నిన్న బులుగు మీడియా, పేటీయం సోషల్ మీడియాలో, లోకేష్ ని తిట్టారు అంటూ, ఒక ఫేక్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో అచ్చేన్నాయుడు లోకేష్ ని తిట్టాడని, పార్టీని తిట్టాడు అంటూ, మార్ఫింగ్ వీడియో ఒకటి బులుగు మీడియా తిప్పింది. అయితే నిన్నే దీని పై అచ్చేన్నాయుడు క్లారిటీ ఇస్తూ, వైసీపీని వాయించి పడేస్తే, ఈ రోజు సాక్షి మీడియా సాక్షిగా, అందరూ చూస్తూ ఉండగా లోకేష్, ఆ మార్ఫింగ్ వీడియో పై వాయించి పెట్టారు. ఈ రోజు , తిరుమల వెంకన్న సాక్షిగా లోకేష్ ప్రమాణం కోసం అలిపిరి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ అలిపిరి వద్ద, లోకేష్ మీడియాతో మాట్లాడారు. అయితే యధావిధగా అక్కడ వచ్చిన సాక్షి మీడియా, వివేక కేసు పై కాకుండా, నిన్న బులుగు మీడియాలో వచ్చిన ఫేక్ వీడియో పై లోకేష్ ని ప్రశ్నించారు. నిన్న వెంకట్ అనే మీ కార్యకర్త వీడియో బయటకు వచ్చింది, అందులో మిమ్మల్ని కూడా తిట్టారు కదా, దీని పై మీ సమాధానం ఏమిటి అంటూ, సాక్షి విలేఖరి అడిగారు. దానికి లోకేష్ ఘాటుగా బదులు ఇచ్చారు. మా కార్యకర్తలను మేము పట్టించుకున్నట్టు ఎవరైనా పట్టించుకున్నారా అని సాక్షి విలేఖరిని ప్రశ్నించారు. మాది కార్యకర్తల పార్టీఅని, కార్యకర్తలకు విలువ ఇచ్చే పార్టీ అని, కార్యకర్తల సంక్షేమ నిధి అని, పెట్టి వారికి సహాయం చేస్తున్నాం అని, ఏ పార్టీ అయినా అలా చేస్తుందా అని ప్రశ్నించారు.

lokesh 14042021 2

కార్యకర్తల కోసం 90 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేసామని, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో చదువుకున్న పిల్లలు, ఐఏఎస్ లు అయిన వారు ఉన్నారని అన్నారు. మీ రాజశేఖర్ రెడ్డి, చం-పే-సి-న మా కార్యకర్తల పిల్లలను ఇక్కడ చదివిస్తున్నాం అని, మీరా మమ్మల్ని కార్యకర్తలకు ఏమి చేయటం లేదు అని అడిగేది అంటూ, సాక్షి విలేఖరి పై ఫైర్ అయ్యారు. ఆ వీడియో ఏంటో, అనేది తేలుస్తాం అని అన్నారు. అయితే నిన్న ఆ వీడియోలో ఉన్న వెంకట్ అనే వ్యక్తి ఏదో వ్యాపారంలో, ఎవరికో డబ్బులు విషయంలో, ఏదో తేడా వస్తే, అది సెటిల్ చేయమని చంద్రబాబు చుట్టూ, లోకేష్ చుట్టూ, బాలయ్య చుట్టూ తిరగటం, వాళ్ళు ఇలాంటివి పట్టించుకోరు కాబట్టి, నేను 30 ఏళ్ళ నుంచి సేవ చేశా, పార్టీకి ఖర్చు పెట్టా, ఇప్పుడు నన్ను పట్టించుకోవటం లేదు అంటూ గొడవ గొడవ చేసాడు. అసులు చంద్రబాబు ఇలాంటి సెటిల్మెంట్ లు చేసే వాడని, ఈయన ఎలా అనుకున్నాడో ఏమో, ఈయన్ను పట్టుకుని ఒక వీడియో తీసుకుని, దాన్ని ఎడిట్ చేసి, నిన్న బులుగు మీడియాలోకి వదిలి సంబరపడ్డారు.

టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పినట్టే చేసారు. ఏడవ తారిఖు తిరుపతి ప్రచారంలో విసిరిన సవాల్ కు తగ్గట్టుగానే, ఆయన ఈ రోజు తిరుపతి నుంచి అలిపిరి వచ్చారు. అలిపిరి దగ్గర వివేక హ-త్య లో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసారు. వెంకటేశ్వర స్వామీ సాక్షిగా అలిపిరిలో ప్రమాణం చేసిన లోకేష్, ఇప్పుడు ఈ హ-త్య ఎవరు చేసారో ప్రజలకు అర్ధమవుతుందని అన్నారు. అంతకు ముందు లోకేష్ గంటకు పైగా అలిపిరి సర్కిల్ లో కూర్చున్నారు. తాను చేసిన సవాల్ కు కట్టుబడి, వెంకన్న పాదాల దగ్గరకు వచ్చానని, జగన్ మోహన్ రెడ్డి మాత్రం నేను సవాల్ విసిరిన తరువాత తప్పించుకున్నారని అన్నారు. ఇప్పటికైనా మించి పోయింది లేదని, తాడేపల్లిలో జగన్ ఇంటిలోనే హేలిపేడ్ ఉందని, ఇక్కడకు 45 నిమిషాల్లో రావచ్చు అని, ఆయన వస్తాను అంటే, ఇక్కడే నేను ఎదురు చూస్తానని సవాల్ విసిరారు. ఈ రోజుతో ఈ విషయం తేలిపోవాలని అన్నారు. నారాసుడి చరిత్ర అంటూ, చంద్రబాబు గారి ఫోటోలు వేసి, తన బాబాయ్ ని మేము వేసిసినట్టు చెప్పారని, అందుకే ఈ రోజు అసలు విషయం ఏమిటో వెంకన్న సాక్షిగా తెల్చేద్దాం అంటూ లోకేష్ సవాల్ చేసారు. లోకేష్ తో పాటుగా, అచ్చెంనాయుడు, ఇతర సీనియర్ నేతలు కూడా, అక్కడే గంట పాటు ఎదురు చూసారు.

ln 14042021 2

గంట పాటు ఎదురు చూసినా, అటు జగన్ రెడ్డి కానీ, వైసీపీ నేతలు కానీ, ఎవరూ రాకపోవటంతో, లోకేష్ మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ, గంట పాటు వీరి కోసం ఎదురు చూసామని, ఒక్కరు కూడా వైసీపీ నుంచి మా సవాల్ స్వీకరించేందుకు సిద్ధంగా లేరని, అందుకే ఇక్కడ వరకు రాలేదని అన్నారు. వారు రకాపోయినా, తమకు నీతి నిజాయతీ, దమ్ము ధైర్యం ఉన్నాయి కాబట్టి, వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని, తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని ప్రమాణం చేసారు. జగన్ మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావటం లేదని అన్నారు. ఒక చెల్లిని హైదరాబాద్ లో వదిలేస్తే, ఇంకో చెల్లి ఢిల్లీలో న్యాయం చేయాలని కోరుతుందని, ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయాలని వాడు, ఈ రాష్ట్రానికి ఏమి చేస్తాడని ప్రశ్నించారు. మా పై అనవసరంగా నిందలు వేసారని, ఛాలెంజ్ చేస్తే మాత్రం పారిపోయారని లోకేష్ అన్నారు. ఈ దెబ్బతో, ప్రజలకు వివేక గారి కేసు విషయంలో క్లారిటీ వచ్చిందని లోకేష్ అన్నారు.

నిన్న చంద్రబాబు తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఉండగా, చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని రాళ్ళ దా-డి జరిగిన విషయం తెలిసిందే. దీని పై చంద్రబాబు నిన్న ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీని పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయమే చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు వచ్చి, అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని, చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించారు. ఈ రోజు అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా తమ విచారణ పై ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. తమకు చంద్రబాబు పై దా-డి జరిగినట్టు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేసారని చెప్పారు. అయితే తమకు ఈ ఘటనకు సంబంధించి, ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు దొరకలేదని చెప్పారు. ఈ ఘటన పై విచారణ చేసామని, అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆధారాలు లబించలేదని చెప్పారు. చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమెండోస్, వ్యక్తిగత సిబ్బందిని కూడా విచారణ చేసామని చెప్పారు. అలాగే నిన్న ఘటనలో ఇద్దరు కార్యకర్తలు కూడా గాయపడ్డారని, వారిని కూడా విచారణ చేసామని చెప్పారు. వారిని ఘటనా స్థలం వద్దకు తీసుకుని వచ్చి, ఎటు నుంచి రాళ్ళు పడ్డాయి, ఏమి జరిగింది, ఇలా మొత్తం వివరాలు సేకరించి, సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసామని మీడియాకు తెలిపారు.

kantilala 13042021 2

అక్కడ ఉన్న సిసి టీవీ ఫూటేజ్ లు పరిశీలించమని, మీడియా దగ్గర ఉన్న ఫూటేజ్ కూడా పరిశీలిన చేసామని చెప్పారు. అలాగే చంద్రబాబు ప్రచార వాహనంతో పాటు, ఆయన వాహన శ్రేణిని కూడా పరిశీలన చేసామని అన్నారు. అయితే తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకేలేదని అన్నారు. ఘటనకు సంబంధించి ఆధారాలు ఉంటే, తమకు అందచేయాలనీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. తమ పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎంత వరకు ఫోర్సు కావాలో, అంత వరకు సెక్యూరిటీ ఉందని అన్నారు. తమకు అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదని, విచారణ కొనసాగుతుందని, తెలుగుదేశం వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. మరో పక్క తెలుగుదేశం నేత నరసింహ యాదవ్​కు తిరుపతి పశ్చిమ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిన్న జరిగిన ఘటనకు సబందించి ఆధారాలు ఇవ్వాలని, రెండు రోజుల్లో తమ వద్దకు వచ్చి, హాజరు కావాలని నోటీసులో తెలిపారు. మొత్తానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబునే, పోలీసులు ఆధారాలు ఇవ్వమని అడగటం కొసమెరపు.

వివేకానందరెడ్డి కేసువిచారణలో సునీతమ్మ ఢిల్లీకేంద్రంగా చేసిన ఆరోపణలపై సీబీఐ ఎందుకు దృష్టిసారించడం లేదని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో పూలు, పాలు, పండ్లు అమ్మేవాళ్లను విచారిస్తున్న సీబీఐ, కేసులో ప్రజలందరూ అనుమానిస్తున్న అసలు అనుమానితులను, సునీతమ్మ చేసిన ఆరోపణలపై ఎందుకు విచారించడంలేదో సమాధానం చెప్పాలని రఫీ డిమాండ్ చేశారు. హ-త్య-తో తమ కుటుంబసభ్యలు ప్రమేయం ఉందని సునీతమ్మ అనుమానం వ్యక్తంచేశారని, వై.ఎస్. భాస్కర్ రెడ్డి, కడప ఎంపీగా ఉన్న వై.ఎస్. అవినాశ్ రెడ్డిలపైనే అనుమానంగా ఉందని ఆమె స్పష్టంగా చెప్పాక కూడా సీబీఐ వారిని ఎందుకు విచారించడం లేదన్నారు? సునీతమ్మ అనుమానించిన వ్యక్తులకు సీబీఐ తక్షణమే లైడిటెక్టర్, నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని టీడీపీ తరుపున తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. పూలు పాలు, పండ్లు అమ్మేవాళ్లను విచారించాల్సిన అవసరంలేదని, ఒక పెద్ద రాజప్రాసాదంలో కుట్రతో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన విచారణలో జాప్యం చేయడమేంటన్నారు. వివేకాను చం-పి-న-వా-రె-వ-రు, శ-వా-ని-కి కుట్లువేసిన వారెవరు.... ర-క్త-పు మడుగుని తుడిచిందెవరు అనేటువంటి అనుమానాలు ప్రజలందరిలోఉన్నాయన్నారు. శ-వా-ని-కి కుట్లువేసిందిఎవరు... ఎవరి అవసరాల కోసం, ఎవరి ప్రయోజనాలకోసం ఆయన ఆపనిచేశాడో సీబీఐ ఎందుకు తేల్చలేక పోయందని రఫీ డిమాండ్ చేశారు. హ-త్య జరిగితే శ-వా-న్ని ఎక్కడి దాన్నక్కడే ఉంచాలని, కానీ దాన్ని మంచం మీదకు మార్చడం, కుట్లువేయడం జరిగిపోయిం దన్నారు. అవన్నీ ఎవరుచేశారనే విచారణలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని రఫీ అభిప్రాయపడ్డారు.

మాజీమంత్రి ఆదినారాయణరెడ్డికి హ-త్య-తో సంబంధముం దని, విజయమ్మ తనలేఖలో ప్రస్తావించడం జరిగిందని, దానికి ఆయన హ-త్య-తో తనకు సంబంధమున్నట్లు నిరూపిస్తే, ఉ-రే-సు-కుం-టా-న-ని బహిరంగంగానే సవాల్ విసరడం జరిగిందన్నారు. అదేమాదిరిగా సునీతమ్మ చెప్పిన భాస్కర్ రెడ్డి, వై.ఎస్. అవినాశ్ రెడ్డి హ-త్య-తో తమకు సంబంధంలేదని ఎందుకు చెప్పలేకపోతు న్నారని రఫీ నిలదీశారు. తండ్రీ, కొడుకులైన భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు హ-త్య-తో తమకు సంబంధమున్నట్లు రుజువుచేస్తే, తాముకూడా ఉ-రే-సు-కో-వ-డా-ని-కి సిద్ధమని ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు? హ-త్య జరిగినప్పుడు నిజానిజాలు నిగ్గుతేల్చడానికి చంద్రబాబునాయడు సిట్ ను నియమిస్తే, హైకోర్ట్ ద్వారా దాన్ని జగన్మోహన్ రెడ్డే అడ్డుకున్నాడని, ఆ విషయం బూతులమంత్రి కొడాలినానీకి, విజయమ్మకు తెలియదా అని రఫీ ప్రశ్నించారు. సిట్ విచారణ కాదు, సీబీఐ విచారణకావాలని కోరిన జగన్మోహన్ రెడ్డి, తరవాత సీబీఐ విచారణకోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఎందుకు వెనక్కు తీసుకున్నాడో చెప్పాలన్నారు. వివేకా -కే-సు వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి తెలుసునని, ఆయన 14వతేదీన సీబీఐ విచారణకు హాజరవుతారని అందరూ అనుకుంటున్నారని, ఆయన సీబీఐ ముందు హాజరవుతున్నారో లేదో సమాధానం చెప్పాలన్నారు. తిరుపతిలోని రేణిగుంటలో తాను హజరుకావాల్సిన సభను కూడా ముఖ్యమంత్రి అందుకు రద్దుచేసుకున్నాడని ప్రజలందరూ అనుకుంటున్నారన్నారు.

Advertisements

Latest Articles

Most Read