గత 5 ఏళ్ళుగా మన రాష్ట్రం పై అనేక దాడులు చూసాం. ఇప్పుడు కొత్తగా సైబర్ దాడికి కూడా కుట్ర జరుగుతుందా అనే సందేహం కలుగుతుంది. ఇది పసిగట్టిన ఏపీ సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌(ఏపీసీఎస్‌వోసీ), తగు సూచనలు చేసింది. వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల్లో జీ-మెయిల్ సేవలకు సోమవారం అంతరాయం కలిగింది. వివిధ శాఖల మధ్య, ఇతర కార్యాలయాల మధ్య, ఫిర్యాదులు, ఉత్తరప్రత్యుత్తరాలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జీ-మెయిల్ ఐడీలను తయారు చేసింది. అయితే సోమవారం ఉదయం నుంచి జీ-మెయిల్ పని చేయకపోవడంతో సమాచార మార్పిడికి అంతరాయం కలిగింది. కాగా దీనిపై రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) వివరణ ఇచ్చింది.

cyber 07052019

తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు చెందిన వెబ్‌సైట్‌లపై హ్యాకర్లు దాడి చేశారని, రాబిన్ హుడ్ రాన్స్‌మ్‌వేర్ అనే వైరస్ సోకిందని రాష్ట్ర ప్రభుత్వానికి సమచారం వచ్చిందని తెలిపింది. ఏపి ప్రభుత్వ వెబ్సైటుల మీద కూడా సైబర్ దాడి చేసి, డేటా దొంగాలించే అవకాసం ఉండనే సమకాహ్రం రావటంతో కూడా, ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ స్పందించి, ముందు జాగ్రత్త చర్యగా ఈ వైరస్ విస్తరించకుండా చర్యలు చేపట్టింది. దీని గురించి ఏపీస్టేట్ డేటా సెంటర్‌కు, ఏపీస్వాన్, రాష్ట్ర సచివాలయానికి, ఇతర ఐటి విభాగాలకు సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ .. రాన్‌సంవేర్ ఈ మెయిల్స్ ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతుందంటూ ఒక హెచ్చరిక పంపింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఐటి సేవలకు సంబంధించి అన్ని ప్రైవేట్ ఈమెయిల్ సేవలను నిలిపివేసింది. సచివాలయ ఐటి సర్వీసులపై ఈ వైరస్ ప్రభావం లేదని, సురక్షితమని ఏపీటీఎస్ అధికారులు తెలిపారు.

cyber 07052019

ఏపీ స్టేట్‌ డేటా సెంటర్‌, ఏపీస్వాన్‌, రాష్ట్ర సచివాలయం, ప్రభుత్వ ఐటీ వ్యవహారాలు చూసే అధికారులు, నిపుణులకు ఏపీసీఎస్‌వోసీ హెచ్చరికలు జారీ చేసింది రాన్‌సమ్‌వేర్‌ ప్రధానంగా ఇ-మెయిల్స్‌ ద్వారా వ్యాపిస్తుంది కనుక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని రకాల ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రైవేటు మెయిల్స్‌ వాడరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య అధికారిక సమాచారం మార్పిడికి ప్రైవేటు మెయిల్స్‌ వాడకూడదన్న నిబంధన ఎప్పట్నుంచో ఉంది. ఐటీ మౌలిక వ్యవస్థలో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ టెక్నాలజీ సర్వీస్ (ఏపీటీఎస్‌)కు ఆదేశాలిచ్చింది. ఐటీ వ్యవహారాల్లో ప్రభుత్వ విభాగాలు అపరిచిత మెయిల్స్‌ను తెరవరాదని, అనుమానం ఉన్న మెయిల్స్‌ విషయాన్ని ముందుగా ఏపీసీఎ్‌సఓసీకి తెలియజేయాలని కూడా సూచించింది. అయితే ప్రస్తుతం ఏపీ డేటా సెంటర్‌, ఏపీ స్వాన్‌, సచివాలయం వంటి ప్రధాన కేంద్రాల్లో ఐటీ వ్యవస్థ పూర్తి భద్రంగా ఉందని ఏపీటీఎస్‌ స్పష్టం చేసింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రైవేటు మెయిల్స్ వినియోగాన్ని నిలిపివేయాల్సిందిగా అన్ని శాఖలకు ఏపీటీఎస్ ఆదేశించింది.

ఐదో విడత ఎన్నికల సందర్భంగా బిహార్‌ ముజఫర్‌పూర్‌లోని ఓ హోటల్‌లో సోమవారం ఉదయం రెండు ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో పాటు ఒక కంట్రోల్‌ యూనిట్‌ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి సాంకేతిక సమస్యలు తలెత్తిన చోట మార్చడానికి ఏర్పాటు చేసిన అదనపు యంత్రాలని వాటికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారి అవదేశ్‌ కుమార్‌ తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ పోలింగ్‌ బూత్‌లో సమస్యని పరిష్కరించి వస్తుండగా.. మధ్యలో కారు డ్రైవర్‌ ఓటు వేసేందుకు వెళ్లడంతో వాటిని భద్రంగా ఉంచడం కోసం హోటల్‌కు తరలించానని ఆయన వివరించారు. అయితే ఇది నిబంధనలకు వ్యతిరేకం కావడంతో అవదేశ్‌ కుమార్‌కు ఎన్నికల సంఘం సంజాయిషీ నోటీసులు జారీ చేసింది.

vvpat 07052019

ఈ విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు హోటల్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి ముజఫర్‌పూర్‌ ఎస్‌డీఓ కుందన్‌ కుమార్‌ చేరుకొని ఈవీఎంలను స్వాధీనం చేసుకున్నారు.. ఈవీఎంలు హోటల్‌కు ఎలా చేరాయన్న దానిపై మరింత లోతైన విచారణ జరుపుతామని తెలిపారు. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్‌ ఆలోక్‌ రంజన్‌ ఘోష్‌ స్పందిస్తూ.. స్వాధీనం చేసుకున్న ఈవీఎంలు సమస్యలు తలెత్తిన చోట ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అదనపు యంత్రాలని ధ్రువీకరించారు. అయితే ఈవీఎంలను హోటళ్లకు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని.. అందుకు సదరు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మోడీ, అమిత్ షా ప్లాన్ ప్రకారం, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ మూడు నెలల క్రిందట హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భగంగా, చంద్రబాబు దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసే కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్లాన్ వేసారు. దీని కోసం కేసీఆర్ రంగంలోకి దిగి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ ను కలిసి హడావిడ్ చేసారు. వాళ్ళని చంద్రబాబు వైపు వెళ్ళకుండా ప్లాన్ వేసారు. అయతే కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిని ఓడించేందుకు ఎన్నికలకు ముందే ప్రజాకూటమిగా ఏర్పడాలనే నిర్ణయానికి 21 పార్టీలు వచ్చాయి, ఎన్నికల్లో పోరాడుతున్నాయి. ఇప్పుడు 23న ఫలితాలు వస్తున్న తరుణంలో, మళ్ళీ కేసీఆర్ ను ఆక్టివేట్ చేసారు మోడీ, షా. విపక్షాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేసారు.

kcr 07052019

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో రెండు దశల పోలింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో ఈ టాస్క్ పూర్తి చెయ్యటానికి స్పీడ్ పెంచిన కేసీఆర్ రాష్ట్రాల బాట పట్టారు. సోమవారం నాడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయిన కూటమిపై నిశితంగా చర్చించారు. అయితే ఈనెల 13న కాంగ్రెస్‌తో కలసి పని చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కావాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు స్టాలిన్‌కు ఫోన్ భేటీ గురించి కేసీఆర్ ఇప్పటికే మాట్లాడారు. అయితే కేసీఆర్‌తో స్టాలిన్ సమావేశం జరగకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండటంతో కేసీఆర్‌, స్టాలిన్‌ భేటీపై అనుమానమేనని తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ వేస్తున్న కుప్పిగంతులు చూస్తున్న స్టాలిన్, ఈ తరుణంలో కేసీఆర్ తో భేటీకి విముఖత చూపించారు.

kcr 07052019

ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్‌తో సోమవారం జరిగిన భేటీలో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించామని అంతే తప్ప ప్రధాని అభ్యర్థిపై చర్చ జరగలేదలేదని కేరళ సీఎం పినరయి విజయన్‌ మీడియాకు వివరించారు. కేసీఆర్‌తో చాలా ప్రాముఖ్యతగల సమావేశం జరిగిందన్నారు. కాగా.. కేరళ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం ఆయన విజయన్‌ అధికార నివాసానికి వెళ్లి ఫెడరల్‌ ఫ్రంట్‌‌పై చర్చించారు. ఇప్పుడు తమిళనాడు వెళ్దాం అనుకుంటే, అక్కడ స్టాలిన్ షాక్ ఇచ్చారు.

తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతూ పెడన 12వ వార్డు మాజీ కౌన్సిలర్‌, వైసీపీ నాయకుడు దొడ్డిపట్ల నాగేశ్వరరావు సోమవారం జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు. పెడన అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జోగి రమేష్‌ వర్గానికి చెందిన మనుషులతో తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు జోగి రమేష్‌ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.10 లక్షలతో తన వద్దకు వచ్చి వైసీపీ తరఫున 12వ వార్డులో ఓట్లు కొనుగోలు చేయాలని ప్రతిపాదించగా తాను తిరస్కరించానని పేర్కొన్నారు. ఆ ఇద్దరూ వార్డులో ఓటరుకు వెయ్యి రూపాయల చొప్పున బాహాటంగా పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేశారని ఆరోపించారు.

ycp 07052019

ఓట్ల కొనుగోలుతో తనకు సంబంధం లేకపోయినా ఆరేపల్లి రాము, భళ్ల గంగయ్య, కూనపురెడ్డి రంగా, తిప్పా పాండు తదితరులు తనను జోగి రమేష్‌ కార్యాలయానికి తీసుకె ళ్లి 10 లక్షల రూపాయలకు లెక్కలు చెప్పాలంటూ వత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఇదే వ్యక్తులు గత నెల 19న తనను కిడ్నాప్‌ చేసి బుద్దాలపాలెం గ్రామంలోని చేపల చెరువుల వద్దకు తీసుకెళ్లి వార్డులో 10 లక్షలకు గాను 6 లక్షలు మాత్రమే పంపిణీ జరిగినందున మిగిలిన నాలుగు లక్షలు ఇవ్వాలని, ఇవ్వకపోతే చంపేస్తామంటూ తనపై చేయి చేసుకున్నారని, కత్తులు చూపించి బెదిరించారని ఆరోపించారు. ఆరేపల్లి రాము, భళ్ల గంగయ్య, కూనపురెడ్డి రంగా, తిప్పా పాండుతో పాటు మరో ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులపై చర్యలు తీసుకుని తనకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు.

Advertisements

Latest Articles

Most Read