పూజలు, మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేయడానికి కొందరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తమ మాట వింటే... సామాన్యులతో పాటు పెద్ద పెద్ద వాళ్లను కూడా మోసం చేయడానికి వీరు ఏ మాత్రం వెనుకాడరు. అలా పూజల పేరుతో ఏకంగా ఓ ఎమ్మెల్యేకే టోకరా వేయబోయిన ఇద్దరు వ్యక్తులు... తమ టైమ్ బాగులేకపోవడంతో కటాకటాలపాలైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆమంచి కృష్ణ మోహన్‌‌కు టోకరా ఇచ్చేందుకు ట్రై చేశారు ఇద్దరు వ్యక్తులు. ఎమ్మెల్యేకు నరదిష్టి ఎక్కువగా ఉందని, దిష్టి పోవాలంటే పూజలు చేయాలని చెప్పారు.

koya 3042019

వీరు హైదరాబాద్‌కు చెందిన కోయదొరలుగా పరిచయం చేసుకుని చీరాలలోని ఆమంచి కృష్ణ మోహన్ ఇంటికి వచ్చారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన కోయదొరలు చిన్న చిన్న పూజలు చేసి రూ.5వేలు తీసుకున్నారు. ఈ పూజలతో నరదిష్టి పోదని.. మొత్తం నరదిష్టి పోవాలంటే పెద్ద పెద్ద పూజలు చేయాలని నమ్మించారు. అందుకు రూ.12లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంతకుముందు పెద్దపెద్ద సినిమా వాళ్లకు, పేరుమోసిన రాజకీయ నాయకులకు పూజలు చేశామని ఇప్పుడు వారి పరిస్థితి బాగుందని నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి.. ఎవరెవరికి పూజలు చేశారని ప్రశ్నించారు.

koya 3042019

వారు చెప్పిన పేర్లతో అనుమానం వచ్చిన ఆమంచి.. క్రాస్ ఎంక్వైరీ చేశారు. హైదరాబాద్ ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకున్నారు. కోయదొరలు మోసగాళ్లు అని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు...ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి వారిని కుమారబాబు, సహదేవుడుగా గుర్తించారు. ఎమ్మెల్యే కాకుండా ఇంకెంతమందితో ఇలాంటి పూజల పేరుతో మోసాలకు పాల్పడ్డారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆమంచినే నమ్మించగలిగాడు అంటే వాళ్లు మాములోళ్లు కాదంటూ చీరాలలో డిస్కషన్ జరుగుతోంది.

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని మే-01న ఏపీలో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఎన్నికల కోడ్ నిబంధనల అడ్డంకులతో ఏపీలో రీలీజ్ చేయలేపోయిన చిత్రబృందం మే-1న రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేసింది. తాజాపరిణామాలను చూస్తే రెండోసారి కూడా రిలీజ్‌ కష్టమేనని తెలుస్తోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర విడుదలపై ఏప్రిల్ 10న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తేల్చిచెప్పింది. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంపై ఏప్రిల్‌ 10న ఈసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఈసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

rgv 30042019

కాగా.. ఆర్జీవీ మూవీతో పాటు మరో రెండు చిత్రాలపై ఏప్రిల్ 10న ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. మార్చి 10 నుంచి కోడ్ అమల్లోకి రావడంతో బయోపిక్‌ల విడుదలపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ సినిమాల ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో సినిమాల విడుదలపై ఆంక్షలు విధించడం జరిగింది. కాగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఏప్రిల్ 10న జారీ చేసిన ఆదేశాలు అమల్లో ఉంటాయని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా రిలీజ్ చేసుకోవచ్చని ఇంతవరకూ ఈసీ ఎక్కడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని అధికారులు చెబుతున్నారు. సినిమా థియేటర్లలో ప్రదర్శనలకు అనుమతి ఇవ్వొద్దని ఎన్నికల సంఘం సూచించింది.

rgv 30042019

ఇదిలా ఉంటే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై ఏప్రిల్ 10న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఎన్నికల సంఘం పంపింది. ఏప్రిల్ 25న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదల కోరుతూ ఎన్నికల సంఘానికి ఆర్జీవీ లేఖ రాయడంతో ఉత్తర్వులు ఇలా జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వుల ప్రకారం తాము నడుచుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. మొత్తానికి చూస్తే.. ఆర్జీవీ తెరకెక్కించిన మూవీ రెండోసారి విడుదలకు కూడా బ్రేక్ పడినట్లేనని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యవహారంపై వర్మ ఎలా ముందుకెళ్తారు..? అసలు సినిమా రిలీజ్ అవుతుందా..? కాదా..? అనేది తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే మరి. కాగా ఇంత జరుగుతున్నా చిత్రబృందం మాత్రం నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.

 

 

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రకాశం జిల్లా పామూరు మండలానికి చెందిన కె రవికిరణ్‌శర్మ, శ్రీనివాసులు ఇరువురు తమ మద్దతుదారులతో కలిసి సోమవారం వారణాసిలోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఇరువురికి స్థానికంగా ఉండే లాయర్లు, మేధావి వర్గం వారు మద్దతును ఇచ్చి నామినీలుగా కూడా పలువురు మద్దతు తెలిపినట్లు వారణాసి ఎంపీ అభ్యర్థులు అయిన రవికిరణ్‌శర్మ, శ్రీనివాసులు తెలిపారు. కనిగిరి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, వెలుగొండ ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రచారం ద్వారా వివరిస్తున్నామన్నారు. తమతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది మోదీపై నామినేషన్ వేసేందుకు తరలి వచ్చారన్నారు.

modi 30042019

పలువురిని నామినేషన్ దాఖలు చేయడానికి రానివ్వకుండా పలువురు అడ్డుకున్నారని వారు పేర్కొన్నారు. తాము గెలుపుకోసం పోటీ చేయలేదని కనిగిరి ప్రాంతంలో కిడ్ని , ఫోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని, ఈ సమస్యలను జాతీయ స్థాయిలో తెలియజేసేందుకు తాము పోటీలో నిలిచినట్లు వారు తెలిపారు. పోలింగ్ జరిగే వరకు తాము వారణాసిలో ఉంటామన్నారు. మరో పక్క, నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు వారణాసికి బయలుదేరివెళ్లిన నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాము మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేయకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ స్థానిక రైతులు సోమవారం వారణాసిలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పంటకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్‌తో జాతీయ పార్టీల దృష్టిని ఆకర్షించేందుకు వీలుగా ఈ నెల 25వ తేదీన నిజామాబాద్ నుండి సుమారు 45మంది రైతులు వారణాసికి తరలివెళ్లిన విషయం విదితమే.

modi 30042019

నిజామాబాద్ నియోజకవర్గంలో మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైనప్పటికీ, ఆశించిన ఫలితం సమకూరలేదనే భావనతో ఏకంగా ప్రధాని మోదీపై మూకుమ్మడిగా పోటీకి దిగితే తమ సమస్య పట్ల మరింత చర్చ జరుగుతుందని భావించిన రైతులు అనేక వ్యయప్రయాసాలు కోర్చి వారణాసికి చేరుకున్నారు. అయితే అక్కడి అధికారులు దక్షిణాది రైతులకు సహకరించకపోగా, మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా అడ్డంకులు సృష్టించారని అన్నదాతలు వాపోతున్నారు. తాము 26వ తేదీన వారణాసికి చేరుకున్న నాటి నుండే తమను పోలీసులు నీడలా వెంటాడుతూ, తమ నామినేషన్లను బలపర్చేందుకు ముందుకు వచ్చిన మద్దతుదారులను బెదిరింపులకు గురి చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. తమతో పాటు తమిళనాడుకు చెందిన రైతులను సైతం నామినేషన్లు వేయకుండా అక్కడి పోలీసులు, అధికారులు కావాలనే అడ్డంకులు సృష్టించారని, వీటిని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగిందని వివరించారు. తాము గంట పాటు నిరసన తెలిపినప్పటికీ, ఏ ఒక్క అధికారి కూడా వచ్చి సమస్య ఏమిటంటూ ఆరా తీయలేదన్నారు.

దొంగే, దొంగా దొంగా అనటం, మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష బ్యాచ్ కి బాగా అలవాటు. సొంత బాబాయ్ హత్యలో వీళ్ళు ఆడిన గేమ్ మనం చూసాం.. తరువాత ఫారం 7 విషయంలో, వీళ్ళే గేమ్ ఆడి, అది తెలుగుదేశం మీద తోసెయ్యటం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఐడియాతోనే వస్తున్నారు. కాకపోతే, ఈ సారి మాత్రం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అసలు విషయం ఏమిటి అంటే, కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఏపీలో ఓట్ల లెక్కింపు ముందు అల్లర్లు జరిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు టీడీపీ ఆటంకం కల్పించే ఛాన్స్‌ ఉందన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ముందస్తు భద్రత ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

vsreddy 30042019 2

ఆటంకాలను అధిగమించేందుకు ఈసీ కఠినంగా ఉండాలన్నారు. కౌంటింగ్‌ జరిగేంత వరకు ఎన్నికల అబ్జర్వర్‌ కౌంటింగ్‌ హాల్‌లోనే ఉండాలన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియను ముందుగానే పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సందర్భంగా ఏపీలోని అధికార పార్టీ గొడవలు సృష్టించే అవకాశం ఉందనివిజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కౌంటింగ్ సందర్భంగా అధికార పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు ఫోర్జరీ 17సి ఫామ్‌లు తీసుకొచ్చి కౌంటింగ్ సూపర్‌వైజర్లతో వాదనకు దిగే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కావొచ్చని అన్నారు. ఇలాంటి వారిపై ఈసీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలనీ... ఎన్నికల అబ్జర్వర్లు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. కౌంటింగ్ ఏజెంట్ల అప్రూవల్ అంశంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరుగుతోందని అన్నారు.

vsreddy 30042019 3

చివరి నిమిషంలో హడావిడి లేకుండా ఈ ప్రక్రియను ముందుగానే ముగించాలని ఈసీని కోరారు. కౌంటింగ్ ఏజెంట్లు అగ్గిపెట్టెలు, కత్తులు, కత్తెర్లు, వాటర్ బాటిల్స్ తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ హాల్స్ దగ్గర పటిష్టమైన బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇనుప మెస్‌లు ఏర్పాటు చేయాలి. అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గరా రాష్ట్ర పోలీసులకు బదులుగా సీఆర్‌ఫీఎఫ్ బలగాలను మొహరించాలని సూచించారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందని లేఖలో విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ లేఖ చూసిన ప్రజలు, మళ్ళీ ఎదో పెద్ద స్కెచ్ వైసీపీ వేస్తుందని, వీళ్ళే గొడవలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read