ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్‌కు కొత్త ముఖాలను పరిచయం చేయాలన్న ఆసక్తితో ఉన్నారు. మంత్రి మండలిలో ఈసారి జెడియు, వైఎస్సార్సీ, ఎఐఎడిఎంకెలను కూడా చేర్చాలన్న యోచనలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్లో జరిగే కేబినెట్ విస్తరణ కార్యక్రమంలో ఈ పార్టీలు సూచించిన ప్రతినిధులకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని విస్తృతంగా వినిపిస్తోంది. మూడు మిత్రపక్షాలను భాగస్వాములను చేయడం ద్వారా తమ బలం మరింతగా చాటుకోవాలని చూస్తున్నారని ప్రచారం సాగుతుందో. అక్టోబరులోనే బీహార్ ఎన్నికలకు వెళుతోంది. పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ లో ముగుస్తాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నందున మోడీ కేబినెట్లో అన్ని రాష్ట్రాల ప్రస్తావన వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు నడ్డా రెండు గంటలపాటు ఇదే సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. ఢిల్లీ ఫలితాలు వెలువడిన రోజే ప్రధాని మోడీతో వీరిరువురూ సమావేశం నిర్వహించి బిజెపి వునఃప్రక్షాళనకు సంబంధించిన ముసాయిదా నివేదిక అందించారని చెవుతున్నారు.

సహజంగానే అనేకమంది పార్టీ సీనియర్ నాయకులను నడ్డా కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా సర్దుబాటు చేసారు. కేంద్ర పార్లమెంటరీ బోర్డును కూడా మార్చిలోనే సంప్రదించి కొన్ని మార్పు లు, చేర్పులు చేయాలని నిర్ణయించారు. ఇదంతా బిజెపి అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ ప్రధాన మంత్రి కొత్త కేబినెట్ వైపు దృష్టిపెట్టారని తెలుస్తోంది. భారీఎత్తున కసరత్తులు ఉన్నప్పటికీ సీనియర్లను కూడా చేర్చుకోవాలన్న ప్రతిపాదన వస్తోంది. అయితే ఎవరిని బిజెపి సంస్థాగత పనులకు పంపించాలన్నది అర్థంకావడం లేదు. పాత ముఖాలు ఇప్పటికే వ్యతిరేకతను తెలుపుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే నరేంద్రమోడీ ఇప్పటికే తన టీమ్ స్థాయిని ఎలాంటి మార్పులు చేయకుండా ఇప్పటివరకూ ఒక రాజకీయ వేత్తగానే నెట్టుకొచ్చారు. కొత్త ముఖాలకు చోటు కల్పించేందుకు 45 ఏళ్లలోపు ఉన్న బిజెపి ఎంపిలకు కూడా చోటు కల్పించారు.

ఇక మన విషయానికి వస్తే, రెండు రోజుల క్రితం ఆకస్మికంగా ఢిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగతో ఏకాంతంగా సమావేశం అయ్యారు. మోడీ ఆయనను అమిత్ షాను కలవాలని కూడా సూచించారు. శుక్రవారం మరోసారి జగన్ న్యూఢిల్లీ వెళ్లి ఒక గంటపాటు అమిత్ షాతో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి కింద వైఎస్సార్సీకి స్థానం కల్పించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీకి 22 మంది ఎంపిలు లోకసభలో ఉన్నారు. వైఎస్సార్సీ నుంచి మిథున్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డిని జగన్ ప్రతినిధులుగా పంపిస్తుందన్న వార్తలు వెలువడుతున్నాయి. అందుకే జగన్ మోహన్ రెడ్డి, రెండు రోజుల వ్యవధిలోనే, ఢిల్లీ వెళ్ళారని, ప్రచారం జరుగుతుంది.

ఇటీవల సస్పెన్షన్‌ను గురైన ఆంధ్రప్రదేశ్ డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు న్యాయం చేయాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఏబీ వెంకటేశ్వరరావు తరపున సీని యర్ న్యాయవాది వై బాలాజీ వాదనలు వినిపిస్తున్నారు. ప్రతి వాదులుగా ఏపీ ప్రభుత్వాన్ని, డీజీపీని, కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. తనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన జీవో 18 చట్టవిరుద్ధ మని, ఏకపక్షమని, పక్షపాతంతో , నిబంధనలు ఉల్లంఘించి జీవో ఇచ్చారని, దానిని రద్దు చేసి తనపై విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను తొలగించాలని ఏబీ వెంకటేశ్వరరావు క్యాలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది మార్చి 10వ తేదీన తనను అదనపు డైరెక్టర్ జనరల్ హోదా నుండి డైరెక్టర్ జన రల్ ఆఫ్ పోలీసు హోదాకు పదోన్నతి కల్పించారని, అనం తరం 2018 ఏప్రిల్ 20న ఏసీబీ డీజీగా తనను నియమించా రని, తదనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో 2019 మే 31న రిలీవ్ చేసి సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారని, ఆనాటి నుండి తనకు పోస్టింగ్ ఇవ్వ లేదని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

గత ఏడాది మే 31 నుండి వేతనం చెల్లించడం లేదని, నిరాధార ఆరోపణలతో సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. రాజకీయ ఒతిళ్లతోనే తనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టులో తాను ఉండటాన్ని సహించలేకపోయారని పేర్కొన్నారు. భద్రతా ఉపకరణాల కొనుగోలుకు కమిటీ ఉంటుందని, అనంతరం ఆడిటింగ్ జరు గుతుందని అవన్నీ అయ్యాకనే డీజీ స్థాయి అధికారి వద్దకు సాధారణ సంతకం కోసం ఫైలు వస్తుందని పిటిషన్లో పేర్కొ న్నారు. ప్రజాప్రయోజనాల రీత్యా సస్పెండ్ చేసినట్లు పేర్కొ న్నారని ఇది సరికాదని చెప్పారు. 30 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ ఎలాంటి ఆరోపణలను తాను ఎదుర్కోలేదని, 2006లో ఇండి యన్ పోలీసు మెడల్, 2015లో ప్రెసిడెంట్ పోలీసు మెడల్ వచ్చిందని 2019లో అతి ఉత్కృష్ట సేవా పతకం కూడా దక్కిం దని పేర్కొన్నారు.

సెలవుపూట తన సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చా రని, దానికంటే ముందు ఎలాంటి దర్యాప్తు లేదా విచారణ తనపై జరగలేదని, ఇండియన్ పోలీసు సర్వీసు రూల్ను పాటించలేదని , 48 గంటల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉన్నా అలాంటిది ఏమీ జరగలేదని పేర్కొన్నారు. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండానే సస్పెండ్ చేయడం సరికాదని వెంకటేశ్వరరావు తన పిటిషన్లో పేర్కొ న్నారు. సస్పెన్షన్ జీవోను బహిర్గతం చేయడంతో అది అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చిందని, దాంతో తాను అనివా ర్యంగా ప్రకటన జారీ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ పిటీషన్ పై ఈ రోజు క్యాట్ విచారణ జరిపింది. ఏబీ వెంకటేశ్వర్ రావ్ క్యాట్ లో వేసిన పిటిషన్ 24 వ తేదీ కి వాయిదా వేసింది క్యాట్. ఏపీ ప్రభుత్వం తరపున దేశాయి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. డీజీ స్థాయి అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేసారు, డీజీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తే హోమ్ శాఖ కి ఇన్ఫార్మ్ చేశారా, ఐపీఎస్ అధికారికి మే 31 2019 నుంచి ఎందుకు జీతం ఇవ్వలేదు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్ ప్రశ్నించింది. దీని పై, వారం రోజుల సమయం ప్రభుత్వం అడగగా, విచారణ ఈ నెల 24 కి వాయిదా వేసింది క్యాట్.

ఈ రోజు ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. గత వారం రోజుల్లో, దేశంలో అందరి పై చేసిన ఐటి రైడ్స్ వివరాలు ఆ ప్రెస్ నోట్ లో ఉన్నాయి. గత వారంలో విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణే నగరాల్లో, 40 చోట్ల ఐటి రైడ్స్ చేసినట్టు ఆ ప్రెస్ నోట్ లో పెర్కుంది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, కడపలో తెలుగుదేశం నేత శ్రీనివాస్ రెడ్డి, అలాగే విజయవాడలో, చంద్రబాబుకి పర్సనల్ సెక్రటరీగా పని చేసిన, శ్రీనివాస్ పై, ఐటి రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. కడపలో శ్రీనివాస్ రెడ్డి, ఒక కాంట్రాక్టర్ కాబట్టి, ఆయన పై, రొటీన్ గా రైడ్స్ జరిగాయి. ఇక శ్రీనివాస్ మీద, జరిగిన ఐటి రైడ్స్ ప్రాముఖ్యత ఎందుకు వచ్చాయి అంటే, ఆయన చంద్రబాబుకి పర్సనల్ సెక్రటరీగా చేసారు కాబట్టి. అయినా, శ్రీనివాస్ ఒక అధికారి. మొన్నటి దాక చంద్రబాబు దగ్గర చేసారు, ఇప్పుడు వేరే డిపార్టుమెంటులో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇక విశాఖపట్నం, ఢిల్లీ, పూణే నగరాల్లో జరిగిన రైడ్స్ ముఖ్యంగా ఇన్ఫ్రా కంపెనీల పై జరిగాయి.

మూడు నాలుగు నెలల క్రితం, మేఘా కృష్ణా రెడ్డి పై ఎలా జరిగాయో, అలా జరిగాయి. ప్రెస్ నోట్ లో కూడా, అదే విషయం చెప్పారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన, మూడు ఇన్ఫ్రా కంపెనీల పై రైడ్స్ చేసినట్టు చెప్పారు. సోదాల్లో నకిలీ బిల్లులు, వగైరా దొరికాయని, సబ్ కాంట్రాక్టర్ ల పెరుతో అసలు వారే రిటర్న్స్ వేస్తున్నారు టాక్స్ ఎగ్గొడుతున్నారు అలా 2000 కోట్లు ఎగేసారు అని చేసిన రైడ్స్ ఇవి. ముఖ్యం గా తెలంగాణ కి చెందిన కంపెనీలు కొన్ని ఆంధ్ర తెలంగాణ లో పని చేసిన కంపెనీలు ఉన్నాయి. ఇక పొతే చంద్రబాబు మాజీ పీఎస్ పై, చేసిన ఐటి దాడులు వివరాలు ఒకే ఒక లైన్ లో రాసారు. ఆయన కూతురు పెళ్లి కోసం, తెచ్చుకున్న బంగారం, తప్ప అక్కడ ఏమి దొరకేలేదు అని సమాచారం.

వివరాలు ఇలా ఉంటే, వైసీపీ మాత్రం, ఈ మొత్తం రైడ్ లు అన్నీ, చంద్రబాబుకి లింకే పెట్టేసి, ఆనంద పడుతున్నారు. అయితే, ఇక్కడ చంద్రబాబు ప్రస్తావనే లేదు. తెలంగాణా, ఇన్ఫ్రా కంపెనీలకు, చంద్రబాబుకి ఏమి సంబంధం ఉంటుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం, చంద్రబాబు మాజీ పీఎస్ మీద ఐటి దాడులు చేసామని. ఇది పట్టుకుని, ఈ రెండు వేల కోట్లు చంద్రబాబు అక్రమంగా చేసినట్టు, హడావిడి చేస్తూ, తమ సొంత మీడియాలో డబ్బా కొడుతూ, తమ పిచ్చి గొర్రెలను సంతోష పెడుతున్నారని టిడిపి వాపోతుంది. ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ, చంద్రబాబు వెంట్రుక కూడా వెళ్ళు పీకలేరని, రాజశేఖర్ రెడ్డే ఏమి చెయ్యలేక, కూర్చున్నారని అంటున్నారు. 2018 నుంచి, 2019 వరకు కేంద్రంలోని మోడీ, అమిత్ షా, చంద్రబాబు పై ఫుల్ ఫోకస్ పెట్టారని, ఏ అవినీతి ఆధారాలు దొరక్క, జగన్ తో చేతుల కలిపి, చంద్రబాబుని దెబ్బ తీసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమి లేని విషయన్ని, ఉన్నదిగా చెప్పి సంతోష పడటం, వారి నైజం అని, వారికి ఇది కొత్తేమీ కాదని టిడిపి నేతలు అంటున్నారు.

టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, యనమల రామకృష్ణుడు, వైసిపి, సాక్షి మీడియా చేస్తున్న ప్రచారం పై విరుచుకుపడ్డారు. 16 నెలలు చిప్ప కూడు తిని, కండీషనల్ బెయిల్ పై తిరిగే వాళ్ళా మమ్మల్ని అనేది అంటూ ధ్వజమెత్తారు. యనమల మాట్లాడుతూ "పిఏలు, పిఎస్ లకు, పార్టీకి సంబంధం ఏం ఉంటుంది..? పిఎస్ శ్రీనివాస్ కు టిడిపితో ఏం సంబంధం ఉంటుంది..? అతనొక ప్రభుత్వ అధికారి మాత్రమే. ఆయనపై దాడులు అతని వ్యక్తిగతం. వాటిని టిడిపికి ముడిపెట్టడం కావాలని బురద జల్లడమే. 40ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10-15మంది పిఎస్ లు, పిఏలు పని చేశారు. మాజీ పిఎస్ పై దాడులు జరిగితే పార్టీకి అంటగట్టడం హేయం. దేశవ్యాప్తంగా 40చోట్ల దాడులకు టిడిపికి సంబంధం ఏంటి..? అక్రమాస్తుల కేసుల నుంచి ‘‘తాను తప్పించుకోవడం..ఎదుటివాళ్లపై దాడులు చేయడమే’’ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు. టిడిపిపై ఫిర్యాదులు చేసేందుకే విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా చేసింది కూడా టిడిపిపై ఫిర్యాదుల కోసమే.. జగన్ షెల్ కంపెనీల సృష్టికర్త విజయసాయి రెడ్డే. వాటిని కప్పిపుచ్చుకోడానికే ఢిల్లీ స్థాయి పదవులు ఇచ్చారు. తన తరఫున పైరవీలకు, టిడిపిపై ఫిర్యాదులకే ఢిల్లీలో విజయసాయి రెడ్డిని పెట్టారు. జగన్ రూ 43వేల కోట్ల అక్రమాస్తుల విచారణ తుదిదశకు చేరింది. రూ 4వేల కోట్ల జగన్ ఆస్తులను ఈడి జప్తు చేసింది. ట్రయల్స్ కు హాజరు కాకుండా జగన్ అందుకే ఎగ్గొడుతున్నారు. శిక్ష తప్పదని తెలిసే ట్రయల్స్ ను అడ్డుకుంటున్నారు. 8ఏళ్లుగా సిబిఐ, ఈడి ఎంక్వైరీకి అడ్డంకులు పెడుతున్నారు. కోర్టుకు హాజరు కాకుండా పదేపదే మినహాయింపులు కోరేది అందుకే. "

"హైకోర్టులో సిబిఐ పిటిషన్ కు జగన్ ముందు జవాబు ఇవ్వాలి. ఎక్కడో ఎవరో మాజీ పిఎస్ పై రెయిడ్స్ కు టిడిపికి అంటగట్టడం ఏంటి..? రివర్స్ టెండర్ కాంట్రాక్ట్ మీరిచ్చిన ఇన్ ఫ్రా కంపెనీపై దాడికి, టిడిపికి సంబంధం ఏంటి..? తెలంగాణలో ఇన్ ఫ్రా కంపెనీపై దాడికి టిడిపికి సంబంధం ఏంటి..? రెయిడ్స్ జరిగిన ఇన్ ఫ్రా కంపెనీకే కాంట్రాక్ట్ లు మీరివ్వలేదా..? 16నెలలు జైలు, 16ఛార్జిషీట్లు ఉన్న మీకా నైతిక హక్కు ఎక్కడిది..? మీ రూ 43వేల కోట్ల అవినీతి సంగతి తేల్చు ముందు..? మీ మీద ఆరోపణలు ముందు నిగ్గు తేల్చుకోండి.. ఏడాదిలో విచారణ పూర్తి చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. మీరెందుకు 8ఏళ్లుగా అడ్డుకుంటున్నారు..? వాయిదాలకు మినహాయింపులు ఎందుకు అడుగుతున్నారు. పదేపదే పిటిషన్లు ఎందుకు పెడుతున్నారు..? 8ఏళ్లుగా కేసులు తప్పించుకుని తిరిగేవాళ్లు టిడిపిని విమర్శించడం దారుణం. టిడిపి, వైసిపి ఏది ఎలాంటి పార్టీయో ప్రజలందరికీ తెలిసిందే. టిడిపి నిప్పులాంటి పార్టీ, నీతి నిజాయితీలున్న పార్టీ."

"తప్పుడు పనులు చేసే పార్టీ టిడిపి కాదు. సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ టిడిపి. అందుకే 40ఏళ్లుగా ప్రజల గుండెల్లో ఉంది. తప్పుడు పనుల్లో నుంచి పుట్టిన పార్టీ వైసిపి. అక్రమార్జన కాపాడుకోడానికి పెట్టిన పార్టీ వైసిపి. ఎన్నికల సంస్కరణలు రావాలి, పొలిటికల్ రిఫామ్స్ రావాలి అన్న పార్టీ టిడిపి. రూ 500, రూ 1,000 నోట్లు రద్దు చేయాలని కోరిన పార్టీ తెలుగుదేశం. గత ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీలో వైసిపి రూ 30కోట్లు ఖర్చు పెట్టిందని వాళ్ల నేతలే చెప్పారు. అధికారంలో ఉండి కూడా టిడిపి డబ్బులకు ఇబ్బందులు పడిందని అన్నారు. చంద్రబాబుపై గతంలోనే 26ఎంక్వైరీలు వేశారు. సభా సంఘాలు, న్యాయ విచారణలు, సిబిసిఐడి అన్నీ చేశారు. ఎందులోనూ వాళ్ల ఆరోపణలు రుజువు చేయలేక పోయారు. ఏనాడన్నా జగన్ అవినీతిపై సాక్షి పత్రిక రాసిందా..? సాక్షి ఛానల్ ప్రసారం చేసిందా..? సిబిఐ, ఈడి కౌంటర్ పిటిషన్ల గురించి చెప్పిందా..? చంద్రబాబు మాజీ పిఎస్ పై దాడులకు ఇచ్చిన ప్రాధాన్యం, జగన్ ఆస్తుల ఈడి జప్తుపై ఇచ్చిందా..? జగన్ 43వేల కోట్ల అవినీతిపై సిబిఐ అఫిడవిట్ పై సాక్షి రాసిందా..? అదే సాక్షికి, ఇతర మీడియాకు ఉన్న వ్యత్యాసం..? టిడిపిపై సాక్షి మీడియా, వైసిపి నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తున్నాం. దీనిని మానుకోకపోతే న్యాయ పరంగా చర్యలు తీసుకుంటాం." అని యనమల రామకృష్ణుడు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read