కేసీఆర్ ఫెడరల్ టూర్స్ .. దేశవ్యాప్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేరళ సీఎంతో కీలకమైన చర్చలు జరిపిన ఆయన ఇప్పుడు తమిళనాడు పర్యటనకు వెళ్తున్నారు. స్టాలిన్‌తో భేటీ ఉంటుందని.. ప్రకటించినప్పటికీ డీఎంకే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇక మిగిలింది కర్ణాటక జేడీఎస్. మరో రెండు మూడు రోజుల్లో కేసీఆర్ కర్ణాటక వెళ్లి కుమారస్వామిని కలుస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ రోజు ఇండియన్ ఎక్ష్ప్రెస్ లో వచ్చిన సంచలన కధనం హాట్ టాపిక్ అయ్యింది. వారం రోజుల క్రితం, తెలంగాణాకు నీళ్ళు వదిలినందుకు, కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ, కేసీఆర్, కుమారస్వామికి ఫోన్ చేసారు. నీళ్ళు వదిలినందుకు ధన్యవాదాలు చెప్తూనే, రాజకీయాల గురించి కూడా మాట్లడరాని, ఇండియన్ ఎక్ష్ప్రెస్ కధనం.
ఆ సమయంలో, కేసీఆర్, కుమారస్వామికి ఒక సరికొత్త ప్రతిపాదన పెట్టారు. ఫెడరల్ ఫ్రంట్ లేదు ఏమి లేదు, నేను కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నా, కొంచెం మీరు ఈ విషయంలో నాకు కాంగ్రెస్ పార్టీకి మైత్రి కుదిరించే ప్రయత్నం చెయ్యండి అంటూ కోరినట్టు సమాచారం. తెలంగాణలో ఉన్న పరిస్థుతులు, గతంలో సోనియా గాంధీకి అన్యాయం చేసిన కారణంగా, డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడలేనని, అలా అని ఈ కూటమిని నడిపిస్తున్న చంద్రబాబు దగ్గరకు వెళ్లి కూడా అడగలనేను అని, అందుకే మిమ్మల్ని సహాయం అడుగుతున్నా అంటూ, కేసీఆర్, కుమారస్వామిని కోరినట్టు ఇండియన్ ఎక్ష్ప్రెస్ లో సంచలన కధనం వచ్చింది.
అయితే కేసీఆర్ ను ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. 2014లో అప్పటి వరకు కాంగ్రెస్ భజన చేసి, టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నా అని ప్రకటించి, ఎన్నికల ఫలితాలు రాక ముందే జై మోడీ అన్నారు. ఇప్పుడు మళ్ళీ మోడీ వచ్చే పరిస్థితి లేదని గ్రహించి, మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళే అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ మీద ఉన్న సహారా స్కాం మీద విచారణ మొదలవ్వకుండా ఉండాలి అంటే, కేసీఆర్ కు కేంద్ర ప్రభుత్వం అండ అవసరం. అందుకే ఇప్పటి నుంచే ఎత్తుగడలు మొదలు పెట్టారు కేసీఆర్. బయటకు హడావిడి చెయ్యటం, లోపల లొంగిపోవటం కేసీఆర్ కు బాగా అలవాటు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇంత పెద్ద కధనం, దేశ వ్యాప్తంగా వస్తే, ఇప్పటి వరకు కేసీఆర్ ఈ కధనం గురించి ఖండించక పోవటం చూస్తుంటే, కేసీఆర్ మనసులో ఏముందో తెలిసిపోతుంది.