రాష్ట్రంలో వింత పరిస్థితి చోటు చేసుకుంది. ఎక్కడైనా ప్రజలు తప్పు చేస్తే, పోలీసులు మందలిస్తారు. కాని మన రాష్ట్రంలో పోలీసులు తప్పు చేస్తుంటే, ప్రజలు మందలించిన సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైనా అత్యంత విలువైంది ఉంది అంటే అది బంగారం కాదు, డైమండ్ కాదు, డబ్బు కాదు.. అదే ఇసుక.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇసుక కోసం తపించి పోతున్నారు. దాదపుగా 20 లక్షల మంది కార్మికులు ఇసుక లేక రోడ్డున పడ్డారు. ఇసుక లేక అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఇసుక బస్తాలలో అమ్ముతున్న పరిస్థితి వచ్చింది. సిమెంట్ బస్తా కంటే, ఇసుక బస్తా రేటు ఎక్కువ ఉంది. ఇలాంటి ఇసుక కోసం, ఇప్పుడు దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఇసుక బంగారం అయ్యి కూర్చుంది. దీంతో ఇప్పుడు పోలీసులు కూడా దొంగ చాటుగా తెచ్చుకునే పరిస్థితి.

police 06082019 2

వివరాల్లోకి వెళ్తే, జగన్ మోహన్ రెడ్డి ఇల్లు ఉంటున్న తాడేపల్లి పోలీసులకు ఇసుక సెగ తగిలింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న బాత్ రూమ్ కట్టేందుకు, పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎక్కడా ఇసుక దొరకటం లేదు. బ్లాక్ లో కొందాం అంటే, వేలకు వేలు పెట్టాల్సిన పరిస్థితి. దీంతో పోలీసులకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. అయితే వారికి ఒక ఆలోచన వచ్చింది. సరిగ్గా వీరు ఈ ఇబ్బంది పడుతున్న టైంలోనే, ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని, నాలుగు ట్రాక్టర్ లని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ నాలుగు ట్రాక్టర్లలో కేవలం ఒక్క ట్రాక్టర్ మాత్రమే లోడ్ అయ్యి ఉంది. మిగతా మూడు ట్రాక్టర్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో తాడేపల్లి పోలీసులకు ఒక ఐడియా వచ్చింది. ఈ ఖాళీగా ఉన్న ట్రాక్టర్లు తీసుకుని బయలుదేరారు.

police 06082019 3

చివరకు దగ్గరలో ఉన్న ఇసుక ర్యాంప్ వద్దకు వెళ్లి, ఇసుకను ట్రాక్టర్లలో లోడ్ చేసుకుని, స్టేషన్ కు తీసుకువచ్చే ప్రయత్నం చేసారు. అయితే ఇంతలో అక్కడ ఉన్న గ్రామస్తులు, పోలీసులు చేస్తున్న పనిని చూసి అవాక్కయ్యారు. ఒక పక్క సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, పనులు లేక కూలి పని చేసుకునే వారు ఇబ్బందుల్లో ఉన్నారు, అలాంటిది ఇలా ఎలా చేస్తారు అంటూ పోలీసులకు అడ్డం తిరిగారు. అయితే మేము పోలీసులమని, ఈ ఇసుక మా సొంతానికి కాదు, పోలీస్ స్టేషన్ లో బాత్ రూమ్ కట్టటానికి అని చెప్పారు. అయినా గ్రామస్తులు వినలేదు. ట్రాక్టర్ ని అడ్డుకున్నారు. రూల్స్ ఎవరికైనా ఒకటే ఉంటాయని, అది ప్రజలు అయినా, ప్రభుత్వం లో ఉన్న వారు అయినా, పోలీసులు అయినా అంటూ ఎదురు తిరిగారు. దీంతో వ్యవహారం ముదరటంతో పోలీసులు అక్కడ నుంచి జారుకున్నారు. ఇవండీ మన రాష్ట్రంలో ఇసుక కష్టాలు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏమి జరుగుతుంది ? అసలు పనులు జరుగుతున్నాయా ? ఎప్పటి నుంచి పనులు ఆగాయి ? నవయుగ ఎందుకు పంపించారు ? కొత్త టెండర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెళ్తుంది ? ఈ అంశాల అన్నిటి పై సమగ్ర నివేదిక ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను ప్రధానమంత్రి కార్యాలయం నివేదిక కోరింది. జగన్ మోహన్ రెడ్డిని కలిసే ముందే, అన్ని వివరాలు ప్రధాని తెలుసుకుని, అందుకు అనుగుణంగా చర్చలు జరిపే అవకాసం ఉంది. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి వివరాలు తెలుసుకుంది పీఎంఓ. ఒక వేళ కొత్త టెండర్ పిలిస్తే, ఎదురయ్యే పరిణామాలు ఏంటి, కేంద్రం పై ఎంత భారం పడుతుంది వంటి అంశాలు పై వివరణ కోరారు.

polavaram 06082019 2

దీనికి సంబంధించి, ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రాధమిక నివేదికను ప్రధాని కార్యాలయానికి ఇచ్చిందని తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి పోలవరం పై చెప్పే వివరణను బట్టి, ప్రధాని ఆ నివేదికలోని అంశాలు బేరీజు వేసుకుని, మాట్లాడనున్నారు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని, అమిత్ షా తో భేటీ తరువాత, పోలవరం పై ఒక స్పష్టత వచ్చే అవకాసం ఉంది. ఇది ఇలా ఉంటే, పోలవరం ప్రాజెక్ట్ టెండర్ ని రద్దు చేస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, నవయుగని బయటకు పంపించి రివర్స్ టెండరింగ్ కి పిలవటం పై, పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే దీని పై, కేంద్ర జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమాధానం ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు బట్టారు.

polavaram 06082019 3

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించిందని, దీని వల్ల పోలవరం ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకొందో అర్ధం కావటం లేదని అన్నారు. మరో పక్క ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్. మొత్తం కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తుంది. మొన్నటి దాకా చంద్రబాబు ప్రభుత్వంలో, రాష్ట్రం పర్యవేక్షణ చేసి, పనులు పరగులు పెట్టించారు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం అన్ని ఖర్చులు ఆడిట్ చేసి, తరువాతే రీయింబర్స్‌మెంట్‌ చేసేవారు. నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ ను థర్డ్‌పార్టీగా నియమించి, ఆ సంస్థ నివేదికలు ఆధారంగా డబ్బుల ఇచ్చే వారు. దీని పై కూడా వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు, పోలవరంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే.

తెలుగు యువత అధ్యక్షుడు, గుడివాడ నుంచి తెలుగుదేశం తరుపున పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్, పార్టీ మారుతున్నారు అంటూ గత మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారని, జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో పని చేస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే చర్చలు అయిపోయాయని, దేవినేని అవినాష్ కు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు జగన్ అప్పచేప్తారని వార్తలు వచ్చాయి. దేవినేని అవినాష్ తో పాటు, కొంత మంది కార్పోరేటర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు, కడియాల బుచ్చిబాబు కూడా జగన్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం పై అవినాష్ కి కూడా మక్కువ ఉందని, తెలుగుదేశంలో ఉంటే అక్కడ గద్దె ఉండటం వల్ల, తనకు అవకాసం రాదని, అవినాష్ కూడా ఒప్పుకున్నట్టు ప్రచారం జరిగింది.

avinash 06082019 1

అయితే ఈ వార్తల పై అటు అవినాష్ కాని, అటు తెలుగుదేశం పార్టీ కాని, ఇటు వైసీపీ కాని అసలు స్పందించలేదు. ఈ నేపధ్యంలో అవినాష్ మనసులో ఏముందో ఎవరికీ అర్ధం కాలేదు. మూడు రోజులు ఖండించక పోవటంతో, అవినాష్ పార్టీ మార్పు ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే నిన్న చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్ పోర్ట్ కి రావటంతో, ఎప్పటిలాగే దేవినేని అవినాష్ వచ్చి, ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు. దీంతో అవినాష్ పార్టీ మారాడులే అని పార్టీ కార్యకర్తలు అనుకున్నారు. అయినా అవినాష్ ఖండించలేదు కదా అనే ఆందోళన. దీంతో ఈ ప్రచారాన్ని అంతటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, దేవినేని అవినాష్ ఈ రోజు పార్టీ మార్పు వార్తల పై ఒక్క ముక్కలో తేల్చేసారు.

avinash 06082019 1

ఈ రోజు తన ఆఫిషియల్ ఫేస్బుక్, ట్విట్టర్ పేజిలో, పార్టీ మార్పు వార్తల పై స్పందించారు. "నేను ఎల్లప్పుడూ తెలుగుదేశం తోనే చంద్రబాబు గారి తోనే. మీ దేవినేని అవినాష్" అంటూ ఒక్క ముక్కలో తేల్చేసారు. దీంతో పార్టీ మారతారు అంటూ చేసిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. నిజానికి దేవినేని నెహ్రు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అవినాష్, అనుకున్న దాని కంటే ఎక్కువే సక్సెస్ అయ్యారని చెప్పాలి. తండ్రి మరణం తరువాత కూడా, ఎక్కడా రాజకీయంగా తప్పటడుగులు వెయ్యలేదు. చంద్రబాబు మాటకు శిరసావహిస్తూ, ఎవరూ చెయ్యని సాహసం, గుడివాడలో పోటీ చేసి, కొడాలి నానికి చుక్కలు చూపించారు. ఓడిపోయినా, ధీటుగా బదులు ఇచ్చారు. పార్టీ ఘోర ఓటమి తరువాత, నాయకులు పెద్దగా పట్టించుకోక పోతే, చిన్నవాడు అయినా సరే, టిడిపి శ్రేణుల పై జరుగుతున్న దాడులుని ముందుండి ఎదుర్కున్నారు. అంత బలంగా అవతల జగన్ ఉన్నా లెక్క చెయ్యక, దాడులు జరిగిన వారి వైపు ఉంటూ, వారికి అండగా ఉన్నారు. ఇలాంటి నాయకులు ఇప్పుడు టిడిపికి అవసరం కూడా. అవినాష్ లాంటి వారికి, బలమైన నాయకులుగా ఎదగటానికి కూడా ఇదే మంచి అవకాసం.

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న వేళ, ప్రధానిని కలిసి వివిధ అంశాల పై చర్చించే వేళ, కేంద్రం జగన్ కు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాల పై దేశ వ్యాప్తంగా రాద్ధాంతం జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి, అటు ట్రిబ్యునల్, ఇటు హైకోర్ట్ అందరూ కలిసి జగన్ వైఖరిని ప్రశ్నిస్తున్నా, జగన్ మాత్రం మారటం లేదు సరి కదా, మరింత వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ ఒప్పందాల సమీక్ష దగ్గర నుంచి, ఇప్పుడు ఏకంగా మీ దగ్గర కరెంటు తీసుకోము అనే స్థాయికి వ్యవహారం వెళ్ళింది. దీంతో ఇప్పుడు కేంద్రం ఎంటర్ అయ్యింది. ఈ సారి మాత్రం సుతి మెత్తగా కాకుండా, ఘాటుగానే బదులు ఇచ్చింది. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ పొతే, మాకేం పట్టింది అనే విధంగా, చాలా ఘాటుగా రాష్ట్రానికి రెండో లేఖ రాసింది.

current 06082019 2

సోలార్, విండ్ ఎనర్జీ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇది కేంద్రం నుంచి వచ్చిన మూడో లేఖ. మేము చెప్పిన కారణాలు కాకుండా, మీ ఇష్టం వచ్చిన కారణాలు చూపించి, విండ్ , సోలార్ ఎనర్జీ విద్యుత్ తీసుకోకపోతే, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జేబులో నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కంపనీలకు చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. దీన్తి సంబందించి కేంద్ర పునర్వినియోగ విద్యుత్‌ శాఖ అదనపు కార్యదర్శి డీపీ యాదవ్‌ ఈ లేఖ పంపారు. సోలార్, విండ్ నుంచి విద్యుత్తును తప్పనిసరిగా రాష్ట్రాలు తీసుకోవాలనే నిబంధన ఎప్పుడూ ఉందనే విషయం గుర్తు చేసారు. గ్రిడ్ దెబ్బ తింటుంది లేక ఇతర ఏదైనా అత్యవసర పరిస్తితుల్లోనే, ఆ విద్యుత్ తీసుకోవటం ఆపే హక్కు ఉంటుందని తెలిపారు.

current 06082019 3

అలాంటి అత్యవసర పరిస్థితిలో కూడా మీరు విద్యుత్ తీసుకోవద్దు అనుకున్నా, ముందుగా విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలకు ఆ కారణం లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆ లేఖలో పెరుకొన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్, విండ్ నున్వి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను కావాలని ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాయని, పరోక్షంగా ఏపిని ఉద్దేశించి ఆ లేఖలో రాసారు. రాష్ట్రాలు కనుక కావాలని అలా చేస్తే, ఆ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు అంతా, రాష్ట్రమే తమ జేబులో నుంచి ఇవ్వాలని, ఈ ఆదేశాలు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదంతోనే పంపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మోడీతో ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాలి అనుకున్న ముందే, కేంద్రం నుంచి ఈ ఘాటు లేఖ రావటంతో, ప్రధాని మోడీని ఎలా కన్విన్స్ చెయ్యాలా అనే విషయం పై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది.

Advertisements

Latest Articles

Most Read