాజధాని రైతులు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల చీఫ్ జస్టిస్ లను మార్చుతూ, కొలీజియం సూచనలు చేసింది. ఈ లిస్టు లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ మహేశ్వరీ కూడా ఉన్నారు. అయితే ఆయన కీలకమైన అమరావతి కేసు కూడా వాదిస్తున్నారు.
రెండు నెలల క్రితం నుంచి అమరావతి కేసు రోజు వారీ విచారణ కూడా జరుగుతుంది. మరో నెల రోజుల్లో సంక్రాంతి పండుగ అయిన తరువాత, ఈ కేసు పై హైకోర్టు ఒక తీర్పు ఇస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో, ఆయన బదిలీ వార్తలు వచ్చాయి. మళ్ళీ కొత్త చీఫ్ జస్టిస్ వస్తే, కేసు మళ్ళీ మొదటి నుంచి వినాల్సి వస్తుంది. దీనిపైనే ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రపతికి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి ఒక లేఖ రాసారు. అమరావతి కేసు తీర్పు వచ్చే వరకు మహేశ్వరీ గారినే చీఫ్ జస్టిస్ గా ఉంచాలని కోరారు. ఇది రైతులతో ముడిపడిన అంశం అని, ఇప్పటికే అనేక మంది మనోవేదనతో చనిపోయారని, మళ్ళీ ఇప్పుడు చీఫ్ జస్టిస్ మారిపోయి, కేసు మళ్ళీ మొదటి నుంచి రావాలి అంటే జాప్యం జరుగుతుందని, దీన్ని నివారించేందుకు ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఈ కేసు విచారణ అయ్యి, తీర్పు ఇచ్చేంత వరకు ఉంచాలని కోరారు. కొత్తగా వచ్చే చీఫ్ జస్టిస్ పై పూర్తి నమ్మకం ఉందని, మళ్ళీ ఈ కేసు మొదటి నుంచి మొదలు పెడితే, తీవ్ర జాప్యం జరిగి, ఇక్కడ ఉన్న 29 వేల కుటుంబాలు మరింత ఆవేదనకు లోనవుతారని, అందుకే ఈ లేఖ రాస్తున్నట్టు, రాష్ట్రపతిని, చీఫ్ చీఫ్ జస్టిస్ ని కోరారు.
సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమీషనర్... ఈ పరిణామాలు రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తాయా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందా ? రాజ్యాంగ సంస్థల మధ్య ఘర్షణ వైఖరి, ఎటు దారి తీస్తుంది ? మొన్న శాసనమండలి, నిన్న కోర్టులు, ఈ రోజు ఎన్నికల కమిషన్, ప్రతి రాజ్యాంగ సంస్థతో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరితో, ఘర్షణ వాతావరణం ఇప్పుడు బహిరంగం అయిపొయింది. మొన్నటి దాకా మాటల వరుకే పరిమితం అయిన ఈ చర్యలు ఇప్పుడు, చర్యల వరకు వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఎలా వ్యావహరిస్తుందో అందరికీ తెలిసిందే. ప్రత్యెక ఆర్డినెన్స్ తెచ్చి మరీ ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ ను టార్గెట్ చేసి, ఆయన పదవి పోయేలా చేసింది. అయితే ఆయన న్యాయ పోరాటం చేసి, హైకోర్టు, సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి, మళ్ళీ ఎన్నికల కమీషనర్ గా నియమించబడ్డారు. అయితే తరువాత హైకోర్టు ఆదేశాల మేరకు, ఎన్నికల ప్రక్రియ పై ముందుకు వెళ్లి, అన్ని రాజకీయ పార్టీలతో, ప్రభుత్వంలో ఉన్న అధికారలుతో సమీక్ష జరిపి, ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే దీని పై ప్రభుత్వం ససేమీరా అంటుంది. చివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్, హైకోర్టు ఆదేశాలు కూడా జత చేసి, చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి, తమకు సహకరించాలని కోరినా, ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు.
ఇంకా చెప్పాలి అంటే నిమ్మగడ్డ తాను కలెక్టర్ ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని, దానికి ఏర్పాట్లు చేయాలని చెప్పినా, చీఫ్ సెక్రటరీ రెండు సార్లు పట్టించుకోలేదు. ఇక ప్రభుత్వం కూడా కోర్ట్ కు వెళ్ళింది. ఫిభ్రవరిలో ఎన్నికలు జరపలేం అని క-రో-నా వైరస్ కారణం ఒకసారి, వ్యాక్సిన్ కారణం ఒకసారి చెప్పి కోర్టులో కేసు వేసారు. ఇది విచారణలో ఉంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం లేకపోవటంతో, నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, ఒక రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమీషన్, ఒక రాష్ట్ర ప్రభుత్వం పై కోర్టు ధిక్కరణ కేసు వేసింది. దీనికి సంబంధించి హైకోర్టులో పిటీషన్ వేసారు ఎన్నికల కమీషనర్. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ప్రభుత్వం లేఖలకు స్పందించటం లేదని, చీఫ్ సెక్రటరీ స్పందన సరిగా లేదు అంటూ, ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలని ఏకంగా కోర్టు ధిక్కరణ కింద పిటీషన్ వేయటం చర్చకు దారి తీసింది. ఇలా రాజ్యాంగ సంస్థల మధ్య పోరుతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరకు ఎటు పోతుందో అర్ధం కావటం లేదు. ప్రభుత్వం ఒకసారి జరుగుతున్న పరిణామాలు సమీక్ష చేసుకుని, రాజ్యాంగ సంస్థలను గౌరవించాల్సిన పరిస్థితి రావాలని కోరుకుందాం.
ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం విచ్చిన్నం జరిగిందో లేదో తేలుస్తాం అంటూ, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పై, వాటిని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపీల్ చేసింది. రాజ్యాంగం విచ్చిన్నం జరిగిందో లేదో తెలుస్తాం అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు వెనక్కు తీసుకోవాలని ఏపి ప్రభుత్వం అభ్యర్ధించింది. అసలు రాజ్యాంగం విచ్చిన్నం జరిగిందో లేదా అనేది అసలు సమస్య కాదని, పిటీషన్ లో తెలిపారు. రాజ్యాంగం విచ్చిన్నం జరిగిందో లేదో తేల్చాల్సింది రాష్ట్రపతి అని, హైకోర్టుకు సంబంధం లేదని సుప్రీంలో వాదించారు. దీని పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‍ఏ బోబ్డే ధర్మాసనం విచారణ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసు పై సెలవులు తరువాత అత్యసరంగా విచారణ జరుపుతాం అని కోర్టు చెప్పింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. మొత్తానికి ఈ అంశం పై ఏపి ప్రభుత్వానికి ఊరట లభించింది.