ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు జాతీయ పార్టీల నేతలతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే. మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టి, మోడీ-షా చేస్తున్న ఘోరాలకు అడ్డుకట్టే వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై కూడా, మోడీని కార్నెర్ చేసే ప్రయత్నం చేసారు. అయితే ఈ విషయం పై, శుక్రవారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కాంగ్రెస్-టీడీపీ కలయికపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన బాస్ మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు అడుగులు వేస్తుంటే, పాపం పవన్ తట్టుకోలేక పోతున్నారు.

pk 02112018 2

పవన్ మాట్లాడుతూ, " సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారు. కాంగ్రెస్ టీడీపీ కలయిక కూడా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ లాగే ఉంది. చివరకు చంద్రబాబు ఎక్కడ మొదలయ్యారో అక్కడికే వెళ్లారు. చంద్రబాబు నిన్న ట్రైలర్ వదిలారు, కాని సినిమా ఫ్లాప్ అవుతుందని అన్నారు. మా అన్న చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ నేను రాష్ట్రం కోసం మీకు మద్దతు ఇస్తే మీరు వెళ్లి అదే కాంగ్రెస్‌తో కలవడం ఎంతవరకు సమంజసం?" అని ఈ సందర్భంగా టీడీపీకి పవన్ సూటి ప్రశ్న సంధించారు. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికే తాను యాత్రలు చేస్తున్నానని... అధికారం కోసం కాదని చెప్పారు. కాని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అన్నారు.

pk 02112018 3

మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు నెరవేర్చకుండా, ఆంధ్రులని తొక్కి పడేస్తున్న మోడీ పై, చంద్రబాబు తిరగబడి, వీరోచితంగా పోరాడుతుంటే, పాపం పవన్ కళ్యాణ్ మాత్రం తట్టుకోలేక పోతున్నారు. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నంత వరకు, చంద్రబాబుకి మోడీని అడిగే దమ్ము లేదన్నాడు పవన్. తరువాత మోడీని బాబు చాకిరేవు పెడుతుంటే, అలా ఎందుకు అంటున్నాడు. అవిశ్వాసం టైంలో కూడా అలాగే చేసాడు. చివరకు ఏమైపోయాడో తెలియకుండా, ఒక నెల రోజులు బయటకు రాలేదు. ఇప్పుడు దేశం మొత్తం మోడీకి వ్యతిరేకం అయితే, దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు, ఏకం అవుతుంటే, పాపం పవన్, జగన్, కెసిఆర్ మాత్రం తెగ బాధ పడుతున్నారు. ఎంతైనా మోడీ, వీళ్ళ బాస్ కదా, ఆ మాత్రం విశ్వాసం ఉండటం సహజం...

అది అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం! అంతంత మాత్రంగా కురిసే వర్షాలు! అప్పుడప్పుడు మాత్రమే పండే పంటలు! ఎకరం పొలం ధర రెండు లక్షలు పలికితే గొప్ప! ఇప్పుడు... అవే భూములు బంగారంలా మారాయి! ఐదు... పది... ఇరవై ముప్పై దాటి ఎకరం రూ.50 లక్షలకు బేరాలు సాగుతున్నాయి. ఇదంతా... దక్షిణ కొరియాకు చెందిన ‘కియ’ కార్ల కంపెనీ రాక మహిమ! కియతోపాటు... దానికి అనుబంధ పరిశ్రమలు భారీ ఎత్తున తరలి రావడం ఖాయం కావడంతో అనంతపురం జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. అమ్మవారిపల్లె ప్రాంతంలో కియ పరిశ్రమకు 600 ఎకరాలను కేటాయించారు. ‘కియ’ కంపెనీ హ్యుండయ్‌కి మాతృ సంస్థ. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కార్ల కంపెనీ ఇది. కర్ణాటక, తమిళనాడుతో పోటీపడి మరీ ఈ పరిశ్రమను చంద్రబాబు సర్కారు రాష్ట్రానికి రప్పించింది.

kia 02112018 2

కియా కార్ల పరిశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.13,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ పరిశ్రమ వల్ల 20 వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగనుంది. అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ రావడం ఓ వరమని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పెనుకొండ మండలం ఎర్రమంచిలో ఏర్పాటవుతున్న కియా పరిశ్రమను గురువారం ఆయన పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 జనవరి 29న ట్రయల్‌ కారు తయారు చేసి ఇస్తామని కియా ప్రతినిధులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.

kia 02112018 3

ప్రస్తుతం పరిశ్రమలో కారు బాడీ ప్రెస్సింగ్‌ యూనిట్‌ పనులు 98.3 శాతం, బాడీ తయారీ యూనిట్‌ పనులు 99.2శాతం, పెయింటింగ్‌ యూనిట్‌ 95 శాతం, ఇంజిన్‌ యూనిట్‌ 95శాతం, అసెంబుల్డ్‌ యూనిట్‌ 95.8 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. జనవరిలో ముఖ్యమంత్రి మొదటి కారును ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో మెగా పరిశ్రమలే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఓ ఎంఎస్‌ఎంఐ పార్కు (స్మూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇప్పటికే 35 నియోజకవర్గాలను గుర్తించినట్లు వివరించారు.

నిన్న చంద్రబాబు ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిస్తే, అదే ఎదో నేరం, ఘోరం అన్నట్టు, బీజేపీ హడావిడి చేస్తుంది. ఎన్టీఆర్ ఆత్మ క్షోబిస్తుంది అని, డైలాగులు కొడుతున్నారు. నిజానికి, ఇప్పుడు ఎన్టీఆర్ ఉంది ఉంటే, మోడీ చేస్తున్న పనులని సమర్ధిస్తారా ? వెళ్లి మోడీని కౌగలించుకుంటారా ? లేక తాట తీస్తారా ? ఇప్పుడు చంద్రబాబు చేసింది కూడా అదే. రాహుల్ గాంధీని కలిసే ముందు, చంద్రబాబు ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్ళారో ఆలోచించాలి. ఎంత ఓర్పుగా ఉన్నారో, మోడీకి ఇవ్వాల్సిన గౌరవం ఎంత ఇచ్చారో ఆలోచించాలి. మనకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా, రాష్ట్రాన్ని అస్తిత్వ పరిచే కుట్ర చేస్తే, చూస్తూ ఊరుకుంటారా ? అందుకే మోడీకి, గుణపాఠం చెప్తున్నారు.

rahul 02112018 1

చంద్రబాబు రాహుల్ ని కలిసారు అనే వారు, అంతకు ముందు ఢిల్లీ చుట్టూ 29 సార్లు తిరిగారు అనేది గుర్తుంచుకోండి.. 11 సార్లు ప్రధానిని కలిసారు, ఒక్క విభజన హామీ అన్నా నెరవేర్చారా ? 17 సార్లు ఆర్థిక మంత్రిని కలిసాడురు, 16,000 కోట్ల రెవెన్యూ లోటుని పూడ్చమని..రెవెన్యూ లోటు ని కవర్ చేయటానికి ఏమైనా నిధులు ఇచ్చాడా జైట్లీ..3000 కోట్లు ఇచ్చి ఇక ఇంతే అన్నారు.. 9 సార్లు హోమ్ మంత్రిని కలిసి, షెడ్యూల్ 9,10 లో ఉన్న కేంద్ర సంస్థలని విభజించమని అదైనా చేశారా..??లేదే.. 7 సార్లు పట్టణాభివృద్ధి శాఖామంత్రిని కలిసారు, కొన్ని ఇళ్ళు కొన్ని నిధులు సాదించుకున్నారు, అక్కడ ఉన్నది వెంకయ్య కాబట్టి అదైనా జరిగింది. 7 సార్లు జలవనరుల శాఖామంత్రిని కలిసారు, పోలవరం నిధుల కోసం..పోలవరం ఆగకుండా చూడటం కోసం..ఉమాభారతి ఉన్నంత వరకు కాస్త కుదురుగా సాగినా ఆమెని మార్చి గడ్కరీ కి ఇచ్చి ఇబ్బందులు పెట్టాలి అనుకుంటే నాగ్పూర్ వెళ్లి మరీ కలిసారు, సరే అదైన చక్కగా చేశారా అంటే పునరావాసం మాకు సబందం లేదు అని మెలిక పెట్టారు..

rahul 02112018 2

5 సార్లు పర్యావరణ శాఖామంత్రి ని కలిసారు, అమరావతికి పర్యావరణ అనుమతుల కోసం..ఇంకా కొర్రెలు పెడుతూనే వున్నారు.. 4 సార్లు గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిని కలిసాడు..నరేగా నిధుల కోసం..విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి లెటర్స్ బూచిగా చూపి ఉపాధి నిధులు ఆపేస్తే వెళ్లి నివేదికలు ఇచ్చారు, నరేగా నిధుల ఉపయోగం లో దేశంలో అందరికంటే ముందు నిలిచారు, ఎన్నో అవార్డులు సాధించారు. 4 సార్లు రైల్వే మినిష్టర్ ని కలిసారు రైల్వే జోన్ కోసం..ఇచ్చారా లేదు కదా.. 3సార్లు బీజేపీ అధ్యక్షుడిని కలిశారు..పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తుంటే వెళ్లి ప్రశ్నించారు.. చివరకు ఏం చేసారు.. పొత్తు ధర్మానికి తూట్లు పొడిచి A2తో కలసి కుట్రలు చేసి ఆయన ప్రభుత్వాన్నే కూలదోయలని చూసారు..

rahul 02112018 3

3 సార్లు మానవ వనరులశాఖ మంత్రిని కలిసారు, విభజన చట్టం ప్రకారం రాష్ట్రం లో ఏర్పాటు చేయవలసిన కేంద్ర విద్యాసంస్థ విషయం లో..12000 కోట్ల విలువైన భూములు ఇచ్చారు..కానీ ఈ రోజుకి కేంద్ర విద్యాసంస్థల నిర్మాణం జరగకపోగా ఇంకో 5 ఏళ్ళు మిగిలి ఉంది కదా అనే మీ చిత్తశుద్ధిని ప్రశ్నించారు. 2సార్లు పెట్రోలియం శాఖామంత్రిని కలిసారు..పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటుకి కొర్రీలు పెడుతుంటే..అదైనా ఇచ్చారా లేదే..లేకపోగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులని మహారాష్ట్రకు తరలించుకుపోవాలని కుట్ర చేశారు. 2సార్లు విద్యుత్ శాఖామంత్రిని కలిసారు..నిరంతర విద్యుత్ కోసం..ఎనర్జీ ఎఫిషిఎన్సీ లో దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఫైబర్ నెట్ కోసం టెలికం మంత్రిని ఒకసారి..గిట్టుబాటుదరల కోసం వ్యవసాయ మంత్రిని ఒకసారి కలిసాడురు.. మొత్తం 77 సార్లు కేంద్రంలో వివిధ శాఖల మంత్రులని కలసి విజ్ఞాపణలు చేసినా రాష్ట్రం కోసం సహనంతో పొత్తు ధర్మం పాటించి అన్ని అవమానాలు మోసినా ఎప్పుడూ గీత దాటలేదు..తెలుగు జాతిని పూర్తిగా చిన్నచూపు చూస్తున్న మోడీ, షాలకి ఎన్నో సార్లు చెప్పి చూసారు, వినలా..హెచ్చరించారు మీరు పట్టించుకోలా..ఇప్పుడు ఎదురు తిరిగారు..మీరు గుక్క పెట్టి ఎడుస్తున్నారు.. ఇంకా చాలా ఉంది, ఇప్పుడే మొదలు పెట్టింది..

తెలుగు ప్రజలను అవమానిస్తే, అణచివేయాలని చూస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో.. 80వ దశకంలో నందమూరి తారక రామారావు నిరూపించారు. జాతీయ రాజకీయాలను శాసించగల దమ్ము తెలుగోడికి ఉందని చాటిచెప్పారు. ఆ తర్వాత 90వ దశకంలో మరోసారి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సత్తాఏంటో చూపించింది. తాజాగా బుధవారం ఢిల్లికి చేరుకున్న చంద్రబాబు ఫ్రంట్‌ కార్యాచరణను ప్రారంభించారు. ఎడముఖం పెడముఖంగా ఉంటున్న బీజేపీయేతర పార్టీల నేతలతో వరుస భేటీలు జరిపారు. దేశ రాజకీయాల్లో ఉద్ధండులైన శరద్‌పవార్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, అఖిలేష్‌, ఏచూరి, మాయావతి, మమతాబెనర్జీలతో ప్రత్యేకంగా చర్చించారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలుసుకున్నారు. దేశాన్ని రక్షించుకుందాం.. కలిసి రండి అంటూ విపక్ష పార్టీలకు పిలుపునిచ్చి కాషాయపార్టీలో చంద్రబాబు ప్రకంపనలు సృష్టించారు.

ccbn 02112018 2

మొదటి నుంచి సైద్ధాంతిక విభేదాలతో ఉప్పు, నిప్పుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలిపి... దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది పలికాయి. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విభేదాలను పక్కన పెట్టాయి. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు... రాహుల్ గాంధీ, శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి, ఫరుక్ అబ్దుల్లా, తదితర నేతలతో కలసి సరికొత్త రాజకీయ సమీకరణకు తెర లేపారు. ఈ నేపథ్యంలో, అన్ని పార్టీలు కలసి బీజేపీని ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మహాకూటమిలో 15 పార్టీలు ఉండనున్నాయి. అవేమిటంటే... కాంగ్రెస్, టీడీపీ, ఎన్సీపీ, ఆర్జేడీ, బీఎస్పీ, ఎస్పీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, జేడీఎస్, తృణమూల్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, డీఎంకే, లోక్ దళ్. ఈ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తూ, జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటయింది. సేవ్ ది నేషన్.. సేవ్ డెమోక్రసీ.. పేరుతో కూటమి రూపుదిద్దుకుంటోంది.

ccbn 02112018 3

దేశాన్ని గట్టెక్కించాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాలన్నా బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీకి, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రత్యామ్నాయ కూటములేవీ సఫలం కాలేకపోయాయని, వికటించిన ఆ ప్రయోగాల నుంచి నేర్చుకున్న అనుభవంతోనే కూటమికి ఏర్పాటు కోసం చొరవ చూపుతున్నానని చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో తాను ఇప్పటికే శరద్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, మాయావతి వంటి నేతలను గత శనివారం ఢిల్లికి వచ్చినప్పుడు కలిశానని, గురువారం నాటి రెండవ పర్యటనలో శరద్‌ పవార్‌, రాహుల్‌ గాంధీతోపాటు అజిత్‌ జోగి, అరుణ్‌ శౌరిని కలిశానని ములాయం సింగ్‌ యాదవ్‌, కుమారస్వామి, మమతా బెనర్జీ సహా పలువురితో సంప్రదింపులు చేస్తున్నానని తెలిపారు. బీజేపీని ఓడించడం కోసం అందరినీ ఏకతాటికి మీదికి తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఈ కూటమికి నేతలెవరూ లేరని, అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలిపారు. తొలుత అందరం కలిసి కూర్చుని మాట్లాడు కుంటామని, ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read