భిన్న ధృవాలు ఏకమయ్యాయి. ఆత్మీయ ఆలింగనంతో మనస్పర్థలు తొలగిపోయాయి. ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య భేదాభిప్రాయాలకు జలీల్‌ఖాన్‌ కుమార్తె, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షబానా ఖాతూన్‌ తెరదించారు. ఆమె మంగళవారం మాజీ మేయర్‌ మల్లికా బేగం నివాసానికి వెళ్లి మద్దతు కోరారు. షబానాను ఆహ్వానించిన మల్లికా బేగం ఆత్మీయ ఆలింగనం చేసుకుని, షబానా నోరు తీపి చేసి, ప్రచార విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓటుతో పాటు ప్రచారంలో మద్దతును కూడా ఇవ్వాలని మల్లికాబేగంను షబానా కోరారు. ఓటు కోసం ఒక నాడు తాను కూడా ఎన్నో గుమ్మాలు ఎక్కి దిగానని, తప్పక మద్దతునిస్తానని మల్లిక మాట ఇవ్వడంతో టీడీపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది.

aadala 16032019

ఫత్వాతోనే విభేదాలు... జలీల్‌ఖాన్‌, మల్లికా బేగం మధ్య 2004లో ఫత్వా వివాదం మొదలైంది. ముస్లిం మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని ముస్లిం మత పెద్దలు అప్పట్లో జారీ చేసిన ఫత్వాకు జలీల్‌ మద్దతు పలికినా మల్లికాబేగం పెద్దగా స్పందించలేదు. తరువాత జలీల్‌ఖాన్‌ సైతం ఆ ఫత్వాను పట్టించుకోకపోయినా ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇదంతా 15 ఏళ్లనాటి మాట. అదే ఫత్వా వివాదం మరోసారి మల్లికా బేగం, షబానాల మధ్య ఇటీవల మళ్లీ తలెత్తింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న షబానా మంగళవారం భర్త జమీర్‌తో కలిసి వెళ్లి, మల్లికాబేగంను కలిశారు. వారిని ఆత్మీయంగా ఆహ్వానించిన మల్లికా బేగం ఆలింగనంతో ఆశీర్వదించారు. అనంతరం మద్దతుగా ప్రచారానికి రావడంపై కూడా హామీ ఇచ్చారు.

aadala 16032019

లగడపాటి మార్క్‌ సయోధ్య.. మల్లికాబేగంను కలిసే విషయమై జలీల్‌ఖాన్‌ సోమవారం లగడపాటి రాజగోపాల్‌ను కలిశారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం జలీల్‌ఖాన్‌ తనను కలవాలనుకుంటున్నారన్న సమాచారం లగడపాటి కార్యాలయం నుంచి మల్లికాబేగంకు అందింది. అందుకు తనకు అభ్యంతరమేమీ లేదని ఆమె తెలిపారు. దీంతో షబానా మల్లికాబేగంను కలుసుకున్నారు. ఇరు వర్గీయులు ఒక్కడవడం స్థానికంగా టీడీపీ కార్యకర్తల్లో ఆనందాన్ని నింపింది.

 

 

రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం. ఇక్కడి నుంచి పార్లమెంటుకు మహామహులు ప్రాతినిథ్యం వహించారు. తెన్నేటి విశ్వనాథం, పీవీజీ రాజు, భాట్టం శ్రీరామ్మూర్తి, కొమ్మూరు అప్పలస్వామి, ఉమాగజపతిరాజు, ద్రోణంరాజు సత్యనారాయణ, ఎంవీవీఎస్‌ మూర్తి, టి.సుబ్బిరామిరెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి వంటి వారు ఇక్కడి నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. తాజాగా కంభంపాటి హరిబాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా రాజకీయ నేపథ్యం కలిగి అనుభవం సాధించాక ఎన్నికైనవారే. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీకి దిగుతున్న ముగ్గురూ రాజకీయాలకు కొత్తవారే. తొలిసారిగా ఇక్కడ నుంచే పోటీ.. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థి మతుకుమల్లి శ్రీభరత్‌. విద్యావంతుడు. విదేశాల్లో చదువుకున్నారు. గీతం విద్యా సంస్థల బాధ్యతలు ఇటీవలె స్వీకరించారు.

aadala 16032019

తాతల నుంచి రాజకీయ వారసత్వం అందుకున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, పార్లమెంటులో వాణి వినిపించాలని గట్టిగా విశ్వసించే శ్రీభరత్‌ అనేక అడ్డంకులు అధిగమించి, పోరాడి టిక్కెట్‌ సాధించుకున్నారు. ఈయన తాతయ్య ఎంవీవీఎస్‌ మూర్తి గతంలో విశాఖ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్‌. డిగ్రీ చదువుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన చదువు పూర్తయిన తరువాత కొంతకాలం కాంట్రాక్ట్‌లు చేశారు. ఆ తరువాత విశాఖపట్నం వచ్చి సొంతంగా భవన నిర్మాణ రంగంలో దిగారు. ఎంవీవీ బిల్డర్స్‌ పేరుతో నగరంలో ఎక్కువ సంఖ్యలో అపార్ట్‌మెంట్లు నిర్మించారు. అలాగే సినిమా రంగం అంటే ఆసక్తి. సొంతంగా కొన్ని సినిమాలు నిర్మించారు. కొన్నింటిలో గెస్ట్‌ రోల్‌, మరికొన్నింటిలో విలన్‌గా నటించారు. దాదాపు ఏడాది క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీలో చేరి విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు.

aadala 16032019

విద్యావంతులు రావాలని... రాజకీయాల్లోకి విద్యావంతులు వస్తే దేశానికి మేలు జరుగుతుందనే భావనతో సీబీఐ పూర్వ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగు పెట్టారు. సొంతంగా ఒక పార్టీని పెట్టాలని భావించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అది ఫలితాలు ఇవ్వదని గుర్తించి తటస్థంగా ఉండిపోయారు. జనసేన నుంచి ఆహ్వానం రావడంతో అందులో చేరారు. రాజకీయాల ద్వారా సమాజంలో మార్పు తేవాలనేది ఆయన ఆలోచన. పోటీ ఇది తొలిసారే అయినా రాజకీయాలను అధ్యయనం చేశారు.

 

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా సిట్ అధికారులు కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసాన్ని బుధవారం మరోమారు తనిఖీ చేశారు. స్నానపు గది, పడక గదిని మైదుకూరు డీఎసీˆ్ప శ్రీనివాసులు పరిశీలించారు. మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిని విచారించారు. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? మృతికి సంబంధించిన సమాచారాన్ని మీకు మొదట ఎవరిచ్చారు? ఏ విధంగా చనిపోయినట్లు చెప్పారు? వంటి విషయాలను ఆరా తీసినట్లు సమాచారం. అలాగే వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డిని కూడా డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి సిట్‌ అధికారులు విచారించారు.

aadala 16032019

దర్యాప్తులో భాగంగా మంగళవారం సింహాద్రిపురం మండలంలోని దిద్దెకుంటకు చెందిన శేఖరరెడ్డి, అతని అనుచరులు నలుగురిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం శేఖరరెడ్డి భార్య లక్ష్మిదేవి విలేకర్లతో మాట్లాడారు. ‘వివేకాతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వివేకా అనుచరుడు పరమేశ్వరరెడ్డితో నా భర్తకు గతేడాది నుంచి మాటలు లేవు. లక్ష్మీనారాయణరెడ్డి అనే వ్యక్తి మాకు రూ.8 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. అతను ఎంతకూ ఇవ్వకపోవడంతో పరమేశ్వరరెడ్డి పంచాయితీ చేశారు. ఇందులో భాగంగా అతను రూ.5 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పడంతో..నా భర్త ఒప్పుకున్నారు.

aadala 16032019

ఆ నగదును లక్ష్మీనారాయణరెడ్డి... పరమేశ్వరరెడ్డికి చేతికి అందజేశారు. కానీ, ఆ డబ్బును తన భర్తకు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఇరువురి మధ్య మాటలు లేవు. డబ్బులు ఇవ్వాలని పరమేశ్వరరెడ్డికి నా భర్త పలుమార్లు ఫోనే చేసేవారు. ఈక్రమంలో నా భర్త తెదేపాలోకి చేరడంతో.. ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసి ఈ హత్య కేసులో ఇరికించే యత్నం చేస్తున్నారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ నెల్లూరు రూరల్‌ అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, జనసేన విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు చేసిన గేదెల శ్రీనివాస్‌ (శీనుబాబు) ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. హైదరాబాద్‌ కేంద్రంగా వచ్చిన ఒత్తిళ్లే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం దాకా ప్రచారం చేసిన ఆదాల.. ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లి, లోట్‌సపాండ్‌లో ప్రత్యక్షమయ్యారు. మంత్రి సోమిరెడ్డి వల్లే పార్టీని వీడాల్సి వచ్చిందన్న ఆ దాల ఆరోపణను ఎవ్వరూ నమ్మడంలేదు. అదే నిజమైతే, సోమిరెడ్డితో తన విభేదాల గురించి చంద్రబాబుకు ఎందుకు చెప్పలేదు? సమస్య పరిష్కరించాలని కోరి, పట్టించుకోకపోతే పార్టీ మారాలి. కానీ... ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లారు. తెల్లవారేసరికి లోట్‌సపాండ్‌లో తేలారు’ అని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఇదంతా హైదరాబాద్‌ కేంద్రంగా జరిగిన పన్నాగమేనని అంటున్నారు. రాజకీయేతర కారణాలతో తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగానే వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు లోక్‌సభ బరిలో దిగుతున్నారని చెబుతున్నారు. ‘లోక్‌సభకు పోటీచేసేది లేదని టీడీపీలో ఉండగా ఆదాల పలుమార్లు చెప్పారు. హైదరాబాద్‌లో జగన్‌ను కలిసి వచ్చాక.. ఎంచక్కా తల ఊపుతూ ఎంపీగా పోటీ చేసేందుకు అంగీకరించారు. దీనివెనుక ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం’ అని టీడీపీ నేత ఒకరు తెలిపారు.

‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆ రాష్ట్రంలోని మనవాళ్ల ఆర్థిక మూలాలపై దాడులు చేస్తున్నారు. వైసీపీకి సరెండర్‌ కమ్మని వేధిస్తున్నారు. ఏమనుకుంటున్నారు వీళ్లు..? ఇది రాజకీయమా..? ఇదా నీతి? ఇది ధర్మమా..? దీనికి సమాధానం చెప్పకుండా మాపై దాడులు చేయిస్తున్నారు. ఈ దాడులు మరింత పెంచే అవకాశం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళవారం కడప, అనంతపురం, కర్నూలుల్లో జరిగిన ఆయా జిల్లాల టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో సీఎం ప్రసంగించారు. ‘జగన్‌పై పన్నెండు కేసులు ఉన్నాయి. హిందూజాకు 100 ఎకరాలు అనుమతి కావాలంటే 11 ఎకరాలు జగన్‌ ఇవ్వాలని అడిగారు. ఆ భూమికి హిందూజానే డబ్బు ఇచ్చింది. ఇందుకోసం ఓ బోగస్‌ కమిటీని పెట్టి.. షెల్‌ కంపెనీలకు డబ్బు పంపి, ఆ డబ్బును తిరిగి వీళ్ల కంపెనీకి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్లీ హిందూజాకు ఇచ్చి 11 ఎకరాల భూమి కొనేశారు. నేను చెబుతున్నది కాదు ఇది.. ఈడీ సీబీఐకి లేఖ రాసింది.. వీళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేసీఆర్‌, మోదీ, జగన్‌ ముగ్గురు ఒక్కటై మనపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఈ దుష్టశక్తులపై పోరాటం చేసేందుకు ప్రజలంతా ఏకం కావాలి. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్య ఇది’ అని పేర్కొన్నారు. నేను మంచికి మంచి.. ‘నేను మంచికి మంచి వాడిని.. చెడ్డకు చెడ్డ వాడిని.

తెలంగాణ ముఖ్యమంత్రి నాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారట. మావద్ద కూడా వారికివ్వడానికి పది సిద్ధంగా ఉన్నాయ్‌. రెడీగా ఉండండి. తమాషాగా ఉందా? మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మీ ఇల్లూ మా ఇంటికి అంతే దూరం.. కేసీఆర్‌ చేసేదంతా చేస్తూ ఏపీ ఎన్నికలతో తనకు సంబంధం లేదంటున్నారు. డబ్బు పంపడం.. జగన్‌ను సంకలో వేసుకోవడం వంటివి సంబంధం లేని విషయాలా? కేసీఆర్‌ ఇక్కడ పెత్తనం చెలాయించాలని దొడ్డిదారిని ఎంచుకున్నారు. జగన్‌ ద్వారా పావులు కదుపుతూ పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునే పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు కట్టడానికి వీలులేదని ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టు రిట్‌ పిటిషన్‌ వేశారు. ఆ ప్రాజెక్టు వల్ల మీకు నష్టమేమిటి.. సముద్రంలోకి వెళ్లే నీళ్లు మేము వాడుకుంటే మీకేంటి బాధ? ఆ రోజు నేను గెలిచిన వెంటనే సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రం ఇంకా విడిపోలేదు.. నోటిఫికేషన్‌ ఇవ్వలేదు.. తెలంగాణలో ఉన్న ఏడు మండలాలు ఇవ్వకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనన్నాను. ఆ రోజు ఆ ఏడు మండలాలు రాబట్టక పోయి ఉంటే పోలవరానికి ఎన్నో అడ్డంకులు పెట్టేవాళ్లు. కేంద్రం సహకరించలేదు. తెలంగాణ ప్రభుత్వం వేరే ప్రభుత్వాలను రెచ్చగొడుతోంది. అయినా వెనక్కిపోలేదు. 68 శాతం పనులు పూర్తి చేశాం. జూలై నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తాం.. డిసెంబరుకు పోలవరం పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read