గత 5 ఏళ్ళుగా మన రాష్ట్రం పై అనేక దాడులు చూసాం. ఇప్పుడు కొత్తగా సైబర్ దాడికి కూడా కుట్ర జరుగుతుందా అనే సందేహం కలుగుతుంది. ఇది పసిగట్టిన ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్(ఏపీసీఎస్వోసీ), తగు సూచనలు చేసింది. వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల్లో జీ-మెయిల్ సేవలకు సోమవారం అంతరాయం కలిగింది. వివిధ శాఖల మధ్య, ఇతర కార్యాలయాల మధ్య, ఫిర్యాదులు, ఉత్తరప్రత్యుత్తరాలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జీ-మెయిల్ ఐడీలను తయారు చేసింది. అయితే సోమవారం ఉదయం నుంచి జీ-మెయిల్ పని చేయకపోవడంతో సమాచార మార్పిడికి అంతరాయం కలిగింది. కాగా దీనిపై రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) వివరణ ఇచ్చింది.
తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు చెందిన వెబ్సైట్లపై హ్యాకర్లు దాడి చేశారని, రాబిన్ హుడ్ రాన్స్‌మ్‌వేర్ అనే వైరస్ సోకిందని రాష్ట్ర ప్రభుత్వానికి సమచారం వచ్చిందని తెలిపింది. ఏపి ప్రభుత్వ వెబ్సైటుల మీద కూడా సైబర్ దాడి చేసి, డేటా దొంగాలించే అవకాసం ఉండనే సమకాహ్రం రావటంతో కూడా, ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ స్పందించి, ముందు జాగ్రత్త చర్యగా ఈ వైరస్ విస్తరించకుండా చర్యలు చేపట్టింది. దీని గురించి ఏపీస్టేట్ డేటా సెంటర్‌కు, ఏపీస్వాన్, రాష్ట్ర సచివాలయానికి, ఇతర ఐటి విభాగాలకు సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ .. రాన్సంవేర్ ఈ మెయిల్స్ ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతుందంటూ ఒక హెచ్చరిక పంపింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఐటి సేవలకు సంబంధించి అన్ని ప్రైవేట్ ఈమెయిల్ సేవలను నిలిపివేసింది. సచివాలయ ఐటి సర్వీసులపై ఈ వైరస్ ప్రభావం లేదని, సురక్షితమని ఏపీటీఎస్ అధికారులు తెలిపారు.
ఏపీ స్టేట్ డేటా సెంటర్, ఏపీస్వాన్, రాష్ట్ర సచివాలయం, ప్రభుత్వ ఐటీ వ్యవహారాలు చూసే అధికారులు, నిపుణులకు ఏపీసీఎస్వోసీ హెచ్చరికలు జారీ చేసింది రాన్సమ్వేర్ ప్రధానంగా ఇ-మెయిల్స్ ద్వారా వ్యాపిస్తుంది కనుక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని రకాల ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రైవేటు మెయిల్స్ వాడరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య అధికారిక సమాచారం మార్పిడికి ప్రైవేటు మెయిల్స్ వాడకూడదన్న నిబంధన ఎప్పట్నుంచో ఉంది. ఐటీ మౌలిక వ్యవస్థలో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ టెక్నాలజీ సర్వీస్ (ఏపీటీఎస్)కు ఆదేశాలిచ్చింది. ఐటీ వ్యవహారాల్లో ప్రభుత్వ విభాగాలు అపరిచిత మెయిల్స్‌ను తెరవరాదని, అనుమానం ఉన్న మెయిల్స్ విషయాన్ని ముందుగా ఏపీసీఎ్సఓసీకి తెలియజేయాలని కూడా సూచించింది. అయితే ప్రస్తుతం ఏపీ డేటా సెంటర్, ఏపీ స్వాన్, సచివాలయం వంటి ప్రధాన కేంద్రాల్లో ఐటీ వ్యవస్థ పూర్తి భద్రంగా ఉందని ఏపీటీఎస్ స్పష్టం చేసింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రైవేటు మెయిల్స్ వినియోగాన్ని నిలిపివేయాల్సిందిగా అన్ని శాఖలకు ఏపీటీఎస్ ఆదేశించింది.