జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య ఎలాంటి స్నేహం ఉందొ అందరికీ తెలుసు. అయితే జగన్ మోహన్ రెడ్డి సియం అయిన తరువాత, అది వ్యక్తిగతం దాటి, ఏకంగా రెండు రాష్ట్రాల దాకా వెళ్ళింది. ప్రమాణస్వీకారం కూడా చెయ్యకుండా, జగన్ మోహన్ రెడ్డి, మన ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన సెక్రటేరియట్ భవనాలను కేసీఆర్ కు భేషరతుగా అప్పచెప్పారు. ఇప్పుడు తాజాగా ఏకంగా గోదావరి జలాలు మళ్ళించటానికి, మన ఆంధ్రప్రదేశ్ చేత, తెలంగాణా భూభాగంలో ప్రాజెక్ట్ కట్టించి, చెరి సగం పంచుకుందాం అంటున్నారు. ఇలా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అన్నీ ఇచ్చేస్తున్నారు కాని, తెలంగాణా నుంచి మాత్రం మనకు రావలసిన లక్ష కోట్ల ఉమ్మడి ఆస్థులు, విద్యుత్ బకాయలు మాత్రం, రావాటం లేదు. కేసిఆర్ గురించి తెలిసిన వారు, జగన్ ను హేచ్చిస్తున్నారు కూడా.

kcr 04082019 2

తన పార్టీని విలీనం చేస్తాను అని చెప్పి సోనియా గాంధీని, దళిత సియం అంటూ ప్రజలను, కేసీఆర్ ఎలా మోసం చేసారో చెప్తున్నారు. నమ్మించి మోసం చేస్తారు జాగ్రత్తా అని జగన్ తో ఎంత చెప్పినా, జగన్ మాత్రం వినటం లేదు. కారణం ఏంటో తెలియదు కాని, కేసీఆర్ ఏది చెప్తే అది అన్నట్టు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదిరిపోయే షాక్ ఇచ్చింది. 2014 నుంచి, అంటే ఏపి విభజన జరిగిన దగ్గర నుంచి, హైకోర్టు, రాజ్ భవన్, ఇతర ప్రభుత్వ సంస్థల నిర్వహణకు ఖర్చులు అన్నీ తెలంగాణా ప్రభుత్వమే పెట్టుకుందని, రూల్స్ ప్రకారం, ఏపి కూడా తన వాటా ఇవ్వాలని, మొన్నటి దాక చంద్రబాబుని అడగే ధైర్యం లేదు కాబట్టి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని, ఈ ఖర్చుల్లో, ఏపి వాటా అడుగుతుంది తెలంగాణా ప్రభుత్వం.

kcr 04082019 3

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయం నుంచి, ఇప్పటి వరకు, హైకోర్టు, రాజ్ భవన్, ఇతర ప్రభుత్వ సంస్థల నిర్వహణకు 42:58 నిష్పత్తి ప్రకారం ఖర్చులు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం కోరుతుంది. దీని ప్రకారం, 58 శాతం వాటాతో, ఆంధ్రప్రదేశ్ 290 కోట్లు కట్టాలని, తెలంగాణా ప్రభుత్వం అంటుంది. రాజ్ భవన్ లో అయిన ఖర్చులో ఏపి వాటా రూ.25 కోట్లు, హైకోర్టు నిర్వహణ ఖర్చులో, ఏపి వాటా రూ.230 కోట్లగా తేల్చి, ఏపి రాష్ట్ర ఆర్థిక శాఖకు వివరాలు పంపించారు. అంతే కాదు, తెలంగాణా నుంచి విద్యుత్ వాడుకున్నందుకు రూ.2,406 కోట్లు ఇవ్వాలని కూడా కోరారు. ఇదంతా బాగానే ఉంది. తెలంగాణా ప్రభుత్వం రూల్స్ ప్రకారం అడుగుతుంది. మరి మన ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది ? మన విద్యుత్ బకాయలు 5 వేలు కోట్లు ఇవ్వాలని ఎందుకు తెలంగాణాను అడగరు ? ఇలాంటి విభజన హామీలు, ఏపికి రావాల్సినవి ఎన్నో ఉన్నాయి. అయినా ఏపి ప్రభుత్వం మాత్రం, తెలంగాణాను అడగటం లేదు అనే అభిప్రాయం ఉంది. చూద్దాం ఏపి ప్రభుత్వం, తెలంగాణాను రావాల్సిన బకయాలు గురించి అడుగుతుందో, లేక తెలంగాణా ఇవ్వమన్న డబ్బులు ఇచ్చేస్తుందో.

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుభాకోణం గుర్తుందా ? నాటి కేంద్రంలోని కాంగ్రెస్ హయంలో ఈ స్కాం జరిగింది. ఆశ్చర్యం ఏమి లేదు, అది కూడా మన వైఎస్ఆర్ గారికి లింక్ అయిన కేసు. కాకపొతే దీంట్లో వైఎస్ జగన్ కాని, విజయసాయి రెడ్డి కాని లేరు. అయితే ఈ ఆగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్ స్కాం కేసు చాలా రోజులుగా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు తాజగా ఐటి జరిపిన దాడుల్లో, ఏకంగా హైదరాబాద్ లోనే ఈ గుట్టుకి సంబంధించి మరో లింక్ దొరికింది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాంకి సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఐటి అధికారులకు, హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీ ప్రమేయం ఉందని ఆధారాలతో సహా తేల్చారు. దీనికి సంబంధించి, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సోదాల్లో, హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీకు లింక్ ఉన్నట్టు ఐటి అధికారులు కనుగొన్నారు.

augusta 04082019 2

హైదరాబాద్ కి చెందిన అల్పా జియో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పోయిన వారం ఐటి అధికారులు సోదాలు జరిపారు. అయితే ఆ సోదాల్లో అనూహ్యంగా నాలుగు విదేశీ ఖాతాల గుట్టు బయటపడింది. అవన్నీ పరిశీలన చేస్తే, లెక్కలు చూపించని మూడుకోట్ల 10లక్షల విలువ చేసే బంగారంతో పాటు, 45లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఐటీ అధికారులు ప్రకటన చేసారు. అల్పా జియో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆళ్ల దినేష్ కంపెనీకి మేనేజింగ్ డైరక్టర్ గా ఉన్నారు. దినేష్ ను పట్టుకోవటానికి ముందు చాలా జరిగింది. సిబిఐ ద్వారా ఐటీ రాడార్ కు చిక్కిన దినేష్, దుబాయ్ లోని రాజీవ్ సక్సైనా కంపెనీలకు ఓవర్ ఇన్ వాయిస్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సోదాలు చేసిన అధికారులు నాలుగు విదేశీ బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు గుర్తించారు. ఈ విదేశీ బ్యాంకు ఖాతాలు ఎవరివనే కొణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

augusta 04082019 3

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్ స్కాంకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ ఆగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్ లో మొత్తం 3600 కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తుంది. దీని పైనే సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ డీల్ కు సంబంధించి మధ్యవర్తిగా ఉన్న రాజీవ్ సక్సేనా అనే వ్యక్తిని సిబిఐ అధికారులు ఇటీవల దుబాయ్ లో పట్టుకుని, భారత దేశానికి తీసుకు వచ్చారు. విచారణలో భగంగా, సిబిఐకి రాజీవ్ సక్సేనా ఇచ్చిన సమాచారంతో, ఐటీ బృందం హైదరాబాద్ లోని దినేష్ ఆళ్ల పై సోదాలు చేసింది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ వెలుగులోనికి వచ్చిన క్రమంలోనే నాటి ఏపి ఉమ్మడి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనుగోలు చేయించిన ఆగస్టా హెలికాప్టర్ పై కూడా వివాదం నడిచింది. అది కూడా ఇప్పుడు సిబిఐ విచారణలో ఉంది.

మా జగన్ మోహన్ రెడ్డి చూసారా, చీఫ్ సెక్రటరీని సుబ్బు అన్నా, డీజీపీని గౌతం అన్నా అంటూ ఎలా పిలుస్తున్నారో ? అధికారులతో ఇలా ఉండాలి, మీ చంద్రబాబుకి చెప్పండి అంటూ, మొన్నా మధ్య వైసీపీ నేతలు చేసిన హంగామా చూసాం. అయితే జగన్ అలా ఉంటున్నారో లేదో మనం చూడాలేదు కాని, వైసీపీ నేతలు మాత్రం, అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. సీనియర్ మంత్రులు సైతం ఇలా చేస్తూ ఉండటంతో, ఇది జగన్ కు తలనొప్పి అనే చెప్పాలి. తాజాగా సీనియర్ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా సమీక్షలో, ఆయన అధికారులతో ప్రవర్తించిన తీరు చర్చనీయంసం అయ్యింది. అసెంబ్లీలో ఎంతో కూల్ గా కనిపించిన పెద్దిరెడ్డి, ఇలాంటి హెచ్చరికలు కూడా చేస్తారా ? సీనియర్ అయిన, ఆయనకు, అధికారులతో ఎలా ప్రవర్తించాలో తేలియదా అంటూ విమర్శలు వస్తున్నాయి.

peddireddy 04082019 2

చిత్తూరు జిల్లా సమీక్షా సమావేశంలో, పెద్ది రెడ్డి అధికారుల పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం మారింది, మీరు మారాలి, అయినా మీరు మారలా, మీ తీరు కూడా మారలా, పధ్ధతి మార్చుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించటం నాకు నిమిషం పని అంటూ పెద్ది రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చివరకు అధికారులను కూడా ఏకవచనంతో సభోదించటం పై, అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. అక్కడే ఉన్న మరో మంత్రి నారాయణ స్వామి ముందుగా మాట్లాడుతూ, అధికారులను గౌరవంగా సంభోదించినా, పెద్దిరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పై, అధికారులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఆడవారి పై కూడా మంత్రి అలాగే మాట్లాడటం చర్చనీయంసం అయ్యింది. ఉద్యానవన శాఖ జేడీ సరస్వతి ఆమె శాఖ పై నివేదిక ఇస్తున్నారు.

peddireddy 04082019 3

దీంతో మధ్యంలో కల్పించుకున్న పెద్ది రెడ్డి, నీ శాఖలో చాలా జరిగింది, ఎన్నో సార్లు ఫోన్లో హెచ్చరించినా నువ్వు మారలా, ఇప్పటికైనా మారు, లేకపోతే నిన్ను ఇక్కడ నుంచి పంపించటం నిమిషం పని అని అన్నారు. ఆమె వివరణ ఇవ్వబోగా, కూర్చో కూర్చో అంటూ పెద్ది రెడ్డి అన్నారు. తరువాత, పీఎంఐపీ పీడీ విద్యాసాగర్‌ పై కూడా పెద్ది రెడ్డి ఫైర్ అయ్యారు. మీ తీరు బాగూలేదు, అంటూ ఫైర్ అయ్యారు. ఆయన వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చెయ్యగా, నీ వివరణ నాకు అవసరం లేదు కూర్చో అని గట్టిగా అరిసారు. అగ్రికల్చర్‌ జేడీ విజయ్‌కుమార్‌ కూడా ఇలాగే అరిసారు, నీ సోదంతా నాకొద్దని చెప్పారు. తరువాత పెద్ది రెడ్డి అందరికీ కలిపి వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్‌తో సహా అందరు అధికారులు వినండి, మా ఎమ్మెల్యేలు, నాయకులు మీ వద్దకు వచ్చి ఏదైనా సమస్య చెప్పితే వెంటనే పరిష్కరించండి అని స్ప‌ష్టం చేసారు. అయితే ఇంత మంది సీనియర్ అధికారులు ఏదైనా తప్పు చేస్తే, వారిని పర్సనల్ గా పిలిచి చెప్పాలి కాని, ఇలా అందరి ముందు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటి అని విమర్శలు వినిపిస్తున్నాయి.

మన దేశంలో ఒక వ్యవస్థని మరో వ్యవస్థ గౌరవించుకోవటమే ఇప్పటి వరకు చూసాం. పలానా వ్యవస్థలో ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే, మరో వ్యవస్థలోని వ్యక్తులు, వేలు ఎత్తి చూపించటం ఎప్పుడూ లేదు. అలాంటిది ఇప్పుడు ఒక రాష్ట్ర స్పీకర్, దేశ అత్యున్నత సభ అయిన రాజ్యసభ చైర్మెన్ పైనే, వేలు ఎత్తి చూపించారు. నిజానికి వెంకయ్య నాయుడు రూల్స్ పాటించే విషయంలో చాలా ఖటువగా ఉంటారు. సొంత పార్టీ నేతలను, ఏకంగా కేంద్ర మంత్రులనే సభలో హెచ్చరించటం చూస్తూ వచ్చాం. అలాగే పార్టీ ఫిరాయింపులు అసలు ప్రోత్సహించే వారు కాదు. దాని పై గట్టిగా మాట్లాడింది కూడా వెంకయ్యే. రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన ఒక ఎంపీ పై అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం కుడా తీసుకున్నారు. అయితే మొన్నీ మధ్య నలుగురు తెలుగుదేశం ఎంపీలు బీజేపీలో చేరారు.

tammineni 04082019 2

ఆ సమయంలో వారు, ఉన్న ఆరుగురిలో, నలుగురు మెజారిటీ సభ్యులు కాబట్టి, వెంకయ్య అనర్హత వేటు నుంచి తప్పించుకోవటానికి, పార్టీని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అది రూల్ బుక్ లో కరెక్ట్ అయ్యింది. నైతికంగా అది సరైన చర్య కాకపోయినా, బీజేపీతో పాటు, ఆ నలుగురు టిడిపి ఎంపీలు, విలీనం అనే పధ్ధతిలో పార్టీ మారటంతో, వెంకయ్య కూడా ఏమి చెయ్యలేక పోయారు. అయితే, ఇప్పుడు ఇదే విషయం పై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం, వెంకయ్యను తప్పుబట్టారు. నేను కనుక వెంకయ్య స్థానంలో ఉంటే అలా చెయ్యను అని, వారి పై అనర్హత వేటు వేసే వాడిని అని అన్నారు. నైతిక విలువల లేకుండా, ఫిరాయింపులు నేను ప్రోత్సహించను అంటూ వెంకయ్య నాయుడుని డైరెక్ట్ గా టార్గెట్ చేసారు ఏపి స్పీకర్.

tammineni 04082019 3

అయితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్న పరిస్థితిని మాత్రం, ఆయనకు అనుకూలంగా చెప్పుకున్నారు. సభలో వారిని కంట్రోల్ చెయ్యలేదు కాని, వారిని తన చాంబర్ కు పిలిచి హెచ్చరించాని చెప్పారు. అలాగే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో, 45 ఏళ్ళకే పెన్షన్ ఎప్పుడూ ఇస్తున్నారు అని అడిగినందుకు, తెలుగుదేశం సభ్యులని సస్పెండ్ చెయ్యటం నైతికమా ? అలాగే చంద్రబాబుకి అసలు మైక్ ఇవ్వకుండా, చెయ్యటం నైతికమా ? నీ యమ్మ అన్న మంత్రిని,బులెట్ దిగిందా అన్న మంత్రిని, ఏకంగా బాడీ షేమింగ్ చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని, స్పీకర్ ఒక్క మాట కూడా వారించలేదు. ఇది నైతికమా ? వెంకయ్య నాయుడు రూల్స్ ప్రకారం వ్యవహరించక తప్పని పరిస్థితి అది. నిజంగా వెంకయ్య నాయుడు గారు చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే, 13 రోజుల పాటు రెండు పదవుల్లో (ఢిల్లీ ప్రత్యెక ప్రతినిధిగా) ఉన్న విజయసాయి రెడ్డి పై అనర్హత వేటు వెయ్యక పోవటం. ఇప్పుడు ఏపి స్పీకర్ గారు నైతికత గురించి పాఠాలు చెప్పిన తరువాత అయినా, వెంకయ్య గారు విజయసాయి రెడ్డి పై అనర్హత వేటు వేస్తారని కోరుకుందాం.

Advertisements

Latest Articles

Most Read