బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లోక్ సభ ఎన్నికల్లో ఓటేయకపోవడం, ఆయన కెనడా పౌరసత్వం గురించి విమర్శలు రావడం, మోడీతో కలిసి రాజకీయ ఇంటర్వ్యూ కాదంటూ చేసిన కార్యక్రమం, దానికి ఆయన ఘాటుగా బదులివ్వడం తెలిసిందే. తన పౌరసత్వం గురించి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అక్షయ్ వాపోయారు. తన దగ్గర కెనడా పాస్‌పోర్ట్ ఉందనే విషయాన్ని ఎప్పుడూ దాచి పెట్టలేదని, ఏడేళ్లుగా అక్కడికి వెళ్లలేదన్నారు. భారత్‌లోనే ఉంటూ ఇక్కడే అన్ని రకాల పన్నులు కడుతున్నానని ఆయన తెలిపారు. నీ అక్షయ్ కుమార్‌పై మాత్రం నెటిజన్లు ట్రోలింగ్ ఆపలేదు. ‘టొరంటో నగరం నా ఇల్లు’ అని గతంలో అక్షయ్ మాట్లాడిన వీడియోను వాడేస్తూ.. ఈ బాలీవుడ్ హీరోను తెగ ట్రోల్ చేస్తున్నారు.

game 27032019

ఈ వ్యవహారంలో నటుడు సిద్ధార్థ్.. మోడీ, అక్షయ్ కుమార్‌పై వ్యంగాస్త్రాలు సంధించాడు. ఎక్కడా అక్షయ్ పేరు ప్రస్తావించకుండానే ఈ బొమ్మరిల్లు హీరో బాలీవుడ్ సూపర్ స్టార్‌కు చురకలు అంటించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ట్వీట్ చేసిన సిద్ధూ.. ‘త్వరలోనే అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికవడానికి మీరు సన్నద్ధం అవుతున్నారు. ఎన్నికల టైంలో నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని మీకు సలహా ఇస్తున్నా. మీరు ఏ పండ్లు తింటారు, ఎప్పుడు నిద్రపోతారు, ఎలా పని చేస్తారు, మీ క్యూటీ పర్సనాలిటీ తదితర విషయాలపై ముఖ్యమైన ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నా. నాకు భారత పాస్‌పోర్ట్ ఉంది. వ్యక్తిగతంగా నాకు బదులివ్వండి’ అని కోరాడు. సిద్ధూ తన ట్వీట్‌లో ఎక్కడా అక్షయ్, మోడీ పేరు ప్రస్తావించనప్పటికీ.. కెనడా పాస్‌పోర్టు ఉన్న ఆయన ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేయడం పట్ల ఇలా సెటైర్ వేశాడు. అక్షయ్ కుమార్ అండర్ రేటెడ్ విలన్ అంటూ ఏప్రిల్ 24న కూడా సిద్ధూ ఓ ట్వీట్ చేశాడు.

వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసు పై టీడీపీ నేత వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఈ కేసులో విచారించాలని టీడీపీ నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు. జగన్ బాబాయి వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది . అసలు వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారం ఇప్పటి వరకు తేలనేలేదు. సిట్ దర్యాప్తు నత్తనడకన సాగటం వెనుక కారణాలపై కూడా వర్ల అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు గురించి టీడీపీ నేత వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి.. ఇంటి దొంగలను వదిలిపెట్టారన్నారు.

varla 04052019

ఇక ఎవరి ఆదేశాలతో ఇంటి దొంగలను అరెస్ట్ చేయలేదో సిట్ చెప్పాలని డిమాండ్ చేశారు.ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్ డేటా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు వర్ల రామయ్య . తండ్రిని ఎవరు చంపారో వివేకా కూతురికి తెలుసునని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఆపాలని సిట్‌కు హైకోర్టు చెప్పలేదని పేర్కొన్నారు. ఇంటి దొంగల పనే అని స్పష్టంగా అర్ధం అవుతుందన్న వర్ల జగన్ ను విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. ఎవరి ఆదేశాలతో ఇంటి దొంగలను అరెస్ట్ చేయలేదో సిట్ చెప్పాలని డిమాండ్ చేశారు.ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్ డేటా ఎందుకు తీసుకోలేదని ప్రశవ్నించారు. తండ్రిని ఎవరు చంపారో వివేకా కూతురికి తెలుసునని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఆపాలని సిట్‌కు హైకోర్టు చెప్పలేదని పేర్కొన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న పైన ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. బీహార్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న మోదీ ఏపి విభ‌జ‌న అంశంలో త‌లెత్తిన స‌మ‌స్య‌లు..ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. అయితే, అయిదేళ్ల‌యినా ఇంకా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌ని చెబుతూనే..రెండు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల మ‌నోభావాల గురించి ప్ర‌స్తావించారు. ప్రచారంలో ప్ర‌ధాని మోదీ ఏపి-తెలంగాణ‌గా రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన నాటి ప‌రిస్థితుల‌ను గుర్తు చేసారు. బీహార్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న అంశాన్ని లేవ‌నెత్తారు. వాజ్‌పేయి హ‌యాంలో మూడు రాష్ట్రాల విభ‌జ‌న స‌క్ర‌మంగా జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు.

modi 04052019

బీహార్ నుండి జార్కండ్ ను విభ‌జించిన స‌మ‌యంలో రెండు ప్రాంతాల‌కు న‌ష్టం లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని..తద్వారా రెండు ప్రాంతాల్లోనూ ఎటువంటి ఆందోళ‌న లేకుండా విభ‌జ‌న స‌క్ర‌మంగా జ‌రిగింద‌ని వివ‌రించారు. ఇక‌, తెలుగు రాష్ట్రాల విభజన చేసిన కాంగ్రెస్ పైన ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేసారు. నాడు అనుస‌రించిన విధానాల కార‌ణంగా అయిదేళ్ల‌యినా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌ని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలే ఉన్నా ఇప్పటికీ ఒకరి కళ్లలో ఒకరు చూసుకోలేని పరిస్థితి ఉందని వివ‌రించారు.

modi 04052019

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి అయిదేళ్ల‌యినా..ప్ర‌ధాని మోదీ నోట అనేక సార్లు ఇదే విషయాన్ని ఇదే విధంగా చెబుతూ వ‌స్తున్నారు. విభ‌జ‌న స‌మ‌యంలో బీజేపీ సైతం మ‌ద్ద‌తిచ్చిన విష‌యాన్ని ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగానే విస్మ‌రిస్తున్నారు. విభ‌జ‌న జ‌రిగే స‌మ‌యంలో నాటి ప్ర‌ధాని ఇచ్చిన హామీల అమ‌లును అదే స్థానంలోకి వ‌చ్చిన మోదీ అమ‌లు చేయ‌టంలో నిర్ల‌క్ష్యం చేసారు. ఏపీకీ తాను ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌లేదు. రాజ్య‌స‌భ‌లో బీజేపీ నేత‌లే ఏపీకి ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేసారు. కానీ, ఇప్పటి వ‌ర‌కూ అది అమ‌లు కాలేదు. ఇక‌, ఏపి-తెలంగాణ మ‌ధ్య స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కేంద్రం నుండి క‌నీస ప్ర‌య‌త్నాలు జ‌ర‌గలేదు. కానీ, ఇప్ప‌టికీ ఏపీ విభ‌జ‌న‌లో త‌మ‌కు
సంబంధం లేద‌న్న‌ట్లుగా మోదీ మాట్లాడుతున్న తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

ఏ పార్టీకైనా కార్యకర్తలే ప్రథమం. కార్యకర్తలు ఎంత కష్టపడితే.. పార్టీ అంతగా బలపడుతుంది. తమ నాయకుడు కోసం.. పార్టీ కోసం కార్యకర్తలు శ్రమిస్తుంటారు. చాలా మంది అభిమానులు తమ అభిమాన నేతపై తమకున్న ప్రేమను , అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తారు. తమ అభిమాన నాయకుడు వస్తున్నారు అంటే చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఊరంతా బ్యానర్లు వేస్తారు. ఏ కార్యక్రమం నిర్వహించ తలపెట్టారో ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడతారు. తన అభిమానం వ్యక్తం చెయ్యటానికి పలు రూపాల్లో ప్రయత్నం చేస్తుంటారు. కానీ చంద్రబాబు విషయంలో ఆయనపై విపరీతమైన అభిమానం ఉన్న ఓ కార్యకర్త ఏం చేసాడో తెలుసా ?

siddhardh 04052019

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓ అభిమాని అనూహ్యమైన బహుమతి ఇచ్చి ఆశ్చర్య పరిచాడు. ఎవరూ ఊహించిన బహుమానం ఇచ్చి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలు పని చేస్తున్న చంద్రబాబు వేళకు భోజనం చెయ్యాలనే ఆ బహుమతి ఇచ్చారు ఓ అభిమాన కార్యకర్త. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ముందు పాలించే చంద్రబాబు ఆరోగ్యం ఉండాలని భావించే ఎవరూ ఊహించని ప్రత్యేకమైన బహుమతిని చంద్రబాబుకి ఇచ్చారు .

siddhardh 04052019

రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారని, ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని భావించిన ఓ కార్యకర్త అధినేతకు ఎవరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త రామానుజం చలపతి గడియారం, లంచ్ బాక్స్‌ను బహుమతిగా ఇచ్చారు . వేళకు భోజనం చేయాలనే ఈ రెండింటినీ బహుమతిగా ఇచ్చినట్టు చలపతి పేర్కొన్నాడు. తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్న కార్యకర్త చలపతిని చంద్రబాబు అభినందించారు.

Advertisements

Latest Articles

Most Read