ఎన్నికల అనంతరం కూడా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ వేడి తగ్గలేదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుల మధ్య చోటుచేసుకున్న సున్నిత వ్యవహారం సోషల్‌ మీడియాలో ఇటీవల చర్చనీయాంశమైంది. వంశీ తనను బెదిరిస్తున్నారంటూ యార్లగడ్డ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ని కలిసి రక్షణ కోరినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై వంశీ, వెంకట్రావు ఇంతవరకు బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. ఇటీవలే విహారయాత్రకు పొరుగు రాష్ట్రానికి వెళ్లిన వంశీ, సోషల్‌ మీడియా ద్వారా జరుగుతున్న చర్చని గమనించి స్పందించారు. జరిగిన అన్ని పరిణామాలను వివరిస్తూ యార్లగడ్డ వెంకట్రావుకు వాట్సాప్‌ ద్వారా ఓ సందేశం పంపారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, ఆయన సోదరుడు జైరమేష్‌కి కూడా దీనిని పంపారు.

vamsi 06052019

అందులోని సారాంశం యథాతథంగా.. ప్రియమైన వెంకట్రావుకు.. నేను వల్లభనేని వంశీ. పెద్దగా పరిచయం అక్కర్లేదనే అనుకుంటున్నా. కొన్ని విషయాలను నీ దృష్టికి తీసుకురావాలనే ఈ మెసేజ్. మన ఉమ్మడి స్నేహితుడు కొడాలి నాని ద్వారా పలు విషయాల్లో నీక సాయం చేసినప్పటికీ మనిద్దరం ఎప్పుడూ కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. నాని ప్రోద్బలం వల్లే నీకు సాయం చేశా. ఈ విషయంలో నువ్వు నానికి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేస్తున్నప్పుడు కూడా మనం కలవలేదు. లక్ష్మీతిరుపతమ్మ ఆలయంలో నువ్వు కనిపించినప్పుడు మాత్రం నీకు స్వాగతం చెప్పాను. ఆ తర్వాత ఒకసారి కేసరపల్లిలో నీ అనుచరులు కట్టిన బ్యానర్‌పై ప్రసాదంపాడు అని రాసి ఉంటే గమనించి నీకు ఫోన్ చేసి సరిచేసుకోమని చెప్పా. ఇప్పటి వరకు మూడుసార్లు పోటీ చేసిన నేను ఎక్కడా అనవసరంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు.

vamsi 06052019

పార్టీ గురించి, చంద్రబాబు గురించే మాట్లాడాను తప్పితే నాపై పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్‌, దుట్టా రామచంద్రరావుల గురించి ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. లగడపాలి పిల్లలు, మా పిల్లల మధ్య చక్కని అనుబంధం ఉంది. వారు మా ఇంటికి, మా పిల్లలు వారింటికి వెళ్తుంటారు. గన్నవరం వచ్చే వరకు నన్ను ఎప్పుడూ చూడని, మాట్లాడని నీ నుంచి నేను అప్పు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైనా నాకు అప్పు ఇచ్చావా? విరాళం ఇచ్చావా? ఇటువంటి నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే నీకు ఫోన్ చేసి కలవానుకున్నా. నీకు ఇష్టం లేకుండా నువ్వే మా ఇంటికి కాఫీ తాగేందుకు రావొచ్చు. వస్తూవస్తూ దాసరి బాలవర్థనరావుని, జైరమేష్‌ని, నీ శ్రేయోభిలాషుల్ని కూడా తీసుకురావచ్చు. గన్నవరాన్ని డల్లాస్‌గా మారుస్తానన్న నీ ప్రతిపాదన విన్నాక నీకు సన్మానం చేయాలనిపించింది. నీకు ఫోన్ చేస్తే స్పందించకపోయే సరికి అపాయింట్‌మెంట్ కోసం నా మనుషుల్ని నీ ఇంటికి పంపా. ఆ తర్వాత నేనే వచ్చాను. అయితే, నా నుంచి నీకు ప్రాణహాని ఉందని పోలీస్ కమిషనర్‌ను కలిసినట్టు పేపర్లో చూశాను. నువ్వేమీ భయపడాల్సిన పనిలేదు. నా వల్ల నీకెలాంటి ఇబ్బంది ఇబ్బంది ఉండదు. దేవుడున్నాడు.. అన్నీ ఆయనే చూసుకుంటాడు... అని వల్లభనేని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు.

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ‌పై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. "మీ నాన్న రాజీవ్ గాంధీ జీవితం దేశంలో నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగిసింది" అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అమర్యాదకర ప్రవర్తనను ఎవరూ ఆశించబోరని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పదవి వంటి అత్యున్నతస్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి ఎవరైనా సభ్యత, సంస్కారం, హుందాతనం ఆశిస్తారని, కానీ, ఈ వ్యాఖ్యలు ప్రధాని నీచ మనస్తత్వానికి ప్రతీకలుగా భావించాల్సి వస్తోందని తెలిపారు.

cbnmodi 05052019

ఇవాళ మన మధ్యలేని దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ విమర్శలు చేయడాన్ని తాము ఖండిస్తున్నట్టు చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు నాగరికత సరిహద్దులు దాటి వ్యక్తి గౌరవమర్యాదలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని వివరించారు. రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించుకున్నారన్న ప్రధాని మోడీ కామెంట్లపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. "మోడీ జీ.. యుద్ధం ముగిసింది. ఖర్మ ఫలం ఎదురుచూస్తోంది. నా తండ్రిపై చేసే విమర్శలు మిమ్మల్ని ఎన్నటికీ కాపాడలేవు, ప్రేమతో ఓ కౌగిలింత" అంటూ ట్వీట్ చేశారు.

cbnmodi 05052019

రాజీవ్ గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. మాజీ ప్రధానిపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారణేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయవద్దని బీజేపీ నిర్ణయించిన విషయం మోడీకి తెలుసా అని ప్రశ్నించారు. ప్రజా సేవలో ఉండి మరణించిన వ్యక్తిని విమర్శించి మోడీ అన్ని హద్దులు దాటేశారని చిదంబరం మండిపడ్డారు. మరోవైపు మోడీ కామెంట్లపై ప్రియాంక గాంధీ సైతం స్పందించారు. అమరుల పేర్లు చెప్పుకుని ఓట్లు అడిగే మోడీ.. ఒక గొప్ప వ్యక్తి బలిదానాన్ని అగౌరవపర్చడం ఆయన విజ్ఞతకు నిదర్శనమన్నారు. మోడీకి అమేథీ ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెబుతారని ప్రియాంక అభిప్రాయపడ్డారు.

గత కొద్ది రోజులుగా గన్నవరం నియోజకవర్గంలో టెన్సన్ వాతావరణం నెలకొంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమను బెదిరిస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, బాలవర్దన రావు నగర పోలీసు కమిషనర్‌ ద్వారకాతిరుమలరావుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వంశీ తమ ఇంటికొచ్చి సన్మానం చేస్తానంటూ ఫోన్‌ చేస్తున్నాడని, తమ ఇంటికి కూడా వచ్చాడని ఫిర్యాదులో పేర్కొని.. సీసీ టీవీ ఫుటేజీని కూడా సీపీకి అందజేయడం జరిగింది. ఫిర్యాదు స్వీకరించిన సీపీ ఈ ఘటనపై విచారణ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఫిర్యాదుపై, వెంకట్రావు ఆరోపణలపై ఇంత వరకూ స్పందించని వంశీ.. వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో ఎట్టకేలకు రియాక్టయ్యారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డకు వంశీ బహిరంగ లేఖ రాశారు.

vamsi 05052019

వంశీ బహిరంగ లేఖ... "సత్సంబంధాలను కొనసాగించేందుకే మీ ఇంటికి వస్తానని నేను ఫోన్‌ చేశాను. మీ అపాయింట్‌మెంట్‌ కోసమే ఫోన్‌ చేశాను.. అందులో భాగంగానే మా అనుచరులను మీ ఇంటికి పంపా. నేను మీ ఇంటికి రావడం ఇబ్బంది అయితే మీరే మా ఇంటికి రండి. మీరు సమయం, తేదీ చెబితే నేను సిద్ధంగా ఉంటాను. ఓ కప్పు కాఫీతాగి వెళ్లొచ్చు. మీ అనుచరులను కూడా మీవెంట తీసుకు రండి. మా అనుచరులను మీ ఇంటికి పంపిస్తే నేను బెదిరిస్తున్నానని మీరు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసినట్టు పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాను. మీరు నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు మీరు ఎవరో తెలియదు.. కొడాలి నాని ద్వారానే పరిచయం అయ్యారు. మీరు గన్నవరం రాకముందు రెండు కేసుల్లో మీకు సాయం చేశాను. మీరు నా గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడున్నాడు అన్నీ ఆయనకు తెలుసు.. అందరికీ దేవుడే న్యాయం చేస్తాడు" అని బహిరంగ లేఖలో వంశీ నిశితంగా వివరించారు. అయితే ఈ లేఖపై వెంకట్రావు.. వెంకట్రావును వంశీకి పరిచయం చేసిన కొడాలి నాని, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

vamsi 05052019

ఇప్పటికే అనుచరులు స్పందన..! ఇదిలా ఉంటే.. వైసీపీ నేతల కారణంగా గన్నవరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని, రాజకీయ కక్షలు పెరుగుతున్నాయని వీటన్నింటినీ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకే వంశీ వారికి ఫోన్‌ చేశారే తప్ప వేరే ఉద్దేశం లేదని ఇప్పటికే వల్లభనేని అనుచరులు వివరించిన విషయం విదితమే. దాడులు చేయడం, విద్వేషపూరిత రాజకీయాలు చేయడం అలాంటి ఉద్దేశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కౌంటింగ్‌ రోజు (మే-23) వరకు గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు.

 

దేశం గర్వించదగ్గ మహోన్నత పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై వైయస్‌ ఆత్మ కేవీపీ విషం చిమ్ముతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. భాజపా, వైకాపా కోవర్టుగా పని చేస్తున్న కేవీపీ పోలవరం నిర్మాణ రికార్డులు చూసి సిగ్గుపడాలన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞoగా మార్చి డబ్బులు దండుకున్న కేవీపీ పోలవరంపై ఉత్తరాలు రాయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. పోలవరానికి ఖర్చు పెట్టిన నిధులు రాకుండా ప్రధాని కార్యాలయం అడ్డుపడుతున్నా నోరెందుకు మెదపరని ప్రశ్నించారు. కేసీఆర్ పోలవరం మీద సుప్రీంకోర్టులో కేసులు వేశారని.. గ్రీన్ ట్రైబ్యునల్‌లో కవిత కేసు వేశారని అవి మీ దృష్టిలో లేవా అని ఉమ ప్రశ్నించారు. వచ్చే జనవరిలోపు తీహార్ జైలుకెళ్లే వాళ్లు కూడా పోలవరం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

jagan 05052019

పోలవరం ప్రాజెక్ట్ ఎంత పూర్తయిందో.. దేశంలోని మిగతా జాతీయ ప్రాజెక్టులు ఎంత పూర్తి అయ్యాయో మీకు తెలియదా? అని ప్రశ్నించారు. దేశంలో ఉన్న జాతీయ ప్రాజెక్టుల పని తీరు గురించి కేవీపీ.. కేసీఆర్, మోదీలకు ఉత్తరాలు రాయాలని కోరారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకోవడం లేదని మోదీ అంటున్నారని.. కేసీఆర్‌, మోదీ ప్రేమించుకోవటం వల్లే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, అంతేగానీ తామంతా ఒకటిగానే ఉన్నామని తెలిపారు. జనం తనను మరచిపోతారనే భయంతో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఒక్కోసారి తన ఉనికిని చాటుకునేందుకు తహతహ లాడతారని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ గతంలో వైఎస్‌కు ఆత్మగా.. ఇప్పుడు జగన్‌కు ప్రేతాత్మ.. కేసీఆర్ అంతరాత్మగా కేవీపీ పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.

jagan 05052019

బీజేపీకి ఆయన తలలో నాలుకగా ఉంటున్నారని విమర్శించారు. విభజన చట్టంలో ఏ అంశాలనూ చంద్రబాబు సాధించలేదనడం హాస్యాస్పదమన్నారు. కమీషన్ల కోసం మట్టిపనులు చేసి దోచుకున్న చరిత్ర కలిగిన కేవీపీకి పోలవరం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన కేవీపీ రాష్ట్ర ప్రయోజనాలను మరోసారి తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యుడిగా ఆనాడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పార్లమెంట్‌లో వౌనం వహించిన కేవీపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. పోలవరం నిధులు విడుదల కాకుండా లేఖలు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో జరిగిన జాప్యంపై ఎందుకు నోరుమెదపరని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి శకునిపాత్ర పోషిస్తున్న కేవీపీ సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచిన చరిత్రను గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ది ఉంటే ప్రధాని మోదీని నిలదీయాలని సవాల్ విసిరారు.

Advertisements

Latest Articles

Most Read