ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి అకస్మాత్తుగా జాతీయ స్థాయికి ఎదిగిపోయారు. కేవలం వారం రోజుల్లో ప్రతిపక్షాల సమైక్యతకు వేదికను సృష్టించటంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఆయా పార్టీలను సమైక్యపరచటంలో విజయం సాధించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నాయకులు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి, సీనియర్ నాయకుడు శరద్ యాదవ్‌తోపాటు వామపక్షాలతోనూ చర్చలు జరిపి, అందరినీ ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను సమైక్య పరిచేందుకు శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నించినా అవి ఆశించిన ఫలితాలను సాధించలేదు.

congress 02112018 2

ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పావులు కదిపారు. కానీ, ఆ ప్రయత్నం కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు. అయితే చంద్రబాబు గత వారం రోజులుగా తెర వెనక చేసిన ప్రయత్నాలు గురువారం జాతీయ స్థాయిలో బాంబులా పేలాయి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే తమ ప్రధాన లక్ష్యమని రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో కలిసి చంద్రబాబు ప్రకటన చేయడం జాతీయ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. ఆయన ప్రయత్నాల మూలంగా బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఒక తాటిపైకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఇంతకాలం రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు ఇష్టపడకపోవటం తెలిసిందే. అయితే, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల మూలంగా వారు కూడా ఇతర ప్రతిపక్షాలతో కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

congress 02112018 3

కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ లేకుండా ప్రతిపక్షాలన్నీ ఒక తాటిపైకి రావటం సాధ్యం కాదంటూ చంద్రబాబు చేస్తున్న వాదనతో మాయావతి, మమతా బెనర్జీ ఏకీభవిస్తున్నట్లు చెబుతున్నారు. మూడు, నాలుగు రోజుల్లో మాయావతి, మమతా బెనర్జీ, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో చంద్రబాబు చర్చలు జరుపనున్నారు. ఆయన గత వారం ఢిల్లీకి వచ్చినప్పుడు మాయావతితో చర్చలు జరపటం తెలిసిందే. త్వరలోనే మరోసారి ఈ నాయకులతో చర్చించిన అనంతరం వచ్చే వారం, పది రోజుల్లో ఢిల్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఈ కీలక సమావేశం ప్రాతిపదిక అవుతుందని అంటున్నారు. గతంలో మాదిరిగానే చంద్రబాబు తాజా ప్రతిపక్ష కూటమికి జాతీయ స్థాయి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

చంద్రబాబు అనవసరంగా మాట్లడారు.. మాట్లాడితే మాత్రం, అవతలి వాళ్ళు సమాధానం కూడా చెప్పుకోలేని విధంగా ఉంటుంది. కేసీఆర్ ఎన్ని బూతులు తిట్టినా, అది వారి విజ్ఞత అని చెప్పి వదిలేసే సంస్కారం ఉంది చంద్రబాబుకు. ఇలాంటి వాళ్ళందరికీ టైం వచ్చినప్పుడు మాత్రం, సరైన విధంగా దెబ్బెస్తారు. నిన్న ఢిల్లీ పర్యటనలో అదే చేసారు చంద్రబాబు. పక్క రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి మీతో కలిసి నడుస్తుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ నిజానికి తాము తెలుగు ప్రజల సంక్షేమం దృష్ట్యా కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో పొత్తు పెట్టుకుందామని అడిగానని, కానీ టీఆర్‌ఎస్‌ అధినేతలే తమ ప్రతిపాదనను తిరస్కరించారని చంద్రబాబు నాయుడు తెలిపారు.

cbn kcr 02112018 2

ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పనేముందని ఎద్దేవా చేశారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశంలో రెండే కూటములు ఉన్నాయని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏ కూటమి వైపు ఉంటారన్నది ఆయన్నే అడగాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ టీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శల గురించి ప్రశ్నించగా, తానేం తప్పు చేశానంటూ ఎదురు ప్రశ్నించారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న ఆ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌ను తానే అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దానని గుర్తుచేశారు.

cbn kcr 02112018 3

అభివృద్ధి చేయడమే తాను చేసిన తప్పా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తన జోక్యం అసలు ఉండదని, తానేమీ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాబోనని స్పష్టం చేశారు. మరోవైపు ఆత్మగౌరవం అంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపైనా చంద్రబాబు స్పందించారు. అసలు ఆత్మగౌరవం పదం పలికే అర్హత వారికుందా అని ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ పేరు చెబితే జనం తన్నేలా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీయేనని పునరుద్ఘాటించారు.

ఢిల్లీ కేంద్రంగా సీఎం చంద్రబాబు సంచనాలు సృష్టిస్తున్నారు. ఆయన ఢిల్లీటూర్‌తో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. జాతీయ రాజకీయ ముఖచిత్రం వారం రోజుల్లో సమూలంగా మారిపోయింది. ఇది నాయుడు ఫ్రంట్‌ అంటూ జాతీయ మీడియా విస్తృత కథనాలు ప్రచురిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత కలిసి నడవడం పెనుసంచలనమంటూ జాతీయ విశ్లేషణలు చేస్తోంది. చంద్రబాబు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడితో రాజకీయ సంప్రదింపులు జరపడం 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ncbn 0112018 1

1996లో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఆయన అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షులు పీవీ నరసింహరావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. తర్వాత చంద్రబాబు ఎప్పుడూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయలేదు. ఇప్పుడు... మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిందని, ఆయన మళ్లీ ప్రధాని అయితే మరింత అన్యాయం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే... మోదీ పాలన దేశానికే ముప్పుగా మారిందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ఉన్న కూటమితోనే ప్రత్యామ్నాయం సాధ్యమనే అంచనాకు వచ్చి రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ncbn 0112018 1

ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేయాలని విపక్షాలన్నీ భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌తో కలిసేందుకు కొందరు ఇష్టపడడం లేదు. దీంతో కూటమి పక్రియ ఓ అడుగు ముందుకు రెండగులు వెనక్కు అన్నట్లు మారింది. దీంతో చంద్రబాబు తీసుకున్న చొరవతో దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ప్రధాని మోదీ, అమిత్‌షాపై ప్రాంతీయ పార్టీలన్నీ రగిలిపోతున్నాయి. అయితే ఇన్నాళ్లు లోలోపల రగిలిపోయిన పార్టీలు సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్నాయి. అలాగే ప్రాంతీయ కూటమి కోసం మంచి నాయకత్వం కోసం వెతుకుతున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు చొరవ తీసుకోవడం వారికి ఆశాకిరణంలా కనిపించింది. అందుకు మోదీ వ్యతిరేక కూటమిపై అంతా ఆసక్తి చూపుతున్నారు. చంద్రబాబు తీసుకున్న చొరవతో దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది.

తిత్లీ తుపాను సహాయం కింద కేంద్రం ఇప్పటి వరకూ పైసా కూడా విడుదల చేయలేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. నిబంధనల మేరకు రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద రెండో కిస్తును మాత్రమే విడుదల చేసిందని వివరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో తాజాగా కేంద్రం విడుదల చేసిన నిధులపై ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం వివరణ ఇచ్చింది. ఆర్థిక సంఘం ప్రతిపాదన మేరకు రాష్ట్రానికి విపత్తు సహాయ నిధికి కేంద్రం ఇవ్వాల్సిన మొత్తంలో గత ఆగస్టులో 190 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తాజాగా 229 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం ప్రతి సంవత్సరం రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి కేటాయించాల్సిన నిధుల మొత్తాన్ని ప్రతిపాదిస్తుంది.

titli 02112018 2

అందులో 75 శాతాన్ని కేంద్రం ఇస్తుంది. మిగిలిన 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూరుస్తుంది. ఇందులో భాగంగానే 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంఘం రాష్ట్రానికి 509 కోట్ల రూపాయలు ఈ నిధి కింద ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే రెండో కిస్తు కింద 229 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. తుపాను సహాయక చర్యల కోసం నిధులు కేటాయించాలని కేంద్రాన్ని గత నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిన తరువాతే విపత్తు సహాయ నిధికి కేంద్రం తన వాటాను విడుదల చేసిందని గుర్తుచేసింది. తిత్లీ తుపాను బాధితుల కోసం ప్రత్యేక సాయంగా ఇచ్చింది కాదు. ఇవి ఎవరి పోరాటంతోనే వచ్చిన నిధులు కావని, రాజ్యాంగ ప్రకారం వచ్చాయని స్పష్టం చేసింది. గతంలో ఏ ప్రధాని ఇంత నిర్దయగా ప్రవర్తించలేదని విమర్శించింది

titli 02112018 3

శ్రీకాకుళం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రెండు సార్లు లేఖ రాశారు. దానికి కేంద్రం స్పందించలేదు. తాజాగా విడుదలైన నిధులు తుపాను సహాయక చర్యలు చేపట్టేందుకు ఇచ్చిన నిధులు కావని తెలిపింది. తిత్లీ తుపాను వల్ల 3673 కోట్ల రూపాయల మేర నష్టం వాటల్లిందని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి వివరించడం తెలిసిందే. ప్రకృతి విపత్తుల సమయంలో ఏ ప్రధాని కూడా రాష్ట్రం పట్ల ఇంత కనికరం లేకుండా వ్యవహరించలేదని ముఖ్యమంత్రి ఆక్షేపించడం తెలిసిందే. హుదూద్ తుపాను సమయంలో 1000 కోట్ల సాయం ప్రకటించి, 600 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు.

Advertisements

Latest Articles

Most Read