ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సాయం ప్రకటించింది. రాష్ట్రానికి ఆర్ధిక సాయంగా 229 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అక్టోబర్ 11న తిత్లీ తుపాను కారణంగా విజయనగరం, శ్రీకాకుళం అతలాకుతలమయ్యాయి. దీంతో కేంద్రం సాయం ప్రకటించాలని ఏపీ సర్కారు కోరింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఈ సాయాన్ని విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి ఈ సాయాన్ని విడుదల చేశారు. కేంద్ర విపత్తు సహాయనిధి నుంచి రాష్ట్ర విపత్తు సహాయనిధికి ఈ నిధులు వచ్చాయి.

cycone 0112018

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా నిధులను ఖర్చు చేసేందుకు కేంద్రం అవకాశమిచ్చింది. తుపాను ధాటికి నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయని, వారిచ్చిన నివేదిక ఆధారంగా మరిన్ని నిధుల విడుదలకు అవకాశమున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. తిత్లీ తుపాను ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొబ్బరి, జీడి, మామిడి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపాను బాధితులకు తక్షణ సాయంగా రూ.1200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖరాసిన విషయం తెలిసిందే.

cycone 0112018

ఆ లేఖలో ‘రూ.1200 కోట్ల తక్షణ సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఈ నెల 13న మీకు నిదేదిక అందజేశాం. తుపాను నష్టం ప్రాథమిక అంచనాలు రూ.3,435.29 కోట్లుగా పేర్కొంటూ ఈ నెల 15న కేంద్ర హోం మంత్రికి, హోం శాఖ కార్యదర్శికి నివేదికలు ఇచ్చాం. తక్షణ సాయం ప్రకటించాలని నేను పదే పదే విజ్ఞప్తి చేసినా మీ కార్యాలయం నుంచి కనీస స్పందన లేకపోవడం, పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్రం ఎలాంటి బృందాన్ని పంపించకపోవడం విచారకరం. కేంద్రం ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయం ప్రకటించాల్సిన అవసరం ఉంది. తుపాను వల్ల దెబ్బతిన్న 2.25 లక్షల కుటుంబాలకు సహాయ, పునరావాస కార్యక్రమాలు అమలు చేసేందుకు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు రూ.1,200 కోట్ల తక్షణ సాయం ప్రకటించాల్సిందిగా మరోసారి కోరుతున్నాను’’ అని ఆ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిపై సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. తనపై నెపం మోపడం వల్లే తాను ప్రతిపక్ష నేత జగన్‌ను పరామర్శించడానికి ఫోన్ చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కోడి కత్తి దాడితో ఏపీ ప్రభుత్వానికి ఏమిటీ సంబంధమని ప్రశ్నించారు. గవర్నర్ డీజీపీకి ఫోన్ చేస్తారని, బీజేపీ నన్ను ఏ-వన్ అంటుందని ఆరోపించారు. దాడి చేస్తే జగన్‌పై సానుభూతి వస్తుందని భావించానని నిందితుడే చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. బై ఎలక్షన్ వచ్చుంటే వైసీపీ ఎంపీ స్థానాలన్నీ టీడీపీ కైవసం చేసుకునేదని జోస్యం చెప్పారు.

jagan 0112018

అమరావతిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సభ్యత్వ రుసుంను కార్యకర్తలు తమ జేబు నుంచి చెల్లించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు సభ్యత్వ రుసుం చెల్లించిన 2 నిమిషాల్లోనే తనకు తెలుస్తుందన్నారు. ప్రకృతి సేద్యాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రోత్సహించాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసం చేసింది కనుక మోదీ ఆదుకుంటారని భావించామన్నారు.

 

jagan 0112018

కేంద్రంతో విభేదించామని, అందువల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తప్పడు విధానం వల్ల సీబీఐ పరువుపోయిందన్నారు. అవిశ్వాసం పెడితే పార్లమెంట్ సాక్షిగా సన్మానం చేస్తామంటూ మోదీ వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. మరో పక్క, తనపై జరిగిన దాడి కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కుట్ర కోణం బయటపడేలా విచారణ జరగడం లేదని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసారు. ఈ పిటిషన్ లో సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సాఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి కేసు విచారణలో ఏపీ పోలీసులు కీలకమైన అడుగు వేశారు. జగన్‌ వాంగ్మూలం కోరుతూ ఆయనకు రెండోసారి లేఖ పంపించారు. వాంగ్మూలం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని లేఖలో జగన్‌ను కోరారు. అయితే జగన్ ఇచ్చే సమాధానాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. ఇదిలావుండగా, దాడి అనంతరం వాంగ్మూలం కావాలంటూ ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లగా జగన్ తిరస్కరించారు. వాంగ్మూలం ఇవ్వబోరంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి లిఖిత పూర్వకంగా చెప్పిన సంగతి తెలిసిందే.

jaganletter 31102018

మరో పక్క దాడి ఘటనపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల దాడి జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన హత్యకు కుట్ర జరిగిందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ ఘటనపై విచారణ చేయించాలని కోర్టును జగన్ కోరారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది. ఈ కేసులో ప్రతివాదిగా చంద్రబాబు పేరును జగన్ చేర్చడం గమనార్హం. ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

jaganletter 31102018

తాను మీ అభిమానని మీతో సెల్పీ దిగాలని చెప్పి జగన్‌పై శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి కత్తి దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి జరిగిన వెంటనే జగన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతడి చేతి నుంచి కత్తి లాక్కున్నారు. శ్రీనివాసరావును విమానాశ్రయంలో భద్రతను పర్యవేక్షించే సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లకు అప్పగించారు. వాళ్లు శ్రీనివాసరావును మరో గదిలోకి తీసుకెళ్లారు. సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ దినేశ్‌ కుమార్‌ ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా శ్రీనివాసరావుపై 307 ఐపీసీ (హత్యాయత్నం) కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

జీవీఎల్‌ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నారని హీరో శివాజీ మండిపడ్డారు. మట్టి తప్ప ఏమీ లేని రాష్ట్రంలో లక్ష కోట్లు దోచుకుంటున్నారని జీవీఎల్‌ విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన అమెరికా నుంచి మాట్లాడారు. ‘‘కేంద్రాన్ని నిలదీయాల్సిన అంశాల్లోనూ రాష్ట్రాన్నే నిందిస్తున్నారు. హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని ఎందుకు విమర్శించడం లేదు?. ఇలాంటి విషయాల్లోనే ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రాన్ని ఎందుకు చొక్కా పట్టుకొని అడగడం లేదు.’’ అని శివాజీ అన్నారు.

lakshmiparavathi 31102018 2

వైసీపీ, జనసేన, బీజేపీ త్వరలో కలిసిపోతారేమోనని హీరో శివాజీ అనుమానం వ్యక్తం చేశారు. ‘గుమ్మడికాయ దొంగల్లా విడివిడిగా ఉండడం ఎందుకు?. జగన్‌ ఎపిసోడ్‌...ఆపరేషన్‌ సక్సెస్‌..పేషెంట్‌ డెడ్. నన్ను టార్గెట్‌ చేసిన వాళ్లు అబాసుపాలవుతారు. ఏపీ పోలీసులపై జగన్‌ నమ్మకం లేదనడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఏపీ విషయంలో కాంగ్రెస్‌ రియలైజ్ అయింది. అందుకే అధికారంలోకి రాగానే హోదా ఇస్తామంటోంది. ఆపరేషన్‌ గరుడపై నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతోంది. ఆపరేషన్‌ గరుడను ప్రజలు నమ్ముతున్నారు.’’ అని శివాజీ అన్నారు.

lakshmiparavathi 31102018 3

ఎన్నికల్లో పోటీ చేయాలని తనకు లేదని హీరో శివాజీ స్పష్టం చేశారు. ఒకవేళ పోటీ చేస్తే బీజేపీ అధ్యక్షుడిపై ఇండిపెండెంట్‌గా చేస్తానని ఆయన వెల్లడించారు. ‘‘ఓ జాతీయ పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని ఆహ్వానించింది..తిర్కసరించాను. ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు పోరాటాన్ని ఆహ్వానిస్తున్నా. హోదాపై నాడు టీడీపీని విమర్శించిన మాట వాస్తవం. తిట్టమంటే తిట్టడానికి పొగడమంటే పొగడటానికి నేనెవరీ చెంచాను కాదు. వైసీపీ, బీజేపీలకు భయపడే వ్యక్తిని కాదు.’’అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read