పోలింగ్ ముగిసింది. ఎన్నికల వేడి కాస్త తగ్గుముఖం పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల పనితీరు పై సందేహాలు లేవనెత్తుతూ దేశ రాజధానిలో హల్ చల్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదులు చేశారు. జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్ష పార్టీలనూ ఏకం చేసే పనిలో పడ్డారు. చంద్రబాబు ప్రయత్నాలని అడ్డుకోవటానికి జగన్ రంగంలోకి దిగారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక సంఘటనల పై రివెర్స్ లో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంపై విమర్శలు చేశారు. ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దృష్టికీ తీసుకెళ్లారు. అదే సందర్భంలో లోకేష్ పైనా విమర్శలు చేసారు. మంగళగిరి పోలింగ్ బూత్ లో లోకేష్ కి ఏమి పని అంటూ జగన్ ప్రశ్నించారు.

game 27032019

అయితే జగన్ అర్ధం లేని వ్యాఖ్యల పై, ఐటీ మంత్రి నారా లోకేష్ ఉన్నట్టుండి వార్తల్లోకి ఎక్కారు. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. జగన్ ను తల లేని కోడితో పోల్చారు. కోడికి తలకాయ లేకపోయినప్పటికీ.. కొన్ని నెలల పాటు బతికేస్తుందని కొద్దిరోజుల కిందట తాను పేపర్ లో చదివానని, వైఎస్ జగన్ కూడా అలాంటి వాడేనని విమర్శించారు. తల లేని కోడిలాగే జగన్ లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా అయిదేళ్ల పాటు నెట్టుకొచ్చాడని అన్నారు. జగన్ తో పోలిస్తే.. తల లేని కోడి సంగతి పెద్ద విచిత్రం కాదని అన్నారు. నేను పోటీ చెస్ నియోజకవర్గంలో, పోలింగ్ సరళి ఎలా ఉందో తెలుసుకునే బాధ్యత తనకు లేదా ? జగన్ చేస్తున్న వాదన వింతగా ఉంది అంటూ చురకలు అంటించారు.

game 27032019

ఇది లోకేష్ చేసిన ట్వీట్... "పోలింగ్ రోజున నేను పోలింగ్ బూత్ కి వెళ్ళడం నిబంధనలకు విరుద్ధమని జగన్ అన్నారు. పోలింగ్ సవ్యంగా జరుగుతుందో లేదో పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుందన్న కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారంటే మన ఖర్మ అనుకోవాలి. మొన్నెప్పుడో పేపర్లో చదివా ఒక కోడి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచీ బతికేస్తుందంట. జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడు. ఈ విషయంతో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రమా చెప్పండి!"

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు, ఈసీ తీరు పై అన్ని పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. జగన్, బీజేపీ, కేసీఆర్ తప్ప, దేశంలోని అన్ని పార్టీలు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాయి. తాజగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ ఎన్నికల నిర్వహణపై మొదటినుంచి అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సక్రమంగా జరగలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన స్వరాన్ని మరింత పెంచిన కేఏ పాల్.. ఏపీ ఎన్నికల తీరుతెన్నులపై సీఈసీ కి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు. 8 ప్రశ్నలు సంధిస్తూ ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఓ లేఖ అందించారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు లిఖిత పూర్వకమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

stalin 17042019

ఎన్నికల సంఘానికి కేఏ పాల్ సంధించిన 8 ప్రశ్నలివే : 1. పోలింగ్ ప్రక్రియ ఎందుకు ఆలస్యమైంది?.. అర్ధరాత్రి వరకు కొనసాగించాల్సిన అవసరమేంటి? 2. పోలింగ్ ఆలస్యానికి బాధ్యత ఎవరిది?.. అసలు అంత జాప్యం జరగడానికి కారణమేంటి? 3. వీవీప్యాట్ స్లిప్పులకు 3 సెకండ్ల సమయం ఎందుకు తీసుకుంది ? 4. ఈవీఎంల్లో ప్రజాశాంతి పార్టీకి చెందిన 12వ బటన్ నొక్కితే.. వైసీపీకి చెందిన 2వ నెంబర్ కు ఓట్లు ఎందుకు పడ్డాయి?.. 5. పోలింగ్ సమయంలో జరిగిన దాడులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు ? 6. 80 శాతం ఈవీఎంలు ఎందుకు పనిచేయలేకపోయాయి?.. దీనిపై మీ సమాధానమేంటి? 7. ఓటర్ల ఫిర్యాదులను లిఖిత పూర్వకంగా తీసుకోకపోవడానికి కారణాలేంటి? 8. కేంద్రం నుంచి వచ్చే పోలింగ్ ఆబ్జర్వర్లను దక్షిణాది వారిని కాకుండా ఉత్తరాది వారిని ఎందుకు సెలెక్ట్ చేశారు?

stalin 17042019

బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమైన కేఏ పాల్.. జాతీయ పార్టీల నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే, జేడీఎస్ తదితర పార్టీల మద్దతు ఉందంటున్నారు. తిరిగి అధికారంలోకి రావడానికి బీజేపీ అస్త్రశస్త్రాలు ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. న్యాయపోరాటంలో భాగంగా ఒకటి, రెండ్రోజుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న కేఏ పాల్.. థర్డ్ ఫేజ్ నుంచి లోక్‌సభ ఎన్నికలు రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం కావాలని కోరారు. అలాగే చంద్రబాబుని కూడా తనతో కలిసి, మోడీ పై పోరాటం చెయ్యాలని కోరతానని చెప్పారు.

దేశ ఆర్థిక వ్యవస్థలో నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీమానిటైజేషన్ ఫలితాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగాలు ఊడిపోయాయని సంచలన నివేదిక ఒకటి బయటపడింది. బెంగుళూరుకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సస్టెయినబిలిటీ సంస్థ 2018లో నిరుద్యోగుల సంఖ్య 6 శాతం పెరిగిందని తెలిపింది. ఇది 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగిత కన్నా రెండింతలు ఎక్కువని పేర్కొంది. అంటే డీమానిటైజేషన్ అనంతరం దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగాలు ఊడాయని పేర్కొంది.

modireportcard 17042019

గత దశాబ్దంతో పోల్చితే ఈ దశాబ్దంలో నిరుద్యోగం రెండు రెట్లు పెరగడం వెనుక డీమానిటైజేషన్ ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2019 పేరిట వెలువడిన ఈ రిపోర్టులో 20 నుంచి 24వయస్సు కేటగిరీలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని తెలిపింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. నిరుద్యోగ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. అయితే ఎన్నికల వేళ విడుదలైన అన్ని ప్రధాన సర్వేల్లోనూ నిరుద్యోగ అంశమే మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశంగా ఉందని తేల్చాయి. అయితే ప్రస్తుతం విడుదలైన ఈ రిపోర్టు సర్వేలను ప్రతిబింబించడం విశేషం.

modireportcard 17042019

నివేదికలోని ముఖ్యాంశాలు... ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిలో ఉన్నత విద్యావంతులే ఎక్కువ. నిరుద్యోగిత శాతం కూడా వీరిలోనే అధికంగా ఉంది. 20-24 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో నిరుద్యోగిత ఎక్కువగా నమోదవుతోంది. ఈ వయసున్న పట్టణ యువకుల్లో 60 శాతం నిరుద్యోగిత నమోదైంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉన్నత విద్యనభ్యసించిన యువకుల్లో 20% నిరుద్యోగులుగా ఉన్నారు. గత రెండేళ్ల కాలంలో ఉన్నత విద్యావంతులకు ఉద్యోగావకాశాలు కూడా భారీగా తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం మాదిరిగానే పట్టణాల్లో రోజుకు రూ.500వేతనంతో సంవత్సరానికి 100రోజుల పాటు ఉపాధి కల్పించే పథకం రూపకల్పన చేయాలని రీసెర్చర్లు కేంద్రానికి సిఫార్సు చేశారు.

తన పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన మాజీ బ్యూకోక్రాట్‌లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారులను బదిలీ చేస్తే.. రిటైర్డ్ ఐఏఎస్‌లు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఉన్నమాట అంటే తనపైనే ఫిర్యాదు చేస్తారా? అని అన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం మీద కేసులు లేవా? అని సీఎం ప్రశ్నించారు. ఏకపక్షంగా అలాంటి వ్యక్తిని ఎలా సీఎస్‌ను చేస్తారని అన్నారు. ఇలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన సీఎం.. తనపై మాజీ బ్యూరోక్రాట్‌లు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై స్పందించారు. సాయంత్రం ఐదారు గంటల సమయం అంటే పోలింగ్ రోజు ఎంతో కీలకం అని.. అలాంటి సమయంలో మొక్కలు నాటడానికి వెళ్తారా? అని ఫైర్ అయ్యారు.

cbnias 17042019

ఆ సమయంలో డీజీతో సీఎస్ సమావేశం కావాల్సిన అవసరమేంటన్నారు. ఇలా అయితే ఎన్నికలను ఎవరు నమ్ముతారని వ్యాఖ్యానించారు. సీఈసీ అరోరా ఢిల్లీలో కూర్చొని ఫోజులు కొడుతున్నాడంటూ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొన్ని చోట్ల ఈవీఎంలను తీసుకెళ్లి.. 24 గంటలు ఇంట్లో పెట్టుకుని తీసుకొచ్చారని సీఎం ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలను నరేంద్ర మోదీ భ్రష్టు పట్టిస్తున్నారని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. దేశాన్ని దోపిడీ చేసి విదేశాలకు పారిపోతున్న వారికి మోదీ కాపలాకాశారంటూ నిప్పులుచెరిగారు. ఇప్పుడు దేశానికి కాపలాదారుడినని మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరలు, రూపాయి విలువ ఇవన్నీ మోదీ ఘోరాతిఘోర వైఫల్యాలుగా పేర్కొన్నారు. 2 వేల నోటు తెచ్చిన మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

cbnias 17042019

‘‘వీవీప్యాట్‌లను లెక్కించమంటే కుదరదంటున్నారు.. వీవీప్యాట్‌లు ఎందుకు పెట్టారు.. అలంకారం కోసమా?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై ఏకపక్ష దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దేశంలో ఎన్నికల కమిషన్‌ ఉందా? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వీవీప్యాట్‌లు లెక్కించమంటే ఎందుకు భయపడుతున్నారని సీఎం ప్రశ్నించారు. మోసం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లే భయపడతారని, మోదీ తన బండారం బయటపడుతుందని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ మీద ఇప్పటి వరకు మార్గదర్శకాలు ఎందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read