సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీవీప్యాట్‌ ద్వారా ఏపీలో సుమారు 13 లక్షల పైచిలుకు ఓట్లను లెక్కించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం విలేకరులతో మాట్లాడుతూ స్పష్టంచేశారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధి లోని శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 70 వీవీప్యాట్లను లెక్కింపు కోసం ర్యాండమ్‌గా ఎంపికచేస్తామని వివరించారు. ఆ తర్వాత తుది ఫలి తాలు వెల్లడి ఆలస్యమయ్యే అవకాశ ముందని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున మధ్యాహ్నం 12 గంటలకే ఫలితాల సరళి తెలిసే అవకాశమున్నప్పటికీ తుది ఫలితాలు మాత్రం రాత్రి 12 గంటల వరకు సమయం పట్టే వీలుందని ద్వివేది స్పష్టంచేశారు.

ec 30042019

ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు ప్రక్రియ చేపడతామని, అభ్యర్ధులు, ఏజెంట్ల సమక్షంలో వీవీప్యాట్‌ల ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తా మన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తో దేశ వ్యాప్తంగా ఫలితాలు వెల్లడిలో జాప్యం అనివార్యమని తెలిపారు. ఒక్కో అసెంబ్లి పరిధిలో ఐదు అసెంబ్లి, ఐదు లోక్‌సభ వీవీ ప్యాట్‌ యంత్రా ల్లోని స్లిప్పులను లెక్కిస్తామని చెప్పా రు. ఒక్కో వీవీప్యాట్‌లో సుమారు వెయ్యి ఓట్ల వరకూ పోల్‌ అయ్యే అవ కాశముందని ఆయన అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1750 వీవీ ప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాల్సి ఉంద న్నారు. మొదట అసెంబ్లి ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. లోక్‌సభ ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం జరిగే అవకాశముందన్నారు.

ec 30042019

సగటున ఒక్కో వీవీప్యాట్‌ ఓట్ల లెక్కింపు గంట నుండి గంటన్నర సమయం పట్టే అవకాశముందని తెలిపారు. ఒక్కో అసెంబ్లి నియోజకవర్గం పరిధిలో ఒక దాని తరువాత మరొక వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కింపును చేపడతామన్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోయిన తరువాతే ఫలితాలను వెల్లడిస్తామని ద్వివేదీ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఈవో నో కామెంట్‌ అంటూ సమాధానం దాటవేశారు. కౌంటింగ్‌ ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష వివాదాస్పదం అయిన అంశంపై విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా సమాధానం చెప్పేందుకు నిరాసక్తత కనబర్చారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిఘా కెమేరాలు పనిచేయడంలేదనే ఆరోపణలపై కూడా ఆయన సమాధానం దాటవేశారు. ఈసీకి కలెక్టర్లు సహకరించడంలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అంటూ విలేకరులు ప్రశ్నించగా దానిపై కూడా ఆయన నో కామెంట్‌ అంటూ సమాధానమిచ్చారు. విలేకరుల సమావేశం సందర్భంగా సీఈవో తాను చెప్పదల్చుకున్న నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోవడం గమనార్హం.

మంచు మనిషి (యతి) హిమాలయాల్లో ఉంటున్నారని కొన్నేళ్లుగా ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది. తాము యతిని చూశామని ఇదివరకు కొందరు అస్పష్టమైన ఫొటోలు కూడా విడుదల చేశారు. అవన్నీ గ్రాఫిక్సేనని కొట్టిపారేశారు చాలామంది. అంతెందుకు హాలీవుడ్ మూవీ మమ్మీ సిరీస్‌లో వచ్చిన మూడో సినిమా మమ్మీ టోంబ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపెరర్‌లో చాలా యతిలను చూపించారు. ఈ మిస్టీరియస్ జీవి ఉందా లేదా అన్న చర్చ అలా కొనసాగుతుండగా... అది ఉంది అని నిరూపించే పాద ముద్రలను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఇప్పుడు నిజంగానే హిమాలయాల్లో మంచు మనిషి జాడలు కనిపించాయట. మన ఇండియన్ ఆర్మీనే నిర్దారించింది. నేపాల్ సమీపంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలు ఉన్నట్లు ఆర్మీ తెలిపింది.

yati30042019 1

ఏప్రిల్‌ 9న సైనికుల బృందం హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లింది. నేపాల్ సమీపంలో మకలు బేస్‌ క్యాంప్‌ సమీపంలో మంచు మనిషి అడుగులను బృందం గుర్తించింది. ఈ పాదముద్రలు 32 అంగుళాల పొడవు 15 అంగుళాల వెడల్పుతో ఉన్నాయని.. వీటిని పరిశీలించిన ఆర్మీ అధికారులు కచ్చితంగా ఈ అడుగులు ‘యతి’వే అంటున్నారు. ఫోటోలను కూడా ఆర్మీ ట్వీట్ చేసింది. అంతేకాదు గతంలో మకలు-బరున్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో మంచి మనిషి (యతి) అడుగులు కన్పించినట్లు సైన్యం చెబుతోంది. మంచుకొండల్లో మంచు మనిషి (యతి) అడుగుల ఫోటోలను ఆర్మీ అధికారులు చేసిన ట్వీట్‌కు నెటిజన్లు, పర్వతారోహకులు ఆసక్తికరంగా స్పందించారు.

yati30042019 1

నిజంగానే మంచు మనిషి ఉన్నాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి పురాణాల్లో వినడమో లేక పాత సినిమాల్లో చూసి ఉండటమో జరిగి ఉంటుంది. కానీ నిజంగానే మంచు మనిషి ఉన్నాడా అంటే నమ్మశక్యంగా లేదంటున్నారు. హిమాలయాలతోపాటూ సైబీరియా, తూర్పు, మధ్య ఆసియాలో కూడా యతి లాంటి జీవులు ఉన్నాయని చెబుతున్నారు. యతి ఓ దైవ సమానమైన జీవి అనీ, దాదాపు తోడేలులా ఉంటుందనీ, రాయితో తయారు చేసిన భారీ ఆయుధాన్ని చేతబట్టి... విజిల్ సౌండ్ చేస్తూ వెళ్తుందని హిమాలయాల ప్రజలు నమ్ముతున్నారు. మొత్తానికి ఫొటోలు రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ కావడంతో యతి ఉందన్న అంశంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ పై, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలంగాణా ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన నెటిజన్లు మండిపడుతున్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి అడుగులేస్తున్న జగన్.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో 19 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కనీస సానుభూతి కూడా ప్రకటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఒక సినీ దర్శకుడి విషయంలో అన్యాయం జరిగిందంటూ ఆగమేఘాలపై ట్వీట్ చేసిన జగన్‌కు విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే ధైర్యం లేదా అని తెలంగాణ ప్రాంతానికి చెందిన మెజార్టీ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యమా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే విద్యార్థుల ఆత్మహత్యలు వాస్తవం.

jagan 29042019

నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు చనిపోయారన్నది వాస్తవం. ఇంటర్ బోర్డ్ ముందు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తే.. వారిని ఈడ్చుకెళ్లి బలవంతంగా అరెస్టులు చేసిన దృశ్యాలు జగన్‌కు కనిపించడం లేదా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల బాధితులకు సానుభూతి తెలుపుతూ, ఉగ్రచర్యలను ఖండిస్తున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. జగన్ ఈ ట్వీట్ చేయడం హర్షించదగ్గ విషయమే. అదే.. తెలంగాణ విద్యార్థుల విషయంలో జగన్‌ మానవత్వం ఎందుకు సన్నగిల్లిందనేది ఇక్కడ అసలు ప్రశ్న. రాజకీయ ప్రయోజనాలతో తీసిన రాంగోపాల్ వర్మ సినిమాపై ఉన్న శ్రద్ధ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌పై లేకపోవడం జగన్ బాధ్యతారాహిత్యానికి, టీఆర్‌ఎస్‌తో ఉన్న ఒప్పందానికి నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంలో జగన్‌తో పోల్చుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు సంతృప్తి వ్యక్తం చేశారు.

jagan 29042019

విద్యార్థుల ఆత్మహత్యల గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు పలు ట్వీట్స్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్య వార్తలు బాధ కలిగించాయని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా.. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ఆయన కొన్ని ట్వీట్స్ చేశారు. స్వయంగా స్పందించకపోయినా.. సోషల్ మీడియా సాక్షిగానైనా జగన్ స్పందించి ఉంటే హుందాగా ఉండేదని, లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసిన రాంగోపాల్ వర్మకు మద్దతుగా ట్వీట్ చేసిన జగన్ కేవలం రాజకీయ ప్రయోజనాలు ఉంటే మాత్రమే స్పందిస్తాననే రీతిలో వ్యవహరించారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్న జగన్‌కు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు చేసిన తప్పేంటని ప్రశ్నించే దమ్ము లేకపోవడం శోచనీయమని విద్యార్థులకు మద్దతు తెలుపుతున్న నెటిజన్లు నిట్టూరుస్తున్న పరిస్థితి.

పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ వ్యవహరిస్తున్నారంటూ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కోడ్‌ ఉల్లంఘనేనని, మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని వ్యవస్థలనూ మోదీ నాశనం చేశారని, తాజాగా ప్రజాస్వామ్యాన్నీ నాశనం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.

cbn tweet 29042019 1

"ప్రధాని తన వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి ద్రోహం తలపెడుతున్నారు. ప్రధాని హోదాను దిగజార్చుతున్నారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలకు ఇది పరాకాష్ట. అయినా, ఓ రాష్ట్ర శాసనసభ్యులు తనతో టచ్ లో ఉన్నారని చెప్పడం దేశ ప్రధాని స్థాయికి తగిన విషయం కాదు. ఇది కచ్చితంగా అనైతిక వ్యవహారమే! ఎన్నికల సంఘం నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలా? ఈ సిగ్గుమాలిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి ప్రధానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి" అంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 40 మంది శాసనసభ్యులు భాజపాతో టచ్‌లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు వెల్లడికాగానే వారు తమవైపు వచ్చేస్తారన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సీరామ్‌పుర్‌లో సోమవారం ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

cbn tweet 29042019 1

మోదీ మాట్లాడుతూ..‘దీదీ, మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. అన్నిచోట్లా కమలం వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని విడిచి వెళ్లిపోతారు. ఇప్పటికే మీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు’ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మీకు ప్రభుత్వాన్ని నడిపించడం కష్టంగా మారనుందని హెచ్చరించారు. గత మూడు సంవత్సరాల కాలంలో ప్రజలను దారుణంగా మోసగించారని, ఈ ప్రభుత్వం అవినీతిమయమైందని దుయ్యబట్టారు. ‘దేనికి అనుమతి, అడ్మిషన్ ఇవ్వాలన్నా ప్రజలు డబ్బులు చెల్లించాల్సిందే. దాన్ని వ్యతిరేకించిన వారిని మమత ప్రభుత్వం శిక్షిస్తుంది’ అని విరుచుకుప్డడారు.

Advertisements

Latest Articles

Most Read