తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ప్రంట్‌పై సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని సీఎం చంద్రబాబు అన్నారు. 21 పార్టీల నేతలతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్రంట్‌ పై జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్లు ఎవరినైనా తాము స్వాగతిస్తామని చంద్రబాబు తెలిపారు. సమయం వచ్చినప్పుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై స్పందిస్తానని చంద్రబాబు చెప్పారు. ఈ ఫ్రంట్‌కు మద్దతు కోరుతూ సీఎం కేసీఆర్ ఇప్పటికే పలువురు నేతలను కలిశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్, కేరళ సీఎం పినరయిని ఇప్పటికే ఒకసారి కలిశారు.

federakl 08052019

రెండో సారి కూడా ఈ నేతలను కలవటానికి కేసీఆర్ బయలుదేరారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ను సీఎం కేసీఆర్ త్వరలో కలిసి మద్దతు కోరతారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్‌పై కసరత్తులు ప్రారంభించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలుండటంతో మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. ఇది ఇలా ఉంటే, 21 పార్టీల నేతలతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన చంద్రబాబు, ఓట్ల లెక్కింపు సమంలో ఈవీఎంలతో సమాంతరంగా వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్‌ చేశారు.

federakl 08052019

ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోవాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించాలన్నారు. అభ్యర్థులు కోరినచోట మళ్లీ లెక్కించాలని కోరారు. పారదర్శకత ఉంటే వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ స్లిప్పుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచితే ప్రజలంతా చూసుకుంటారని చెప్పారు. ఎన్నికల విధానంపై ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యవహరించాలని సూచించారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించడం కష్టమైన పని కాదని, తాము పోరాటం చేసేది తమ కోసమో, పార్టీ కోసమో కాదన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం కల్గించేందుకే పోరాడుతున్నట్టు స్పష్టంచేశారు. ఓట్ల లెక్కింపు ఆలస్యమైనా ఇబ్బంది లేదని సీఎం వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్‌లోని ఒక మంత్రి చేత రాజీనామా చేయించాల‌ని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్, ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు సమాచారం పంపారు. వైద్య, గిరిజ‌న సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న కిడారి శ్రావ‌ణ్‌తో రెండు రోజుల్లో రాజీనామా చేయించాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆదేశించినట్టు, రాజ్‌భ‌వ‌న్ నుండి ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి స‌మాచారం అందింది. మరి కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తున్న వేళ‌, ఏపీ కేబినెట్ భేటీ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ ఆదేశం ఇప్పుడు ప్ర‌భుత్వంలో హాట్ టాపిక్‌గా మారింది. చట్టసభల్లో సభ్యుడు కాని ఆయన గతేడాది నవంబరు 11న చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

governor 08052019

రాజ్యాంగ నియమావళి ప్రకారం.. మంత్రిగా నియమితులైన వారు ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాలి. శ్రావణ్‌కు ఆరునెలల వ్యవధి ఈ నెల 10తో ముగుస్తుంది. 11 నుంచి ఆయన మంత్రిగా కొనసాగడానికి వీల్లేదు. ఆయన తండ్రి, అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడంతో శ్రావణ్‌కు మంత్రిగా అవకాశం లభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర శాసనసభకు గత నెల 11నే పోలింగ్‌ జరిగినా.. ఫలితాలు ఈ నెల 23న వెలువడతాయి. ఈ ఎన్నికల్లో ఆయన గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మరికొన్ని రోజులు పడుతుంది. పదో తేదీతోనే ఆరునెలల గడువు ముగుస్తుండడంతో రాజ్‌భవన్‌ అప్రమత్తమైంది. ఒక మంత్రి చట్ట సభల సభ్యుడు కాలేక ఆటోమేటిగ్గా పదవి కోల్పోవడం అవమానకరంగా ఉంటుందని, అందువల్ల పదో తేదీలోపే శ్రావణ్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని గవర్నర్‌ నరసింహన్‌ సీఎంకు సూచించినట్లు తెలిసింది.

governor 08052019

గ‌త ఏడాది ఆయ‌న‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. ఆ స‌మ‌యంలో విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్వదేశానికి తిరిగి రాగానే సర్వేశ్వ‌ర రావు కుమారుడి బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. ఈ మేర‌కు గ‌త న‌వంబ‌ర్ 11న జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కు అవ‌కాశం క‌ల్పించారు. కీల‌క‌మైన వైద్య‌..గిరిజ‌న సంక్షేమ శాఖ‌లు అప్ప‌గించారు. అయితే, ఆయ‌న‌కు ఆ త‌రువాత ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తార‌ని భావించినా.. అలా చేయ‌లేదు. గ‌త నెల 11న ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న అర‌కు నుండి టీడీపీ అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్నారు. ఇంకా ఫ‌లితాలు రాలేదు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌ను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయమ‌ని కోరాల‌ని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఏకంగా ముఖ్య‌మంత్రికి సూచించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నాను. కేసీఆర్ వైఖరిపై తమకు ఉండే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిచ్చే విషయంలో ఇప్పుడేమీ చెప్పలేమని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఫలితాల అనంతరం తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామని సురవరం చెప్పారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిచ్చే అంశంపై ఢిల్లీలో మంగళవారం ఎన్టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సురవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

cpi 07052019

కేసీఆర్, పినరయి విజయన్ భేటీని కేవలం సీఎంల సమావేశంగానే చూస్తామని చెప్పారు. విజయన్ సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యుడు మాత్రమేనని.. ఆయన స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ స్థాయి నాయకత్వం ఉందని చెప్పారు. ‘కేసీఆర్‌పై మా అనుమానాలు మాకున్నాయి. కేసీఆర్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటారు. అవసరాన్ని బట్టి తృతీయ కూటమికి కూడా కేసీఆర్ మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ మెజార్టీ రానప్పుడు.. మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంది’ అని సురవరం చెప్పారు.

cpi 07052019

దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే బీజేపీపై తీవ్రమైన అసంతృప్తి ఉందని సురవరం తెలిపారు. ఈ అసంతృప్తిని పోగు చేయడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ విఫలమైందన్నారు. ‘కాంగ్రెస్ పెద్ద పార్టీ. కానీ, రాజకీయ చొరవ లేదు. సెక్యులర్ శక్తులను ఏకం చేయడంలో విఫలమైంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాదు. హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందని భావిస్తున్నాం’ అని సురవరం అన్నారు. ఇప్పటికీ కెసిఆర్ పై మాకు చాలా అనుమానాలున్నాయన్నారు. కేరళ సీఎం విజయన్ పొలిట్ బ్యూరో సభ్యుడైనా ఆయన స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు ఉండవన్నారు. కెసిఆర్ అవసరాన్ని భట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలను మార్చుకుంటారని, రేపు అవసరాన్ని భట్టి కెసిఆర్ తృతీయ కూటమికి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

గత ఐదేళ్లలో జరిగిన ఒక తప్పు ఈసారి జరగకుండా చూడాలని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత సమీక్ష సందర్భంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. వి.వి.వి.చౌదరి అనే ఈ నాయకుడు కొంత ఆవేశంతో మాట్లాడారు. ‘సార్‌... పైస్థాయిలో మీరు చాలా చాకిరీ చేస్తున్నారు. కింద మేం కూడా పార్టీపై అభిమానంతో చాలా పని చేస్తున్నాం. మాలో చాలామంది సంపాదించింది తక్కువ. పోగొట్టుకొంది ఎక్కువ. నేను రాజకీయాల్లోకి దిగి మూడెకరాలు అమ్ముకొన్నాను. కష్టపడి పార్టీని గెలిపిస్తే ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యుల ఇళ్లలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎక్కువ కనిపిస్తున్నారు. పార్టీని గెలిపించిన వారిని వదిలేసి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడం, ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కువైపోయింది.

cbn tdp 07052019

దీనితో మొదటి నుంచీ పార్టీలో ఉన్న వారికి మనస్తాపం కలుగుతోంది. మేం ఎవరిపై పోరాడామో వారిని మాపై కూర్చోబెడితే మాకు బాధ కలుగుతోంది. ఈ సారి అటువంటి పరిస్ధితి రానివ్వకుండా చూడండి’ అని ఆయన అన్నారు. దీనికి చంద్రబాబు కూడా స్పందించారు. ఈ సారి అటువంటి పరిస్ధితులు రాకుండా చూస్తానన్నారు. నాయకులను నవ్వించిన చంద్రబాబు: ఒక టీడీపీ కార్యకర్త అనుభవాన్ని ఈ సమావేశంలో వివరించి... వచ్చిన నాయకులందరినీ చంద్రబాబు నవ్వించారు. ‘ఇటీవల టీడీపీ కార్యకర్త ఒకరు జైల్లో పనిచేసే కానిస్టేబుల్‌కు లిఫ్ట్‌ ఇచ్చారు. మాటల్లో... తాను ఇటీవలి ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేశానని ఆ కానిస్టేబుల్‌ చెప్పారు.

cbn tdp 07052019

కారణం ఏమిటని అడిగితే జగన్‌ 16 నెలలు జైల్లో ఉండి వచ్చారని, జైలు సిబ్బంది సాధకబాధకాలు ఆయన కంటే బాగా తెలిసిన నాయకుడు రాష్ట్రంలో మరొకరు లేరని ఆ కానిస్టేబుల్‌ చెప్పారు’ అని చంద్రబాబు వివరించినప్పుడు నాయకులంతా ఫక్కువ నవ్వేశారు. ‘ఇంతా చేసి ఆ కానిస్టేబుల్‌కు జగన్‌ అధికారంలోకి వస్తాడా అన్నదానిపై మాత్రం నమ్మకం కలగడం లేదట. మహిళలంతా టీడీపీకే వేశామని చెబుతుండటంతో టీడీపీనే గెలుస్తుందని అనిపిస్తోందని చివర్లో చెప్పాడు’ అని సీఎం వివరించారు.

Advertisements

Latest Articles

Most Read