కేసీఆర్ వ్యవహార శైలి తెలిసినవాళ్ళు, అతను ఎలా మాట మారుస్తాడో, ఒకసారి దెయ్యం అని, ఒకసారి దేవత అని ఎలా పోగుడుతారో బాగా తెలుసు. ముఖ్యంగా సోనియా గాంధీ లాంటి పవర్ఫుల్ లేడీనే తన వైఖరితో తిప్పలు పెట్టారు కేసీఆర్. తెలంగాణా ఇచ్చిన వెంటనే, మా పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేస్తాం అని చెప్పి, తరువాత సోనియాని ఒక ఆట ఆడారు కేసీఆర్... ఇప్పుడు కూడా బీజేపీతో అదే ఆట మొదలు పెట్టారు. ఎన్నికల్లో మోడీ సపోర్ట్ తీసుకుని, గట్టెక్కిన కేసీఆర్, మోడీ శత్రువు అయిన చంద్రబాబు పై కూడా కుట్రలు చేసారు. అయితే, పైన ఉన్నది, సోనియా కాదు, మోడీ.. గుజరాతీ తెలివితేటలు మాములుగా ఉండవు.. అందుకే ఇప్పటి నుంచె కేసీఆర్ ను కంట్రోల్ లో పెట్టుకుంటున్నారు. ఫలితాలు తేడా కొడితే, కేసీఆర్ ఎలా ఆట ఆడతారో తెలుసు, అందుకే ఇప్పటి నుంచే కేసీఆర్ ను గుప్పెట్లో పెట్టుకుంటున్నారు, మోడీ, షా..

 

kcr 28042019

ఇందులో భాగంగా, తెలంగాణలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ఆదాయ పన్ను శాఖ కన్నేసింది. ఎన్నికల కమిషన్‌కు, ఆదాయ పన్ను శాఖకు వారే స్వయంగా సమర్పించిన పత్రాల్లోని భారీ వ్యత్యాసాలపై దృష్టి సారించింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆస్తులు, అప్పుల్లోని భారీ వ్యత్యాసాల నిగ్గు తేల్చేందుకు నోటీసులు జారీ చేసింది. 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లతోపాటు ఐటీ రిటర్నులను సమర్పించాలని స్పష్టం చేసింది. ఆయా పత్రాల్లో ఆస్తులు, అప్పుల లెక్కలకు సంబంధించి భారీ తేడాలు ఉంటే.. అందుకు కారణాలను ఆధారాలతో సహా వివరించాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేనా, 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా, టీఆర్‌ఎస్‌ తరఫున 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌, అంతకు ముందు సంవత్సరాల్లో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల వివరాలను అందజేయాలని ఐటీ శాఖ తన నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

 

kcr 28042019

నిజానికి, గత ఏడాది డిసెంబరులో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కానీ, ఆయా రాష్ట్రాల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కూడా ఐటీ శాఖ నుంచి ఎటువంటి నోటీసులూ వచ్చిన సమాచారం లేదు. దాంతో, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ ఆస్తులు, అప్పుల లెక్కలను మరోసారి సరి చూసుకునే పనిలో పడ్డారు. ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలోని సమాచారం, ఐటీ రిటర్న్స్‌ వివరాల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయేమోనని చెక్‌ చేసుకుంటున్నారు. ఈ నోటీసులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. కేవలం ముఖ్యమంత్రికే కాదు.. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఈ నోటీసులు జారీ చేసింది.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి రహస్య మంతనాలు నిర్వహించా రు. వీరిద్దరే దాదాపు గంటసేపు శనివారం సమావేశం అ య్యారు. దీంతో మిథున్‌రెడ్డి సీఈవోతో ఏం చర్చించారు? ఎవరిపైనైనా ఫిర్యాదు చేశారా? అనే విషయాలేవీ బయటకు తెలియలేదు. వైసీపీకి చెందిన మరో నేత తలసిల రఘురామ్‌తో కలిసి సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి మిథున్‌రెడ్డి వచ్చారు. రఘురామ్‌ బయటే ఉండిపోగా.. మిథున్‌రెడ్డి ఒక్కరే సీఈవో గదిలోకి వెళ్లి.. గంట తర్వాత వచ్చారు. మీడియాకు ఏమి చెప్పకుండానే కారెక్కి వెళ్లిపోయారు.

mithunreddy 28042019

ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచీ వైసీపీతోపాటు వివిధ పార్టీల నాయకులు సీఈవోను కలిశారు. ఎందుకు కలుస్తున్నదీ మీడియాకు వెల్లడించారు. ఫిర్యాదు లు, వినతిపత్రాలు ద్వివేదికి అందజేస్తూ వాటి తాలూకా ఫొ టోలు, వీడియోలను మీడియాకు విడుదల చేసేవారు. సీఈ వో ఆఫీసు నుంచి బయటకొచ్చిన తర్వాత ఎందుకు కలిసిందీ? ఏమని ఫిర్యాదు చేసిందీ అక్కడున్న విలేకరులకు చెప్పేవారు. వీటన్నింటికీ భిన్నంగా మిథున్‌రెడ్డి, సీఈవోల భే టీ సాగింది. ఓట్ల లెక్కింపునకు ఇంకా 20రోజులకు పైగా సమయం ఉంది. ఇలాంటి తరుణంలో మిథున్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో ఏకాంత చర్చల మర్మం ఏమిటో అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

 

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో కాషాయదళానికి కనీసం 80 స్థానాలు కూడా రావని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా ఓట్లు చీలిపోతాయని అన్నారు. అంతేకాకుండా 440 వోల్టుల విద్యుత్ ఎంత ప్రమాదకరమో, బీజేపీ కూడా అంతే ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. బీజేపీ దేశానికి అతిపెద్ద ముప్పు అని అభివర్ణించారు. అందుకే ప్రజలు ఆ పార్టీకి దూరంగా ఉండాలని, పొరబాటున కూడా ఆ పార్టీకి మద్దతుగా ఓటేయవద్దని విజ్ఞప్తి చేశారు.

mamatha 27042019

అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం దేశానికి ఎలాంటి నష్టం ఉండదని, ఆ మేరకు తాను హామీ ఇస్తానని అన్నారు. హుగ్లీ జిల్లాలోని పండువాలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మమత మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. "బీజేపీ, మోదీ రెండోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఆ పార్టీ నిండా నిరక్షరాస్యులే. వాళ్ల నుంచి మనం ఏం ఆశిస్తాం చెప్పండి!" అంటూ విమర్శించారు. మోదీ హయాంలో దేశంలో ఘర్షణలు, కల్లోలాలు విపరీతంగా జరిగాయని మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

mamatha 27042019

మమతా బెనర్జీ తనకు ఏటా మిఠాయిలు పంపుతారని ప్రధాని మోదీ పేర్కొనడంపై దీదీ భిన్నంగా స్పందించారు. తాను ప్రధాని మోదీకి బెంగాల్ రసగుల్లాలు పంపుతుంటానని, లడ్డూలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వాడినట్టుగా ఈసారి ఆ మిఠాయిల్లో ఇసుక, గులకరాళ్లు ఉండేలా చూస్తానని.. దీంతో ఆయన పళ్లు ఊడటం ఖాయమన్నారు. గతవారం ఇదే పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన మోదీ ప్రధాని పదవికి వేలం వేయరని మమతపై చురకలు వేయడం.. అలాగే ఓ ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ తనకు ఏటా బహుమతులు, రెండు కుర్తాలు పంపుతుంటారని చెప్పడంతో దీదీ ఇలా స్పందించారు.

రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి ఫెడరల్ ఫ్రంట్ విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతిస్తున్నట్టు చెబుతున్నారని, కానీ, ఆయన ఏ కోణంలో మద్దతిస్తున్నారో చెప్పాలని కోరారు. 'వైసీపీ శాసనసభ్యులు టీడీపీలో చేరేలా అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించాడంటూ రెండేళ్ల పాటు ఏపీ అసెంబ్లీని బహిష్కరించారు. మరి, తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వ్యక్తి ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతు ప్రకటించడం ఏమైనా న్యాయమా? ఏపీలో తప్పయిన ఫిరాయింపులు తెలంగాణలో ఏ విధంగా ఒప్పవుతాయో జగన్ చెప్పాలి.

jagan 27042019

కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై జగన్ అభిప్రాయం ఏంటో వివరించాలి' అంటూ విజయశాంతి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. అయితే, దీనిపై ఇటు వైసీపీ నేతలు కానీ, అటు టీఆర్ఎస్ నేతలు కానీ ఎవరూ స్పందించలేదు. రాములమ్మ ఫేస్‌బుక్ పోస్ట్ యథావిథిగా... " కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తామని వైసీపీ అధినేత జగన్ గారు చెబుతున్నారు. ఈ సందర్భంగా నేను జగన్ గారిని అడిగేది ఒకటే... వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేరేందుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించారనే కారణంతో గత రెండేళ్ల పాటూ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలంతా బహిష్కరించారు. ఏపీలో పార్టీల ఫిరాయింపుపై తిరుగుబాటు చేస్తూ,"

jagan 27042019

"తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభాలు పెడుతున్న కేసీఆర్ గారితో కలిసి, జాతీయ స్ధాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని జగన్ గారు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం. ఏపీలో తప్పైతే తెలంగాణలో ఎలా ఒప్పవుతుందో జగన్ గారు వివరణనివ్వాలి. కేసీఆర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం జగన్ గారి దృష్టిలో తప్పా, ఒప్పా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది" అని విజయశాంతి చెప్పుకొచ్చారు. అయితే రాములక్క వ్యాఖ్యలపై టీఆర్ఎస్, వైసీపీ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Advertisements

Latest Articles

Most Read