రాజధాని తరలింపు, సీఆర్డీఏ బిల్లుల్ని అసెంబ్లీలో మందబలంతో ఆమోదించిన అధికారపార్టీ మండలిసాక్షిగా ఛైర్మన్‌పై దూషణలకు దిగుతూ, దాడికి ప్రయత్నించిందని టీడీపీసీనియర్‌నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు వాపోయారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో సహచర ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అశోక్‌బా బు, మంతెన సత్యనారాయణరాజులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మండలిలో రూల్‌-71పై చర్చ జరుగుతుండగానే, ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి లాబీల్లో కూర్చొని సైగలుచేస్తూ కనిపించాడన్నారు. మండలి సభ్యుల్ని కొనుగోలు చేయడానికి వచ్చిన విజయసాయి, పవిత్రమైన పెద్దలసభను కొనుగోలు కేంద్రంగా మార్చాడని బచ్చుల మండిపడ్డారు. అధికారపార్టీసభ్యులు, మంత్రులతో కలిసి, ఛైర్మన్‌ షరీఫ్‌ను ఒత్తిడికి గురిచేస్తూ, లేనిదాన్ని తమకు అనుకూలంగా చేయాలంటూ బెదిరింపులకు పాల్పడటం విజయసాయికే చెల్లిందన్నారు. ఛైర్మన్‌ బాత్రూమ్‌కు వెళ్లినా వదలకుండా, షరీఫ్‌ రెండుచేతులు పట్టుకొని ఆయన్ని ప్రలోభాలకు గురిచేశాడన్నారు. మంత్రులుకూడా వీధిరౌడీలను మరిపించేలా, ఛైర్మన్‌ చేతిలోని కాగితాల్ని చించిపారేసి, ఆయనముందున్న బల్లపైకెక్కి విధ్వంసం సృష్టించారని అర్జునుడు తెలిపారు. నిబంధనలపేరుతో, తప్పుడు బిల్లుల్ని ఆమోదించుకోవడానికి దుష్టఆలోచనలతో మంత్రులు చేయాల్సిన దాష్టీకాలన్నీ చేశారన్నారు. బెయిల్‌పై తిరుగుతున్న విజయసాయిరెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌ లోకి వెళ్లి, ఆయన్ని బెదిరించాడన్నారు.

బిల్లులో ఉన్న తప్పులన్నింటినీ ఛైర్మన్‌హోదాలో షరీఫ్‌ కూలంకషంగా విశదీకరించినా కూడా మంత్రులు వెనక్కుతగ్గలేదన్నారు. వైసీపీ సభ్యులంతా నిజంగా ప్రజాస్వామ్యవాదులైతే, విజయసాయిరెడ్డి చర్యలను సమర్థించరని బచ్చుల తేల్చిచెప్పారు. జేబులుకొట్టేవాళ్లు, బ్లాక్‌టిక్కెట్లు అమ్మేవాళ్లు, దాదాగిరీ చేసేవా ళ్లు రాష్ట్రానికి మంత్రులయ్యారని, వారు మాట్లాడేభాష, హావభావాలు నీచాతినీచంగా ఉన్నాయన్నారు. నిన్న ఇద్దరిని కొన్నాం.. ఈరోజు మరో ఇద్దరిని కొంటున్నాం..మీరేమి చేయలేరంటూ మండలిసాక్షిగా ప్రతిపక్షసభ్యులను బెదిరించిన విజయసాయి బెయిల్‌ని తక్షణమే రద్దుచేయాలని అర్జునుడు డిమాండ్‌చేశారు. విశాఖలో పొలాలుకొన్నంత తేలిగ్గా, మండలిలో ప్రతిపక్షపార్టీ సభ్యుల్ని కొనాలన్న తాపత్రయం ఏ2లో అడుగడుగునా కనిపించిందన్నారు. అధికారపార్టీ ఎంతగా భయపెట్టి నా, మంత్రులు ఎన్నిరకాలుగా దూషించినా, ఎక్కడా భయపడకుండా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నిలిచిన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడుకాదని, తమపార్టీ, తమనాయకుడు నేర్పిన సభ్యత, సంస్కారం వల్లనే తామె వరమూ హద్దులు మీరడంలేదన్నారు.

ఒకపథకం ప్రకారమే మండలిలో జరిగేది బయటప్రపంచానికి తెలియకుండా చేశారని, కరెంటు తీసేసి, చీకట్లో తమపై దాడికికూడా యత్నించారని, ఘోరమైనభాష ప్రయో గిస్తూ తమను దూషించారని టీడీపీ ఎమ్మెల్సీదీపక్‌రెడ్డి తెలిపారు. మండలిలో ఏం జరుగుతుందో తెలియకూడదనే ప్రత్యక్షప్రసారం ఇవ్వకుండా, ప్రసారమాధ్యమాలను నిలిపివేశారన్నారు. ప్రజలమనోభావాల ప్రకారం ముందుకెళ్లాలని టీడీపీ సభ్యులు సూచిస్తే, దానికి విరుద్ధంగా వైసీపీమంత్రులు మండలిలో రౌడీయిజం చేశారన్నారు. ఛైర్మన్‌ ఛాంబర్‌లోకి వెళ్లి, ఆయన్ని అనరాని మాటలన్నారని, మతంపేరుతో ఆయన్ని దూషించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వారికి ప్రజలెలా ఓట్లేశారో తెలియడం లేదన్నారు. పాలకులుగా ఉండి అధికారపార్టీవారు చేస్తున్న దారుణాలను ప్రజలంతా గమనించాలన్నారు. విజయసాయి సైగచేయగానే మంత్రులంతా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా తమపైకి దూసుకొచ్చారని దీపక్‌రెడ్డి వాపోయారు.

మండలిలో రాజ్యాంగఉల్లంఘన జరిగిందని మొసలికన్నీరు కారుస్తున్న మంత్రిబొత్స సత్యనారాయణకు చట్టం గురించి ఏం తెలుసునని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు పార్లమెంట్‌లో చట్టాలుచేసినప్పుడు లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లుల్ని రాజ్యసభలో అనేకమార్లు తిరస్కరించడం జరిగిందని, అంతమాత్రాన దేశచరిత్రలో ఎన్నడూకూడా రాజ్యసభఛైర్మన్‌పై దాడులకు యత్నించిన ఉదంతాలు లేవన్నారు. భారతరాజ్యాంగం నుంచే చట్టాలు ఏర్పడ్డాయని, ఆచట్టాలనుమించే అధికారం ఎవరికీ ఉండదనే విషయా న్ని అధికారపార్టీసభ్యులు తెలుసుకోవాలన్నారు. అసెంబ్లీకి ఉండే అధికారమే మండలికి కూడా ఉంటుందని, ఫైనాన్స్‌బిల్లులను ఆమోదించినంతతేలిగ్గా జనరల్‌బిల్లుల్ని ఆమోదిం చడం సాధ్యపడేదనే విషయాన్ని బొత్స గ్రహించాలన్నారు. 151మందితో బిల్లుని అమోదించే అధికారం అసెంబ్లీకి ఉన్నట్లే, బిల్లులను తిరస్కరించే అధికారం మండలికి ఉంటుందనే ఇంగితం సీనియర్‌మంత్రినని చెప్పుకుంటున్న బొత్సకు లేకపోవడం విచారకరమన్నారు. రూల్‌-71పై చర్చించాకే ఇతరబిల్లులు చర్చించాలని తాముకోరామ ని, అన్నిపార్టీలు అభ్యంతరాలు తెలిపినా, అసెంబ్లీలో ఏకపక్షంగా ఎస్సీ కమిషన్‌బిల్‌ని, ఇంగ్లీషుమీడియం బిల్లుని ఎలా ఆమోదించారో సమాధానంచెప్పాలని అశోక్‌బాబు ప్రశ్నించారు.

ఒక్కరోజులోనే హడావిడిగా, ఆఘమేఘాలపై రాజధాని తరలింపు, సీఆర్డీఏరద్దు బిల్లుల్ని అసెంబ్లీలో ఏవిధమైన చర్చలేకుండా, 10గంటల్లోనే ఎలా అమోదించారన్నారు. బిల్లుని రిజెక్ట్‌చే యమని అధికారపార్టీ సభ్యులే ఒత్తిడిచేశారని, మండలిలో రిజెక్ట్‌చేస్తే ఆవంకతో తిరిగి అసెంబ్లీలో ఫైనాన్స్‌బిల్‌గా ఆమోదముద్ర వేయించుకోవచ్చన కుటిలఆలోచన వారిలో ఉందన్నారు. చట్టప్రకారమే నడుచుకోవాలని ఛైర్మన్‌కు సూచించాము తప్ప, ఎవరు, ఏవిధమైన ఒత్తిడి చేయలేదన్నారు. బెయిల్‌పై తిరుగుతున్న వ్యక్తి, మండలిఛైర్మన్‌ ఛాంబర్‌లోకి వెళ్లి, ఆయన్ని బెదిరించడం జరిగిందన్నా రు. అసెంబ్లీ కార్యదర్శి తప్పుచేస్తే, అతనిపైచర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. బీజేపీ, పీడీఎఫ్‌, ఇతరపార్టీలుకూడా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన బిల్లులపై మండలిలో అభ్యంతరాలు వ్యక్తంచేశాయన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లిందన్న ఉక్రోషంతో, మంత్రులంతా హద్దుమీరి ప్రవర్తించారన్నా రు. విజయసాయి కౌన్సిల్‌లాబీల్లో కూర్చోవడం ఏమిటని అశోక్‌బాబు ప్రశ్నించారు. ఉదయం సభప్రారంభం నుంచి, రాత్రి 9వరకు బెయిలపై ఉన్నవ్యక్తి అసెంబ్లీ ఛైర్మన్‌ ఛాంబర్‌లో ఉండటం ఎలాంటి చట్టమో బొత్స చెప్పాలన్నారు. 22మంది మంత్రులు మండలిలో చేయాల్సిన యాగీ అంతా చేశారని, వారు వాడిన పదాలు వింటే సభ్యసమాజం తలదించుకుంటుందని, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గ్యాలరీలో ఉండి మండలిలో తమసభ్యులు ఏంచేయాలో పర్యవేక్షణ చేశారన్నారు. లోకేశ్‌ని, ఇతర సీనియర్‌ ఎమ్మెల్సీలను అనరాని మాటలు అన్నారని, ప్రజలకోసం, రాష్ట్రభవిష్యత్‌కోసమే తామందరం, అధికారపార్టీ దారుణాలను నిలువరించామన్నారు. ముఖ్యమంత్రి అనుభవంలేకుండా మూర్ఖత్వంతో వ్యవహరిస్తుంటే, మంత్రులేమో ఎవరిమాటవినకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారన్నారు.

అనుకున్నదే అయ్యింది. తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన మండలి ఉండటానికి వీలు లేదు అంటూ, మండలి రద్దుకి దాదపుగా జగన్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం, అసెంబ్లీలో ఈ విషయం పై నిర్ణయం తీసుకుందామని జగన్ అన్నారు. దీనికి స్పీకర్ తమ్మినేని సీతారం కూడా ఒకే చెప్పారు. అంతకు ముందు జగన్ మండలి పై, అసెంబ్లీలో మాట్లాడారు. అసలు ఈ రాష్ట్రానికి మండలే అవసరం లేదని, మనకు అసెంబ్లీలోనే ఎంతో మంది మేధావులు ఉన్నారని, వీళ్ళు మంచి సలహాలు ఇస్తారని అన్నారు. మండలిలో సలహాలు ఇవ్వాల్సింది పోయి, కుట్రలు చేస్తున్నారని మండలి పై మండి పడ్డారు. మండలి కోసం, ఏడాదికి 60 కోట్లు ఖర్చు అవుతుందని, అసలు మండలి ఎందుకు అని జగన అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మండలి లేదని, కేవలం 6 రాష్ట్రాలకే ఉందని జగన్ అన్నారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని ప్రలోభ పెట్టారని జగన్ అన్నారు. అలాగే చైర్మెన్ పై కూడా జగన్ వ్యాఖ్యలు చేసారు. ఆయన చట్టం తో కాకుండా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారని అన్నారు.

jagan 23012020 2

నిన్న కూడా జగన్ మోహన్ రెడ్డి, మండలిలో ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మండలిలో చర్చ జరిగిన బిల్లులపై సెలక్ట్ కమిటీకి వెళ్ళాచ్చా అనే అంశంపై ఆరా తీశారు. బుధవారం రాత్రి ఆయన అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మండలిలో బిల్లును ఆమోదింప చేసుకోవడంలో విఫలమైనప్పటికి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. మండలి వ్యవహారాన్ని ఆషామాషిగా తీసుకోకుడదని ఖచ్చితంగా విపక్షానికి బుద్ధి చెప్పాలని ఆయన ప్రణాళికలు రచించారని లీక్లు ఇచ్చారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మంత్రులు, అధికార పార్టీ ముఖ్య నాయకులంతా మండలిలో తిష్ట వేసినా విపక్షాన్ని ఎదుర్కొలేక పోయామని ఇటువంటి పరిస్థితు ల్లో మండలిలో బలమున్న టిడిపిని ఎలా బలహీనపరచాలా..? అన్న అంశంపై కూడా సీఎం జగన్ సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.

jagan 23012020 3

అదే విధంగా ప్రస్తు తం సెలక్ట్ కమిటీకి వెళ్ళిన బిల్లును పరిస్థితి ఏమిటీ..? వాటిని మార్చే అధికారం కమిటీకి ఉంటుందా..? లేక అదే రూపంలో వాటిని ఆమో దించాలంటే ఎంత సమయం పడుతుంది..? గతంలో ఆ రకంగా ఆమోదించిన బిల్లులు ఏమైన ఉన్నాయా..?ఉంటే సెలక్ట్ కమిటీని ఎలా ఎదుర్కో వాలి..? అన్న కోణంలో కూడా ఆయన ఆరా తీశారు. ఒకవేళ మూడు నెలల తర్వాత సెలక్ట్ కమిటీ కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటే ఏం చేయాలి..? ఈ లోపు అభివృద్ధి వీకేంద్రీకరణ అంశంపై ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా..? అందుకోసం న్యాయ నిపుణుల సలహా క వాడా తీసుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం వెళుతున్నట్లు తెలుస్తోంది. అసలు మండలి రద్దు ప్రతిపాదన పెడితే ఎలా ఉంటుందన్న ఓ సీనియర్ నేత అభిప్రాయంపై కూడా సీఎం జగన్ లోతుగా ఆలోచన చేసినట్టు తెలిసింది. నిన్న రాత్రి చ్ప్పినట్టే, ఈ రోజు జగన్ మండలి రద్దు ప్రతిపాదన తీసుకొచ్చారు.

కాసేపట్లో హైకోర్టులో ఏపీ రాజధాని, సీఆర్డీఏ రద్దు పిటిషన్ల విచారణ జరగనుంది. దీంతో ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. పిటిషన్ల విచారణకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. మొత్తం ఐదు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గి వాదించనున్నారు. అయితే ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని, హైకోర్టుకు చేరుకున్నారు. నిన్న హైకోర్ట్ లో, ఏపీలో అమరావతి తరలింపు, 3 రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టిం ది. వికేంద్రీకరణ బిల్లు రైతుల న్యాయబద్ధమైన ప్ర యోజనాలకు విరుద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపింది. న్యాయ సమీక్ష విధానంలో సమాజ ప్రయోజనాలకు భంగం కలిగే విధానాలను అడ్డుకునే అధికారం కోర్టుకు ఉందని స్పష్టం చేసింది. వికేంద్రీ కరణ, సీఆర్డీఏ బిల్లులపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని, ఆ బిల్లులపై పూర్తి నివేదిక సమర్పించాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది.

court 23012020 2

పిటిషన్‌పై తదుపరి విచారణను గురువారం చేపట్టనున్నట్లు వెల్లడించింది. అంతకుముందు వాదనలు వినిపించిన లాయర్ అశోకభాను.. ప్రభుత్వాలు మారినంత మాత్రాన స్టేక్ హోల్డర్లతో చేసుకున్న ఒప్పందాలు మారవని, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా రాజధాని వికేం ద్రీకరణ బిల్లు తెచ్చారని, కోర్టుకు వివరించారు. సీఆర్డీఏ చట్టం రద్దును కొట్టివేయాలని కోరారు. చట్టసభల ఆమోదం పొందిన తరువాతే వికేంద్రీక రణ ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం తరఫున ఏజీ కోర్టుకు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు గతప్రభుత్వంలో ఇచ్చిన హామీల కంటే అదనపు ప్రయో జనాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసిందన్నారు. ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును సోమవారం అసెంబ్లీలో పాస్ చేసింది.

court 23012020 3

ఈ బిల్లు ప్రస్తుతం శాసన మండలిలో ఉంది. ఈ లోగా బిల్లు ఆమోదాన్ని సవాల్ చేస్తూ 37 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక, 3 రాజధానుల కేసు వాదనకు ముకుల్ ని మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టులో దాఖలైన కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభు త్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహల్లిని నియమించింది. ముకుల్ ఫీజు కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తుగా రూ. కోటి అడ్వాన్స్ గా చెల్లించేందుకు అనుమతిలిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అమరావతి తరలింపు కేసులను ముకుల్ పర్యవేక్షణలో ఎదుర్కొవాలని ఏజీకి సర్కారు స్పష్టం చేసింది. మొత్తానికి, ఇప్పుడు అందరి దృష్టి, హైకోర్ట్ లో చెప్తారు అనే విషయం పై, ఉత్కంఠ నెలకొంది.

సోషల్ మీడియాలో సంచలన ఫోటోలు తిరుగుతున్నాయి. నిన్న శాసనమండలిలో, మంత్రులు, వైసీపీ సభ్యులు, బెంచీలు, కుర్చీలు ఎక్కి, మండలి చైర్మెన్ ను బెదిరుస్తున్న ఫోటోలు ఉన్నాయి. బొత్సా బెంచీ ఎక్కి చైర్మెన్ పై వేలు చూపిస్తూ ఉండగా, కొడాలి నని, కుర్చీ ఎక్కి, మండలి చైర్మెన్ ని బెదిరిస్తున్నట్టు ఆ ఫోటోలలో ఉంది. ఎవరు తీసారో కాని, ఈ ఫోటోలు, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిన్న లోకేష్ ఫోన్ ఉపయోగించి, తమను ఫోటోలు తీస్తున్నారని, మంత్రులు లోకేష్ పై దాడి చెయ్యబొగా, లోకేష్ అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి. బహుసా ఇవి లోకేష్ తీసిన ఫోటోలు ఏమో అని, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మొత్తానికి, నిన్నటి నుంచి వైసీపీ మంత్రులు చెపుతున్నని అన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. ఈ ఫోటోలను చూస్తే, ఈ రోజు వార్తా పత్రికల్లో, మండలి చైర్మెన్ ను మంత్రులు బెదిరించారు అనే న్యూస్ నిజమే ఏమో అని అనిపిస్తుంది. నిన్న కరెంటు తీసి, వైఫై తీసి, లైవ్ ప్రసారాలు ఆపేసింది ఇందుకేనా అనే అనుమానం కలుగుతుంది.

botsa 23012020 2

నిన్న, రాజధానుల వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా శాసన మండలిలో ఉద్రిక్త పరిస్థి తులో చోటు చేసుకున్నాయి. ఒక దశలో పోడియం వద్దకు కొంత మంది మంత్రులు దూసుకువచ్చారు. పోడియం వద్ద మంత్రులకు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మంగళవారం అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లు లపై బుధవారం మండలిలో చర్చ జరిగింది. అనంతరం ఈ బిల్లు లను ఆమోదించాలని మంత్రులు ప్రతిపాదించారు. అయితే దీనిని టీడీపీ సభ్యులు విభేదించించారు. ఈ బిల్లులకు సవరణలు ప్రతిపా దిస్తూ, సెలక్ట్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. మండ లిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రెండు బిల్లులకు వేర్వేరుగా సవరణలతో సెలక్ట్ కమిటీకి పంపాలని సవరణ లను సోమవారమే చైర్మనకు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠపై ప్రభావం చూపించే బిల్లులని, రాజధాని తరలింపు అంటే జోక్ కాదని వ్యాఖ్యానించారు. మండలిలో 22 మంది మంత్రులకు ఏమి పని అని ప్రశ్నించారు. సభ్యులైన ఇద్దరు మంత్రులు మినహా మిగిలిన వారిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు.

botsa 23012020 3

ఈ దశలో మండలి చైర్మన్ షరీఫ్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ రూల్ 71పై చర్చ సందర్భంగా అసాధారణ నిర్ణయం తాను తీసుకు న్నానని వివరించారు. నోటీపై చర్చ తరువాత రెండు బిల్లులను ప్రవే శపెట్టాలనుకున్నానని తెలిపారు. సెలక్ట్ కమిటీకి సవరణలను ఎమ్మెల్సీ అశోక్ బాబు తనకు ఇచ్చారని తెలిపారు. చైర్మన్ ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోడియంలోకి దూసుకువెళ్లి, చైర్మన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో మిగిలిన మంత్రులు కూడా పోడియం లోకి దూసుకువెళ్లారు. వెలను చుట్టుముట్టి చైర్మన్ పై అధికార పక్ష మంత్రులు ఒత్తిడి తేవడాన్ని గమనించిన టీడీపీ సభ్యులు కూడా పోడియంలోకి వచ్చారు. సెలక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యులు, ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని మంత్రలు నినాదాలు చేయడం ప్రారంభిం చారు. మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స తది తరులు టీడీపీ సభ్యులు బుద్దా వెంకన్న, లోకేష్ తదితరులపైకి దూసుకువచ్చారు. ఈ దశలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

botsa 23012020 4

మంత్రి రంగనాథరాజు, మోపిదేవి జోక్యం చేసుకుని మంత్రులను అడుకుని తోపులాట నుంచి బయటకు తీసుకువచ్చారు. టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తుం డగా, మంత్రులు, ఇతర వైకాపా సభ్యులు చైర్మనను వాదనకు దిగారు. దీనిని గమనించిన టీడీపీ సభ్యులు చైర్మన్ పై దాడి చేయవ ద్దంటూ నినాదాలు చేశారు. ఈ దశలో యనమల జోక్యం చేసుకుని సభ్యులు కాని వారిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు. 22 మంది మంత్రులకు మండలిలో పని ఏమిటని ప్రశ్నించారు. మండలి కార్యకలాపాలు చూసేందుకు చంద్రబాబు వచ్చారని అధికార పక్షం, వైకాపా నేతలూ వచ్చారని ప్రతిపక్షం పరస్పర విమర్శలు చేసుకోవ డంతో సభలో గందరగోళం నెలకొంది. ఎవరు ఏమి మాట్లాడుతు న్నారో తెలియని స్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు బిల్లు లను సెలక్ట్ కమిటీకి పంపాలని, సరైన సమయంలోనే తాము సవర ణలు ఇచ్చామని తెలిపారు. చైర్మన్ తప్పు చేస్తే, తమ తప్పు లేదని తెలిపారు. సెలక్ట్ కమిటీ పంపండంపై ఓటింగ్ నిర్వహించాలని పట్టు బట్టారు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదాలు, నినాదాలతో సభలో గంద రగోళం నెలకొంది. సభలో ఆర్డర్ లో లేనందున 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

Advertisements

Latest Articles

Most Read