అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యుల్ని స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో సీఎం జగన్ మాట్లాడుతుండగా తెదేపా సభ్యులు పోడియం వద్దకు వచ్చి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. దీంతో సీఎం జగన్ స్పందిస్తూ ఉద్దేశపూర్వకంగానే తెదేపా సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారని.. ఆ పార్టీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు సూచించారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన లేచి సస్పెండ్ చేయాల్సిన సభ్యుల పేర్లు చదివి వినిపించారు. అనంతరం స్పీకర్ సభ నుంచి తెదేపా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుకి మాట్లాడే అవకాసం ఇవ్వకుండా, పదే పదే అడ్డు పడుతూ, గంటన్నర మాట్లాడారు అంటూ అసత్యాలు చెప్పినందుకు, టిడిపి ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే, వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చెయ్యటంతో, అసెంబ్లీ లాబీల్లో నేల పైన కూర్చుని, చంద్రబాబుతో సహా నిరసన.
నేల పైన కూర్చుని నిరసన తెలుపుతున్న చంద్రబాబు సహా, టిడిపి ఎమ్మెల్యేలు. ఇక్కడ ఉండ కూడదు అని లాగేసిన మార్షల్స్. టిడిఎల్పీ నుంచి కూడా వెళ్ళిపోవాలని, మార్షల్స్ దౌర్జన్యం. దీంతో బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు. సియం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు అసెంబ్లీ ప్రాంగణం మెయిన్ గేట్ వద్దకు బయల్దేరిన టీడీపీ శాసనసభ్యుల బృందం. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా చంద్రబాబు మౌనదీక్ష. శాసనసభ ప్రధానద్వారం వద్ద ఒక్కడే మెడలో నల్లకండువతో చంద్రబాబు. టీడీపీ ఎమ్మెల్లేలను నిరంకుశంగా సభనుంచి సస్పెండ్ చేయడంపై చంద్రబాబు నిరసన. సస్పెండ్ అయినా సభ్యులకు సంఘీభావంగా మెట్లపై చంద్రబాబు బైఠాయింపు. ఇరవై నిముషాలుగా చంద్రబాబు బైఠాయింపు.
అంతకు ముందు చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ను చేతులు జోడించి వేడుకున్నారు. ‘‘అమరావతిని ఆపేశారు. పెట్టుబడులు తరలిపోతున్నాయి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. చిన్నవాడైనా ముఖ్యమంత్రికి రెండు చేతలెత్తి దండం పెడుతున్నా. రాజధానులపై పునరాలోచన చేయండి. తొందరపడొద్దు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాలేదు. కడపకిచ్చినట్లు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా నిధులు ఇస్తే మరింత సంతోషిస్తా. అంతే తప్ప రాజకీయంగా వెళితే మీకూ, రాష్ట్రానికి నష్టం. భూములిచ్చిన రైతులు గురించి ఆలోచించండి’’ అని చంద్రబాబు అన్నారు.